Monday, July 18, 2011

"లెజెండ్స్" - ఇక్కడ కనపడ్డారండోయ్!

"లెజెండ్స్" - ఇక్కడ కనపడ్డారండోయ్

ఎవరో చెప్పనఖ్ఖరలా - మీరే చూసుకోండి...

చెవులకు తుప్పు లాటిదేమన్నా ఉంటే - వదిలిపోతుంది


http://www.youtube.com/watch?v=UpvnblSNa4Y


అపర సరస్వతీ పుత్రులకు సాష్టాంగ ప్రణామాలతో!

PS: Ignorance is NOT a BLISS.. ..Click and Expand "Show More" to know who those legends are!

ఆ నువ్వు గొట్టంలో (YOU TUBE) లంకెలు పట్టుకు అలా వెళ్ళిపోతే ఇంకా బ్రహ్మాండమైన నిధులు లభిస్తాయి.....అనగా అక్కడున్న మ్యూజిక్ ఫర్ ఎవర్ అన్న పేరు మీద నొక్కి అప్పుడు వచ్చే ప్రొఫైల్ లో రామవర్మ అన్న లంకె నొక్కి వెతుక్కోటమే...

ఓపిక లేదు కానీ, ఇష్టం ఉన్నవాళ్ళు అలా చేస్కోండి... 


భవదీయుడు
వంశి

10 comments:

  1. $వంశీ గారు

    మృదంగం అదరహో..:)

    # రామవర్మ
    రామ్ మోహన్ రావు గారేనా?

    ధన్యవాదాలు ఇక్కడ పంచుకున్నందుకు. ముఖ్యంగా మంచి యూట్యూబ్ సముదాయాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. మునుగుతున్నా..రేపుదయం తేల్తానేమో :).

    ReplyDelete
  2. @రాజేశ్ - దుర్యోధనుడిలా ఇంకా మునిగే ఉన్నారా? లేచొచ్చారా?

    సంతోషం .....నచ్చినందుకు....

    రామ్మోహన్ రావు IS NOT రామవర్మ ...

    ఓ సారి మళ్లీ జాగ్రత్తగా ఇచ్చిన వివరాలు అవీ చూడండి...

    ReplyDelete
  3. చాలా సంతోషం వంశీ.
    విజయవాడ సంగీత త్రిమూర్తుల్ని చూసి మనసు నిండింది ఇవ్వాళ్ళ.
    ఆ రోజుల్లో రాధాకృష్ణరాజుగారని ఒక మృదంగ భీష్ముడుండేవారు విజయవాడలో. వారు వాయించగా వినే అదృష్టం ఒకే ఒక్కసారి కలిగింది - ఆహా ఏమి వాయిద్యమది. అప్పటికే ఆయనకి డెబ్భై పైబడినాయి. కానీ అన్ని కచేరీలకీ వచ్చేవారు. వారి మనవడు లక్ష్మీనారాయణరాజు అని అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. ఇప్పుడు మంచి విద్వాంసుడై ఉండాలి.
    కానీ ఇలా కేవలం యూట్యూబు లంకెలు వెదికి పెడితే సరిపోదు వంశీ. కనీసం ఇప్పుడు ఇంకా బతికున్న మన గొప్ప ఆర్టిస్టులకి జాతీయ వేదిక మీదనూ, ప్రపంచ వేదికమీదనూ పెద్దపీట వెయ్యాలి. దానికి ఏవన్నా పథకం ఆలోచించండి.

    ReplyDelete
  4. #దుర్యోధనుడిలా ఇంకా మునిగే..
    మా అస్మదీయులు వచ్చినట్లు జాడ తెల్పు వ్యాఖ్య లేదే? ;)


    అప్పు'డేనా.. అది రసప్రవాహం కదండీ..ఉదయానికి ఎంతో అయిష్టంగా తేలా..ఇదిగో మళ్ళీ మునుగుతున్నా..బుడుగ్..డుగ్..O O O oo

    ReplyDelete
  5. @ కొత్తపాళి

    బతికున్న మన గొప్ప ఆర్టిస్టులకి జాతీయ వేదిక మీద, ప్రపంచ వేదిక మీద పెద్ద పీట వెయ్యాల్సిందే. కానీ ఆ పీట సామాన్యులమైన మనం, అనగా నాలాటి లక్ష్మీకటాక్షం లేని వారు - మొయ్యలేమని ఓ పేద్ద అనుమానం.

    ఉన్న తందానా, బూటు, కాటు, డ్రాయరు సంస్థల్లాటివే పూనకం వచ్చినట్టు పూనుకోవాలి. అవ్వేమో చాలా మటుకు మనలాటోరి డొనేషన్ల, సభ్యత్వ రుసుముల మీదే బతుకుతున్నా, ఆ డొనేషన్ల, సభ్యత్వ డబ్బు కోసమే రాజకీయాలెక్కువైపోయిన్నూ, పనీ పాట లేక కులాల కాట్లాటలు పెట్టుకునిన్నూ, కమర్షియల్లయిపోయిన్నూ లుకలుకలాడిపోతున్నాయి.

