Saturday, August 20, 2011

పాత చొక్కా - కాన్వాస్ పానెల్సు - అక్రిలిక్ పెయింట్సు......ఇవాళ్టికి చాల్లే!!!

 నేను బొమ్మలేస్కోడానికి ఈసారి వెరైటీగా కాన్వాస్ పానెల్స్, అక్రిలిక్ పెయింట్స్ తీసుకొచ్చాడు...


 వేసుకోని ఓ పాత చొక్కా చేతులు చించి, నాకు వేసేసి పెయింటు ఇంకెక్కడా అంటించకుండా ఆ చొక్కా మీద పూసుకోమన్నాడు , పూస్తున్నా చూసారా?


మొదటి బొమ్మ ఇలా వేసా.....కాన్వాస్ అంతా గుడ్డగా, సరిగ్గా రాలేదు.... ఆ కాన్వాస్ పానెల్ పుచ్చుకుని దాని మీద మొట్టమొదటిగా గీసిన బొమ్మ - చేప బొమ్మ.

చాలా భయంకరంగా వచ్చిందన్నాడు నాన్న...అవును, నాకే నచ్చలేదు....నాన్నని అడిగా ఎలా వెయ్యాలని...రెండో కాన్వాస్ మీద ఇంకో బొమ్మ  వేసేప్పుడు చూపిస్తా అన్నాడు....సరే అని పైరేట్ బొమ్మ గీసా....ఫర్వాలా ఓ మాదిరిగా వచ్చింది....ఆ తర్వాత మెర్ మెయిడ్ గీసా.... మెర్ మెయిడ్ కి స్థలం సరిపోలా పైరేట్ ని పెద్దగా గీసేప్పటికి...



ఈ సారి కొంచెం జాగ్రత్తగా రెండో కాన్వాస్ మీద మళ్ళీ మెర్ మెయిడ్, చేపలు, స్టార్ ఫిష్ గీసా....ఆ మధ్యలో బొద్దుగా ఉందే - ఆ చేప నాన్న గీసి చూపించాడు....మిగతావన్నీ నేనే వేసేసా....అయితే ఈ బొమ్మలో  ఒక విచిత్రం ఉంది...చెప్పుకోండి చూద్దాం....




రెండో కాన్వాస్ కి ఎరుపు బోర్డర్ వెయ్యమన్నాడు ...వేస్తున్నా....


బోర్డర్ ఇంకా వేస్తున్నా....



అంతా గీసేసాక , హ హ అని నవ్వి - మెర్ మెయిడ్ చేతులేవి అని అడిగాడు నాన్న....ఊప్స్....చేతులు వెయ్యడం మర్చిపోయా.....అదే పైన చెప్పిన విచిత్రం....ఇప్పుడు వేసా....


చేతులు వెయ్యటం అయిపోయింది అని చెపుతున్నా నాన్నకి.....



ఇవాళ్టికి చాల్లే, మళ్ళీ రేపో ఎల్లుండో ఇంకొన్ని బొమ్మలు గీద్దాం అన్నాడు.... 


No comments:

Post a Comment