Sunday, August 21, 2011

మీలో ఎవరికన్నా దడ దడ లాడించుకోవాలనున్నదేమోనని.....సుతారంగా ఉంటుందయ్యా....ఖంగారు పడనఖ్ఖరలేదు....

అల్లప్పుడెప్పుడో ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగులంటే చాలా మందికి అర్థం కాని రోజుల్లోనే మనం ఆ అబ్స్ట్రాక్టునంతా ఔపోసన పట్టేసి , కుటుంబ సభ్యులని, కాలనీ జనాలని, కాలేజి జనాలని  దడ దడ లాడించటం జరిగింది....

మళ్ళీ ఏదో డబ్బాలోకి, అదే - సొంత డబ్బాలోకి కుక్కుతున్నావేమిరా నాయనా....

అది కాదు సుబ్బయ్యా.....మన దగ్గిర కళ ఉన్నప్పుడు కలాపోసకులకు, ఇదిగో నాదగ్గర ఫలాన కళ ఉందయ్యా అని తెలియచెప్పాలి కదరా నాయనా....

అవుననుకో! అయినా నువ్వు ఔపోసన పట్టేస్తే దడ దడ ఎందుకయ్యింది జనాలకు?

ఓ - మంచి ప్రశ్నే - అయితే చిన్న సవరణ - ఆ దడ దడ నేను ఔపోసన పట్టే క్రమంలో జరిగింది అని ఓ చిన్న వివరణ....ఔపోసన పట్టేసాక వారితో పనిలేకుండా పోయింది.....

సరే....ఇంతకీ ఇప్పుడిదెందుకు చెపుతున్నావు?

మీలో ఎవరికన్నా దడ దడ లాడించుకోవాలనున్నదేమోనని....అయితే పరిణితి చెందాం కాబట్టి, సుతారంగా ఉంటుందయ్యా....ఖంగారు పడనఖ్ఖరలేదు....

నిన్న కూతురుతో కాన్వాస్లు మీద బొమ్మలేయించే పని పూర్తయ్యేటప్పటికి లోన కమ్మగా నిద్దరోతున్న "అబ్స్ట్రాంభకర్ణుడు" నిద్దర లేచాడయ్యా....ఇహ లేచాక చెప్పేదేముంది - ఊరుకోడుగా, కాన్వాసు దడ దడలాడించాడన్నమాట.....ఆ దడ దడే ఈ టపాకు కారణం.....

మనకి ఈ కళ కూడ ఉన్నదా మహానుభావా?

ఉన్నది ధనుంజయా.....ఉన్నది....నీకు తెలియనివి ఇంకా బోలెడు ఉన్నాయి నావద్ద....

సకల కళావల్లభులన్నమాట మీరు.....ఇందులో వేలు , అందులో వేలు అని లేకుండా అన్నిట్లో వేళ్ళేనన్నమాట....

అయితే ఓ మాట చెప్పాలె....అదేదో మహేశ్ బాబు సినిమాలో "ఫామిలీ ఫామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా" అన్నట్టు , ఈ బొమ్మల గోల చుసి "మీ ఇంట్లో అంతా బొమ్మలు గీసేస్తున్నార్రా?" అని కొంతమంది కుంకలు హాచ్చర్యపోతారని, ప్రశ్నలేస్తారనీ ముందే చెపుతున్నా...... అలా హాచ్చర్యపోవద్దనీ, ప్రశ్నలెయ్యొద్దనీ....

మరి పోనీ నువ్వు మనిషివా, ఎం.ఎఫ్.హుసేనువా అని అడుగుదామనుకుంటున్నావేమో - ఆ ఛాన్సు కూడా లేదబ్బాయ్...

అయితే మనది అలాటిలాటి ఆబ్స్ట్రాక్ట్ కాదయ్యోయ్.....చూడగానే తెలిసిపోయినట్టుంటుంది కానీ తెలీదు....అదీ లెక్కన్నమాట...ఇప్పుడు నువ్వు ఈ కింది బొమ్మలు చూసి ఏది ఏమిటో చెప్పు....చెప్పలేకపొయ్యావా - ఆయన్ని పంపిస్తా....

ఎవరిని పంపిస్తావు నాయనా?

ఆయనే.....

సరే కానీ.....చూసి చెప్పు.....అర్థమయ్యిందో లేదో....అర్థమైతే కామెంటు వెయ్....అవ్వకున్నా వెయ్.....ఏం?5 comments:

 1. కామెంటు వ్రాసి - ప్చ్ అనడమేమిటీ? "నో కామెంటు" అనడమేమిటి? అర్థము వివరించుడు? ఆ పైన రెండు కిల కిలలు కూడా వేసారు.......

  ReplyDelete
 2. చెప్తే బాధపడతారేమో. మీకంటే మీ అమ్మాయే నయం అనిపించింది. ఈ వయసులో మీరు వేసే బొమ్మలా ఇవి? ఇలా చాలా ఉన్నాయిలెండి..

  ReplyDelete
 3. హహహ.......బాగుంది.....ఇవి నా కోసమో, మీ కోసమో వేసినవి అనుకుంటున్నారా? కూతురు కోసం వేసిచ్చిన అబ్స్ట్రాక్ట్ బొమ్మలు.... కుంభకర్ణుడు చాలా ఏళ్ళకు నిద్దర లేచాడని ఊరకే చిన్నమ్మికి వేసిచ్చిన బొమ్మలు

  వయసుతో సమబంధం, సంబంధం ఉన్న దడ దడ బొమ్మలు - రేపో ఎల్లుండో....కాచుకోండి!

  రెండు బిల బిలలు...అనగా :) :)

  ReplyDelete
 4. అవమానం! అవమానం! అభిమానధనుడైన నన్నే పరిహసింతురా......

  సున్నితమైన దడ బొమ్మ ఐదు నిముషాల్లో వేయబడ్డది.... ప్రచురించబడ్డది....

  సాంపిలు కోసం....

  ReplyDelete