Saturday, October 15, 2011

గణపతిదేవుడు - చందురుడు / కప్ప తల్లి నీళ్ళాడె - వర్షాకాలం పాట

గణపతిదేవుడు - చందురుడు
("బాల" పత్రిక - 1946)

ఆకాశములో ఆకాశములో
లెక్కకు మించిన చుక్కలురా
లెక్కకు మించిన చుక్కలనడుమ
చక్కని చందురుడొక్కడురా ||

చక్కని చందురు బింబము పైన
చెవులపిల్లి ఒకటున్నదిరా
మాసముదినముల కొక్క పక్షమున
చెవులపిల్లి మన కగపడురా ||

గణపతిదేవుని కోపము వలన
చంద్రునికట్టి శాపమురా
శాపమువల్లను చందురుడెప్పుడు
పెరుగుచు తరుగుచు నుండునురా || 

**************************************


gaNapatidEvuDu - canduruDu
(bAla patrika - 1946)

aakASamulO aakASamulO
lekkaku mincina cukkalurA
lekkaku mincina cukkalanaDuma
cakkani canduruDokkaDurA ||

cakkani canduru bimbamu paina
cevulapilli okaTunnadirA
mAsamudinamula kokka pakshamuna
cevulapilli mana kagapaDurA ||

gaNapatidEvuni kOpamu valana
candrunikaTTi SApamurA
Sapamuvallanu canduruDeppuDu
perugucu tarugucu nunDunurA ||


*********************************************



వర్షాకాలం పాట
("బాల" పత్రిక - సెప్టెంబరు 1946)
(శ్రీ న్యాయపతి కామేశ్వర రావు)

కప్ప తల్లి నీళ్ళాడె
కడవలనిండ నీళ్ళొచ్చె
కనవోయి - వానదేవుడా

ఈగతల్లి నీళ్ళాడె
వీధులనిండ నీళ్ళొచ్చె
వినవోయి - వానదేవుడా

దోమ తల్లి నీళ్ళాడె
దొరువులనిండ నీళ్ళొచ్చె
కనవోయి - వానదేవుడా

బాతుతల్లి నీళ్ళాడె
బావులనిండ నీళ్ళొచ్చె
వినవోయి - వానదేవుడా

1 comment:

  1. కప్పతల్లి నీళ్ళాడే వానదేవుడా నాకిష్టమైన పాట. మా పాప కోసం కసరత్తు చేస్తూ నేర్చుకున్నాలెండి. చిన్నారి చిట్టిగీతాలలో చివర్న ఈ పాట వస్తుంది.

    ReplyDelete