Wednesday, July 27, 2011

మీరు ఎంత "చక్కగా / దరిద్రంగా" రాయగలరు?

మీరు ఎంత "చక్కగా / దరిద్రంగా" రాయగలరు?

కొంతమందికి రాయటం ఇష్టం. కొంతమందికి రాయించుకోటం ఇష్టం. కొంతమందికి కొన్ని రాతలే ఇష్టం. కొంతమందికి అన్ని రాతలూ ఇష్టం.

ఇల్లా ఎన్నైనా, ఎంతైనా చెబుతూ పోవచ్చు.

ఎంతో వద్దు, కొంతే ముద్దు నాయనా...

అలాగంటావా? సరే అయితే - ఆ "కొంతే" ఉన్న టపాలోకి వెళ్ళబోయే ముందు మీకో చిన్న ప్రశ్న -

ఈ క్రింది వాక్యాలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? దీన్నే మీరు రాయాల్సి వస్తే ఎలా రాస్తారు?

"నీలిరంగు ఆకాశం నల్లని మేఘాల చారలతో అట్టలు కట్టి, అప్పుడే మొగుడు చచ్చి భోరున ఏడవటానికి సిద్ధంగా ఉన్న ఆడదాని ఆక్రోశంలా విలయతాండవానికి పూనుకుంటోంది."

నువ్వే రాసావా ఇది? ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చావా?

ఎత్తుకోళ్ళు చేసుకురాడం, పాంకోళ్ళు వేసుకోడం నాకు చేతకాదేమో అన్న అనుమానం నాకుంది నాయనా...

నీ ప్రశ్నకు సమాధానం మటుకు ఇదీ "ఈ ముత్యం అచ్చంగా నాలో పుట్టిందే"....

ఆహా! ఎంత "అందమైన" వర్ణన? దీనికి ప్రేరణ ఏమిటో కాస్త చెబుతావా?

ప్రేరణ ఇదే - ఇదిగో ఈ క్రిందనున్న లంకె.....


సవాలు/పోటీ


కథా కమామీషు కొద్దిగా వివరిస్తే....?

మా ఊరుకి రెండు గంటల దూరంలో ఉన్న సాన్ హోసేలో స్థాపించబడిన సాన్ హోసే స్టేట్ యూనివర్సిటి ప్రతి సంవత్సరం "ఎడ్వర్డ్ జార్జ్ బుల్వర్-లిట్టన్" పేరిట ఒక "సవాలు/పోటీ"  నిర్వహిస్తూ ఉంటుంది. ఆ "సవాలు/పోటీ"లో Bad Writing అన్నది ఒక "వర్గం/విభాగం".

ఈ సంవత్సరం ఆ Bad Writing విభాగంలో గెలుపొందినవారు - విస్కాన్సిన్ ప్రొఫెసర్ "సూ ఫాండ్రీ" ...వారికి విజయం చేకూర్చి పెట్టిన రాత ఇదే

 "Cheryl's mind turned like the vanes of a wind-powered turbine, chopping her sparrow-like thoughts into bloody pieces that fell onto a growing pile of forgotten memories."


మైండ్ బ్లోయింగ్ యార్! - బుర్ర పేలిపోయింది తమ్మీ! బాగుంది ...చాలా బాగుంది....

సరే వారు గెలిచారు...బాగుంది...ఇప్పుడు ఏమిటంటావు?

వస్తున్నా...అక్కడికే వస్తున్నా

ఇలాటిది - అనగా "సవాలు/పోటీ" - మన దేశంలో ఏదన్నా ఉన్నదా? తెలిసినవారు కామెంటు రూపంలో తెలియచెయ్యగలరు

ఇప్పుడు అసలు సంగతికీ, కొద్దిగా క్లిష్టమైన ప్రశ్నకీ - కాచుకోండి!

ఏమిటి కాచుకునేది? సంగతులు, ప్రశ్నలూ కలిపిన బిందెలో నీళ్ళా? 


