Tuesday, August 16, 2011

"నా తొలి రచన"- అక్టోబరు 1941లో విశ్వనాథ వారు వ్రాసిన వ్యాసం

చాలా రోజుల తరువాత , నిన్న - సాఫ్టువేరు బోషాణం, అనగా హార్డ్ డ్రైవును బయటకు తీసా... 

అందులో బయటపడిన "విమర్శిని - Annual Research Journal  విశ్వనాథ వాఙ్మయ జీవిత విశేష సంచిక - జనవరి 1977" పిడి.ఎఫ్ ఫైల్లో ఉన్న ఒక ముత్యం - "నా తొలి రచన" - అనగా "విశ్వనాథ వారి తొలి రచన" - పంచుకోవాలనిపించి......

వారు అక్టోబరు 1941లో వ్రాసిన వ్యాసం ఇది.....

ఇదిగో ఈ క్రింద చదువుకోండి........చక్కని చుఱకలు - ఇతరులకు వెయ్యటమే కాక తనమీద తాను వేసుకున్న చెణుకులు కూడా చూడండి

జ్ఞాపికానుబంధంలో ఉన్న జ్ఞాపకాలు, ముఖ్యంగా కొడాలి వారు, జలసూత్రం వారు, మల్లాది వారు - ఇలా ఎందరో మహామహులు అందించిన జ్ఞాపకాల జ్ఞాపికలు చాలా బావున్నవి....

వ్రాత, మాట, భాష - నమోన్నమః 

ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఎడిటరుగా, సుప్రసన్నాచార్య గారు అసొసియేట్ ఎడిటరుగా ఈ జర్నల్ నడిచిందని ఆ ఫైలులో ఉన్నది....ఈ జర్నల్ గురించిన ఇతర వివరాలు తెలిసినవారు, ఒకవేళ ఆ జర్నల్ యొక్క కాపీలేమన్నా మీ వద్ద ఉంటే పంచుకోగలరన్న ఆశతో.....

భవదీయుడు
వంశి.....


PS: ఆ Journal విషయసూచిక ఇదిగో ఇక్కడ....


9 comments:

 1. పెద్ద సారు గారి తొలి రచన అద్బుతం.మీ ఇంటికి యీ నిధుల కోసం కన్నం వెయ్యాలి అని వుంది.thanks for sharing vamsi garu.

  ReplyDelete
 2. బహు కృతఙతలు.
  విజయవాడలో విశ్వనాథవారి ఇల్లు చూస్తూంటే ఆయన కళ్ళముందుకు వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడిది చదువుతూంటే ఎదురుగా కూచుని నాతోనే చెప్తున్నట్టు అనిపిస్తోంది. మరోసారి ధన్యవాదాలు.

  ReplyDelete
 3. సత్యసాయి గారు - బహుకాల దర్శనం

  మురళీకృష్ణ గారు - :)

  అన్వేషి గారు - కన్నాలేస్తే ఏం దొరక్కుండా అన్నీ మా రామారావు దగ్గర భద్రపరచా! వాడు 2000 డాలర్లు పోసి కొన్న పేద్ద సేఫ్టీ బాక్సే అన్నిటికీ శ్రీరామ రక్ష.... :)

  ReplyDelete
 4. వంశీ గారూ! ఆ జర్నల్ నెట్ లో ఎక్కడైనా దొరుకుతుందా... లింకులేమైనా ఉంటే ఇవ్వగలరు.. అందులో ఉన్న చాలావరకు వ్యాసాలు సంపాదించగలిగాను. కొన్ని లేవు...మీ వద్ద లింకులేమైనా ఉంటే అందించగలరు... ధన్యవాదాలు

  ReplyDelete
 5. కౌటిల్య,

  ఈ పుస్తకం అంతర్జాలపుస్తకకల్పవృక్షంలో (అదే, DLI:)) ఉంది.

  http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0002/284&first=1&last=451&barcode=2020120002283

  ReplyDelete
 6. కామేశ్వరరావు గారూ!
  బాబోయ్! మీరివ్వాళ నాకు పేద్ద బహుమతిచ్చారు.డౌన్లోడు చేసేస్తున్నాః)...అసలు DLI అంతా మీకు బుఱ్రలో ఉంటుందనుకుంటా.;).ఆ కల్పవృక్ష సముద్రంలో పడి ఎలా వెతుకుతారండీ బాబూ!... మీకు శతసహస్ర వందనాలు...

  ఇందులో చివరిపేజీ లేదు..ః(.. చెళ్ళపిళ్ళవారు రాసింది..ః(..వాఆఅ..వాఆఆ..

  ReplyDelete
 7. కౌటిల్య

  నా వద్ద ఉన్న పి.డి.ఎఫ్ కాపీ పంపించాను మీకు - ఈమెయిల్లో.

  ఈమెయిలు పంపించాక ఇప్పుడే చూశాను...అర్కైవ్.ఆర్గ్ లో vimarshini అని సెర్చి చేసి చూడండి...మొదటి పుస్తకం అదే....

  ReplyDelete
 8. అమూల్యం, అపూర్వం!

  ReplyDelete