Thursday, June 30, 2011

"ట్రాన్స్ఫార్మర్స్ - డార్క్ ఆఫ్ ద మూన్" - చూసానహో - రాసానహో

ట్రాన్స్ఫార్మర్స్ - డార్క్ ఆఫ్ ద మూన్

స్పీల్బర్గ్ - ఈ పేరు కనపడ్డదంటే ఆ సినిమా అలాస్కాదైనా, ఆర్జెంటీనాదైనా, ఆంధ్రదేశానిదైనా మొదటిరోజు మొదటిషో అంత కాకపోయినా, మొదటిరోజు మూడోషో మటుకు చూడటం జరుగుతుంది. అల్లాగే వెళ్ళా. చూసా. వచ్చా.

ఏ సినిమాకైనా వెళ్ళటం ఒకెత్తు కాకపోయినా, చూడటం ఒక ఎత్తు, తిరిగిరావటం ఒక ఎత్తు, వచ్చాక పరిస్థితి ఒక ఎత్తు. వెళ్ళటానికి ఎత్తులేమీ ఉండవు. టికెటు కవుంటర్లో డబ్బులిచ్చాక టికెట్ చేతిలో పడి హాల్లోకి వెళ్ళి సీట్లో కూర్చున్నాకా ఎత్తుల పర్వం మొదలవుతుంది. సినిమా అన్నాక ఏదో ఒక ఎత్తుకు తీసుకెళ్ళటం ఖాయమే. ఐతే ఆ పర్వం పూర్తయ్యేటప్పటికి అంత ఎత్తులో నిలబడి చిద్విలాసాలు చిందించటమో, అంత ఎత్తు నుంచి కిందకు పడిపోటంతో తీవ్రంగా గాయపడి కుయ్యో మొర్రో అనటమో, అటూ ఇటూ కాకుంటే మధ్యలోని త్రిశంకులోకి జారి వెర్రి నవ్వులు నవ్వుకోటమో - ఈ మూడిట్లో ఏదో ఒకటే - ఖచ్చితంగా ఒకటే సంభావనగా ప్రాప్తమయ్యేది. 

ఈ ట్రాన్స్ఫార్మర్స్ పరంపరలో రెండో సినిమా - కిలిమాంజరో పర్వతమంత ఎత్తులో తీసుకెళ్ళి అక్కడినుంచి పడెయ్యటంతో బోల్డు దెబ్బలు తగిలించుకొచ్చా....అయినా సరే హాలీవుడ్డు చక్రధారి స్పీలుబర్గంతటోడు అంత ఇదిగా మనకోసం కోట్లల్లో డబ్బులెట్టి దాదాపు మూడు గంటల సినిమా మూడో భాగంగా తీస్తే, మనకేం రోగమనిన్నీ, ఏక్ నిరంజన్ లా పర్సులో రెపరెపలాడుతూ బయటకు తియ్, బయటకు తియ్ అని ఓ రెచ్చిపోతూ కత్తి యుద్ధం చేసి పాంటు జేబుకు చిల్లు పొడిచేస్తున్న పది డాలర్ల నోటుని సంతోషపరుద్దామనిన్నీ, ధైర్యే సాహసే స్పీల్బర్గ్ లక్ష్మీ అని ప్రార్థించుకునిన్నీ హాల్లో సీట్లోకి శరీరాన్ని కూలదోసా.....

రాత్రి 8.30 షో - 8.25 అయ్యింది. హాలు సగం కూడా నిండలా....పిల్లలకు స్కూలు సెలవలున్నా ఇదేంటీ - హాలు ఇంత దీనావస్థలో ఉన్నది అనిపించింది. సరేలే హాలుతో మనకేం సంబంధం, స్పీల్బర్గుతో సంబంధం అనుకుని సరిపెట్టుకున్నా...ట్రైలర్లు మొదలైనాయి... గ్రీన్ లాంటెర్న్, హారీ పోటర్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్ - ఈ మూడు ట్రైలర్లయ్యేటప్పటికి పొలోమంటు ఓ 70-80 మంది బిలబిల (పిల్లాడు), కిలకిల (పిల్ల) దూసుకుంటూ వచ్చారు...హాలు ఫుల్లు, కిల కిల - బిల బిల లతో కొద్దిసేపు గోల గోల.....ఆరో ట్రైలర్ అయ్యేప్పటికి గోల సద్దుమణిగింది....10, 8, 7.....అని నంబర్లు తెర మీద కనపడ్డంతో సూది కిందపడితే వినపడేంత నిశ్శబ్దం....సున్నాకొచ్చింది....సినిమా మొదలయ్యింది....

సరే ఇహ మిగతావి - అనగా లొల్లాయి ఆపేసి.....సినిమాలోకొచ్చేస్తే -

రెండు ముక్కల్లో - ఆటోబాట్స్ సైబర్ట్రాన్ గ్రహాన్ని రక్షించుకోటానికి చేసే యుద్ధం - ఆ కీలకాన్ని దాచుకున్న "ఆర్క్" అనే ఎయిర్ క్రాఫ్ట్ ను డిసెప్టికాన్స్ చేతిలో పడకుండా అడ్డుకోటం, ఆ అడ్డుకోటంలో భాగంగా తమవాడే అయిన ముసలి ఐన్ స్టీన్ లాటి సెంటినెల్ ప్రైం ను నమ్మటం, అది చెడటం, ఆప్టిమస్ ప్రైం వీరవిహారం చెయ్యటం - చివరకు ఆ గుంపులో "ఒకాయన" చెయ్యి పోగొట్టుకుని విజయం సాధించటం, ఆ విజయంలో భాగంగా భూమి రక్షింపబడటం , ఈటన్నిటికీ అమెరికనుల చంద్రమండల యాత్రతో ముడిపెట్టటం -  అదీ సంగతన్నమాట.....

మొదటి గంటన్నరలో గ్రాఫిక్స్ అదరహ! బెదరహ! కుదరహ! నదరహ! అబ్బోయహ! విశ్వరూపం చూపించేసాడు.........బూటకమో, నాటకమో , నిజమో- చంద్రమండల యాత్రలో పాలు పంచుకున్న బజ్ ఆల్డ్రిన్ సినిమాలో కనపడటంతో ఈలలూ, చప్పట్లు - నేను కూడా కొట్టాననుకో.... గ్రాఫిక్స్ ఆ తర్వాత బాలేదా? బాగున్నాయి - కాకుంటే అప్పటికి మీరే ఓ ఆటోబాటైపోతారన్నమాట.

ఇక్కడ ఒకటి చెప్పాలె - అమెరికనుల చంద్రమండల యాత్ర నాకు అంత ఉత్సాహం కలిగించకపోయినా, రష్యన్ వాళ్ళ రోదసి యాత్ర, అలా మొదటి మానవుడిగా - మన పురాణాల్లోవి వదిలేసి - అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన యూరీ గగారిన్ అంటే పిచ్చి అభిమానం - ఎందుకో తెలియదు....ఆయనవి బోల్డు ఫోటోలు, ఆర్టికల్సూ ఉండేవి నా దగ్గర....

సరే మళ్ళీ సినిమాలోకొచ్చేస్తే - ఆటోబాట్స్ ఐన్ స్టీన్ - సెంటినెల్ ప్రైం ను చంద్రుడి మీద నుంచి భూమ్మీదకు తీసుకొచ్చేస్తాడు దర్శకుడు...సెంటినెల్ ప్రైం రూపు, రేఖలు - అదరహ! ఆప్టిమస్ ప్రైం రుపు రేఖలు కూడా కొద్దిగా మారిపోయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు....సెంటినెల్ ప్రైం ట్విస్టిచ్చి మెగాట్రాన్ తో కలిసిపోయే ప్లానేసి వెన్నుపోటు పొడుస్తాడు........సెంటినెల్ - ఆప్టిమస్ - ముఖ్యంగా ఆప్టిమస్ ప్రైం తను ఉన్న ప్రతి సీన్లోనూ బలమైన ముద్ర వేసేస్తాడు, మరీ ముఖ్యంగా యుద్ధ విన్యాసాల్ల్లో....ఇహ సినిమా గురించి ఇక్కడితో ఆపేస్తా....ఎక్కడికెళ్తున్నానో అర్థమైపోయిందనుకుంటా మీకు.....

