Thursday, July 28, 2011

మీరో మాంచి కథ రాసారు. పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది. డబ్బులు లేవు. ఏం చేస్తారు?

మీరో మాంచి కథ రాసారు. 
అందులోనూ పిల్లల కోసం అనుకుందాం.
ఆ కథ పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది.
డబ్బులు లేవు.
ఏం చేస్తారు?

 • మెటికలు విరుచుకుంటూ బాధ పడుతూ కూర్చుంటాను.
 • పొలమో, ఇల్లో అమ్మేసి పుస్తకం అచ్చేయిస్తాను.
 • చేతిలో డబ్బులాడేట్టు తలరాత కొద్దిగా మార్చమని ఆ భగవంతుడికి మొక్కుకుంటాను.
 • నా పుస్తకం అచ్చెయ్యలేకపోటానికి కారణం ఆంధ్రా వాళ్లే అని దూషిస్తాను.
 • పబ్లిషర్లను శాపనార్థాలు పెట్టి, తేనీరు తాగి చక్కగా తొంగుంటాను.
 • తెలిసినవారినెవారినైనా కొద్దిగా సాయం చేసిపెట్టమని అడుగుతాను.  
 • .......
 • .......

యెహా గోలాని గోలా.....ఇవ్వన్నీ పక్కనబెట్టి అసలు సంగతి జెప్పు.
అంబ పలుకు జగదంబ పలుకు అని అశరీరవాణి పొలికేక పెట్టిందని వార్త......

కట్ చేస్తే

అన్నిటికన్నా సులభమైన పని ఒకటి చెయ్యొచ్చు మీరు.
ఇక్కడికెళ్లి ఓ అక్కవుంటు క్రియేట్ చేసుకుని మీ ఆవేదన వాళ్ల మీద కక్కండి.
మీ కక్కు వాసన నచ్చితే, వాళ్లు మీ ఆవేదన సైటులో పెడతారు.

అల్లా వారు సైటులో పెట్టగానే -
 • దానవీరశూరకర్ణులు కొంతమంది మీకు కవచాలో, కుండలాలో ఇస్తారు.
 • ఫండింగు పూర్తి కాగానే మీ బాధలు కొండెక్కి కూర్చున్నంత సంతోషంగా పులకించిపోతారు.
 • మీర్రాసిన ఆ పిల్లల పుస్తకం అచ్చేయిస్తారు...
 • ఆ తర్వాత మీరు ఎవరికీ అర్థం కాని స్టెప్పులేసుకుంటూ ఆకాశవీధుల్లో విహారం చేస్తూ ఉంటారు.

కాబట్టి ......అదండీ సంగతి....
ఇహ మీరు అడుగు వెయ్యటమే ఆలస్యం.....

ఒక్క పుస్తకాలేమిటి, మీకున్న ఏ మాంఛి ఆలోచనైనా వాళ్ల దగ్గర వెళ్ళబోసుకోవచ్చు....

ఆనందోబ్రహ్మ!


భవదీయుడు
మాగంటి వంశి

"ఆయన"కు ఈ మాపు చూపిస్తే ఏమంటాడో?

జనాభా ఎక్కువైపోయింది, భూభారం పెరిగిపోతోంది, పాపాలెక్కువైపోతున్నై...ఇల్లాటి మాటలు వినీ వినీ విసుగొచ్చిందండీ .  అప్పుడప్పుడు - ఏంట్రా ఈడికెవడికో పనీపాటా లేదు, ఎదవగోలాని ఎదవ గోల అనిపించటం కూడా కద్దు.

అల్లా అన్న "ఆయన"కు ఈ మాపు చూపిస్తే ఏమంటాడో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇక్కడో లంకె ఇస్తున్నా.....

మాపు

ఖర్మకాలి మీలో - "ఆయన" - పరకాయప్రవేశం చేసి తిష్ట వేసుకుని కూర్చుని ఉంటే , మాపు చూసి ఏమనుకుంటున్నారో కాస్త కామెంటి చెప్పండి.....


ఈ సైటులో ఇల్లాటివే ఇంకా కొన్ని ఎదవగోలలున్నాయి ...చూసి తరించండి / ఆనందించండి... ;)

భవదీయుడు
మాగంటి వంశి

Wednesday, July 27, 2011

మీరు ఎంత "చక్కగా / దరిద్రంగా" రాయగలరు?

మీరు ఎంత "చక్కగా / దరిద్రంగా" రాయగలరు?

కొంతమందికి రాయటం ఇష్టం. కొంతమందికి రాయించుకోటం ఇష్టం. కొంతమందికి కొన్ని రాతలే ఇష్టం. కొంతమందికి అన్ని రాతలూ ఇష్టం.

