Friday, October 14, 2011

తాండవకేళి

తాండవకేళి

-- శ్రీ వేటూరి సుందరశాస్త్రి గారి కృతి
(శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జనకులు)
మణిమంజరి పత్రికలో ప్రచురితం
   

పరమేశ్వరుడూ - తాండావకేళి సల్పెనే ||

కుండలా కాంతూలూ మెరయ
             దండిగా అందెలూ మ్రోయ
దండిగా టాకీ చేబూని
             థళాంథళాం యని థణినాదముతో   || తాండా ||

శిరామూనా మమ్మేలు కన్యా
            ముఖామూన మూడొ కన్ను
సొగసూగ స్ఫటికాలహారము
            నిగాల్ నిగాల్ మని నిగనిగ మెరయుచు || తాండా ||

సరస్వతీ వీణీమీటాగా
            పురందరుడు తాళం వేయగ
హరి మృదంగమ వాయించగను
            పరీపరీ పరి పరి పరి విధముల || తాండా ||

రమామణీ గీతము పాడాగా
             కమాలజుడు తాళం వేయగ
ఉమాదేవి కొలువూన హరుడు
             తధిమిత కుంతరి తకుఝణ తకథిమి  || తాండా ||

శశీకళా మస్తాకమున
            భసితాంగ విబూతి రేఖ
విషామూ గళామున
           మిసాల్ మిసాల్ మని మిసమిస మెరయ || తాండా ||

దేవాది దేవేంద్ర వరులు
           దేవతా గంధర్వ స్త్రీలు
భావమూనా ప్రణుతింపగను
           భళీభళీ భళి భళిభళి యనుచును || తాండా ||

వెంకటా రాజాఖ్య హృదయ
           పంకజాపరియంక నిలయ
శంకరు డదుగో ప్రదోష కాలము
           ఝణాఝణం యని ఝణినాదముతో || తాండా ||

No comments:

Post a Comment