సెంటినెల్ ప్రైంకు వాయిస్ ఇచ్చింది "స్టార్ ట్రెక్" టి.వి.సీరియల్లోని నా అభిమాన నటుడు లెనార్డ్ నిమో(మ్మో)య్ (మిస్టర్ స్పాక్) అని తర్వాత చూసి ఆశ్చర్యపోయా....జగ్గయ్య గారికన్నా భీకరంగా దంచి పారేశాడు....టెక్కునాలజీతో వాయిస్ మారుస్తారనుకో, అయినా కానీ ...

ఇక హీరోయిన్ను గురించి - మెగన్ ఫాక్స్ ఉన్నప్పుడు వచ్చినంత కళ, ఇప్పటి హీరోయిన్ను చూస్తే రాలా....అసలావిడ ఉన్నా లేకపోయినా ఒకటే ఆ సినిమాలో....

సంగీతం గురించి చెప్పనే అక్ఖరలా....హెవీ మెటల్, రాక్ కలిపి అదరగొట్టటంతో పాటు, లింకిన్ పార్క్ - స్టెయిండ్, గూ గూ డాల్స్ - ట్రాకులు వాడుకోటంతో బోల్డు శ్రవణానందం కలిగింది....డిసెప్టికాన్ షాక్ వేవ్ పాత్ర కూడా మంచి, బలమైన ముద్రవేస్తుంది - ఇంకొన్ని సీన్లు ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది....

మొత్తానికి ఎవరెష్టు కాదు కానీ కాంచనగంగ పర్వతం ఎక్కించి అక్కడే నిలబెట్టాడు నన్ను ....అదండీ సంగతి.....

మైకేల్ బే మహాశయుడు - ఈ మూడో భాగాన్ని - సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు...మూడు గంటల దృశ్య - విందుభోజనానికి నాదీ పూచీ....వెళ్ళి చూసొచ్చెయ్యండి.....చూసొచ్చాక ఓ కామెంటు ఇక్కడ పడెయ్యండి....

PS: The earlier post in the aggregators had the wrong TITLE of the movie... :) Woo Hoo! New thing learned - Excitement kills many things - including titles....So deleted that one and reposted this one!

Tuesday, June 28, 2011

హప్పుడే హారు నిండి హేడులోకొచ్చేసింది...హాచ్చర్యంగా!

21 జులై, 2005

భలే రోజయ్యా...

ఏం? భలేగవ్వటానికి ఆ రోజు ఏం జరిగింది?

మాగంటి.ఆర్గ్ వెబ్సైటు పుట్టినరోజయ్యా లింగయ్యా! హప్పుడే హారు నిండి హేడులోకొచ్చేసింది...హాచ్చర్యంగా!

హాచ్చర్యమేముంది అందులో?  పుట్టాక పెరగాలిగాల్సిందేగా - అడ్డంగానో, దిడ్డంగానో, నిలువుగానో?

అవుననుకో...అయినా నువ్వు మరీ మొహమాటం లేకుండా అట్టా అనేస్తే ఎట్టా లింగా?

అయ్యన్నీ నా దగ్గర జాన్తా నై ....అనిపించింది అనెయ్యటమే! అవునూ, ఇది అసలు ఎందుకు మొదలుపెట్టా?

ఏమిటి? ఈ వాగుడా?

కాదు - వెబ్సైటు

అదో పెద్ద కథ

అంత పెద్ద కథ వినే ఓపిక లేదు కానీ, ఓ నాలుగు ముక్కలు జెప్పు

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది...ఏం జెప్పమంటా?

ఈ దిక్కుమాలిన కడుపుల గోలేంటి బాబోయ్...నువ్వూ వద్దు నీ కథ వద్దూ, కడుపూ వద్దూ కాళ్ళూ వద్దు
 
అప్పుడే ఇసిగిపొయ్యావా లింగా?

ఓ! బాగా ఇసిగిపోయా - నాలుగు ముక్కలు కక్కమంటే కడుపులు - కాళ్ళు అంటావు, అది సరే కానీ ఓ మాట జెప్పు - ఈ ఆరేళ్లలో నువ్వు చేసిన పని నీకు తృప్తినిచ్చిందా?

నేను చించుకోకుండా నువ్వే చించేసి అందరి కాళ్ళ మీద పడేసావుగా. నీకు తిరుగు లేదు లింగా...అయినా తృప్తి పావు పాలు, అసంతృప్తి ముప్పావు పాలు

తృప్తి దేనికి? అసంతృప్తి దేనికి?

తృప్తి - ఒక అడుగు ముందుకు పడిందనీ, అసంతృప్తి - ఇంకా కొన్ని మైళ్ళ ప్రయాణం మిగిలుందని...

అడుగు పడిందిగా, ఆ అడుగు కూడా వెయ్యనోళ్ళు లక్షల్లో ఉన్నారు.. అయినా నీ అసంతృప్తికి అంతే లేనట్టుగా కనపడుతోందే. ఒక్కటి గుర్తెట్టుకో...దేనికైనా ఓ అంతు ఉండాల్సిందే! ఉన్నదాంతో తృప్తి పడకపోతే బోల్డు కష్టాలొస్తాయి .

ఓసోస్ కష్టాలేగా....అయ్యొక లెక్కా డొక్కా మనకి ! 

మరింక ఏడుపెందుకు?

ఏడుపుకీ, అసంతృప్తికి బోల్డు తేడా ఉందిరా లింగా!

ఏంటి, ఏంటి...."ఏరా" లోకి వెళ్ళిపోయింది మాట....జాగ్రత్తగా మాట్లాడు..

నువ్వూ నేనూ ఒహటే గదరా! నిన్నంటే నన్ననుకున్నట్టే కాబట్టి ఇహ ముయ్యచ్చు తవరు

అంతేనంటావా?

అంతే...

సరే కానీ ఈ ఆరేళ్లలో పని అంతా నువ్వే చేసావా , ఇంకెవరన్నా సాయపడ్డారా? పడితే ఎంతమంది? వాళ్ళ కథా కమామీషు ఏమిటి? కొద్దిగా వివరమిచ్చుకో

మొదటి మూడున్నరేళ్ళు "ఓల్ అండ్ సోలు" గా పనిచేసా లింగా - ఆతర్వాత రెండున్నరేళ్లలో బోల్డంతమంది కాకపోయినా, అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేసినవాళ్ళు చాలామందే ఉన్నారు. సర్వశ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్, పరుచూరి శ్రీనివాస్, డాక్టర్ కె.బి.గోపాలం, సుధామ, తురగా జానకీరాణి, వాడపల్లి శేషతల్ప సాయి, కప్పగంతు శివరామ ప్రసాద్, రంజని, డాక్టర్ జెజ్జాల కృష్ణమోహన రావు, నిడదవోలు మాలతి, చంద్రలత, డింగరి దుర్గ, ఇన్నయ్య, ఇలియాస్ అహ్మద్, శ్యాం నారాయణ, కుప్పా రాజశేఖర్, బుర్రా రాంచంద్, కేశరాజు భాను కిరణ్, డాక్టర్ ఆర్.జయదేవ ,  డాక్టర్ పతంజలి , శ్రీ జె.మధుసూదన శర్మ, నూకల ప్రభాకర్ , మండా కృష్ణమోహన్, డాక్టర్ స్వరూప్ కృష్ణ, డాక్టర్ సరస్వతీ భట్టార్,  డాక్టర్ చల్లా విజయలక్ష్మి,  డాక్టర్ చెముటూరి నాగేంద్ర, మల్లిన నరసింహారావు, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి,  వై.వి.కృష్ణ, కొల్లూరి భాస్కర రావు , వెంకట రమణ, నల్లాన్ చక్రవర్తి శేషాచార్య, ఆచార్య కొవ్వలి సత్యసాయి, డాక్టర్ వేమూరి వేంకటేశ్వర రావు, కిరణ్ ప్రభ, వారాల ఆనంద్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పింగళి ప్రభాకర రావు, చర్ల రత్నకుమారి, జె .జానకి , వీణా శ్రీనివాస్ , సరోజినీ మూర్తి, దేవరపల్లి రాజేంద్ర కుమార్, పప్పు అరుణ, మార్సియా, విమల, జ్యోతి వలబోజు, మాగంటి శివరామశర్మ, మాగంటి శ్రీదేవి, యానిమేటర్లు రవి, రాజేంద్ర, కృష్ణ, వాయిస్ ఓవర్ కళాకారులు (ప్రముఖ ఆకాశవాణి అనౌన్సర్లు ఇద్దరు - వీరి పేర్లు, వివరాలు ఇప్పటికి గోప్యమే)  - ఇలా ఇంత మంది మహానుభావులు / మహానుభావురాళ్లు సాయం చేసారు...ఇంకా ఒకరిద్దరినెవరినన్నా మరిచిపోయానేమో తెలియదు, ఒకవేళ మరచి ఉంటే వారికి హృదయ పూర్వక క్షమాపణలతో....