ఇల్లా ఎన్నైనా, ఎంతైనా చెబుతూ పోవచ్చు.

ఎంతో వద్దు, కొంతే ముద్దు నాయనా...

అలాగంటావా? సరే అయితే - ఆ "కొంతే" ఉన్న టపాలోకి వెళ్ళబోయే ముందు మీకో చిన్న ప్రశ్న -

ఈ క్రింది వాక్యాలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? దీన్నే మీరు రాయాల్సి వస్తే ఎలా రాస్తారు?

"నీలిరంగు ఆకాశం నల్లని మేఘాల చారలతో అట్టలు కట్టి, అప్పుడే మొగుడు చచ్చి భోరున ఏడవటానికి సిద్ధంగా ఉన్న ఆడదాని ఆక్రోశంలా విలయతాండవానికి పూనుకుంటోంది."

నువ్వే రాసావా ఇది? ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చావా?

ఎత్తుకోళ్ళు చేసుకురాడం, పాంకోళ్ళు వేసుకోడం నాకు చేతకాదేమో అన్న అనుమానం నాకుంది నాయనా...

నీ ప్రశ్నకు సమాధానం మటుకు ఇదీ "ఈ ముత్యం అచ్చంగా నాలో పుట్టిందే"....

ఆహా! ఎంత "అందమైన" వర్ణన? దీనికి ప్రేరణ ఏమిటో కాస్త చెబుతావా?

ప్రేరణ ఇదే - ఇదిగో ఈ క్రిందనున్న లంకె.....


సవాలు/పోటీ


కథా కమామీషు కొద్దిగా వివరిస్తే....?

మా ఊరుకి రెండు గంటల దూరంలో ఉన్న సాన్ హోసేలో స్థాపించబడిన సాన్ హోసే స్టేట్ యూనివర్సిటి ప్రతి సంవత్సరం "ఎడ్వర్డ్ జార్జ్ బుల్వర్-లిట్టన్" పేరిట ఒక "సవాలు/పోటీ"  నిర్వహిస్తూ ఉంటుంది. ఆ "సవాలు/పోటీ"లో Bad Writing అన్నది ఒక "వర్గం/విభాగం".

ఈ సంవత్సరం ఆ Bad Writing విభాగంలో గెలుపొందినవారు - విస్కాన్సిన్ ప్రొఫెసర్ "సూ ఫాండ్రీ" ...వారికి విజయం చేకూర్చి పెట్టిన రాత ఇదే

 "Cheryl's mind turned like the vanes of a wind-powered turbine, chopping her sparrow-like thoughts into bloody pieces that fell onto a growing pile of forgotten memories."


మైండ్ బ్లోయింగ్ యార్! - బుర్ర పేలిపోయింది తమ్మీ! బాగుంది ...చాలా బాగుంది....

సరే వారు గెలిచారు...బాగుంది...ఇప్పుడు ఏమిటంటావు?

వస్తున్నా...అక్కడికే వస్తున్నా

ఇలాటిది - అనగా "సవాలు/పోటీ" - మన దేశంలో ఏదన్నా ఉన్నదా? తెలిసినవారు కామెంటు రూపంలో తెలియచెయ్యగలరు

ఇప్పుడు అసలు సంగతికీ, కొద్దిగా క్లిష్టమైన ప్రశ్నకీ - కాచుకోండి!

ఏమిటి కాచుకునేది? సంగతులు, ప్రశ్నలూ కలిపిన బిందెలో నీళ్ళా? 


వెటకారం పక్కనబెట్టు ఎంకా, కుంకా - సరే కానీ, తెలుగు బ్లాగుల్లో ఇలాటిది ఒకటి పెడితే, మీరు విజేత కాగలరా అన్న ప్రశ్న ఒకటి వేసుకోండి. అలా వేసుకున్న ప్రశ్న క్లిష్టమనిపించి సమాధానం దొరకకపోతే, ఇంకో చిన్న ప్రశ్న వేసుకోండి - తెలుగు బ్లాగుల్లో రాసే రాతల ఆధారంగా - టపా కానివ్వండి, కామెంటు కానివ్వండి - విజేతగా ఎవరిని ప్రకటించవచ్చో తెలియచెయ్యండి.

గమనిక: చిత్తచాంచల్యం ఉన్నవారిని, మతి భ్రమించిన వారిని, ఉన్మాదులను దయచేసి ఉదహరించవద్దు....చిత్తచాంచల్యం ఇంటి పేరుగా ఉన్నవారు కానీ, వొంటికి పట్టించుకున్నవారు కానీ, చిత్తచాంచల్యం దినుసుగా వంట చేసుకునేవారు కానీ, వారి పేర్లు కానీ, పేళ్ళు కానీ, వారు రాసిన రాతలు కానీ - అవి తక్క మిగతావేవైనా ఉదాహరించే స్వేచ్ఛ మీకిచ్చేస్తున్నా.....ఆనందో బ్రహ్మ! 