    అవి తలుచుకుంటే కొదవేమి? కానీ పేరు సంపాదించుకోవాలన్న దుగ్ధ, గిన్నెస్సుల్లోకి ఎక్కాలన్న తీటే పరమార్థమైపోయి ఇల్లాటి చిన్న పనులు, అందుబాటులో ఉన్న పనులు, అందరికీ ఉపయోగపడే పనులు - తలుచుకోవు, అందులోని మనుషులు తలుచుకోనివ్వరు....

    ఓ చిన్న ఉదాహరణ.....ఉదాహరణో , నా గోలో ఏదనుకున్నా ఫరవాలా - మొన్నటికి మొన్న డాక్టర్ వేమూరి గారి బ్లాగులో వార్త చూసి రెండ్రోజులు నిద్దర పోలా.....పెద్దాయన జోలె పట్టుక్కూర్చున్నామని ఓ మాటనేసారు.....దెబ్బకు కళ్ళల్లో సుళ్ళు తిరిగేసినాయి.... ఉన్నవన్నీ ఊడ్చేసి ఇచ్చేద్దామా అన్నంత ఆవేశం వచ్చేసింది....కానీ మా ఆవిడ మొట్టికాయలేసి ఈ లోకం లోకి తీసుకొచ్చి పడెయ్యటంతో సంభాళించుకున్నా.......డబ్బులు చూసుకుని ఆ పీఠానికి కొంత పంపించాలి.......అదే ఇల్లాటి ఓ సంఘం తలుచుకుందనుకోండి, ఆ డబ్బులు ఎంత సేపు పని?

    ఇక్కడోటి చెప్పాలి - "అయినా ఒకడికిస్తే వంద మంది తయారవుతారు అడుక్కోడానికి , ఎంతమందికి ఇస్తాం" అని అల్లాటి ఓ సంఘానికి "చెయిర్మెన్" అయిన ఓ పెద్దాయన స్వయంగా నాతో అన్న మాట.....మ్రాన్పడి చూడటం నా వంతు అయ్యిందన్నమాట.......ఇల్లా ఎవడి బాధలు వాడివి - అనగా సంఘాలైనా, మనుషులైనా ఒకటేరా నాయనా అని కామోలు....

    సరే నా గోల - అదలా పక్కనబెట్టి - ఓ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాటిదేదన్నా పోష్టుల రూపంలోనో, కామెంట్ల రూపంలోనో పెట్టండి.....ఏం చెయ్యవచ్చో ఆలోచించి ఆ ప్రకారంగా ముందుకు సాగుదాం....పిల్లికి మెడలో గంట కట్టే బాధ్యత తీసుకోడానికి నాకేం అభ్యంతరం లేదు....

    ReplyDelete
  6. న్న డాక్టర్ వేమూరి గారి బ్లాగులో వార్త చూసి రెండ్రోజులు నిద్దర పోలా.....పెద్దాయన జోలె పట్టుక్కూర్చున్నామని ఓ మాటనేసారు.....దెబ్బకు కళ్ళల్లో సుళ్ళు తిరిగేసినాయి________వంశీ గారూ, బాబ్బాబూ, వివరాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి! ఉన్నది మొత్తం ఊడ్చేయలేకపోయినా ఎంతో కొంత భక్తితో....ఇచ్చుకుంటాను. గూగులించాను కానీ వివరాలు దొరకలేదు. లింకు ఇస్తిరా సగం పుణ్యం మీకు!

    ReplyDelete
  7. http://latebloomer-usa.blogspot.com/2011/07/blog-post_12.html
    (వేమూరి వారి బ్లాగు లింక్ )


    సగం పుణ్యం గారంటీ కదా! :-)

    ReplyDelete
  8. Mandakini garu,
    Thank you Madam !

    సగం పుణ్యం గారంటీ కదా! Yes....guaranteed!

    ReplyDelete
  9. @ సుజాత గారు - లింకు దొరికేసిందిగా...సంతోషం...

    @ మందాకిని గారు - లింకు అలా తెచ్చి ఇలా అతికించినందుకు మరింత సంతోషం..

    ReplyDelete
  10. Vamsi, I hear you.
    Let me just say - been there, done that.
    పట్టుదలగలిగిన సామాన్యమైన మనుషులే ఘనకార్యాలు చేసేది. మనం మంచి పని తలపెట్టి పని మొదలుపెడితే అన్నిశక్తులూ కూడగట్టుకుని దోహదం చేస్తాయని నాకో నమ్మకం. తప్పక చేద్దాం.

    ReplyDelete