వీరిలో 95 శాతం మంది సూచనలు సలహాలు ఇచ్చి నాకు తెలియని విషయాలు నేర్చుకునే అరుదైన అవకాశం కల్పించినవారైతే, కొంతమంది నా సతాయింపు భరించలేక కోప్పడ్డవాళ్ళూ ఉన్నారు, మరికొంతమంది నేనొకటంటే వారొక అర్థం తీసుకుని కోపగించి అలిగి మాట్లాడకుండా వెళ్ళిపోయినవారూ ఉన్నారు....వీరి వివరాలు ఇక్కడ చెప్పటం మొదలుపెడితే అంతులేని కథే అవుతుంది....

లోకోభిన్న రుచిః కాబట్టి - పైన పేర్కొన్నవారు కాక మరికొంతమంది స్పందించిన విధంబెట్టిదనిన -
అ) నీకు సమాచారమిస్తే నాకేమిటి? 
ఆ) మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి, డబ్బులిస్తే కొంచెం "మెటీరియల్" ఇస్తాం
ఇ) అసలు ఈలాటి వెబ్సైటుతో ఎవడికి ఉపయోగం? నా టైము దండగ, మీ టైము దండగ. నన్ను మళ్ళీ అడగొద్దు.
ఈ) నేను చాలా బిజీ మనిషినండీ. అయినా నా పనులు మానుకుని మీకెందుకు ఇవ్వాలండీ? మీరేమన్నా చుట్టమా పక్కమా?
ఉ) మీకు ఇస్తాను కానీ , మీరు నాకో పని చేయ్యాలి. నా పుస్తకమేమన్నా అచ్చేయించి పెట్టటం సాధ్యమా? అది మీరైనా సరే, మీ స్నేహితులైనా సరే
ఊ) ఇస్తాను కానీ మీ సైటులో నేను చెప్పిన మార్పులు నేను చెప్పినట్టు చేస్తేనే
ఋ) మీ సైటు లుక్కు మార్చాలి, అప్పుడు ఆలోచిస్తా
ౠ) మీ సైటు గురించి వేరేవారేమనుకుంటున్నారో నాకు తెలుసు. అయినా మీకిప్పట్లో ఇవ్వటం సాధ్యపడకపోవచ్చు.
ఎ) నాదగ్గర బోల్డు సమాచారం ఉన్నది. కానీ నాకు టైము లేదు. మీకు పంపించడమూ కుదరదు.

ఇలా మరికొన్ని విచిత్రమైన కోరికలు కోరటమూ, వారికి నావద్ద పాతాళభైరవి లేదని చెప్పటం జరగటం, వారు విస విస లడటం - ఇల్లా కొన్ని కథాకళిలు జరగటం జరిగింది....మరికొంతమంది లౌక్యంగా  పొమ్మనకుండా పొగబెట్టటం, మరికొంతమంది పొగబెట్టి ముక్కులు ఘాటెక్కించడం, మరికొంతమంది అర్థం కాకుండా మాట్టాడటం.....

సరే ఇవన్నీ పక్కనబెట్టేసి....మాట్టాడకుండా పోయినవారంతా, నవ్వుకుని పక్కకు తొలగిపోయినవారంతా, సమాచారం ఇవ్వనివారంతా మంచోరే అనుకుని నా దారిలో నేను సాగిపోటం....అల్లాగన్నమాట... 


ఏదేమైనా , ఎటువంటి చిన్నపాటి సాయం చేసినవారికైన, అడిగినా సాయం చెయ్యనివారికైనా - అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలతో....మీ సాయం లేకుంటే ఈ చిన్ని వెబ్సైటులో ఇంత సమాచారం చేర్చగలిగేవాడినీ కానూ, ఇంతమందికి అందుబాటులోకి తెచ్చి ఉండగలిగేవాడినీ కాను.....వెబ్సైటు సందర్శకుల మెచ్చుకోళ్ళన్నీ వీరందరికే చెందుతాయి......

సందర్శకులు అంటున్నావు? ఎంత మంది చూస్తున్నారు ఈ వెబ్సైటు...

అడిగావా? అనుకుంటూనే ఉన్నా..... ఇదిగో నీ కోసం - క్రితం ఆగష్టు నుంచి ఈ రోజు అనగా - జూన్ 28వ తేదీ వరకూ వెబ్సైటు స్టాటిస్టిక్కులు ....





బాగుంది - ఈ 11 నెలల్లో దాదాపు 30 లక్షల హిట్లా? అవునూ ఇదేంటి - హిట్లు నవంబరు నుంచి తగ్గినాయే?

అవును - సమయాభావం వల్ల ఇంతకుముందులా వెబ్సైటు SEO Optimization మీద శ్రద్ధ పెట్టకపోటం మూలాన - వెబ్సైటుకు కొత్తరూపు తీసుకు రావటం, ఆ సమయంలో సెర్చ్ ఇంజన్స్ కు తగ్గట్టు సమాచారం పొందుపరచడం మిస్సవ్వడం వల్లనూ, ప్రచురించవలసిన సరంజామా ఎక్కువైపోవటం వల్లనూ - ఇలా మరికొన్ని కారణాలవల్ల పడిపోయింది.....ఇహ ఈ నెల నుంచి మళ్ళీ ఆ పని మీదే ఉంటున్నా కాబట్టి మళ్ళీ ఊపందుకోవచ్చు అని ఊహ....

బాగుంది బాగుంది....మరి కొత్త ప్రణాలికలేమిటి?

చిన్న పిల్లల కథలు ఒక వెయ్యి ఆడియో రూపంలో తయారు చేసే పని, ఒక 100 పిల్లల కథల యానిమేషన్ పని మొదలైనాయి ప్రస్తుతానికి.....ఇప్పటికి ఓ వంద ఆడియోలు, ఒక రెండు యానిమేషన్లు పూర్తయ్యాయి, మిగిలినవి పూర్తయ్యాక మిగతా వాటి మీద పడతానన్నమాట......

మిగిలినవంటే?

చాలానే ఉన్నాయి....చెప్పాగా మైళ్ళ ప్రయాణం మిగిలిపోయిందని......వివరాలు తర్వాతెప్పుడైనా....

శుభం....సర్వేజనాస్సుఖినోభవంతు!