భవదీయుడు
మాగంటి వంశి

PS: నా పేరు ప్రకటిస్తే మీ చేత ఆ పైన కట్టిన "అట్టలు" కడిగిస్తా! :)
PPS: ఇదంతా హాస్యానికే అని అనుకున్నవారు ధన్యులు సుమతీ!

Sunday, July 24, 2011

6,63,57,678 - అవును అక్షరాలా 6 కోట్ల 63 లక్షల పాఠాలు - నేర్చుకునేందుకే!

టైటిలు చూసి
 • తికమక పడ్డారా?
 • మతిపోయిందా?
 • ఆశ్చర్యపోయారా?
 • నిర్ఘాంత - పోతున్నారా? పోయారా? పోవాలనుకుంటున్నారా?
పైవాటిల్లో ఇంకా ఏమీ పోలేదా?

అయితే ఈ క్రిందనున్న లింకు నొక్కి చూసుకోండి.....

6 కోట్ల 63 లక్షల పాఠాలు - నేర్చుకునేందుకే!


ఇదేంటిది - సల్మాన్ ఖాన్ అని వున్నది....చొక్కాలు విప్పి కండలు చూపిస్తారా అని అడుగుతున్నారా?

లేదు, కాదు, చాదు (కాటుక సంబంధం), ఊదు.....

అన్నీ పాఠాలే, అది కూడా "ఫ్రీ", "ఫ్రీ", "ఫ్రీ" గా

మీ మీ పిల్లలకో కాదంటే మీకో ఉపయోగపడేవి ఉన్నాయి....ఆలస్యమెందుకు ?

ఆనంద"పాఠో"బ్రహ్మ

ఈ ఆరుకోట్లు ఎక్కడినుంచి తెచ్చా?

ఆ సైటులో అదిగో అల్లదిగో ఆ పైన - 66,357,678 lessons delivered అని ఉన్నదిగా అక్కడినుంచి....

Friday, July 22, 2011

రంగస్థల ఆణిముత్యాలు - ఆడియోలు కొన్ని....

ప్రచురించబడ్డవి ఇవీ - 


శ్రీకృష్ణ రాయబారం
శ్రీ బందా కనకలింగేశ్వర రావు


బాహుకుడు  
శ్రీ బందా కనకలింగేశ్వర రావు

శ్రీకృష్ణ తులాభారం
శ్రీమతి అబ్బూరి కమలాదేవి 


గయోపాఖ్యానం
శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు
 
 
ఈలపాట
శ్రీ కె.రఘురామయ్య

ఇంద్రుడు
 
శ్రీ కె.రఘురామయ్య

నాగుల చవితి
 శ్రీ కె.రఘురామయ్య

వాల్మీకి 
శ్రీ కె.రఘురామయ్య
  

మార్కండేయ
 శ్రీ కె.రఘురామయ్య


ఉషా పరిణయం
 శ్రీ కె.రఘురామయ్యవీటిలో రఘురామయ్య గారి ఆడియోలు కొన్ని, సినిమాలల్లోవి అని తెలియవస్తోంది.........

శ్రీ అద్దంకి శ్రీరామచంద్రమూర్తిగారి ఆడియోలు కొన్ని త్వరలో........

బహుముఖ ప్రజ్ఞావంతులు, రంగస్థల నటులు శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు గారిని సంప్రదించగానే, సంతోషంగా వారి వద్ద ఉన్న అరుదైన రికార్డింగులు, ఆడియోలు  ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న రంగస్థల నటులు - ఆడియో లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Thursday, July 21, 2011

చించు, ఎందుకు చించామని ఆలోచించు, అలా ఆలోచించిన దాన్ని ఆచరించు!

నిన్న షష్టి.

సుబ్రహ్మణ్యస్వామి అభిషేకం.

రుద్రపారాయణం పూర్తి చేసా.

గుడి నుంచి ఇంటికి రావటానికి 20 నిముషాలు.

కారెక్కాక, బ్లాగులో నిన్న కొత్తపాళి గారు రాసిన కామెంటు - "ఇంకా బతికున్న మన గొప్ప ఆర్టిస్టులకి జాతీయ వేదిక మీదనూ, ప్రపంచ వేదికమీదనూ పెద్దపీట వెయ్యాలి. దానికి ఏవన్నా పథకం ఆలోచించండి. " - వేరు పురుగులా బుఱ్ఱను తొలవడం మొదలుపెట్టింది....ఆ కామెంటుకు జవాబుగా నేను రాసింది - న్యాయం చెయ్యలేదేమొ అనిపించింది.....

