Friday, June 3, 2011

"అతడు అడవిని జయించాడు" డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 3 hrs audio

డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 3 hrs audio
పరిచయకర్త: డాక్టర్ పతంజలి
ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం


"ప్రపంచ సాహిత్యంలోనే చాలా పేరు పొందిన సాహితీప్రక్రియ నవల. 11వ శతాబ్దపు ప్రారంభంలో జపాన్ దేశంలో నవలా ప్రక్రియ ఆవిర్భవించినట్లుగా కాలర్సెన్సోక్లోపీడియా 13వాల్యూంలో ఉన్నది" అంటూ డాక్టర్ పతంజలి గారు "అతడు అడవిని జయించాడు" రచనతో ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్ కేశవరెడ్డి గారితో ఆకాశవాణి పరిచయకార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత తెలుగుదేశంలో నవల జీవితానికి నూరేళ్ళు నిండాయని చెబుతూ డాక్టర్ కేశవ రెడ్డి గారు 7 నవలికలు మాత్రమే రచించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని వివరిస్తారు. ఆ తరువాత డాక్టర్ కేశవరెడ్డిగారి బాల్యం గురించీ, వారి సాహితీ ప్రస్థానాన్ని గురించి చాలా చక్కగా వివరించారు.

వృత్తి పరంగానూ, రచనా పరంగానూ చికిత్సే ప్రధాన ధ్యేయంగా కలిగినవారు అని చెబుతూ వారితో పరిచయ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన శ్రీ పతంజలి గారికీ, శ్రోతలకు ఒక మంచి కార్యక్రమం వినే అవకాశం కలిపించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి, అన్నిటికన్నా మిన్నగా ఏ భేషజం లేకుండా చక్కగా తన అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను మనతో పంచుకున్న శ్రీ కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అడగగానే ఈ మూడు గంటల ఇంటర్వ్యూను పబ్లిష్ చేసుకోడానికి అనుమతి ఇచ్చిన శ్రీ పతంజలి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో .....

ఆరు భాగాలుగా చేసి ఎం.పి.3లుగా పంపిన శ్యాం నారాయణగారికి ధన్యవాదాలతో

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

 

భవదీయుడు
మాగంటి వంశీ

3 comments:

  1. వంశీ గారూ, ఈ పరిచయంలో అతడు అడవిని జయించాడు నాటకం కూడా ఉందా! అందులో ఉండే ఒకే ఒక ముసలివాడి పాత్రను మిశ్రో అద్భుతంగా రక్తి కట్టించారు.అది దొరికితే అప్ లోడ్ చెయ్యడి, మీకు బోల్డంత పుణ్యం వస్తుంది

    ReplyDelete
  2. సుజాత గారూ

    దొరకాలే కానీ, అప్ లోడ్ చెయ్యటం ఎంతసేపు పని? బాబ్బాబూ - ఆ పుణ్యం మాట ఎందుకు? ఇప్పటికే పున్నెం మూటలెక్కువైపోయినాయని , ఇంట్లోవాళ్ళకు, చుట్టుపక్కలవాళ్ళకు, మా నగరంలో వాళ్ళకు, మా రాష్ట్రంలో వాళ్ళకు పంచగా కూడా మిగిలిపోయినాయనీ మా ఆవిడ గోల చేస్తోంది... :) ఇహ మిశ్రో గారి సంగతే చెప్పారూ? ఆయనకేమండీ ? బంగారం! ఇప్పుడూ మీ ప్రశ్నకు చిక్కుప్రశ్నే జవాబుగా - ఈ ఇంటర్వ్యూలు మూడుగంటలు విని, అప్పుడు చెప్పండి ఆ నాటకం ఉందో లేదో...నాకు జవాబు తెలుసనుకోండి...అయినా సరే!

    ReplyDelete
  3. వంశీగారూ, పరిచయం ఎలాగూ విన్నానులెండి.నా పై కామెంట్ రాసే సమయానికి నాకు పవర్ కట్ టైమైంది. అందుకే మిమ్మల్నే అడిగేశాను.

    ఇక నాటకం సంపాదించి అప్ లోడ్ చేసే పనిలో ఉండండి సార్!:-))

    ReplyDelete