వెటకారం పక్కనబెట్టు ఎంకా, కుంకా - సరే కానీ, తెలుగు బ్లాగుల్లో ఇలాటిది ఒకటి పెడితే, మీరు విజేత కాగలరా అన్న ప్రశ్న ఒకటి వేసుకోండి. అలా వేసుకున్న ప్రశ్న క్లిష్టమనిపించి సమాధానం దొరకకపోతే, ఇంకో చిన్న ప్రశ్న వేసుకోండి - తెలుగు బ్లాగుల్లో రాసే రాతల ఆధారంగా - టపా కానివ్వండి, కామెంటు కానివ్వండి - విజేతగా ఎవరిని ప్రకటించవచ్చో తెలియచెయ్యండి.

గమనిక: చిత్తచాంచల్యం ఉన్నవారిని, మతి భ్రమించిన వారిని, ఉన్మాదులను దయచేసి ఉదహరించవద్దు....చిత్తచాంచల్యం ఇంటి పేరుగా ఉన్నవారు కానీ, వొంటికి పట్టించుకున్నవారు కానీ, చిత్తచాంచల్యం దినుసుగా వంట చేసుకునేవారు కానీ, వారి పేర్లు కానీ, పేళ్ళు కానీ, వారు రాసిన రాతలు కానీ - అవి తక్క మిగతావేవైనా ఉదాహరించే స్వేచ్ఛ మీకిచ్చేస్తున్నా.....ఆనందో బ్రహ్మ! 


భవదీయుడు
మాగంటి వంశి

PS: నా పేరు ప్రకటిస్తే మీ చేత ఆ పైన కట్టిన "అట్టలు" కడిగిస్తా! :)
PPS: ఇదంతా హాస్యానికే అని అనుకున్నవారు ధన్యులు సుమతీ!

22 comments:

 1. maartnda will be the winner any doubt..?

  ReplyDelete
 2. @ చెనీమా - మీరు పేర్కొన్న maartnda ఎవరు? పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి ? లంకెలు ఇవ్వగలరా? .... మీరు టపా పూర్తిగా చదివే, అనగా - గమనికలు, సంగతులు, ప్రశ్నలతో సహా అని అర్థం - ఈ కామెంటు రాసారా?

  ఏమనుకోనంటే - ఓ మాట చెప్పాలనిపించి.....మీ పేరు వింతగా ఉన్నదే - ఎనీమాతో రైమింగవుతూ....అలాక్కాదు వేరే అర్థమున్నది అంటే దయచేసి వివరించుడు....

  అదలా పక్కనబెడితే మిమ్మల్ని బ్లాగుల్లో, నా బ్లాగులో చూడటం ఇదే మొదలు అనుకుంటా...ఇలా విచ్చేసినందుకు ధన్యవాదాలు....

  ReplyDelete
 3. ha hha hha. good one.
  Can't say about blogs, but I can nominate several essays written by Telugu professors in AP :)

  ReplyDelete
 4. వంశీగారు మార్తాండ గురించి తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. మాగంటికి ప్రమాదం.. :)) నా బ్లాగు కూడా కావాలంటే లిస్టులో వేసుకోవచ్చు. ఎందుకంటే మనం పండితులం కాదు కాబట్టి...:))

  ReplyDelete
 5. @ కొత్తపాళి

  మీ నామినేషన్ల కోసం కళ్ళు కాయలు కాయించుకుని ఉందామని ఉన్నది....మీ ఆలస్యం మీకు అమృతమేమో కానీ మాకు ఆకతాళ్ళు....కాబట్టి మా తాళ్ళు ఎక్కువగా తిప్పకుండా ఆ నామినేషన్లు ఇలా పడెయ్యండి....