Sunday, June 26, 2011

శ్రీకృష్ణదేవరాయలు - ఆడియో ధారావాహిక - మొదటి భాగం

శ్రీకృష్ణదేవరాయలు - ఆడియో ధారావాహిక - మొదటి భాగం
రచన: ??? శ్రీ ఎస్.డి.వి.యాజిద్
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవరెడ్డి
సహకారం: శ్రీ వి.ఎస్.గోపీకృష్ణ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 27, 2011

పాత్రలు - పాత్రధారులు

కృష్ణనాయకుడు: శ్రీ  వి.అమరేంద్ర
అప్పాజి: శ్రీ మల్లాది గోపాలకృష్ణమూర్తి
వీర నరసింహరాయలు: శ్రీ బందా వేంకటరమణయ్య
సంగ: శ్రీమతి కె.అరుణశ్రీ
సైనికుడు: శ్రీ కె.కామేశ్వర రావు

వ్యాఖ్యానం: శ్రీమతి వి.గాయత్రి, శ్రీ కె.వి.ఎస్.కె.కిశోర్

ఆసక్తి వున్నవారికి ఉపయోగపడుతుందేమోనని - ప్రతి సోమవారం పొద్దున్నే ఏడుంపావుకు ప్రసారమవుతుందిట ఈ ఆడియో ధారావాహిక...

ఎక్కడ వినవచ్చా?

 ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

PS:అనౌన్సరమ్మగారెవరో కానీ, రచయిత పేరు కుళ్ళబొడిచేసారు....మీకెవరికన్నా అర్థమైతే చెప్పండేం...సవరిస్తాను...

Hi ya Hi ya Hi ya.. Hi ya Hi ya Hi ya!!

Oh mother of the earth
Of whom we all are born
We call upon your daughter
The spirit of the corn
Oh let us send her blessings
And lest our field go dry

Send raindrops mighty spirits
That thunder in the sky
Oh spirit of the rain
The thunderbird above
We see you as you fly
With the rainbow that you love
Oh send the cooling rain
That our corn and beans may grow
And climb upto the sun
Like the arrow from your bow

Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya

Oh sun oh mighty sun
you drive away the night
As you warm us with your light
Oh shine upon our field
And send us corn of gold
To help our hungry people
Survive the winter's cold

Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya

Friday, June 24, 2011

ఈ వారం వెబ్సైటులోకి ఎక్కినవేమిటి?

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర సంగీత సభ
వయొలిన్: శ్రీ సూర్యదీప్తి
మృదంగం: శ్రీ పెరవలి జయభాస్కర్
నిడివి: సుమారు 20 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 13, 2011


____________________________________

భక్తిరంజని కార్యక్రమం
శ్రీకృష్ణ స్తుతి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 14, 2011


____________________________________


జానపద సంగీత కార్యక్రమం
పెళ్ళిపాటలు
శ్రీమతి బై(పై)రుపాక ఎల్లమ్మ & బృందం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 14, 2011

____________________________________

హరికథా గానం
భక్త కబీర్ దాసు - హరికథ
కథకులు: ???
నిడివి: సుమారు 30 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 14, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ
పూర్తి కార్యక్రమం ప్రసార లోపమ్ వల్ల రికార్డు  చేయలేకపోయినందుకు చింతిస్తూ...

____________________________________


కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
శ్రీ ఎన్.సి.హెచ్.రంగాచార్యులు గాత్ర కచేరీ
వయొలిన్: శ్రీ సూర్యదీప్తి
మృదంగం: శ్రీ వి.కాళీప్రసాద్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 15, 2011


____________________________________


కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
బృంద కచేరీ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 16, 2011


____________________________________


జీవన సంధ్య నాటిక
రచన: శ్రీమతి రత్నావళి
నిర్వహణ: శ్రీ బి.చిట్టిబాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 17, 2011


____________________________________

అక్షర శిల్పాలు కార్యక్రమం
శ్రీమతి హిమజ, శ్రీ జూకంటి జగన్నాధం స్వీయ కవితా పఠనం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 17, 2011


____________________________________

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం
శ్రీ మల్లెల తేజస్వి వయొలిన్ వాద్య కచేరీ
మృదంగ సహకారం: శ్రీ డి.శేషాచారి
నిడివి: 60 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 17, 2011


____________________________________

జానపద సంగీత కార్యక్రమం
కాంతవతి కథ - చిందు యక్ష గానం
వరంగల్ జిల్లా, జనగాం మండలం కళాకారులు
మేడిపల్లి  శ్రీనివాస్ & బృందం వారిచే -
(గడ్డం భిక్షపతి, గడ్డం ధనంజయ,గడ్డం నరహరి, గడ్డం శ్రీనివాస్, రాములు, అనూరాధ, అన్నపూర్ణ )
నిడివి: సుమారు 30 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 19, 2011


____________________________________


కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
శ్రీమతి కె.స్వరాజ్యలక్ష్మి గాత్ర కచేరీ
వయొలిన్: శ్రీ ద్వారం సత్యనారాయణ రావు
మృదంగ సహకారం: శ్రీ కాళీప్రసాద్ బాబు
నిడివి: 30 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 19, 2011


____________________________________


రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం
శ్రీ డి.వి.మోహన కృష్ణ గాత్ర కచేరీ
రామనాధపురం శ్రీనివాస అయ్యంగార్ కీర్తనలు
వయొలిన్: శ్రీ కె.వి.కృష్ణ
మృదంగ సహకారం: శ్రీ పెరవలి జయభాస్కర్
ఘటం: శ్రీ ఎం.హరిబాబు
నిడివి: 30 నిముషాలు
ఆకాశవాణి చెన్నై కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 19, 2011


____________________________________


జానపద సంగీతం ఆడియోలు
జానపద బ్రహ్మ శ్రీ మానాప్రగడ నరసింహమూర్తి గారి పాటలు

 • కర్మ ఫలితమున
 • పట్నం బస్సు నేనెక్క
 • ఓ పార్వతీ తనయ
 • గుర్రాల గోపిరెడ్డి

____________________________________


కర్నాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం
శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణా వాద్యం
మృదంగ సహకారం: శ్రీ డి.శేషాచారి
నిడివి: 50 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 20, 2011


____________________________________


హరికథా కాలక్షేపం
భక్త మార్కండేయ
కథకురాలు: శ్రీమతి మునిలక్ష్మి భాగవతార్
వయొలిన్: పుదుక్కొట్టై ఆర్.రామనాధం
మృదంగం: శ్రీ డి.అనంతరావు
నిడివి: 60 నిముషాలు
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 21, 2011


____________________________________


వేద పఠనం
భక్తి రంజని కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 23, 2011

____________________________________

లక్ష్మీ నృసింహ స్తుతి
భక్తి రంజని కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 23, 2011

____________________________________


ఉత్తర యోగి - జాతీయ నాటకం
రచన: అరూప్ మిత్రా
తెలుగు సేత: శ్రీమతి దుర్గాభాస్కర్
కార్యక్రమ నిర్వహణ: శ్రీమతి రతన్ ప్రసాద్ (చిన్నక్క)
పర్యవేక్షణ: శ్రీ చావలి దేవదాస్
నిడివి: సుమారు 50 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 23, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ
ఈ ఉత్తర యోగి నవల నా వద్ద లేదు కానీ, ఇంటర్నెట్టులో లభ్యమైన సమాచారం ఈ క్రింది విధంగా ఉన్నాది.....మూలం చదవకుండానే శ్రీమతి దుర్గా భాస్కర్ గారు (వీరు రిటైర్డు ఆకాశవాణి డైరెక్టరు) చేసిన తెలుగు సేత ఈ నాటక రూపంలో వింటే బావుందనే అభిప్రాయం కలిగింది.....కొనుక్కోవలసిన నవలల్లో ఒకటి అని అనిపించింది...

In 1870, the spiritual leader of the Nagai Japat, makes a momentous prediction: the Uttara Yogi would settle down in South India. His arrival would presage the liberation of the country from foreign rule and put an end to the era of falsehood. The long vigil for the Uttara Yogi begins.

Having completed his internship for the ICS in England, young Aurobindo Ghose returns to India and joins the service of the Maharaja of Baroda. Soon, he chalks out his programme for achieving the independence of India. He popularises the ‘battle cry’ Vande Mataram and initiates the Swadeshi and Boycott movements to thwart the partition of Bengal.

He also strives to put an end to the moderate policies of the Congress by replacing it with nationalism. Secretly, he initiates an armed insurrection to overthrow the British by establishing a bomb factory in his ancestral garden house of Muraripukur, exposure of which leads to the infamous Alipore Bomb Trial.

