Wednesday, August 17, 2011

మంజీరా నీళ్ళు ఎంత తియ్యగా ఉంటాయిరా! కృష్ణమ్మను వదిలేసాక, నోటికి అంత రుచి తగిలేది మంజీరమ్మతోనే!!

."మంజీరా నీళ్ళు ఎంత తియ్యగా ఉంటాయిరా! కృష్ణమ్మను వదిలేసాక, నోటికి అంత రుచి తగిలేది మంజీరమ్మతోనే" - అని మా అమ్మ నోట,  దాదాపు నాలుగు దశాబ్దాల పైనే - అంతకాకపోయినా, నాకు ఊహ తెలిసినప్పటినుంచి  వింటూనే ఉన్న మాట....

ఆ మాటలో ఎంతో నిజముంది.....ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళింటికో, పిన్ని వాళ్ళింటికో వెళ్ళినప్పుడు గండిపేట నీళ్ళు తాగితే, ఏదో తగ్గిందిరా ఈ నీళ్ళల్లో అనిపించేది....

హైదరాబాదులో అద్దెకున్న ఇళ్ళు కానివ్వండి, ఆ గోల వదిలి స్వంత ఇంట్లోకి మారిన తరువాత కానివ్వండి మేం తాగిందెప్పుడూ "మంజీర" నీళ్ళే ....ఈ శరీరాన్ని పెంచి, బుద్ధినిచ్చిన ఆ నదీమతల్లులు కృష్ణమ్మకు, మంజీరమ్మకు నమోన్నమహలతో  ...

సరే అది అలా పక్కనబెట్టి టపాలోకొస్తే "మహాంధ్రోదయం" - శ్రీ దాశరథి గారి రచన చదువుతున్నా....ఇందులో వారు "మంజీర" గురించి వ్రాసిన ఒక ముత్యం కంటపడమేమిటీ, చదవటమేమిటి, వారు వ్రాసిన విధానానికి ఒళ్ళు పులకించటేమిటి, ఈ టపా వ్రాయాలనిపించడమేమిటి - అన్నీ అలా ఒకదాని వెంబడి ఒకటి జరిగిపోయాయి....

"ఎంత బాగుందో" - అని అంటే ఆ రచనకు నేను చేసే మహాపరాధం అంతా ఇంతా కాదన్నమాట పచ్చి నిజం....చదువుకుని మీరే తెలుసుకోండి....

అయితే - శ్రీ దాశరథి ఇందులో వాడిన ఒకటి రెండు పదాలకు (క్రింద ఇచ్చాను) అర్థం తెలియలా.....తెలిసినవారెవరన్నా వివరిస్తే సంతోషం.....

మిసిమింతురాలు
హసంతిక  
కావ్యదుకూలము
"మంజీర" -  శ్రీ దాశరథి గారి ఖండిక

2 comments:

 1. అర్థాలు తెలిసిపోయినాయయ్యోయ్...ఇహ మీరు కష్టపడనఖ్ఖరలా ... :)

  దుకూలము - అంటే ....సన్నని వస్త్రం , తెల్లని వస్త్రం
  హసంతిక - అంటే కుంపటి
  మిసిమింతురాలు - అంటే అలసిపోయిన వనిత

  ReplyDelete
 2. మహాంధ్రోదయం... 10 వ తరగతి పాఠ్యాంశం లో చదువుకున్న గుర్తు.. అప్పటినించి నేను దాశరథి గారి అభిమానిని.. మీ దగ్గర మహాంధ్రోదయం పూర్తి కావ్యం ఉంటే దయచేసి share చెయ్యగలరా?

  ReplyDelete