  @ జ్యోతి

  అంత మాటనేసారేమి? మీ కామెంటు చూస్తే ఆయనెవరో "చి.చాం/మ.భ్ర / ఉ" ల్లో ఒకదానికో, మూడిటికో స్వంతదారుడిలా ఉన్నారు....మధ్యలో మాగంటికి ప్రమాదమేమి? అందులోనూ రెండు కిల కిలలు వేసారు...మొన్నామధ్య మిమ్మల్ని ఉప్పందించమని అడిగాను - దానికేమన్నా సంబంధం ఉన్నదా? అది కాకుంటే ఈ కిలకిలలకు, "చి.చాం/మ.భ్ర / ఉ" ల వారికి వేరే సంబంధమేమన్నా ఉన్నదేమో వివరించుడు...మరి మీ బ్లాగు ఏ లిష్టులో వేసుకోవాలో మరింతగా వివరించుడు...

  అవునూ - అదంతా సరే కానీ - ఇంతకీ మీలో ఎవరూ, ఆ పైన రాసిన "నీలిరంగు ఆకాశం....." మీకెలా కనపడిందో మీ రాతల్లో చెప్పలేదే?

  ReplyDelete
 6. మీరు పైన రాసిన అట్టల వాక్యం చదివితే నేను ఓ 4-5 ఏళ్ళ కిందట చేసిన కొన్ని వర్ణనలు గుర్తొచ్చింది.

  అవి:

  "ఆకాశం లో మేఘాలు గజ్జి కురుపుల్లా ఉన్నాయి. ఒకదానితో ఒకటి రాపిడి కి గురై చిదిగిపోయి చీము కారుతుందేమో!"

  "ఎదురుగా వస్తున్న బస్సు ప్రగ్నంట్ లేడీ లా నడవలేక నడవలేక నడుస్తున్నది."

  మరి నేను ఈ పోటీకి అర్హురాలినేనా? :)

  ReplyDelete
 7. పోస్ట్ కి సంబంధం లేని వ్యాఖ్య:
  ఇది మీ గ్రంధలాయానికి ఏమైనా పనికి వస్తుందేమో చూడండి.
  http://vivaha-bhojanambu.blogspot.com/2011/07/blog-post_25.html

  ReplyDelete
 8. వంశీగారు, ఆ రచనలు చదివితే మీకేమన్నా అవుతుందని నా భయం. మీకేమన్నా ఐతే మాగంటికి ప్రమాదమే కదా. ఎవరు చూసుకుంటారు.. మీరు చెప్పిన ఉదాహరణలు నాకు తెలీదు కాని ఒకసారి ఒక కధ పంపినవాడిని బాగా తిట్టాను.ఇంకా కోపం తగ్గక జంధ్యాల తిట్లదండకం పంపించాను. ఇప్పుడైనా అర్దమై ఉంటుంది ఆ రచనలు ఎలా ఉంటాయో. :))

  మీరు ఉప్పందించమన్న విషయం గుర్తుంది. తప్పకుండా చెప్తాను. కాని నా సైట్ మాత్రం హోస్టింగ్ చేసే అబ్బాయికి అప్పజెప్పా. బాబ్బాబు కాస్త దీని జాగ్రత్తగా చూడు ఈ దొంగలు, పురుగుల నుండి అని చెప్తే పోన్లే పెద్దావిడ కదా అని తన సొంత సైట్ తో పాటు దీని కాపలా కూడా చూసుకుంటున్నాడు. అదీ సంగతి.
  ఇక మీరు చెప్పిన ఆకాశం సంగతి వస్తే అంత భయంకరమైన అవిడియాలు రావు కాని ఆయా షేడ్స్ చూడగానే ఈ రంగులో చీర, బార్డర్ ఉన్న చీర బావుంటుంది కదా. ఈ షేడ్ లో చీర కొనుక్కుని అద్దాలు కుట్టుకుందామా??ఇలా అన్ని చీరల గురించే ఆలోచనలు వస్తాయి. సో ఈ విషయంలో నన్ను సెమించాలి తమరు..