Well-researched and craftily woven, Uttara Yogi is a remarkable historical novel, taking the reader back to pre-independent India through a tale of patriotism, adventure, love and betrayal, revealing through a multitude of characters, episodes and experiences, the true identity of the Uttara Yogi

____________________________________


చిన్నపిల్లల కథలు - ఆడియో
పులి - వడ్రంగి పిట్ట కథ
వాయిస్: శ్రీమతి మాగంటి శ్రీదేవి

ఈ ఆడియోల పరంపరలో భాగంగా ఇప్పటికే సిద్ధమై ఉన్న 99 ఆడియోలు ఒక రెండు వారాల్లో పబ్లిష్ చేయబడతాయి....

____________________________________



ఆదర్శ దంపతులు - నాటిక
రచన: శ్రీ భూపతి రామారావు
నిర్వహణ: శ్రీ. బి.చిట్టిబాబు
పాల్గొన్నవారు:
 • శ్రీ బి.(డి).వి.ఎస్.మూర్తి
 • శ్రీ కె.ఎస్.వి.కె.కిశోర్
 • శ్రీమతి బి.విజయశ్రీ
 • శ్రీమతి టి.రమాశ్రీదేవి
సహకారం: శ్రీ నవీన్ కుమార్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 22, 2011
నిడివి: సుమారు 25 నిముషాలు

____________________________________


రాగం - తానం - పల్లవి కార్యక్రమం
వీణా వాద్యం
ఆర్టిష్టు: శ్రీ డి.శ్రీనివాస్
మృదంగం: శ్రీ వి.కాళీప్రసాద్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 22, 2011
నిడివి: సుమారు 45 నిముషాలు

Thursday, June 23, 2011

ఎవరికైనా హైదరాబాదులో నమ్మకమైన కేరళ ఆయిల్ మసాజ్ సెంటర్ ఎరికలో ఉన్నదా?

ఎవరికైనా హైదరాబాదులో నమ్మకమైన కేరళ ఆయిల్ మసాజ్ సెంటర్ ఎరికలో ఉన్నదా? తెలియజేసినవారికి ముందస్తు ధన్యవాదాలు....

నడుము నొప్పి విపరీతంగా కల ఒక పెద్దాయనకు సహాయం కోసం అడుగుతున్నాను.ఇంతకు ముందు అనగా ఓ ఏడెనిమిదేళ్ళ క్రితం ఇలా ఆయిల్ మసాజ్ చేయించుకున్నప్పుడు చాలా వరకు తగ్గిందనీ, ఇప్పుడు మళ్ళా తిరగబెట్టిందనీ చెప్పటంతో ఇలా ఓ పోష్టు వేస్తే ఎవరికైనా తెలిసిన వారు చెబుతారన్న ఆశతో.

తిరగబెడితే మళ్ళీ అక్కడికే వెళ్ళొచ్చుగా అని ప్రశ్న వస్తుందేమోనని - అప్పటి ఆ వైద్యశాల ప్రధాన డాక్టర్ గారు అప్పుల బాధల్లో కూరుకుపోయి ఆ వైద్యశాల మూసేసారని తెలిసింది...

మీకెవరికైనా తెలిసినవారు వెళ్ళి ఫలితం కనపడిన వైద్యశాల అయితే మరింత సంతోషం.వెళ్ళాక ఊరకే డబ్బులు తీసుకుని ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యకుండా ఉండే  వైద్యశాల గురించి తెలియచెయ్యండి బాబో! 

భవదీయుడు
వంశీ

Monday, June 20, 2011

చిన్నపిల్లల కథల సెక్షన్లో ఇంకో 100 కథలు!!

ఇంకో 100 పిల్లల కథలు ఈ రోజు చేర్చడమైనది....


ఎక్కడ ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న పిల్లల కథలు - సాహిత్యం లంకె నొక్కటం, ఆ తర్వాత చదువుకోటమో, చదివించటమో - మీ మీ ఇష్టానుసారం....

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, June 17, 2011

బ్లాగ్ దండోరా - పిల్లల కథల సెక్షన్లో ఇంకో 90 కథలు !!

బ్లాగయ్యలారా , బ్లాగమ్మలారా

చిన్నపిల్లల కథల సెక్షన్లో ఈ వేళ / ఈ రోజు ఇంకో 90 కథలు పబ్లిష్ చేసానని తెలియపరుస్తూ బ్లాగ్ దండోరా వెయ్యటమైనదహో!

మీ మీ పిల్లలతో కథానందమయ సమయ ప్రాప్తిరస్తు........ఆనందోబ్రహ్మ

భవదీయుడు
మాగంటి వంశీ

అరుదైన లలిత సంగీతం పాటల ఆడియోలు కొన్ని .....అందులో ఒకటి శ్రీ పుట్టపర్తి వారి రచన కూడా!

తన తండ్రిగారు శ్రీ ఎం.ఎల్.నరసింహం గారు పాడిన కొన్ని అరుదైన లలిత సంగీతం పాటల  ఆడియోలు పంచుకున్న శ్రీ మండా కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను . ఆకాశవాణి విశాఖ, విజయవాడ కేంద్ర ప్రసారాలతో పరిచయం ఉన్నవారికి శ్రీ ఎం.ఎల్.నరసింహం గారి గురించి చెప్పవలసిన పని లేదు...అద్భుతమైన పాటలు ఎన్నో ఆయన గళం నుంచి జాలువారాయి....

 • చిగురాకుల మాటునున్న
రచన: శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య
సంగీతం : శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం

 • నీలి నీలి గగనంలో
రచన: రాయంచ
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం
సంగీతం: శ్రీ చంద్రశేఖర్


 • నందనందనునీ
రచన: శ్రీ సి.నా.రె
సంగీతం : శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం


 • నీలాంబరధరి
రచన: శ్రీ ఆవంత్స సోమసుందర్
సంగీతం : శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం

 • గగనాన పండింది
రచన: శ్రీ రామకోటి
సంగీతం: శ్రీ ఆదిత్య ప్రసాద్
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ద్వారం లక్ష్మి


 • జయజయ పద్మావతి
రచన: కరుణశ్రీ
సంగీతం: కె.ఎస్.ప్రకాశరావు
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



 • మ్రోయింప మురళి
రచన: శ్రీ వక్కలంక
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం


 • ప్రవిస రాధే
రచన: జయదేవుడు
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



 • వెన్నెలేమో పంపింది
రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం: శ్రీ తిరుపతి రామానుజ సూరి
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



 • ఆ మహోన్నత శిల్పి
రచన: శ్రీ వక్కలంక
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



 • పూవులలోని
రచన: శ్రీ వక్కలంక
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ద్వారం లక్ష్మి



 • చైతన్యం
రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం



 • చిగురాకులపై
రచన: శ్రీ సి.నా.రె
సంగీతం: శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ఆర్.జి.శోభారాజు



 • నీడై తోడై
రచన: శ్రీ కాటూరి విజయసారధి
సంగీతం: శ్రీ ఎం.ఎల్.నరసింహం
పాడినవారు: శ్రీ ఎం.ఎల్.నరసింహం
 

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "లలిత సంగీతం ఆడియో" లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Thursday, June 16, 2011

1300 చిన్న పిల్లల కథలు - ప్రస్తుతానికి ఓ 150 మాత్రమే!

చిన్న పిల్లల కథలు - ప్రస్తుతానికి ఓ 150 మాత్రమే!

గత నాలుగేళ్లలో ఓ 850 కథలు సేకరించానండీ....

ఎక్కడినుంచి?

వివిధ పత్రికలనుంచి సేకరించానండి....ఆ 850 కాక, పాత పిల్లల పుస్తకాల నుంచి స్కాన్ చేసినవి మరో 462 ఉన్నాయి....అన్నీ కలిపి ఓ 1300 కథలనుకోవచ్చన్నమాట....