ఇంకెందుకు ఆలస్యం - చించు, ఎందుకు చించామని ఆలోచించు, అలా ఆలోచించిన దాన్ని ఆచరించు అని ఆ షడాననుడు తన వేలాయుధంతో ఓ పోటు పొడవటంతోనూ, ఆ పోటు సరిపోకపోతే ఆ వెనకనే నేనున్నానటూ దన్నుగా నిలబడ్డ శివయ్య త్రిశూలం కనపడ్డంతోనూ, ప్రస్తుతానికి పొడవనులే కానీ - సంస్థల మీద పడి ఏడవటం ఎందుకు నీకు నువ్వే ఆలోచించుకొని, ఏదో ఒకటి చెయ్యిరా పిచ్చికుంకా అని ఆ పెద్దాయన శివయ్య హెచ్చరించటంతోనూ తీవ్రమైన ఆలోచనలో పడిపోయా....అలా పడి - పోయి పోయి, ఒక నిశ్చయ తీరానికి చేరా.....ఇహ ఆచరణలో పెట్టటం మిగిలింది....

అదేమిటో కాస్త ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తా....

1) ఆ గొప్ప ఆర్టిష్టుల పేర్ల లిష్టు ఒకటి తయారు చేసుకోటం
2) అలా తయరుచేసుకున్న వారి పూర్తి వివరాలు సంపాదించటం
3) అలా సంపాదించిన వివరాలు పట్టుకొని వారిని స్వయంగా సంప్రదించటం
4) ఒక వెబ్సైటు తెరిచి ఆయా కళాకారుల వివరాలు పూర్తిగా ప్రచురించటం - ఫోటోలు / వీలున్న చోట ఆడియోలు
5) ఒక ఫండ్ లాటిది ఏర్పాటు చేసుకోటం
6) ఆ లిష్టులోని వారిలో - ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక ముగ్గురిని అనగా త్రిమూర్తులను ఎంపిక చేసుకొని, ఉడతాభక్తిగా చెరో ఐదు వేల రూపాయల నగదు అందించటం.

ఇవే కాక మరికొన్ని ఆలోచనలు ఉన్నాయి....అవి ఒక పరిధి గీసుకున్నాక వివరిస్తాను...

నెంబర్లు 1, 4, 5, 6 సుళువైనవే.

వెబ్సైటు తెరవటం ఒక్క రెండు గంటల పని.

ఫండ్ సంగతికొస్తే ఈ రోజే ఒక 200 డాలర్లు పక్కనబెట్టా....అక్టోబరులో మరో 200 డాలర్లు పక్కనబెడతా...దానితో ఉడతాభక్తి నగదు సరిపోతుంది....

లిష్టులోని వారిని ఎంపిక ఎలా చేస్తారు అని అడుగుతున్నారా?

లిష్టులోని వారి వయసు ఆధారంగా....పెద్దవయసువారు ముందు, ఆ తరువాత పుట్టినవారు తర్వాత...అలాగన్నమాట.....

నగదు సమర్పించుకుంటే సరిపోతుందా? అదీ అంత చిన్న మొత్తంతోనా? సిగ్గుచేటు - కళామతల్లికి , ఆయా కళాకారులకి అవమానం అని అంటున్నారా?

ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది....అయినా నా సమాధానం వినాలనుకుంటే ఇదిగో - నాకున్న లక్ష్మీ కటాక్షం అంతవరకే కాబట్టి, ఉడతాభక్తి అని చెప్పుకొచ్చాను....

మరి సంస్థలాటిది ప్రారంభిస్తారా?

సంస్థ ఆలోచన లేదు, సర్వసంగ పరిత్యాగమూ లేదు..... అంతా స్వీయ సమర్పణే!

మరి నగదు తీసుకున్నవారికి టాక్సు గొడవలొస్తాయేమో...ఆలోచించావా?

ఆ దిశగా కొద్దిమందిని కదల్చటం జరిగింది.....వారి సమాధానం కోసం వేచి చూస్తున్నాను....

ఏమి చెప్పు - నువ్విచ్చే నగదు కన్నా - శాలువాలు, సత్కారాలు , జనాలు, చప్పట్లు ఉంటేనే శోభయ్యా...కళాకారుడికి తృప్తీనూ

ఆవైపు కూడా ఆలోచించాలి....కానీ ప్రస్తుతానికి "లక్ష్మమ్మ" నన్ను ఇంతవరకే అనుమతిస్తోంది....

