Friday, June 17, 2011

అరుదైన లలిత సంగీతం పాటల ఆడియోలు కొన్ని .....అందులో ఒకటి శ్రీ పుట్టపర్తి వారి రచన కూడా!

తన తండ్రిగారు శ్రీ ఎం.ఎల్.నరసింహం గారు పాడిన కొన్ని అరుదైన లలిత సంగీతం పాటల  ఆడియోలు పంచుకున్న శ్రీ మండా కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను . ఆకాశవాణి విశాఖ, విజయవాడ కేంద్ర ప్రసారాలతో పరిచయం ఉన్నవారికి శ్రీ ఎం.ఎల్.నరసింహం గారి గురించి చెప్పవలసిన పని లేదు...అద్భుతమైన పాటలు ఎన్నో ఆయన గళం నుంచి జాలువారాయి....

  • చిగురాకుల మాటునున్న
రచన: శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య
సంగీతం : శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం

  • నీలి నీలి గగనంలో
రచన: రాయంచ
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం
సంగీతం: శ్రీ చంద్రశేఖర్


  • నందనందనునీ
రచన: శ్రీ సి.నా.రె
సంగీతం : శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం


  • నీలాంబరధరి
రచన: శ్రీ ఆవంత్స సోమసుందర్
సంగీతం : శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం

  • గగనాన పండింది
రచన: శ్రీ రామకోటి
సంగీతం: శ్రీ ఆదిత్య ప్రసాద్
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ద్వారం లక్ష్మి


  • జయజయ పద్మావతి
రచన: కరుణశ్రీ
సంగీతం: కె.ఎస్.ప్రకాశరావు
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



  • మ్రోయింప మురళి
రచన: శ్రీ వక్కలంక
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం


  • ప్రవిస రాధే
రచన: జయదేవుడు
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



  • వెన్నెలేమో పంపింది
రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం: శ్రీ తిరుపతి రామానుజ సూరి
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



  • ఆ మహోన్నత శిల్పి
రచన: శ్రీ వక్కలంక
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



  • పూవులలోని
రచన: శ్రీ వక్కలంక
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ద్వారం లక్ష్మి



  • చైతన్యం
రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



  • చిగురాకులపై
రచన: శ్రీ సి.నా.రె
సంగీతం: శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ఆర్.జి.శోభారాజు



  • నీడై తోడై
రచన: శ్రీ కాటూరి విజయసారధి
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం
 

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "లలిత సంగీతం ఆడియో" లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

2 comments:

  1. నేను పుట్టపర్తి వారి చివరి కుమార్తె పుట్టపర్తి అనూరాధను. మీరు ఉదహరించిన పాట నేను రాసినదే అదే కాదు పా సంగీత రూపకం నేను రాసినదే ..మా అమ్మ గారు క్యాన్సరుతో బాధపడుతూ చివరి రోజులలో వున్నారు..అప్పుడు మా అయ్య గారు మా అమ్మ గారి కోసం రాఘవేంద్ర స్తోత్రం 108 సార్లు పారాయణ చేసే వారు.ఇల్లు అశాంతిగా వుంది. అప్పుడు మా నాన్న గారు నాతో ఈ సంగీత రూపకం రాయించారు.అప్పుడు నాకు ఇరవై అనుకుంటా..నేను చిన్నదాన్ని కవితాస్పూర్తి..మా నాన్న గారి వర ప్రసాదంగా మాకు సంక్రమించింది.
    ఈ రోజు దీన్ని చదివిన వెంటనే ఇది నేను రాసినదే కదా అని స్పురించింది..మంచి జ్ఞాపకం అందించి నందుకు కృతజ్ఞతలు..

    ReplyDelete
  2. నమస్తే అనురాధ గారు

    సరస్వతీదేవి కోరి నాన్నగారికోసం నడిచొచ్చిన ఇల్లు, ఆ ఇంట్లోని మనుషులు - నిజంగా వరప్రసాదమే.....

    మాకూ మీ పరిచయం ఒక వరమే! "అయ్యవారి" శివతాండవమంటే ప్రాణమండీ....మీ ధన్యవాదాలు / కృతజ్ఞతలు శ్రీ మండా కృష్ణమోహన్ గారికే...నేను చేసిందేమీ లేదు....

    భవదీయుడు
    వంశీ

    ReplyDelete