ఆ  ఫేసుబుక్కు, యాహూ గ్రూపులు, గూగుల్ గ్రూపులు అన్నీ వదిలేసి నా మానాన నేను పూర్వాశ్రమంలోలాగా వెబ్సైటు మీదకెళ్ళిపోయాక ఇప్పుడు కాస్త టైము దొరికి - ఓ 150 ప్రచురించా!

ఎక్కడ?

పిల్లల కథలు - సాహిత్యం సెక్షన్లో!

చదువుకోవాలనుకున్నవాళ్ళు అక్కడికెళ్ళి లంకెల మీద నొక్కి చదూకోటమే...

మరి మిగిలిన 1100 కథలు ఎప్పుడు?

ఓ మూడు వారాల్లో అన్నీ ఎక్కించగలను అని అనుకుంటున్నాను స్వామీ....

ఆ పేజీ దర్శిస్తూ ఉండండి....


మరి చిన్న పిల్లల కథలు - ఇన్నిరోజులు ఎందుకు దాచిపెట్టా?

నువ్వు అడుగుతావా లేదా అని...

అదే మరి....

A BIG - HUGE - MONSTER Disclaimer: కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమాత్రం లేదని తెలియచేసుకుంటూ, హక్కుదారులు ఎవరికైనా అభ్యంతరం ఉంటే దయచేసి తెలియపర్చమని విన్నపం.....తెలియపరచిన వెంటనే క్షమాపణలతో ఆ కథలు అక్కడినుంచి తొలగిస్తానని విన్నవించుకుంటూ

భవదీయుడు

వంశీ


PS: ఒక ఆనిమేషన్ ప్రాజెక్టు మీద పని మొదలుబెట్టటం జరుగుతోంది.....బ్లూ ప్రింట్ ఆల్మోస్టు రె"ఢీ", వాయిస్ ఓవర్ కళాకారులూ రె"ఢీ"- వివరాలు త్వరలో !

"నా" కు దీర్ఘమిస్తే ఏం జరిగింది? ఓ అద్భుతం జరిగింది.......

2005 నంది నాటకోత్సవాలలో , సాంఘిక నాటికల విభాగంలో ఉత్తమ నాటికగా బంగారు నంది బహుమతి గెలుచుకున్న నాటిక - ""నా" కు దీర్ఘమిస్తే ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం చేసింది.

రచన, దర్శకత్వం: శ్రీ.బి.పి.ప్రసాదరావు

పాత్రలు / పాత్రధారులు:-

 • వృద్ధుడు:శ్రీ బి.పి.ప్రసాద రావు
 • రంగడు: భవానీ ప్రసాద్
 • పాండు: శ్రీ.సి.వి.ఎస్.శాస్త్రి
 • కార్తీక్: శ్రీ నాగసాయినాథ్
 • జోగినాథం: శ్రీ సి.నారాయణస్వామి
 • కాంతం: శ్రీమతి శ్రీలక్ష్మి
 ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ 

హైదరాబాదు వంశీ - నిరంజన్ కళాకేంద్రమ్ సభ్యులు సమర్పించిన కార్యక్రమం ఇది.

బి.పి.ప్రసాదరావు గారు, భవానీ ప్రసాద్ గారు - ఆయా పాత్రల్లో జీవించేసారు అంటే అతిశయోక్తి కాదు. వారిద్దరికీ, వారిలోని కళాకారుడికీ హృదయపూర్వక నమస్సులతో....

సుమారు 50 నిముషాల నిడివి కల ఈ నాటికను విని ఆనందించండి

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, June 14, 2011

వేటపాలెం లైబ్రరీలో ఉన్న పుస్తకాల లిష్టు బయటపడింది.....ఆనందోబ్రహ్మ!!

హార్డ్ డ్రైవులో పాత సరంజామా కోసం వెతుకుతూంటే వేటపాలెం లైబ్రరీలో ఉన్న పుస్తకాల లిష్టు బయటపడింది నిన్న...

ఎప్పుడో 2007 లో ఇక్కడినుంచి సేవ్ చేసుకున్నా...(అనుకుంటా)....ఫైలు డేటు చూస్తే 2007 అని ఉంది...

http://www.saraswataniketanam.org/ ....

ఇప్పుడు ఆ లింకు, వెబ్సైటు పని చేస్తున్నట్టు లేవు....

ఫైలు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ అప్లోడు చేసా....

ఆనందోబ్రహ్మ...

ఈ లిష్టు చూసి సారస్వత నికేతనంలో సరస్వతి ఇల్లా చిక్కిపోయిందా అనో, ఏంటీ వేటపాలెం లైబ్రరీలో ఇన్నే పుస్తకాలున్నాయా అనో ఓ పెస్న ఏసారనుకో - ఏటవుద్దీ ?

సరే మనలో మనకు గొడవలెందుకు గానీ - ఫైల్లో ఆ చివర డిస్కు నెంబరు అని ఉందిగా సుబ్బారావు....చూసావా అది? ఆ డిస్కు నెంబరంటే డిజిటైసు చేసిన పుస్తకాలు ఎక్కించిన డిస్కు నెంబరన్నమాట.... అదీ సంగతి....


అనుబంధంగా Digital Library Of India సైటులో ఉన్న పుస్తకాల లిష్టు ఒకప్పుడు ఈ పోష్టులో....


భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, June 12, 2011

కుదరదులే కానీ , మూడు వారాలకోసారి చేస్కో....!! అంతేనా? అంతే....


ఈ వారంలో వెబ్సైటులో చేర్చిన సమాచారం


ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో

సంగీత సంచిక కార్యక్రమంలో "రాగం తానం పల్లవి" గురించి శ్రీ సూర్యదీప్తి గారి వివరణ. 

 • రాగమేమిటి, తానమేమిటి, పల్లవేమిటి - వాటి పుట్టుపూర్వోత్తరలేమిటి అని సందేహాలున్నవారికీ, తెలుసుకోదల్చిన వాళ్ళకీ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ప్రసార తేదీ: జూన్ 8, 2011

_______________________________________________________
  
సంస్థానాలు పేజీలో
 
సంస్థానాలు సెక్షన్లో - కొంతమంది రాజావార్ల ఫోటోలు, బోలెడన్ని కోటల ఫోటోలు తక్క మిగిలిన సమాచారం అంతా పొందుపరచడమైనది. మీ దగ్గర ఏవన్నా ఇతర వివరాలు, ముఖ్యంగా రాజావార్ల ఫొటోలు, కోటలకు సంబంధించిన చిత్రాలు ఉంటే పంచుకోవలసిందిగా విన్నపం...

 • Important Note: ఈ వారం మా ఊరు చల్లపల్లి రాజవంశీకులు శ్రీ శ్రీ శ్రీమంతురాజా యార్లగడ్డ చంద్రధర ప్రసాద్ గారితో పరిచయం జరగటం ఎనలేని ఆనందం కలిగించింది. వారు వెబ్సైటు కాకతాళీయంగా చూడటం, అభినందిస్తూ ఈమెయిలు పంపించటం - అన్నీ కలలో జరిగినట్టు జరిగింది . వారి వద్దనుంచి త్వరలో చల్లపల్లి (దేవరకోట) సంస్థానానికి సంబంధించి అరుదైన చిత్రాలు, వివరాలు చూడబోతున్నారు


_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో
 
రాగం-తానం-పల్లవి కార్యక్రమంలో శ్రీ డి.ఎస్.నారాయణన్ గారి వయొలిన్ వాద్యవిన్యాసం. 
మృదంగ సహకారం: శ్రీ పి.జయభాస్కర్. 
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ప్రసార తేదీ: జూన్ 8, 2011. 

