Wednesday, July 13, 2011

శ్రీ శనగల కబీరు దాస్ ఫోటో ఒకటి - మీకోసం!

శ్రీ శనగల కబీరు దాస్

విజయవాడ రేడియో నాటకాలు వినేవాళ్ళకి పై పేరు వినగానే బోలెడు హాస్యపాత్రలు గుర్తుకొస్తాయి, ముఖాన నవ్వు అలుముకుంటుంది. వీరు ఆకాశవాణి ప్రసారం చేసిన (దాదాపు) 200 నాటకాల్లో పాలుపంచుకున్నారు....

1945 ప్రాంతాల్లో జన్మించి ఉండొచ్చని శ్రీమతి లంక లలిత (మా పిన్ని) తెలియచేస్తున్నారు. ఆవిడ నాలుగైదు సార్లు ఏదో నాటక సభల్లో ఆయన్ని చాలా దగ్గరినుంచి చూసిందిట. అలా దగ్గరగా చూసినందుకు గామోసు వయసు ఉజ్జాయింపు వేసి చెప్పిందన్నమాట...

శ్రీ శనగల కబీరు దాస్ 2010 ఆగష్టులో కన్నుమూసారని తెలియవచ్చింది..

ఆయన ఫోటో ఒకటి మీకోసం .....


 
సౌజన్యం: శ్రీమతి లంక లలిత (ఏదో మాగజైనులో ఈ ఫోటో వచ్చిందిట!)

1 comment:

  1. కబీర్ దాసు గారి గొంతు నాకు బాగా గుర్తుంది. ఇష్టం కూడా! ఈయన హైద్రాబాదు నాటకాల్లో కూడా వేశారు కదండీ!

    అరెరె, ఆయన పోయారా?ఇలా రేడియో కళాకారులు కాలం చేసినపుడు కనీసం పేపర్లో కూడా వార్త రాదండీ! దూరదర్శన్ అనౌన్సర్ రోజా రాణి(శాంతి స్వరూప్ గారి భార్య) రెండేళ్ళ క్రితం మరణించారని ఏదో బ్లాగులో చూస్తే తప్ప తెలీలేదు. ఇది చాలా విచారించాల్సిన సంగతి

    ఫొటో ఇచ్చినందుకు సంతోషం

    ReplyDelete