మరి లిష్టు ఎవరితో మొదలుపెడదామనుకుంటున్నావు?

మొదలు ఆకాశవాణి కళాకారులతోనూ, ఆ తర్వాత నాటక రంగ కళాకారులతోనూ, ఆ తర్వాత జానపద కళాకారులతోనూ, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కళాకారులతోనూ, ఆ తర్వాత సాహితీవేత్తలతోనూ, ఆ తర్వాత మిగిలినవారితోనూ - ఇలాగన్నమాట

ఇవన్నీ ఎప్పటికయ్యేను?

ఎప్పటికైతే అప్పటికే స్వామీ......అడుగు వేసేసా, ఇహ వెనుదిరిగేది లేదు .....

సరే అది అలా పక్కనబెట్టెస్తే - ఒకవేళ ఈ నగదు కార్యక్రమంలో పాలుపంచుకోవాలనుకున్న వారెవరైనా ఉంటే ఇచ్చే నగదు పెంచుకోవచ్చు, లేదా కళాకారుల సంఖ్య పెంచుకోవచ్చు. అయితే కళాకారుల సంఖ్య ఐదుకు గానీ, పదికి గానీ పరిమితం చేస్తే బాగుంటుందని భవదీయుడి అభిప్రాయం.

ఇంకో విషయం - డబ్బుతో పని కాబట్టి అనుమానాలు రాకుండా, గొడవల్లేకుండా - పాలుపంచుకోవాలనుకున్నవారికి ఆయా కళాకారుల అడ్రసు వివరాలు, బాంకు వివరాలు ఇచ్చెయ్యటం జరుగుతుంది.

పాలుపంచుకోవాలనుకున్నవారే ఆ బాంక్ అక్కవుంటుకు ట్రాన్స్ఫర్ చెయ్యటమో, వేరే విధంగా అందేలా చూడటమో చేసుకోవచ్చు...

2, 3 నంబర్లకు సాయం చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తే, అదే కాక ఇతరంగా ఆలోచనలు, సలహాలు ఇవ్వాలనిపించినవారు  దయచేసి ఇక్కడే ఒక కామెంటు కొట్టండి.....

అయినా ఒక వెర్రి ప్రశ్న - పైన కొత్తపాళి గారి కామెంటుకు దీనికి సంబంధమేమన్నా ఉన్నదా అసలు అన్న అనుమానం వచ్చిందయ్యా...

ఇదసలు పెద్దపీట ఎలా వేస్తుంది అన్న అనుమానం వచ్చిందా? శుభం

భవదీయుడు

మాగంటి వంశి

Wednesday, July 20, 2011

కార్టూనిష్టు ఊమెన్ / కేరళ రాష్ట్ర కార్టూనిష్టుల వివరాలు

నిన్న సాయంత్రం మన కార్టూనిష్టు శ్రీధర్ గురించి కొన్ని మాటలొచ్చి, మాటలైపోయాక గూగిలిస్తే హాచ్చర్యంగా ఆయనవి కొన్నే తగిలినా, ఇంకో భండారం బయటపడింది...కేరళ రాష్ట్ర కార్టూనిష్టుల వివరాలున్న వెబ్సైటు / బ్లాగు - ఇక్కడ


http://keralacartoonists.blogspot.com/

ఇందులో ఊమెన్ అన్న కార్టూనిష్టు గారి ఫోటో, వివరాలు ఈ క్రింద....అయితే ఇక్కడున్న ఈ ఊమెన్ గారు, మనలో కొద్దిమందికి పరిచయమున్న ఊమెన్ గారు ఒకరో కాదో తెలియదు....ఆ బ్లాగు వారికి ఈమెయిలు పంపించా, జవాబేమన్నా వస్తే మళ్ళీ ఇక్కడే పోష్టు చేస్తా...
Samji K Oommen,
Kulanjeelazhathu,
Mannadi p.o.,
Enathu,
Pathanamthitta.
M-Kerala-9847003405
H-Kerala-Pathanamthitta-04734-222813


ఫోన్ నంబర్లూ అవీ ఉన్నాయి మరి.....అంటే మనిషి ఇంకా ఈ లోకంలో ఉన్నట్టే అని అనుమానం, మనకు తెలిసిన ఊమెన్ గారేమో స్వర్గస్తులయినారు ...చిక్కు విడేది ఎలా చెప్మా?

తెలుగు బ్లాగుల్లో ఇలాటి కార్టూనిష్టుల వివరాలున్న, అంటే మన రాష్ట్రానికి సంబంధించినవారి వివరాలున్న బ్లాగేదన్నా ఉన్నదా? తెలిస్తే చెప్పండి....

