Thursday, June 16, 2011

1300 చిన్న పిల్లల కథలు - ప్రస్తుతానికి ఓ 150 మాత్రమే!

చిన్న పిల్లల కథలు - ప్రస్తుతానికి ఓ 150 మాత్రమే!

గత నాలుగేళ్లలో ఓ 850 కథలు సేకరించానండీ....

ఎక్కడినుంచి?

వివిధ పత్రికలనుంచి సేకరించానండి....ఆ 850 కాక, పాత పిల్లల పుస్తకాల నుంచి స్కాన్ చేసినవి మరో 462 ఉన్నాయి....అన్నీ కలిపి ఓ 1300 కథలనుకోవచ్చన్నమాట....


ఆ  ఫేసుబుక్కు, యాహూ గ్రూపులు, గూగుల్ గ్రూపులు అన్నీ వదిలేసి నా మానాన నేను పూర్వాశ్రమంలోలాగా వెబ్సైటు మీదకెళ్ళిపోయాక ఇప్పుడు కాస్త టైము దొరికి - ఓ 150 ప్రచురించా!

ఎక్కడ?

పిల్లల కథలు - సాహిత్యం సెక్షన్లో!

చదువుకోవాలనుకున్నవాళ్ళు అక్కడికెళ్ళి లంకెల మీద నొక్కి చదూకోటమే...

మరి మిగిలిన 1100 కథలు ఎప్పుడు?

ఓ మూడు వారాల్లో అన్నీ ఎక్కించగలను అని అనుకుంటున్నాను స్వామీ....

ఆ పేజీ దర్శిస్తూ ఉండండి....


మరి చిన్న పిల్లల కథలు - ఇన్నిరోజులు ఎందుకు దాచిపెట్టా?

నువ్వు అడుగుతావా లేదా అని...

అదే మరి....

A BIG - HUGE - MONSTER Disclaimer: కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమాత్రం లేదని తెలియచేసుకుంటూ, హక్కుదారులు ఎవరికైనా అభ్యంతరం ఉంటే దయచేసి తెలియపర్చమని విన్నపం.....తెలియపరచిన వెంటనే క్షమాపణలతో ఆ కథలు అక్కడినుంచి తొలగిస్తానని విన్నవించుకుంటూ

భవదీయుడు

వంశీ


PS: ఒక ఆనిమేషన్ ప్రాజెక్టు మీద పని మొదలుబెట్టటం జరుగుతోంది.....బ్లూ ప్రింట్ ఆల్మోస్టు రె"ఢీ", వాయిస్ ఓవర్ కళాకారులూ రె"ఢీ"- వివరాలు త్వరలో !

3 comments:

 1. బాగుందండి. మీ ప్రయత్నం. మీ వెబ్సైట్ ఈ మద్య చూడ లేదు.చాలా అదనంగా కలిపినట్లున్నారు. నా వద్ద మా బామ్మగారు పాడే (సేకరించిన) పాటలు ఉన్నాయి హేమలత ఫాంట్లో, మీరు వెబ్సైట్లో పెడ్తానంటే పంపించగలుగుతాను. అన్నీ ఒక చోట ఉండటం కరెక్ట్ కదా.

  ReplyDelete
 2. అన్నట్లు మీ వెబ్సైట్లో పిడిఫ్ కన్నా html లింక్స్ ఉన్నవి చప్పున వస్తునాయి. పిడిఫ్ డౌన్లోడ్ కావటం లేదు. మా నెట్ అంత ఘోరం కాదు అయినా..ఎక్కువగా html పెట్టటానికి ట్రై చెయ్యరూ?

  ReplyDelete
 3. @వాణి - మీ బామ్మగారి పాటలు పంపించండి. వెబ్సైటులో పెట్టటానికి ఫాంటుతో సంబంధం లేదు - ఎందుకంటే అన్నీ యూనీకోడులోకి వెళ్ళిపోతాయి కనుక, మీకు వీలుంటే "ట్రాన్స్లిటెరేషన్" కు ఉపయోగించిన ఆంగ్ల మూలం ప్రతి పంపించండి....అప్పుడు పబ్లిష్ చేసే పని సుళువవుతుంది......లేకుంటే కొద్ది సమయం పడుతుంది......ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నా - ఇంతకీ మీ వద్ద ఉన్నవి పి.డి.ఎఫ్ ప్రతులా? వర్డ్ డాక్యుమెంట్లా? నోటుపాడులా?......

  ఇహ వెబ్సైటులో పి.డి.ఎఫ్ డాక్యుమెంట్లు ఎప్పుడొ శాతవాహనుల కాలం నాటివి, అనగా సుమారు ఏడు సంవత్సరాల క్రితంవి (వెబ్సైటు మొదలుపెట్టినప్పటివి అని అర్థమన్నమాట)....అవి ముట్టుకుంటే ఆర్యావర్తనం అంతా తిరిగొచ్చినంత పని.........అయినా మీకు ఏయే డాక్యుమెంట్లతో ఇబ్బంది ఉందో తెలియచెయ్యండి, వాటి పని పడతాను ...మీరన్న తరువాత నేను అదాటుగా ఓపెను చేసినవన్నీ బానే ఓపెనవుతున్నాయి మరి.......

  ReplyDelete