Sunday, June 12, 2011

కుదరదులే కానీ , మూడు వారాలకోసారి చేస్కో....!! అంతేనా? అంతే....


ఈ వారంలో వెబ్సైటులో చేర్చిన సమాచారం


ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో

సంగీత సంచిక కార్యక్రమంలో "రాగం తానం పల్లవి" గురించి శ్రీ సూర్యదీప్తి గారి వివరణ. 

 • రాగమేమిటి, తానమేమిటి, పల్లవేమిటి - వాటి పుట్టుపూర్వోత్తరలేమిటి అని సందేహాలున్నవారికీ, తెలుసుకోదల్చిన వాళ్ళకీ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ప్రసార తేదీ: జూన్ 8, 2011

_______________________________________________________
  
సంస్థానాలు పేజీలో
 
సంస్థానాలు సెక్షన్లో - కొంతమంది రాజావార్ల ఫోటోలు, బోలెడన్ని కోటల ఫోటోలు తక్క మిగిలిన సమాచారం అంతా పొందుపరచడమైనది. మీ దగ్గర ఏవన్నా ఇతర వివరాలు, ముఖ్యంగా రాజావార్ల ఫొటోలు, కోటలకు సంబంధించిన చిత్రాలు ఉంటే పంచుకోవలసిందిగా విన్నపం...

 • Important Note: ఈ వారం మా ఊరు చల్లపల్లి రాజవంశీకులు శ్రీ శ్రీ శ్రీమంతురాజా యార్లగడ్డ చంద్రధర ప్రసాద్ గారితో పరిచయం జరగటం ఎనలేని ఆనందం కలిగించింది. వారు వెబ్సైటు కాకతాళీయంగా చూడటం, అభినందిస్తూ ఈమెయిలు పంపించటం - అన్నీ కలలో జరిగినట్టు జరిగింది . వారి వద్దనుంచి త్వరలో చల్లపల్లి (దేవరకోట) సంస్థానానికి సంబంధించి అరుదైన చిత్రాలు, వివరాలు చూడబోతున్నారు


_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో
 
రాగం-తానం-పల్లవి కార్యక్రమంలో శ్రీ డి.ఎస్.నారాయణన్ గారి వయొలిన్ వాద్యవిన్యాసం. 
మృదంగ సహకారం: శ్రీ పి.జయభాస్కర్. 
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ప్రసార తేదీ: జూన్ 8, 2011. 

ఈ గంట ఆడియోలో - 
 • ఖరహరప్రియ రాగం తానం , 
 • నీపదములె గతియని నమ్మితి శ్రీరామ చంద్రా అనే పల్లవి, 
 • ఆది తాళం, 
 • రెండు కళ్ళ చౌకం పల్లవి ఎత్తుగడ  సమం నుండి ప్రారంభం.
  _______________________________________________________

  
ఆకాశవాణి కార్యక్రమాలు / నాటికలు పేజీలో

జై జవాన్ నాటిక
ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం
ఆడియో సౌజన్యం: డాక్టర్ తాడేపల్లి పతంజలిగారు  
 
రచన: శ్రీ తాడేపల్లి పతంజలి
నిర్వహణ: శ్రీ మంత్రవాది మహేశ్వర్
సహకారం: శ్రీ నక్కా సుధాకర రావు

పాల్గొన్నవారు:
రామరాజు: శ్రీ ఎం.దత్తాత్రేయులు
చక్రపాణి: శ్రీ కె.సుదర్శన్
విష్ణుమూర్తి: శ్రీ వి.రమణమూర్తి
శ్రీలత: శ్రీమతి మంజుల

_______________________________________________________

సాహితీ సంబంధ సెక్షన్లో
 • ప్రసార సాహిత్యం - శ్రీ నాయని సుబ్బారావు
 • నవ్వుల బండి - బుజ్జాయి
 • ఉదయిని - 1935 (దసరా సంచిక)
 • ఉదయిని - 1936 (మే నెల సంచిక)
 • ఉదయిని - 1936 (ఆగష్టు నెల సంచిక)

ఈ మణిపూసలు శ్యాం నారాయణగారి సౌజన్యం

_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం
ఆర్టిస్టు: శ్రీ కె.శ్యాం కుమార్
వయొలిన్: శ్రీ ద్వారం సత్యనారాయణ
మృదంగం: శ్రీ పెరవలి జయభాస్కర్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 7, 2011

