Tuesday, June 14, 2011

వేటపాలెం లైబ్రరీలో ఉన్న పుస్తకాల లిష్టు బయటపడింది.....ఆనందోబ్రహ్మ!!

హార్డ్ డ్రైవులో పాత సరంజామా కోసం వెతుకుతూంటే వేటపాలెం లైబ్రరీలో ఉన్న పుస్తకాల లిష్టు బయటపడింది నిన్న...

ఎప్పుడో 2007 లో ఇక్కడినుంచి సేవ్ చేసుకున్నా...(అనుకుంటా)....ఫైలు డేటు చూస్తే 2007 అని ఉంది...

http://www.saraswataniketanam.org/ ....

ఇప్పుడు ఆ లింకు, వెబ్సైటు పని చేస్తున్నట్టు లేవు....

ఫైలు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ అప్లోడు చేసా....

ఆనందోబ్రహ్మ...

ఈ లిష్టు చూసి సారస్వత నికేతనంలో సరస్వతి ఇల్లా చిక్కిపోయిందా అనో, ఏంటీ వేటపాలెం లైబ్రరీలో ఇన్నే పుస్తకాలున్నాయా అనో ఓ పెస్న ఏసారనుకో - ఏటవుద్దీ ?

సరే మనలో మనకు గొడవలెందుకు గానీ - ఫైల్లో ఆ చివర డిస్కు నెంబరు అని ఉందిగా సుబ్బారావు....చూసావా అది? ఆ డిస్కు నెంబరంటే డిజిటైసు చేసిన పుస్తకాలు ఎక్కించిన డిస్కు నెంబరన్నమాట.... అదీ సంగతి....


అనుబంధంగా Digital Library Of India సైటులో ఉన్న పుస్తకాల లిష్టు ఒకప్పుడు ఈ పోష్టులో....


భవదీయుడు
మాగంటి వంశీ

1 comment:

  1. వంశి గారు: ఆ లిస్టులో వున్నది వేటపాలెం గ్రంథాలయం నుండి scan చేయబడిన కొన్ని పత్రికల (కొన్ని ప్రత్యేక సంచికలు కూడా!) వివరాలు. మొత్తం 256 సిడిలు. ఈ మధ్యనే ఆ సిడిల దర్శనభాగ్యం కలిగింది.

    ఆ లిస్టులో typoలున్నాయి. అముద్రిత గ్రంథచింతామణి అల్లా Amruthagrandachinthamani అయ్యింది :-(.

    -- శ్రీనివాస్

    ReplyDelete