వంశి

PS: ఇది పుచ్చుకుని ఇల్లాటి నిధులు మనమే కనుక్కున్నట్టు ఓ పోష్టేసుకోండేం? ఫరవాలా! Just kidding :)....అబ్బో - ఇవి నిధులా? ఛా ...నిజంగానే?

Monday, July 18, 2011

"లెజెండ్స్" - ఇక్కడ కనపడ్డారండోయ్!

"లెజెండ్స్" - ఇక్కడ కనపడ్డారండోయ్

ఎవరో చెప్పనఖ్ఖరలా - మీరే చూసుకోండి...

చెవులకు తుప్పు లాటిదేమన్నా ఉంటే - వదిలిపోతుంది


http://www.youtube.com/watch?v=UpvnblSNa4Y


అపర సరస్వతీ పుత్రులకు సాష్టాంగ ప్రణామాలతో!

PS: Ignorance is NOT a BLISS.. ..Click and Expand "Show More" to know who those legends are!

ఆ నువ్వు గొట్టంలో (YOU TUBE) లంకెలు పట్టుకు అలా వెళ్ళిపోతే ఇంకా బ్రహ్మాండమైన నిధులు లభిస్తాయి.....అనగా అక్కడున్న మ్యూజిక్ ఫర్ ఎవర్ అన్న పేరు మీద నొక్కి అప్పుడు వచ్చే ప్రొఫైల్ లో రామవర్మ అన్న లంకె నొక్కి వెతుక్కోటమే...

ఓపిక లేదు కానీ, ఇష్టం ఉన్నవాళ్ళు అలా చేస్కోండి... 


భవదీయుడు
వంశి

Thursday, July 14, 2011

క్రితం రెండు వారాల్లో వెబ్సైటులోకి ఎక్కించినవేమిటయ్యా అంటే?


క్రితం రెండు వారాల్లో వెబ్సైటులోకి ఎక్కించినవేమిటయ్యా అంటే?


కర్నాటక సంగీత సభ కార్యక్రమం
గాత్రం: శ్రీమతి డి.వర్ధని
వయొలిన్: శ్రీ ద్వారం సత్యనారాయణరావు
మృదంగం: శ్రీ పి.జయభాస్కర్
ఆకాశవాణి  హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 25, 2011


 *************************


ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రసారం చేయబడిన విజ్ఞానశాస్త్ర ధారావాహిక - సాంకేతిక రంగంలో మహిళా శక్తి . ఈ ధారావాహికలోని ఈ భాగం - "మహిళలు - పర్యావరణ పరిరక్షణ" గురించి

రచన: డాక్టర్ సమ్మెట గోవర్ధన్
రచనా సహకారం: జనవిజ్ఞాన వేదిక శాస్త్రప్రచార విభాగం
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవ రెడ్డి
సహకారం: శ్రీ ఎన్.సత్యనారాయణ
ప్రసార తేదీ: జూన్ 25, 2011
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఇందులో పాల్గొన్నవారు
శ్రీమతి డి.స్వప్న
కుమారి శఠగోపన్ కృష్ణవేణి
శ్రీమతి ఎం.సుభాషిణి
కుమారి వి.హారిక


 *************************


భక్తిరంజని కార్యక్రమం
చంద్రశేఖరాష్టకం, శివకీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 26, 2011

  *************************


భక్తిరంజని కార్యక్రమం
శ్రీరామ సుప్రభాతం , సంప్రదాయ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 27, 2011


  *************************


భక్తిరంజని కార్యక్రమం
అమరనారాయణ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 9, 2011


  *************************


భక్తిరంజని కార్యక్రమం
శివ సంప్రదాయ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 10, 2011

  *************************

హైటెక్ కాపురం నాటిక
రచన: అత్తలూరి విజయలక్ష్మి
నిర్వహణ: చావలి దేవదాస్
సహకారం: జా(గా?)జుల ప్రభాకర్

పాల్గొన్నవారు:
శ్రీమతి సి.శైలజ
శ్రీమతి బి.పద్మశ్రీ
శ్రీమతి ఎం.ఎస్.లక్ష్మి
శ్రీ ఎస్.జాఫర్ బాషా
శ్రీ పి.శేషు బాబు
శ్రీ కె.మురళీ కృష్ణ
శ్రీ ఎస్.కామేశ్వర శర్మ
శ్రీ అద్దంకి శ్రీరామచంద్రమూర్తి
శ్రీ వెంకట్రామయ్య
శ్రీ సుబ్బారావు


ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 29, 2011


 ************************* 


కర్నాటక సంగీత కార్యక్రమం
శ్రీ ఎం.జయకృష్ణ గాత్రం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 7, 2011