_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు / రూపకాలు పేజీలో

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు టాగోర్ 150 సంవత్సరాల సందర్భంగా సమర్పించిన అద్భుతమైన కార్యక్రమం - "150 Years of Tagore" డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో


_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు / భక్తి రంజని పేజీలో


భక్తి రంజని కార్యక్రమం
అచ్యుతాష్టకం, సంప్రదాయ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ


_______________________________________________________

ఆకాశవాణి కార్యక్రమాలు / ఇతర కార్యక్రమాలు  పేజీలో

"భారత జననీ" - దేశభక్తి గీతం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ


_______________________________________________________


జానపదం - ఆడియో పేజీలో 

 బాలనాగమ్మ - బుర్రకథ రెండవ భాగం
గరివిడి లక్ష్మి & బృందం
ఆడియో సౌజన్యం - శ్రీ వెంకట రమణ (???) 


_______________________________________________________ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో


కర్నాటక శాస్త్రీయ సంగీతం
నాదస్వర ద్వయం
ఆర్టిష్టు : శ్రీ ఎం.డి వెంకటరాజు, శ్రీ ఎం.డి.మల్లికార్జున
ప్రత్యేక డోలు సహకారం: శ్రీ ఆర్.బాలసుబ్రహ్మణ్యం
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 12, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ _______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు / ఇతర కార్యక్రమాలు  పేజీలో


ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రసారం చేయబడిన విజ్ఞానశాస్త్ర ధారావాహిక - సాంకేతిక రంగంలో మహిళా శక్తి . ఈ ధారావాహికలోని ఈ భాగం - "బోధనాభ్యాసంలో నూతన పరదా తొలగింపు" గురించి

రచన: డాక్టర్ సమ్మెట గోవర్ధన్
రచనా సహకారం: జనవిజ్ఞాన వేదిక శాస్త్రప్రచార విభాగం
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవ రెడ్డి
సహకారం: శ్రీ ఎస్.సత్యనారాయణ
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఇందులో పాల్గొన్నవారు
శ్రీ టి.విశ్వనాథ్
శ్రీమతి స్వప్న
కుమారి శఠగోపన్ కృష్ణవేణి
కుమారి హరిత_______________________________________________________

ఆకాశవాణి కార్యక్రమాలు / ఇతర కార్యక్రమాలు  పేజీలో

ఈ మాసపు పాట
రచన: శ్రీ వారణాసి వెంకట రావు
సంగీతం: టి.కె.సరోజ
గానం: కె.లక్ష్మీనరసమ్మ
ఆకాశవాణి  విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 12, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

 • శ్రీ వారణాసి వెంకట్ రావు గారు ఇక్కడి బే ఏరియాలో నివాసముంటున్న వారి అబ్బాయి వారణాసి రవిగారి వద్దకు వచ్చి ఉన్నప్పుడు వారితో ఫోనులో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వారు తన స్వీయ రచన, సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పిల్లల పాటలు, భక్తి సంగీతపు పాటల సి.డి.లు పంపించారు. అవి అన్నీ త్వరలో వెబ్సైటులో చూడవచ్చు...వీటిలో కొన్ని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి గళంలో వినవచ్చు


_______________________________________________________


సాహితీ సంబంధ సెక్షన్లో
అంత్యార్పణ నాటిక
రచన: ఆచార్య ఆత్రేయ
విశాలాంధ్ర ప్రచురణాలయం
ఫిబ్రవరి 1955

__________

భోజరాజీయము
రచన: అనంతామాత్యుడు
సంగ్రహకర్త - శ్రీ కొండూరు వీరరాఘవాచార్య
1969 సంవత్సరం

__________


మన తెలుగు తెలుసుకుందాం
రచన: డాక్టర్ ద్వానా శాస్త్రి
మే, 1997
సౌజన్యం: డాక్టర్ ద్వా.నా.శాస్త్రి

__________


"తొలకరి"
రచన: పింగళి లక్ష్మీకాంతం / కాటూరి వెంకటేశ్వర రావు
త్రివేణి - మచిలీపట్నం
సంక్రాంతి 1923 సంచిక
సౌజన్యం: పరుచూరి శ్రీనివాస్