  ReplyDelete
 9. ఇలాంటివి ఫీట్లు తెలుగు రచైతలు ఇప్పటికే చేశారు గదండీ. కొమ్మనాపల్లి గణపతిరావు గారి ఏ నవలైనా తీసుకుని మొదటి రెండు పేజీలు చదవండి.

  షాడో మధుబాబు కూడా ఇలా రాస్తుంటాడు. "విపరీతమైన ఆలోచనలతో కందిరీగలతుట్టెలా తయారయింది షాడో అంతరంగం. అప్రయత్నంగా వారం రోజులవెనక్కి పరుగులు తీశాయతని ఆలోచనలు.."

  ReplyDelete
 10. @రవి - కొమ్మనాపల్లి, మధుబాబు, ఇంకా గట్టిగా మాట్లాడితే యండమూరి - వీళ్ళు రాసేవి క్లిషేలు. ఇక్కడ వంశీ ప్రపోజ్ చేస్తున్న వర్గంలోకి వస్తాయనుకోను.

  @ వంశీ - ఆకాశం మేఘాల వర్ణన, మెటఫర్ మిక్సయింది తప్పిస్తే వర్ణన నాకు బానే ఉంది. ఇంతకంటే ఘోరాలు చూశాను నేను. తాళం చెవులగుత్తి గుమ్మటంలా ఉండడం అంటే ఏవిటో తెలుసా? నాక్కొంచెం వారాంతం దాకా టైమివ్వండి. కొన్ని ఆణిముత్యాలు చిలకరిస్తాను. వర్ణనలు ఉండవు - ఎంతైనా రాసింది ప్రొఫెసర్లు కాబట్టి. కానీ ఈ వాక్యానికి అర్ధం ఏవిటని బుర్ర బద్దలు కొట్టుకోవడం మాత్రం తథ్యం - ముందే హెచ్చరిస్తున్నా.

  ReplyDelete
 11. @ సౌమ్య - చదవగానే వమనం - అనగా డోకులాటి "ఫీలింగు" కలిగితే అది రాత అనిపించుకోదేమోననీ, నేను ఈ టపాకోసం పేర్కొన్న విభాగంలోకి చేరదేమోనని నా అనుమానం. మీ మొదటి ఉదాహరణ ఆ కోవలోకొస్తే, రెండోది మరీ తేలిపోయిందేమో అని అనిపించింది. రెండోది తేలిపోయిందేమో అని అనటానికి నేను ఇదో, ఇలాటిదో బోల్డు సార్లు చదవటమో, నాకు నేను అలాగే అనుకోటం మూలానేమో అని కూడా అని అనుమానం. ప్రైజు రాకపోవచ్చు కానీ పోటీలో తప్పకుండా పాల్గోవచ్చు. :)

  @ రవి - నేను చెప్పదలచుకున్నది సరిగ్గా చెప్పలేదేమో అన్న అనుమానంతో, చిన్న వివరణ. చదవగానే ఒక్క క్షణం కరంటు షాకు కొట్టిన కాకిలా గిలగిల కొట్టుకుని, ఆ కరంటు ఎందుకు అలా షాకిచ్చిందా అని "అర్థం" చేసుకోటానికి పదే పదే షాకు కొట్టించుకోవాలన్న దుగ్ధ పెరిగిపోయిందనుకోండి. చివరికి అర్థమన్నా మిగలాలి, కాకన్నా మిగలాలి. అల్లాటి షాకుల్లాటి రాతలు, షాకు తట్టుకుని మిగిలిన కాకులు మీకెవరికన్నా ఎరికలో ఉన్నాయా అని అడగటం ఉద్దేశమన్నమాట. నా మటుకు ఇంతవరకు కొమ్మనాపల్లి, మధుబాబు గార్ల రాతలు చదవగానే అల్లాటి షాకులు తగల్లా.....కొత్తపాళి గారు చెప్పిన కారణానికేనేమో మరి....అసలుగా నేను ఆ పైన రాసిన "నీలిరంగు....." ఆ షాకుల విభాగంలోకి అడుగు పెట్టటానికి వీలే లేదు....అయినా సాంపిలు కోసం, ఇంకెవరన్నా ఇదే ఆకాశాన్ని, అదే ఫీలింగును ఎంత దరిద్రంగా రాయగలరు అన్న ప్రశ్న బుర్రను తొలిచేస్తూంటే అక్కడ వేసాన్నన్నమాట... కానీ మీరు, ఆ పైనిచ్చిన సూ ఫాండ్రీ గారి రాత చదివారనుకోండి ఆ షాకు తగులుతుంది...తగల్లేదని ఎవరైనా అంటే మటుకు వారు అబద్ధం చెబుతున్నారనే నా నమ్మకం.....:)