  *************************


కర్నాటక సంగీత కార్యక్రమం
శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణా వాద్యం
మృదంగ సహకారం: శ్రీ డి.శేషాచారి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 20, 2011


 ************************* 


కర్నాటక అనుసంధాన సంగీత కార్యక్రమం
పప్పు పద్మా రవిశంకర్ వీణా వాద్యం
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 11, 2011


  *************************


రవివాసరీయ అఖిల భారత సంగీత కార్యక్రమం
ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర ప్రసారం
ప్రసార తేది: జూన్ 25, 2011


  ************************* 


రాగం తానం పల్లవి
డాక్టర్ ఎన్,సి.హెచ్. రంగాచార్యులు గారి గానం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేది: జులై 6, 2011


  *************************

రాగం తానం పల్లవి
శ్రీమతి బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం గారి వీణావాద్యం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తెదీ: జూన్ 29, 2011


  *************************


సీతా కల్యాణం
హరికథా కాలక్షేపం
కథకులు: శ్రీ రాజయ్య శర్మ భాగవతార్
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 28, 2011  *************************


"వివేకం" - లఘు ప్రసంగం
ఆచార్య ఎస్.వి.రామారావు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 10, 2011


  *************************


శ్రీకృష్ణదేవరాయలు - ధారావాహిక - 3
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 10, 2011


  *************************


శారద లేఖలు - ధారావాహిక
వ్యాఖ్యాత: అత్తలూరి విజయలక్ష్మి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 10, 2011

  *************************


ప్రముఖ రంగస్థల నటులు శ్రీ ఆచంట వేంకటరత్నం నాయుడు, జలంధరుడి వేషంలో వీనుల విందుగా వినిపించిన మాటలు 

  *************************


ప్రముఖ రంగస్థల నటులు శ్రీ ఆచంట వేంకటరత్నం నాయుడు, జరాసంధుడి వేషంలో వీనుల విందుగా వినిపించిన మాటలు 

*************************


మనతెలుగు కార్యక్రమం
పురాణాల్లో మానవతావాదం - భరతుడు
వ్యాఖ్యాత: శ్రీ పులివర్తి కృష్ణమూర్తి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 11, 2011


************************* 


వైజ్ఞానిక వైతాళికులు
విలియం హార్వే
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్  గారి ప్రసంగ వ్యాసం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 11, 2011*************************


భక్తిరంజని కార్యక్రమం
శ్రీకృష్ణ గానలహరి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 11, 2011*************************

అంబరీష చరిత్ర హరికథాగానం
కథకురాలూ: శ్రీమతి జయంతి సావిత్రి
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 12, 2011

మొదటి ఐదు నిముషాలు ఓ రకంగా ఉన్నా, తరువాత 55 నిముషాలు మటుకు, కథను చాలా బాగా, అనగా చాలా చాలా బాగా చెప్పుకొచ్చారు సావిత్రి గారు


*************************

గోరంతదీపం నాటిక
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 13, 2011


*************************

రాగం తానం పల్లవి
శ్రీ డి.వి.మోహనకృష్ణ గారి గాత్రం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 13, 2011


*************************


కర్నాటక సంగీత కార్యక్రమం
పంచవీణ - పుదుక్కొట్టై ఆర్.కృష్ణమూర్తి, మేడూరి శ్రీనివాస్, సీతారామయ్య, ఈమని లలితాకృష్ణ, కె.పద్మావతి
మృదంగ సహకారం: గోపాలకృష్ణ
ఘటం: రమణమూర్తి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 13, 2011

ఈ కార్యక్రమంలో త్యాగరాజుల వారి కృతి "నాద తనుమనిషం శంకరం " చిత్తరంజని రాగం, ఆది తాళం - పంచవీణ మీద చాలా అద్భుతంగా ఉన్నది. ఇదే కృతి గాత్ర రూపంలో అయితే శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి గారిది మొదటి స్థానం. ఆ తర్వాత శ్రీ మహరాజపురం సంతానం గారిది అని ఈ సంగీత పరిజ్ఞానం లేని అజ్ఞాని అభిప్రాయం...

నిజంగానే "చిత్తం" రంజిల్లిపోతుందండీ - ఆహా! త్యాగయ్యా - ఎంత అదృష్టం చేసుకున్నావయ్యా, నీతో పాటు మమ్మల్నీ ధన్యుల్ని చేసావు....