__________


సాహిత్య సుందరి
రచన: డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి
ఫిబ్రవరి 1980
ఆంధ్ర సారస్వత పరిషత్తు
1986 నుండి కాపీరైటు ఫ్రీ

__________విక్రమార్కుని విడ్డూరం
రచన: రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రధమ ముద్రణ; జూన్ 1960
విద్యోదయ పబ్లికేషన్స్, కడప
__________

తెలుగులో బాలల నవలలు
పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం
డిసెంబరు, 1986
డాక్టర్ పసుపులేటి ధనలక్ష్మి
సౌజన్యం: పరుచూరి శ్రీనివాస్


__________

 
అమర్ చిత్రకథ
చిన్న పిల్లల కథలు

ఇందులో
 • పులి - వడ్రంగి పిట్ట కథ
 • తెలివయిన తాబేలు కథ
 • కుందేలు, చకోర పక్షీ, పులి కథ
 • పామూ - ఎలుక కథ
 • తెలివితక్కువ బ్రాహ్మడు కథ
 • ఆడచిలుక - వేటగాడు కథ
 • తెలివిలేని కొంగ కథ
ఉన్నాయి....

ఇది ఒక రకంగా ఆణిముత్యమే. ఒక రెండేళ్ళ క్రితం వినాయకచవితికి గామాలు, బోషాణం నుంచి బయటపడ్డది....ఆ తర్వాత సంవత్సరం దసరాకు మా ఆవిడ గొంతులో పడి ఆడియో కథ తయారయ్యింది....అలా సంవత్సరం తోస్తే కానీ మా ఆవిడ గొంతు చక్రాలు కదల్లా! ఏం చెప్పమంటారు?

స్కానులో సరిగ్గా రావేమో అనుకున్నా కానీ పుస్తకంలో బొమ్మలు మటుకు బ్రహ్మాండంగా వచ్చినాయి....

_______________________________________________________

సరే ఈ వెబ్సైటు వార్తలు ఇంతటితో సమాప్తం - మళ్ళీ 3వ తారీకున పునర్దర్శనం...

అదేంటి - వారం వారం అప్డేట్ అన్నావు?

అవును , 19 తారీకు వస్తానని ఈ రోజే వచ్చాగా మరి ? 

అయితే  వారం వారం కుదరదులే కానీ , మూడు వారాలకోసారి చేస్కో....

అంతేనా?

అంతే....

అల్లా మూడు వారాలకైతేనో, ఐదు వారాలకైతేనో బోల్డు పనీ చేసుకోవచ్చు, వార్తలూ ఒకే పోష్టులో రాయొచ్చు....

అదీ సంగతి సుబ్బయ్యా

వస్తానయ్య ఇహ...

భవదీయ
వంశీ

 
1 comment:

 1. వంశి గారు: ఉదయిని సంచికలు చూసి, ముఖ్యంగా నాదగ్గరలేని దసరా సంచికను చూసి, అమందానంద ... OK. OK. క్లుప్తంగా చాలా (!) సంతోషించాను. రెండేళ్ళ క్రితం ఒక ఘనత వహించిన ప్రభుత్వసంస్థ వారికి "ఉదయిని" సంచికల కాపీలకొరకై ముందుగానే పైకం చెల్లించుకున్నా పని జరగలేదు :-( సరే నా గోల పక్కనపెట్టి, అందించిన మీకు, శ్యాంనారాయణగారికి బోలెడు thanks.

  రజనీకాంతరావు గారు టాగోర్ పైన సమర్పించిన కార్యక్రమం సుమారు 35 ఏళ్ళ క్రితం విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారితమైనది. ఇప్పుడు కొత్తగా చేసినది కాదు :).

  తొలకరి, తెలుగులో బాలల నవలలు, విక్రమార్కుని విడ్డూరం పుస్తకాలు DLI లో లభ్యం. నా "సౌజన్యం" ఏమీ లేదు :-).

  జమిందార్ల ఫోటోలకోసం, గతంలో చెప్పినట్లుగా, శ్రీరామ వీరబ్రహ్మం గారి నానరాజన్యచరిత్రము (1930, 2nd ed. Not the first ed. which is on-line!)- మించిన పుస్తకం లేదు. మంచి scaner అందుబాటులో వుంటే నేనే ఎప్పుడో మీకు దానిలోని బొమ్మలు పంపగలను.

  భవదీయుడు,
  -- శ్రీనివాస్

  ReplyDelete