ఈ గంట ఆడియోలో - 
 • ఖరహరప్రియ రాగం తానం , 
 • నీపదములె గతియని నమ్మితి శ్రీరామ చంద్రా అనే పల్లవి, 
 • ఆది తాళం, 
 • రెండు కళ్ళ చౌకం పల్లవి ఎత్తుగడ  సమం నుండి ప్రారంభం.
  _______________________________________________________

  
ఆకాశవాణి కార్యక్రమాలు / నాటికలు పేజీలో

జై జవాన్ నాటిక
ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం
ఆడియో సౌజన్యం: డాక్టర్ తాడేపల్లి పతంజలిగారు  
 
రచన: శ్రీ తాడేపల్లి పతంజలి
నిర్వహణ: శ్రీ మంత్రవాది మహేశ్వర్
సహకారం: శ్రీ నక్కా సుధాకర రావు

పాల్గొన్నవారు:
రామరాజు: శ్రీ ఎం.దత్తాత్రేయులు
చక్రపాణి: శ్రీ కె.సుదర్శన్
విష్ణుమూర్తి: శ్రీ వి.రమణమూర్తి
శ్రీలత: శ్రీమతి మంజుల

_______________________________________________________

సాహితీ సంబంధ సెక్షన్లో
 • ప్రసార సాహిత్యం - శ్రీ నాయని సుబ్బారావు
 • నవ్వుల బండి - బుజ్జాయి
 • ఉదయిని - 1935 (దసరా సంచిక)
 • ఉదయిని - 1936 (మే నెల సంచిక)
 • ఉదయిని - 1936 (ఆగష్టు నెల సంచిక)

ఈ మణిపూసలు శ్యాం నారాయణగారి సౌజన్యం

_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం
ఆర్టిస్టు: శ్రీ కె.శ్యాం కుమార్
వయొలిన్: శ్రీ ద్వారం సత్యనారాయణ
మృదంగం: శ్రీ పెరవలి జయభాస్కర్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 7, 2011

_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు / రూపకాలు పేజీలో

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు టాగోర్ 150 సంవత్సరాల సందర్భంగా సమర్పించిన అద్భుతమైన కార్యక్రమం - "150 Years of Tagore" డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో


_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు / భక్తి రంజని పేజీలో


భక్తి రంజని కార్యక్రమం
అచ్యుతాష్టకం, సంప్రదాయ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ


_______________________________________________________

ఆకాశవాణి కార్యక్రమాలు / ఇతర కార్యక్రమాలు  పేజీలో

"భారత జననీ" - దేశభక్తి గీతం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ


_______________________________________________________


జానపదం - ఆడియో పేజీలో 

 బాలనాగమ్మ - బుర్రకథ రెండవ భాగం
గరివిడి లక్ష్మి & బృందం
ఆడియో సౌజన్యం - శ్రీ వెంకట రమణ (???) 


_______________________________________________________



ఆకాశవాణి కార్యక్రమాలు /శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పేజీలో


కర్నాటక శాస్త్రీయ సంగీతం
నాదస్వర ద్వయం
ఆర్టిష్టు : శ్రీ ఎం.డి వెంకటరాజు, శ్రీ ఎం.డి.మల్లికార్జున
ప్రత్యేక డోలు సహకారం: శ్రీ ఆర్.బాలసుబ్రహ్మణ్యం
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 12, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ 



_______________________________________________________


ఆకాశవాణి కార్యక్రమాలు / ఇతర కార్యక్రమాలు  పేజీలో


ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రసారం చేయబడిన విజ్ఞానశాస్త్ర ధారావాహిక - సాంకేతిక రంగంలో మహిళా శక్తి . ఈ ధారావాహికలోని ఈ భాగం - "బోధనాభ్యాసంలో నూతన పరదా తొలగింపు" గురించి

రచన: డాక్టర్ సమ్మెట గోవర్ధన్
రచనా సహకారం: జనవిజ్ఞాన వేదిక శాస్త్రప్రచార విభాగం
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవ రెడ్డి
సహకారం: శ్రీ ఎస్.సత్యనారాయణ
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఇందులో పాల్గొన్నవారు
శ్రీ టి.విశ్వనాథ్
శ్రీమతి స్వప్న
కుమారి శఠగోపన్ కృష్ణవేణి
కుమారి హరిత



_______________________________________________________





ఆకాశవాణి కార్యక్రమాలు / ఇతర కార్యక్రమాలు  పేజీలో

ఈ మాసపు పాట
రచన: శ్రీ వారణాసి వెంకట రావు
సంగీతం: టి.కె.సరోజ
గానం: కె.లక్ష్మీనరసమ్మ
ఆకాశవాణి  విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 12, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

 • శ్రీ వారణాసి వెంకట్ రావు గారు ఇక్కడి బే ఏరియాలో నివాసముంటున్న వారి అబ్బాయి వారణాసి రవిగారి వద్దకు వచ్చి ఉన్నప్పుడు వారితో ఫోనులో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వారు తన స్వీయ రచన, సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పిల్లల పాటలు, భక్తి సంగీతపు పాటల సి.డి.లు పంపించారు. అవి అన్నీ త్వరలో వెబ్సైటులో చూడవచ్చు...వీటిలో కొన్ని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి గళంలో వినవచ్చు


_______________________________________________________


సాహితీ సంబంధ సెక్షన్లో
అంత్యార్పణ నాటిక
రచన: ఆచార్య ఆత్రేయ
విశాలాంధ్ర ప్రచురణాలయం
ఫిబ్రవరి 1955

__________

భోజరాజీయము
రచన: అనంతామాత్యుడు
సంగ్రహకర్త - శ్రీ కొండూరు వీరరాఘవాచార్య
1969 సంవత్సరం

__________


మన తెలుగు తెలుసుకుందాం
రచన: డాక్టర్ ద్వానా శాస్త్రి
మే, 1997
సౌజన్యం: డాక్టర్ ద్వా.నా.శాస్త్రి

__________


"తొలకరి"
రచన: పింగళి లక్ష్మీకాంతం / కాటూరి వెంకటేశ్వర రావు
త్రివేణి - మచిలీపట్నం
సంక్రాంతి 1923 సంచిక
సౌజన్యం: పరుచూరి శ్రీనివాస్

__________


సాహిత్య సుందరి
రచన: డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి
ఫిబ్రవరి 1980
ఆంధ్ర సారస్వత పరిషత్తు
1986 నుండి కాపీరైటు ఫ్రీ

__________



విక్రమార్కుని విడ్డూరం
రచన: రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రధమ ముద్రణ; జూన్ 1960
విద్యోదయ పబ్లికేషన్స్, కడప




__________

తెలుగులో బాలల నవలలు
పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం
డిసెంబరు, 1986
డాక్టర్ పసుపులేటి ధనలక్ష్మి
సౌజన్యం: పరుచూరి శ్రీనివాస్


__________

 
అమర్ చిత్రకథ
చిన్న పిల్లల కథలు

ఇందులో
 • పులి - వడ్రంగి పిట్ట కథ
 • తెలివయిన తాబేలు కథ
 • కుందేలు, చకోర పక్షీ, పులి కథ
 • పామూ - ఎలుక కథ
 • తెలివితక్కువ బ్రాహ్మడు కథ
 • ఆడచిలుక - వేటగాడు కథ
 • తెలివిలేని కొంగ కథ
ఉన్నాయి....

ఇది ఒక రకంగా ఆణిముత్యమే. ఒక రెండేళ్ళ క్రితం వినాయకచవితికి గామాలు, బోషాణం నుంచి బయటపడ్డది....ఆ తర్వాత సంవత్సరం దసరాకు మా ఆవిడ గొంతులో పడి ఆడియో కథ తయారయ్యింది....అలా సంవత్సరం తోస్తే కానీ మా ఆవిడ గొంతు చక్రాలు కదల్లా! ఏం చెప్పమంటారు?

స్కానులో సరిగ్గా రావేమో అనుకున్నా కానీ పుస్తకంలో బొమ్మలు మటుకు బ్రహ్మాండంగా వచ్చినాయి....

_______________________________________________________

సరే ఈ వెబ్సైటు వార్తలు ఇంతటితో సమాప్తం - మళ్ళీ 3వ తారీకున పునర్దర్శనం...

అదేంటి - వారం వారం అప్డేట్ అన్నావు?

అవును , 19 తారీకు వస్తానని ఈ రోజే వచ్చాగా మరి ? 

అయితే  వారం వారం కుదరదులే కానీ , మూడు వారాలకోసారి చేస్కో....

అంతేనా?