  @ కొత్తపాళి - :) బద్దలు కొట్టేసుకోటానికి నేను రెడీ...మీదే ఆలస్యం.....గుత్తి గుమ్మటంలా మారిపోతే కొంతమందికైనా షాకు తగులుతుందని ఆయనెవరో అలా రాసుంటారు లెండి. :) :)

  ReplyDelete
 12. ప్రియా, నా పిచ్చి(చ్చ) కాకపోతే పొట్టపొడిస్తే అక్షరం రాని నేను కవినవటమేమిటి?

  నాది అనుకున్న ఈ నా కవిత్వం అంతా నీది కాదూ...

  నిన్ను కలవకముందు వరకూ......

  శూన్యం అంతే తెలియనిది, కనపడనిదీ అనుకున్నా.

  సూర్యుడు వేడి పుట్టిస్తాడనుకున్నా.

  చంద్రుడు చల్లదనం ఇస్తాడనుకున్నా.

  నిన్ను కలిసాకే గదా .....

  శూన్యానికి రంగులద్దటం నేర్చుకున్నా.

  సూర్యుడు చల్లగా ఉన్నాడని,

  చంద్రుడు వెచ్చగా కూడా ఉంటాడని రాయడం నేర్చుకున్నా.

  అవును మరో మాట నేస్తమా....

  నిన్ను కలిసాకే గదా ఇన్ని మాటలు.....

  అందుకే...

  నీవు లేని ఈ నేను నేను కాదు

  నేను లేని నువ్వు నువ్వు కాదు

  మరింక నువ్వెవరు, నేనెవరు?

  ReplyDelete
 13. నాకు తెలిసిన ఆయన ఒకరు కవితా(?)సంకలనంలో గుండు మీద(రాసింది కాగితం మీదే లెండి) కవిత(?) ఒకటి రాశారు. ఆ సంకలనం చాన్నాళ్లు భద్రంగా దాచుకున్నాను. మరి ఏమైందో. వెతికి రాస్తాను బాగా నవ్వుకుందురు గాని.(మావాళ్లెవరైనా చదివి చించకపోతే). ఆయన బాగా ముదిరితే ఆ అవార్డుకి అర్హత వస్తుంది..

  ReplyDelete
 14. Dont know if it is true. But I came across this Article on 'How Not to Write'.

  QUOTE

  CALCUTTA's Telegraph has got hold of an answer paper of a candidate at the
  recent UPSC examinations. The candidate has written an essay on the Indian
  cow:

  "The cow is a successful animal. Also he is quadrupud, and because he is
  female, he give milk,but will do so when he is got child.He is same like
  God,sacred to Hindus and useful to man.But he has got four legs together.
  Two are forward and two are afterwards.

  "His whole body can be utilised for use. More so the milk. What can it do?
  Various ghee, butter,cream, curd, why and the condensed milk and so forth.
  Also he is useful to cobbler, watermans and mankind generally.

  "His motion is slow only because he is of asitudinious species. Also his
  other motion is much useful to trees, plants as well as making flat cakes in
  hand and drying in the sun. Cow is the only animal that extricates his feeding
  after eating. Then afterwards she chew with his teeth whom are situated in
  the inside of the mouth. He is incessantly in the meadows in the grass.

