Wednesday, August 24, 2011

సముద్రంలో జీవాలండి!!....పొద్దు గుంకే సూరీడండి!!....

కూతురు వేసిన బొమ్మలు రెండు.....

ఒక సారి చూపిస్తే చాలు, ఈ పిల్లలు ఎంత తొందరగా పట్టుకుంటారో అని ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు...

మంచి పెయింటింగు టీచరెవరన్నా దొరికితే బాగుండబ్బాయా!


సముద్రంలో జీవాలండి....
అవ్వేమిటో మీరు చెప్పాలండికొండలు, మబ్బులు, సముద్రాలండి
పొద్దు గుంకే సూరీడండి....


2 comments:

 1. చక్కగా ఉన్నాయి. మీ బ్లాగులో వ్యాఖ్య రాద్దామంటే error వస్తోందండీ.

  ReplyDelete
 2. @ కొత్తావకాయ గారు

  ఏదో మీ అభిమానం....చిన్నమ్మికి ఆశీర్వాదం.....

  ఏమని ఎర్రర్ వస్తోందో చెబితే సమాధానం ఇవ్వగలను.....

  పేద్ద వ్యాఖ్య రాద్దామనుకున్నారనుకోండి - మీరు ఇలా చెయ్యాలి....

  1)ముందు అంత పెద్దవ్యాఖ్య రాసెయ్యండి
  2)రాసెయ్యటమ్ అయిపోగానే కీబోర్డులో ఉన్న Ctrl బటన్ నొక్కిపెట్టి A బటన్ నొక్కండి
  3)ఆ వెంటనే C బటన్ నొక్కండి
  4)ఆ తర్వాత కామెంటు సబ్మిట్ చెయ్యండి
  5)గూగుల్ సైన్ ఇన్ అనో అదేదో వచ్చిందనుకోండి
  సైన్ ఇన్ అయిపోండి
  6)ఎర్రర్ రాలేదా?
  7)సంతోషం

  8)ఎర్రర్ వచ్చిందా?
  9)ఆనందం...

  10)ఇప్పుడు బ్రవుసర్ బాక్ బటన్ నొక్కండి...
  11)ఏమీ అవ్వలేదా?
  12)మళ్ళీ బాక్ బటన్ నొక్కండి
  13)ఈసారీ ఏమీ అవ్వలేదా?
  14)బ్రవుసర్ అడ్రెస్ బారులో మళ్ళీ బ్లాగు అడ్రెస్సు ఇచ్చి బ్లాగుకు రండి
  15)కామెంటే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టటానికి సిద్ధం కండి

  16)కామెంటు బాక్సులోకొచ్చాకా Ctrl బటన్న్ నొక్కి V నొక్కండి
  17)ఠ..డా....మీ పేద్ద కామెంటు సిద్ధం
  18)అప్పుడు ఆ కామెంటు సబ్మిట్ చెయ్యండి...

  19)విప్పుడు వెర్రర్ రాదు.....
  20)వెర్రర్ వచ్చిందా?

  21)ఇంతే సంగతులు చిత్తగించవలెను....

  ReplyDelete