Friday, August 19, 2011

ఘంటసాల మేష్టారు ఈ పాట పాడక పోయుంటే బాగుండేదా?

ప్రజలారా 

 • మీకు ఎప్పుడైనా శోకసముద్రంలో మునిగిపోవాలనిపించిందా? 
 • కంటికి మింటికి ధారగా ఏడవాలనిపించిందా? 
 • ఏడవటానికి కారణం కోసం ఎదురుచూపులు, కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారా?
 • పోనీ లోపల ఉన్న ఏడుపు బయటకు రావటానికి ఏదన్నా ఊతం దొరికితే బాగుండు అనిపించిందా? 
 • ఊతం దొరికిందే అనుకుందాం - ఆ దొరికిన ఊతాన్ని పట్టుకోని గంపలు గంగాళాలు నింపలేకపోయారా? 
 • అలా ఎందుకు అనిపిస్తుందిరా నాయనా? ఎవడైనా సంతోషంగా ఉండాలనుకుంటాడు కానీ - అనిపించిందా?

అయితే ఆగిపోండి - అక్కడే ఆగిపోండి.....

మీ సమస్యకు సమాధానం దొరికేసింది....

అదే అదే.......టడా ....ఠడా.....ఠఢా....


పుష్పవిలాపం - కరుణశ్రీ గారి రచన....

ఈ మాట వినగానే, ఒక బరువైన కంఠం ఎంతో విషాదం నింపుకుని ఆ బాధను వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ బాధలో నేనూ ఓ భాగం అయిపోవాలని అనుకోని తెలుగువాడు ఉండడేమో అని అనుకుంటే అది మీ తప్పు కాదు....అలా అనిపించటానికి మూడు పాళ్ళు పాపయ్య శాస్త్రి గారి రచనా కౌశల్యం, ఒక పాలు మేష్టారు గాత్రం - ఇదే కారణం, మహత్యం...

కాదు కాదు, అటుదిటు వేసుకో అంటారా?

సరే మంచిది......వేసా బాబయ్యా! స్థిమితంగా ఉందా ఇప్పుడు?

ఇహ పోతే ఇందులో కొన్ని లైన్లు కరుణశ్రీ గారు, ఆ థీం తీసుకున్నందుకు అందరు కవులు వ్రాసినట్టే "బరువు" పెంచటానికి వ్రాసినట్టుంటుంది....అయితే గొప్ప విషయమేమంటే ఆ బరువు కొలిచే తూనికా తల్పంలో శయనం , తూనిక రాళ్ళ గోల లేకుండా, అన్ని పక్కలా పూల "బరువు" సరిపోయి మహదానంద రూపం ధరించింది......

ఆ తల్పాన్ని శయనానికి, సుఖనిద్రకు (ఇక్కడ దుఃఖ నిద్రకు) అనుకూలంగా మలచటం, సద్దటం ఆడవారంత సున్నితత్వం ఉంటే కానీ చెయ్యలేరు.......అయితే అందరు ఆడవారు తల్పాన్ని నిద్రకు తయారు చెయ్యటమంత చక్కటి పని చెయ్యలేరు కానీ, ఏడుపు మాత్రం పూలు కోసి పెట్టి గంపలకెత్తినంత సులభంగా చెయ్యగలరు.....అదేమి విచిత్రమో.....

ఆ తల్పం తయారు చేసుకుని, దాని మీద పడుకుని ఏడిస్తేనే ఏడుపా అని అడుగుతున్నారా? అవును - మీకా తయారింపు గోల లేకుండా చక్కగా మహాకవి చేతికి అందించారు కాబట్టి సంతోషించి ఆ ఏడుపు కొద్దిగా తగ్గించండి...... చదువుతుంటేనే ఏడుపొచ్చే కొందరికి ఊతంగా, ఆ ఏడుపు - గంపల నుండి గంగాళాల రూపం ధరించడానికి మేష్టారు గారు తనవంతు సహకారం అందిస్తూ "ఏడుపామృతకషాయం" కలిపి "అమరత్వం" ప్రసాదించారు....ఇహ తిరుగేముంది.....వందనములు వందనములు....