*************************

భక్తిరంజని కార్యక్రమం
నన్ను విడచి కదలకురా
త్యాగరాజుల వారి కృతి
మహరాజపురం సంతానం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 12, 2011


*************************

PS: 

కొంతమంది మిత్రులు అడుగుతున్నారు - పిల్లల కథల ఆడియోలు ఏవీ అనిన్నూ, యానిమేషన్ కథాకమామీషు గురించి వివరించమనిన్నూ :

క్లుప్తంగా - ఐదుగురు పెద్దల సలహాల వల్ల పిల్లల కథల ఆడియోలు సి.డి.ల రూపంలో, యానిమేషన్లు డి.వి.డి ల రూపంలో తీసుకుని రావాలని నిర్ణయించటమైనది.......స్కూళ్లకు, అందులోని విద్యార్థులకు - గవర్నమెంటు స్కూలు పిల్లలకు ఆయా సి.డి.లు , డి.వి.డి లు ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి....

ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలోని దాదాపు అరవై రెండు పాఠశాలలను సంప్రదించటం జరిగింది..........యాభై పాఠశాల యాజమాన్యాలు అంగీకరించినాయి..... అయితే ఒక బృహత్ ప్రయత్నం కాబట్టి, దానికి తగ్గ అడ్డంకులు, సాధక బాధకాలు దానికి ఉన్నాయి....అంతా ఒక కొలిక్కి, ఒక రూపుకు వచ్చాక ఇతర వివరాలు తెలియచేస్తాను...అప్పటిదాకా ఓపిక పట్టమని విన్నపం...... 

Wednesday, July 13, 2011

శ్రీ శనగల కబీరు దాస్ ఫోటో ఒకటి - మీకోసం!

శ్రీ శనగల కబీరు దాస్

విజయవాడ రేడియో నాటకాలు వినేవాళ్ళకి పై పేరు వినగానే బోలెడు హాస్యపాత్రలు గుర్తుకొస్తాయి, ముఖాన నవ్వు అలుముకుంటుంది. వీరు ఆకాశవాణి ప్రసారం చేసిన (దాదాపు) 200 నాటకాల్లో పాలుపంచుకున్నారు....

1945 ప్రాంతాల్లో జన్మించి ఉండొచ్చని శ్రీమతి లంక లలిత (మా పిన్ని) తెలియచేస్తున్నారు. ఆవిడ నాలుగైదు సార్లు ఏదో నాటక సభల్లో ఆయన్ని చాలా దగ్గరినుంచి చూసిందిట. అలా దగ్గరగా చూసినందుకు గామోసు వయసు ఉజ్జాయింపు వేసి చెప్పిందన్నమాట...

శ్రీ శనగల కబీరు దాస్ 2010 ఆగష్టులో కన్నుమూసారని తెలియవచ్చింది..

ఆయన ఫోటో ఒకటి మీకోసం .....


 
సౌజన్యం: శ్రీమతి లంక లలిత (ఏదో మాగజైనులో ఈ ఫోటో వచ్చిందిట!)

ఈ రోజు ముంబైలో బ్లాస్ట్స్ - రాజకీయం?

ఒరే రామారావు, మళ్లీ ముంబైలో పేలుళ్ళు జరిగినాయిరా....ప్రస్తుతానికి 8 మంది మరణం, 70 మంది క్షతగాత్రులట...

ఎప్పుడు ఒక రాజకీయ సంక్షోభం వచ్చినా, వస్తుందనుకున్న అనుమానం ఉన్నా , ఏ ప్రముఖులు అన్నా ఇబ్బందుల్లో ఉన్నా చక్కగా పక్కదారి పట్టిస్తూ ఉంటారన్నమాట మనకు తెలిసిందే గదరా. ఇది కూడా అలాటిదే అయ్యుంటుందని నా అనుమానం. అనుమానం నిజమైనా కాకపోయినా పాపం ఏ ఇబ్బందులైనా సామాన్యులకేగా - ప్రాణాలైనా, ధరలైనా, జీవితమైనా?  May God Bless The Politicians

అలా అనమాకురా ఒరే, మనకు దేశభక్తి లేదనుకునేరు....

ఎవడురా నా కన్నా దేశభక్తుడు? చేతకాక - దేశాన్ని, మనుషులని రక్షించుకోలేని దద్దమ్మల్లా ఉండటమే దేశభక్తైతే........ 

ఆపెయ్యి ఆ బుసలు ఆపెయ్యి - సరే కానీ టెర్రరిష్టులంటారు, ఆనవాలు తెలుసంటారు, ఎవరు చేసారో తెలుసంటారు - మరి ఉపేక్ష ఎందుకంటావు?

అందుకే నిన్ను వెఱ్ఱిమాలోకం అనేది. ఆ వెఱ్ఱి కుదిరినప్పుడు అదే అర్థమవుతుందిలే...