Wednesday, June 8, 2011

నటరాజ రామకృష్ణగారితో 1977లో ప్రసారమైన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం - పరిచయకర్త: శ్రీ సుధామ

శ్రీ నటరాజ రామకృష్ణ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ; జూన్ 8, 2011
నటరాజ రామకృష్ణగారితో 1977లో ప్రసారమైన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం
పరిచయకర్త: శ్రీ సుధామ


సుధామ గారు బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ పరిచయ కార్యక్రమం. వారికి, నటరాజ వారికి, ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...


నటరాజ వారు - నాకిష్టమైన "అమరకోశం" గురించి చాలా మంచి మాటలు చెప్పారు...

నటరాజ రామకృష్ణగారు హైదరాబాదు అశోకనగర్లో మేముండే వీధికి రెండు వీధులవతల ఉండేవారు. వారి శిష్యులు శ్రీ కళాకృష్ణగారు మా నాన్నగారి స్నేహితులు కూడాను. అత్యద్భుతమైన కళాకారులు శ్రీ నటరాజ వారు. ఎంతో నిమ్మళంగా,ప్రశాంత వదనంతో ఉండేవారు. సాయంత్రంపూట అలా వ్యాహ్యాళికి బయలుదేరి ఇంటిపక్కనే ఉన్న పార్కు, మా లక్ష్మీ చిల్డ్రన్స్ స్కూల్ చుట్టూ అలా ఒక రవుండు వేసి వెళ్ళిపోయేవారు. అలా ప్రతిరోజు చూసేవాళ్ళమ్మ్ ఆయన్ను. కొంతమంది కొండె గాళ్ళు ఉంటారుగా! ఆయన కనపడగానే డాన్సులు మొదలుపెట్టేవారు. ఆయన చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. ఒక రోజు ఆయన్ని చూసి అలా డాన్సులాడుతుంటే, మా క్లాసుమేటు మారుతి వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ డాన్సాడుతున్న వాళ్ళని, నటరాజవారిని చూసి, ఆయన పార్కు దాటేసాక, ఆ పిల్లచేష్టలకి ఆగ్రహంతో ఊగిపోతూ చేతికందిన కర్ర తీసుకుని దొరికినవాణ్ణి దొరికినట్టు పిర్రలు వాయగొట్టారు. అంతే ఆ రోజు నుంచి వాళ్ళు గప్ చుప్.

అది అలా ఉంటే ఇంకో పార్కు జ్ఞాపకం - స్కూలైపోయాక ఇంటికెళ్ళి దోశో, ఇడ్లీనో మెక్కి ఆ పార్కుకు పోయి గోళీలో, బచ్చాలో ఆడుకునేవాళ్ళం. గోళీలాటలో విపరీతమైన ప్రావీణ్యం ఉండేది మనకు! రోజూ జేబులు నిండిపోయేవి - అలా ఒకరోజు అన్నీ తీసుకుపోతుంటే కోపం పట్టలేక సాయి సమీందర్ అనే క్లాసుమేటు ఉక్రోషంతో లాగూ జేబు పట్టుకు పర్రున చించిపారెయ్యటం, అందులో గోళీలన్నీ రోడ్డు మీద పడి దొర్లిపోవటం, నేను సాయి గాణ్ణి పట్టుకుని వంచేసి వీపు మీద గభీ గభీమని గుద్దటం మర్చిపోలేని జ్ఞాపకం! చిన్నపిల్లలంగా అంతే మరి, కొట్టుకోటం, మళ్లీ ఆడుకోటం...

సరే ఇహ జ్ఞాపకాలు పక్కన బెట్టేస్తున్నా

ఏమిటి బాబూ! ఇందాకే చెప్పావు - 19వ తారీకు వరకు దర్శనం లేదని....

అవును....కానీ ఇది నటరాజ వారుగా అందుకు అన్నమాట

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

 

భవదీయుడు
మాగంటి వంశీ

6 comments:

 1. Have you deleted your Facebook account?

  ReplyDelete
 2. Yes, I have deleted it, and it's just not that - am out of yahoo groups and google indology groups etc etc etc to spend more time on the website as I used to....and I am happy with the way it's working out. Lots of updates are in pipeline now! :)

  ReplyDelete
 3. వంశీ గారు:

  మీ రేడియో పోస్టులు నా మటుకు నాకు చాలా అవసరం. అవి ఎక్కడా దొరకని సంపద!

  నటరాజ రామకృష్ణ వారి గురించి ఈ నాలుగు ముక్కలూ రాసినందుకు ధన్యవాదాలు. మన పత్రికల్లో వున్నంతలో కాస్త "ఈనాడు" బాగా రాసింది.

  నటరాజ రామకృష్ణ గురించి వొక మోనోగ్రాఫ్ లాంటిది రావాలని నాకు అనిపిస్తోంది. నాట్య కళా సాంప్రదాయంలో అటు సాంప్రదాయం, ఇటు ప్రయోగం చేసిన వారు అరుదు (లేరేమో?) ఆ సృజనాత్మక తపన ఈ కాలంలో మరీ ముఖ్యంగా లలిత కళల మీద (నాట్యం మీద మరీ) ఆసక్తి పెంచుకుంటున్న తరానికి తెలియాలి. లేకపోతే, కేవలం అనుకరణే గొప్ప కళగా మిగిలిపోతుంది.

  ReplyDelete
 4. "కేవలం అనుకరణే గొప్ప కళగా మిగిలిపోతుంది" - గొప్ప మాట చెప్పారు అఫ్సర్ గారు....ప్రయోగాలు సంప్రదాయ పరిమితులకు లోబడి చెయ్యటం చాలా కష్టమైన పని, ఆ పని అలవోకగా చేసి చూపించారు నటరాజ వారు...

  రేడియో పోష్టులు ఉంటాయండి. కాకుంటే వారానికి ఒకసారి సినాప్సిస్ లాగున ఇస్తానన్నమాట.....నా ఒక్కడి పనే కాదండీ, బోల్డంతమంది మహానుభావులు సాయం చేసారు, చేస్తున్నారు...పేరు పేరునా వందనాలతో....

  ReplyDelete
 5. Thanks for the audio.
  ఇప్పుడు వింటున్నా :)
  వారానికోసారి రాస్తానంటే అలాక్కానీండి కానీ, రాయండి :) అప్పుడే కదా, ఇవన్నీ ఉన్నాయని మాకు తెలిసేది!

  ReplyDelete
 6. @ సౌమ్య - ఆడియో విన్నందుకు బోల్డు సంతోషం......

  ReplyDelete