 • "బుట్టలందు చిదిమి అమ్ముకొందువె....... హృదయమే లేని నీ పూజలెందుకోయి"
 • "బండబారెనటోయి నీ గుండెకాయ"
 • "హాయిగ కన్ను మూసెదము ఆయమ కాలివ్రేళ్ళపై"
 • "త్రుంపబోవకుము, తల్లికి బిడ్డకు వేరు సేతువే"
 • "నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునె"
 • "గొంతుకురి బిగించి"
 • "గుండెలో నుండి సూదులు ...... దయలేని మీ ఆడువారు"
 • "పేద నెత్తురులును కంపు దేహాలపై గుమాయింపు కొరకు"
 • "పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై"
 • "అందమును హత్యచేసెడి హంతకుండ"

ఇల్లాటి వాక్యాలతో  కాగితపు పడవ లాటి చాలా మంది హృదయాల మీద కాంచన గంగ  పర్వతాన్ని పెట్టి అదిమినట్టు అదిమే ప్రయత్నంలో కరుణశ్రీ గారు సఫలం అయ్యారు కాబట్టే ఆ రచన అట్లా నిలిచింది....

మేష్టారు పాడినా పాడకపోయినా అది అలా చరిత్రలో నిలిచిపోయేదే......అయితే ఆ బరువు తాను స్వయంగా మోసి, ఇతరులకు పంచటంలో మేష్టారు తనవంతు సాయం తాను చేసారు....అదండీ సంగతి.....

సరే ఇప్పుడు అసలు సంగతికి వస్తున్నా - అయితే ఇదే యే ఎం.ఎస్.రామారావు గారి చేతో, పి.బి.శ్రీనివాస్ గారి చేతో పాడించి ఉంటే -  పాటకు - అంత పేరు రాకపోయుండొచ్చు కానీ బోలెడంత బ్రహ్మాండంగా ఉండేది అని నా అభిప్రాయం, అనుకోలు....మీరేమన్నా నా అభిప్రాయం మారదు కానీ, నిర్మొహమాటంగా మీ మాట వ్రాసెయ్యండిక్కడ....నిర్మొహమాటం అన్నానని బభ్రాజమానం మాటలు వ్రాస్తే -  తెలుసుగా?

మాన్యులు క్షమింతురు గాక, అప్పుడప్పుడు - ఇదే పాట శ్రీ పువ్వుల సూరిబాబు గారు పాడి ఉంటే ఎలాగుండేదో అని అనిపించటం కూడా కద్దు....బాలుగారు పాడితే చాలా దారుణంగా ఉండేదనిన్నూ అనుమానం .....

ఇప్పుడు మీ కామెంట్లు బరువుగా పారించండి.....

బరువుగా ఎలా పారిస్తారు బాబూ?

శుభం.....

భవదీయుడు
వంశీ

5 comments:

 1. కరుణశ్రీగారి పుష్పవిలాపం అప్పటికే పాపులర్.ఐనా కొందరు చదవడానికే.ఘంటసాలవారి గళంతో లక్షలాది విని (బాధపడుతూ)ఆనందించడానికి వీలయింది. అంధ్రా సైగల్ M.S.రామారావుగారైనా న్యాయం చేసి వుండే వారనుకొంటాను.ఐనా ఒకరి ప్రసిద్ధమైన పాటలూ ,పద్యాలూ ఇంకొకరి కంఠంతో పోల్చడం సబబుకాదు.ఘంటసాల గానం అనితర సాధ్యం అని మీకు తెలియంది కాదు కదా!

  ReplyDelete
 2. ఒక్కరే ఒక్కరే ఒక్కరే
  ఒకే కె.వి.రెడ్డి,ఒకే ఆదుర్తి,ఒకే ఘంటసాల,ఒకే యస్.డి.బర్మన్,ఒకే ఇళయరాజ వీళ్ళ స్థానాల్లో మరొకరిని ఊహించటం నాలాంటి వారికి అనూహ్యం.

  ReplyDelete
 3. @ కమనీయం గారు - :)

  @ రాజేంద్రా - అవును మీరన్నదీ నిజమే......అయితే కొన్ని అలా అనూహ్యంగా ఉంటేనే జీవితానికి ఆనందం, ఆవేశం, ఆవేదనం...

  ReplyDelete
 4. గానంలో ఘంటసాలకు సాటి మరొకరు లేరు ! ఘంటసాల వంటి గాయకుడు నభుతోనభవిష్యతి

  ReplyDelete
 5. గానంలో ఘంటసాలకు సాటి మరొకరు లేరు ! ఘంటసాల వంటి గాయకుడు నభుతోనభవిష్యతి

  ReplyDelete