Thursday, July 28, 2011

మీరో మాంచి కథ రాసారు. పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది. డబ్బులు లేవు. ఏం చేస్తారు?

మీరో మాంచి కథ రాసారు. 
అందులోనూ పిల్లల కోసం అనుకుందాం.
ఆ కథ పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది.
డబ్బులు లేవు.
ఏం చేస్తారు?

 • మెటికలు విరుచుకుంటూ బాధ పడుతూ కూర్చుంటాను.
 • పొలమో, ఇల్లో అమ్మేసి పుస్తకం అచ్చేయిస్తాను.
 • చేతిలో డబ్బులాడేట్టు తలరాత కొద్దిగా మార్చమని ఆ భగవంతుడికి మొక్కుకుంటాను.
 • నా పుస్తకం అచ్చెయ్యలేకపోటానికి కారణం ఆంధ్రా వాళ్లే అని దూషిస్తాను.
 • పబ్లిషర్లను శాపనార్థాలు పెట్టి, తేనీరు తాగి చక్కగా తొంగుంటాను.
 • తెలిసినవారినెవారినైనా కొద్దిగా సాయం చేసిపెట్టమని అడుగుతాను.  
 • .......
 • .......

యెహా గోలాని గోలా.....ఇవ్వన్నీ పక్కనబెట్టి అసలు సంగతి జెప్పు.
అంబ పలుకు జగదంబ పలుకు అని అశరీరవాణి పొలికేక పెట్టిందని వార్త......

కట్ చేస్తే

అన్నిటికన్నా సులభమైన పని ఒకటి చెయ్యొచ్చు మీరు.
ఇక్కడికెళ్లి ఓ అక్కవుంటు క్రియేట్ చేసుకుని మీ ఆవేదన వాళ్ల మీద కక్కండి.
మీ కక్కు వాసన నచ్చితే, వాళ్లు మీ ఆవేదన సైటులో పెడతారు.

అల్లా వారు సైటులో పెట్టగానే -
 • దానవీరశూరకర్ణులు కొంతమంది మీకు కవచాలో, కుండలాలో ఇస్తారు.
 • ఫండింగు పూర్తి కాగానే మీ బాధలు కొండెక్కి కూర్చున్నంత సంతోషంగా పులకించిపోతారు.
 • మీర్రాసిన ఆ పిల్లల పుస్తకం అచ్చేయిస్తారు...
 • ఆ తర్వాత మీరు ఎవరికీ అర్థం కాని స్టెప్పులేసుకుంటూ ఆకాశవీధుల్లో విహారం చేస్తూ ఉంటారు.

కాబట్టి ......అదండీ సంగతి....
ఇహ మీరు అడుగు వెయ్యటమే ఆలస్యం.....

ఒక్క పుస్తకాలేమిటి, మీకున్న ఏ మాంఛి ఆలోచనైనా వాళ్ల దగ్గర వెళ్ళబోసుకోవచ్చు....

ఆనందోబ్రహ్మ!


భవదీయుడు
మాగంటి వంశి

5 comments:

 1. తెలంగాణా వ్యతిరేకతని దాచుకోకుండా ప్రదర్శించారు అభినందనలు

  ReplyDelete
 2. @బుద్ధా మురళి - తమరు ఈ కామెంటు - ఆనంద "శ్లే"ష్మంతో రాసిందా? ఆవేశ "శ్లే"ష్మంతో రాసిందా? తెలిస్తే తగ్గ సమాధానం అప్పుడిస్తా! అప్పటిదాకా మీ అభినందనలు మీ దగ్గరే పెట్టుకోండి.... :)

  వ్యతిరేకినని తమరు నిర్ణయించేస్తే ఎట్లాగు? అవమానం కాదూ?

  ReplyDelete
 3. తెలంగాణకి ప్రత్యేకరాష్ట్రం అవసరం లేదనడమూ, తెలంగాణవాదులమని చెప్పుకునేవాళ్ళ పైత్యాల్ని విమర్శించడమూ - ఇవి తెలంగాణవ్యతిరేకత కావు. తెలంగాణవ్యతిరేకత అంటే తెలంగాణని ఒక ప్రాంతంగా, ప్రజగా, సంస్కృతిగా ద్వేషించడం. తెలంగాణవాదులు చేస్తూంటారు చూడండి ఆంధ్రాని, అలాంటిదన్నమాట. తెలంగాణవాదులూ, తెలంగాణ రెండు వేఱువేఱు విషయాలు,. ఒకటి కాదు.

  అయినా తెలంగాణ అనే ఈ ప్రస్తావన ఇప్పటిదాకా పెద్ద బ్రెయినీ వాదాలతో ముగిసినట్లు నాకెప్పుడూ కనిపించలేదు. అనుభవరీత్యా చూస్తే తెలంగాణవాదుల నుంచి పాశవిక భావోద్వేగాలూ, ఆవేశాలూ, తిట్లూ, దూషణలూ తప్ప పెద్ద బ్రెయినీనెస్ ఆశించాల్సిన అవసరం లేదు. కనుక వాళ్ళు అపార్థం చేసుకుంటే మీరు పెద్దగా ఫీలవ్వొద్దు మాగంటిగారూ ! ఎందుకంటే ప్రతిదాన్నీ అపార్థం చేసుకోవడం వారి జన్మహక్కు.

  ఈ వ్యాఖ్య వల్ల మీ బ్లాగుప్రశాంతికి భంగం కలిగితే తొలగించండి. నేనేమీ అనుకోను.

  ReplyDelete
 4. తెలంగాణవాదులూ, తెలంగాణ రెండు వేఱువేఱు విషయాలు,. ఒకటి కాదు. - How true! How true!

  తాడేపల్లి గారూ - లేదండీ ఫీల్ ఏమీ అవ్వలేదు...వాళ్ళ అపార్థాలతో నాకు పని లేదు....ఎవడు అపార్థం చేసుకుంటే అది వాడి బాధ! :)

  మీరన్నట్టు అపార్థాలు జన్మహక్కులైపోయీ, అనవసరంగా మాట్లాడితే మటుకు - హననానికి పెద్ద సమయమూ పట్టదు...అదీ ఇక్కడ....ఈ బ్లాగులో....

  ReplyDelete