Saturday, October 8, 2011

"గ్రామ్యమా? వాడుక భాషా?" - విశ్వనాథ వారి అభిప్రాయం
5 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. రవీ

  మీరన్నది నిజమే...మొదట చదవగానే ఇదేమిట్రా పెద్దాయన ఇలా అనేసాడు అనిపించి కొద్దిగా ఆశ్చర్యపోయిన మాట వాస్తవం...అయితే రెండు మూడు సార్లు చదివినతర్వాత ఆ ఆశ్చర్యం కొద్దిగా సడలింది....

  ఆయన ఆ మొదటి పేజీలో - భాషా సానుభూతి మీద "నొక్కి" చెప్పాలనుకున్నారని, అలా సానుభూతి ఉన్నవారికి కాకువు పెంచుకోవాలనిపిస్తే అది తొందరగానే లభిస్తుందనీ, అయితే దానికి హృదయ సంస్కారం చాలా అవసరమనీ, ముందు భాషా స్వభావం తెలుసుకోవాలనీ, గుడ్డెద్దు చేలో పడ్డట్టు గ్రాంథిక భాషైనా, వాడుక భాషైనా - రెండూ కావలసినవే అనిన్నూ, వాటిని బోదకాళ్ళ రూపానికి తీసుకొనిపోకూడదనీ , మార్పుల కోసం సిద్ధంగా ఉండాలనీ, వీలైతే మనమే పూనుకోవాలనీ నా మట్టి బుర్రకు అర్థమయ్యింది....

  దానికి, అంటే ఆ సానుభూతికి ఊతంగా మిగిలిన పదాలు అల్లుకొచ్చారనుకుంటా....సంపర్కం వల్ల భాష జీవం చెడిపోతుంది, నిలబెట్టుకోడం కష్టమన్న ఆరాటం ఆయన ఇతర రచనల్లో కూడా ప్రస్ఫుటంగా (నామటుకు) కనపడే విషయం...

  ఇతరులకు నర్మగర్భంగానూ, కొండొకచో విపరీతార్థాలు కనపడనూ వచ్చు....దానికి వారినీ తప్పు పట్టవలసిన అవసరం లేదనుకోండి.....

  మీ అభిప్రాయం - ఆ రాయలసీమ కవుల భాష శుద్ధ తెనుగు కాదు అని ఆయన అన్నారన్న దానితో విభేదిస్తున్నా.... :) ... అనలేదనే నా ఊహ! తీరిగ్గా మళ్ళీ ఓ నాలుగైదు సార్లు చదవండి....ఒకసారి చదివితే బుర్రకెక్కే మనిషి కాదు ఆయన....

  ReplyDelete
 3. రెండు సార్లు చదివానండి. బుఱ్ఱకెక్కలేదు. ఇదివరకెప్పుడో ఆయన ఓ సభలో రాయలసీమ పండితుణ్ణి పట్టుకుని "నీ భాష తెలుగే కాద"ని తిట్టాడట. దానికీయన అసలు తెలుగంటే మాదే, ఒక్క నన్నయ్య తప్ప మిగిలిన కవులందరూ మా వాళ్ళేనని తెగేసి చెప్పాడుట. అది గుర్తొచ్చి ఈయన అభిప్రాయం ఇదేనేమో అనుకోవలసి వచ్చింది.

  ఇకపోతే -

  >>సంపర్కం వల్ల భాష జీవం చెడిపోతుంది, నిలబెట్టుకోడం కష్టమన్న >>ఆరాటం ఆయన ఇతర రచనల్లో కూడా ప్రస్ఫుటంగా (నామటుకు) >>కనపడే విషయం...

  విశ్వనాథవారిని చూసి గర్వించదగిన కారణమూ, కొంచెం విసుగు తెప్పించే కారణమూ రెండూ అదేనండి. తెలుగంటే అంత గౌరవమాయనకు. అది చూసి మనసు ఉప్పొంగిపోతుంది. కాకపోతే అది ఒక్కోసారి శృతి మించినప్పుడు "ఏంటీ పెద్దాయన" అనిపిస్తుంది.

  ReplyDelete
 4. తీవ్రవాదిగా ఉండటమే మంచిది కదండీ - కనీసం భాష విషయంలో.....తీవ్రవాదమంటే శృతి మించాల్సిందేగా.... :)

  అయితే ఆ శృతిలో పాడిన సంగీతం మనబోటి వారికి ఎక్కాలంటే ముందు "సంగీతం" లో స, మ, గీ, త ఉన్నాయని తెలియాలిగా....అవి తెలుసుకోటానికి, నాకైతే ఓ దశాబ్దం గడిచిపోయింది....ఇప్పటికి "స" తెలిసింది.....

  ఆ రాయలసీమ పండితుడిని ఆక్షేపించిన సంగతి నాకు కొత్త.... ఏదైతేనేమి లెండి, అర్థం తెలుసుకోటానికి కష్టపడుతూ ఉండటమే, ఎప్పటికో ఒకప్పటికి ఫలితం లభిస్తుందనే నా ఆశ....

  ReplyDelete
 5. శృతి = శ్రుతి...శ్రుతి...శ్రుతి....శ్రుతి

  ReplyDelete