  "His only attacking and defending organ is the horn, specially so when he is
  got child. This is done by knowing his head whereby he causes the weapons
  to be paralleled to the ground of the earth and instantly proceed with great
  velocity forwards.

  "He has got tails also, but not like similar animals. It has hairs on the
  other end of the other side. This is done to frighten away the flies which
  alight on his cohoa body whereupon he gives hit with it.

  The palms of his feet are soft unto the touch. So the grasses head is not
  crushed. At night time have poses by looking down on the ground and he shouts
  his eyes like his relatives, the horse does not do so.

  "This is the cow."

  P.S.: We are informed that the candidate passed the exam.

  UNQUOTE

  Sorry for a lengthy comment.

  ReplyDelete
 15. బట్టతల
  ----
  అతని మెదడు నిండా ఉన్న
  తన ప్రియురాలి అలోచనలు
  ఒక్కొక్క వెంట్రుకను తినేసాయి

  కాని ప్రియురాలు దూరం అయ్యింది
  చివరకు బట్టతల మిగిలింది

  ReplyDelete
 16. @ బ్లాగు వీరుడు - ఇది నిజంగా పిచ్చ కవి రాతే.... కాకుంటే వర్గీకరణలో చేర్చటం కష్టం....పంచుకున్నందుకు సంతోషం... :)

  ReplyDelete
 17. @ పక్కింటబ్బాయి - ఇది కవితలకు సంబంధించింది అన్న అపోహలో ఉన్నట్టున్నారు అంతా.... అన్నీ కవితల సమాధానాలే వస్తున్నాయి .....:)

  ఆ పోటీ "రూల్స్ / రెగ్యులేషన్సు" - అక్కడిచ్చిన లంకె నొక్కి చూసి మళ్ళీ రండి.....

  అయినా సరే, మీరు చెప్పారు కాబట్టి ఆ గుండు కవిత కోసం ఎదురు చూస్తాను....దొరకగానే తెచ్చి ఇక్కడ అతికించండి....

  ReplyDelete
 18. @ సుజాత - తెలుగులో మనకున్న ఆవు వ్యాసం లాగా ఉన్నది....పంచుకున్నందుకు సంతోషం....

  ReplyDelete
 19. @ భాస్కర్ - మీరు పక్కింటబ్బాయి గారితో కలిసి అలా డాబా మీదకెళ్ళి పరీక్షల కోసం చక్కగా చదువుకోండి....అనగా ఆయనకు రాసిన కామెంటే మీక్కూడా అని అర్థం...:)

  ReplyDelete
 20. వంశీగారు, మీరు చెప్పిన డవిలాగులాంటివి నిన్నే ఒక మాసపత్రికలోని బహుమతి పొందిన హారర్ కధల్లో చూసాను. ఆ కధలు మీకు పోస్ట్ చేసేదా?? బోల్డున్నాయి. చదివే సాహసం చేయలేను..

  ReplyDelete
 21. $వంశీ గారు

  నేను సయితం కయిత(?)తో సతాయిస్తాను.. ;-)
  ...

  ప్రేయసి నునుపైన సొట్టబుగ్గల గురించి..

  గరకుబండ మీద బిందెను యేళ్ళగా పెట్టబెట్టి ఆ గరకుప్రదేశం నునుపుగా అవ్వి గుంట ఎలా ఏర్పడిందో నా ప్రేయసి సొట్ట బుగ్గలు కూడా అంతే నేను ముద్దు పెట్టడం వల్ల!

  ఇక్కడోసారి చూడండి ;))
  http://www.youtube.com/watch?v=IrY9pqxOOYg

  ReplyDelete
 22. తెల్లని మశూచి కుండలు
  గగనం మొహం మీద తారలు

  సొంతం కాదు,ఎక్కడో చదివిందే!

  ReplyDelete