అంతే....

అల్లా మూడు వారాలకైతేనో, ఐదు వారాలకైతేనో బోల్డు పనీ చేసుకోవచ్చు, వార్తలూ ఒకే పోష్టులో రాయొచ్చు....

అదీ సంగతి సుబ్బయ్యా

వస్తానయ్య ఇహ...

భవదీయ
వంశీ

 




Wednesday, June 8, 2011

నటరాజ రామకృష్ణగారితో 1977లో ప్రసారమైన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం - పరిచయకర్త: శ్రీ సుధామ

శ్రీ నటరాజ రామకృష్ణ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ; జూన్ 8, 2011
నటరాజ రామకృష్ణగారితో 1977లో ప్రసారమైన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం
పరిచయకర్త: శ్రీ సుధామ


సుధామ గారు బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ పరిచయ కార్యక్రమం. వారికి, నటరాజ వారికి, ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...


నటరాజ వారు - నాకిష్టమైన "అమరకోశం" గురించి చాలా మంచి మాటలు చెప్పారు...

నటరాజ రామకృష్ణగారు హైదరాబాదు అశోకనగర్లో మేముండే వీధికి రెండు వీధులవతల ఉండేవారు. వారి శిష్యులు శ్రీ కళాకృష్ణగారు మా నాన్నగారి స్నేహితులు కూడాను. అత్యద్భుతమైన కళాకారులు శ్రీ నటరాజ వారు. ఎంతో నిమ్మళంగా,ప్రశాంత వదనంతో ఉండేవారు. సాయంత్రంపూట అలా వ్యాహ్యాళికి బయలుదేరి ఇంటిపక్కనే ఉన్న పార్కు, మా లక్ష్మీ చిల్డ్రన్స్ స్కూల్ చుట్టూ అలా ఒక రవుండు వేసి వెళ్ళిపోయేవారు. అలా ప్రతిరోజు చూసేవాళ్ళమ్మ్ ఆయన్ను. కొంతమంది కొండె గాళ్ళు ఉంటారుగా! ఆయన కనపడగానే డాన్సులు మొదలుపెట్టేవారు. ఆయన చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. ఒక రోజు ఆయన్ని చూసి అలా డాన్సులాడుతుంటే, మా క్లాసుమేటు మారుతి వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ డాన్సాడుతున్న వాళ్ళని, నటరాజవారిని చూసి, ఆయన పార్కు దాటేసాక, ఆ పిల్లచేష్టలకి ఆగ్రహంతో ఊగిపోతూ చేతికందిన కర్ర తీసుకుని దొరికినవాణ్ణి దొరికినట్టు పిర్రలు వాయగొట్టారు. అంతే ఆ రోజు నుంచి వాళ్ళు గప్ చుప్.

అది అలా ఉంటే ఇంకో పార్కు జ్ఞాపకం - స్కూలైపోయాక ఇంటికెళ్ళి దోశో, ఇడ్లీనో మెక్కి ఆ పార్కుకు పోయి గోళీలో, బచ్చాలో ఆడుకునేవాళ్ళం. గోళీలాటలో విపరీతమైన ప్రావీణ్యం ఉండేది మనకు! రోజూ జేబులు నిండిపోయేవి - అలా ఒకరోజు అన్నీ తీసుకుపోతుంటే కోపం పట్టలేక సాయి సమీందర్ అనే క్లాసుమేటు ఉక్రోషంతో లాగూ జేబు పట్టుకు పర్రున చించిపారెయ్యటం, అందులో గోళీలన్నీ రోడ్డు మీద పడి దొర్లిపోవటం, నేను సాయి గాణ్ణి పట్టుకుని వంచేసి వీపు మీద గభీ గభీమని గుద్దటం మర్చిపోలేని జ్ఞాపకం! చిన్నపిల్లలంగా అంతే మరి, కొట్టుకోటం, మళ్లీ ఆడుకోటం...

సరే ఇహ జ్ఞాపకాలు పక్కన బెట్టేస్తున్నా

ఏమిటి బాబూ! ఇందాకే చెప్పావు - 19వ తారీకు వరకు దర్శనం లేదని....

అవును....కానీ ఇది నటరాజ వారుగా అందుకు అన్నమాట

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

 

భవదీయుడు
మాగంటి వంశీ

ఈ ఆకాశవాణి గోలేంటయ్యా బాబూ.....చంపుతున్నావు, రోజుకు రెండు పోష్టులేసి?

ఈ ఆకాశవాణి గోలేంటయ్యా బాబూ.....చంపుతున్నావు, రోజుకు రెండు పోష్టులేసి?


"చదివితే చదువు, వింటే విను లేకుంటే లేదు , నా బ్లాగు నా ఇష్టం "


అని అంటాననుకున్నావా... :)


సరేలే, సమయం సరిపోవట్లేదని నేనే మానేద్దామనుకున్నా ఈ రోజు నుంచి. మానేసి వారానికి ఓ రోజు - అనగా ఆదివారం సాయంత్రం పూట ఆ వారానికి సంబంధించి ఓ టపా వేస్తా! అది చదువుకుని చెవులు చించుకో - ఏం?


మొగాంబో ఖుష్ హువా! బ్లాగాంబో ఖుష్ హువా! ఆకాశవాణాంబో ఖుష్ హువా!


19 వ తేదీన పునర్దర్శన ప్రాప్తిరస్తు...

అన్నమయ్య హరికథాగానం - కథకులు: శ్రీ కొచ్చెర్ల రామకృష్ణ

అన్నమయ్య హరికథాగానం
కథకులు: శ్రీ కొచ్చెర్ల రామకృష్ణ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 7, 2011
నిడివి: 60 నిముషాలు 

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, June 7, 2011

శ్రీ మేడూరి శ్రీనివాస్ గారి వీణావాద్యం - కర్నాటక శాస్త్రీయ సంగీత సభ

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం
శ్రీ మేడూరి శ్రీనివాస్ గారి వీణావాద్యం
మృదంగం: శ్రీ పెరవలి జయభాస్కర్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 6 2011
నిడివి: ఒక గంట


ఎక్కడ వినొచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

అవసరమైన మార్పు - శ్రీ వి.రాధా రామ్మోహన్ గారి కథానిక

కథాప్రపంచం కార్యక్రమం
"అవసరమైన మార్పు"
శ్రీ వి.రాధా రామ్మోహన్ గారి కథానిక
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ; జూన్ 6, 2011
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ


ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, June 6, 2011

శివ స్తుతి - భక్తి రంజని కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

శివ స్తుతి
భక్తి రంజని కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ 

అనుసంధాన కర్నాటక సంగీత సభా కార్యక్రమం - గాత్రం: శ్రీ రాధాకృష్ణమూర్తి

అనుసంధాన కర్నాటక సంగీత సభా కార్యక్రమం
గాత్రం: శ్రీ రాధాకృష్ణమూర్తి
వాద్య సహకారం:-
వయోలిన్: శ్రీ ఎం.సత్యనారాయణ శర్మ
మృదంగం: శ్రీ ఎం.ఏడుకొండలు

ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 30, 2011
నిడివి: అరగంట
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

 • మా పాలి వెలసెగా / రాగం: అసావేరి / త్యాగరాజ కీర్తన
 • కలిగియుంటే కదా / రాగం: కీరవాణి / తాళం: ఆది / త్యాగరాజ కీర్తన

మొదలైనవి వినవచ్చు


ఎక్కడ వినవచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, June 5, 2011

వరంగల్ జిల్లా లింగాల గణపురం గడ్డం శ్రీనివాసు & బృందం - అరుంధతీ కల్యాణం చిందు యక్ష గానం

అరుంధతీ కల్యాణం - రెండవ భాగం
చిందు యక్ష గానం
గడ్డం శ్రీనివాసు & బృందం
వరంగల్ జిల్లా - లింగాల గణపురం
జానపద సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 5, 2011

ఈ చిందు యక్షగానం ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత జానపద కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

జానపద గీతాలు - పుల్లోరి బూదమ్మ & బృందం వారిచే ఉయ్యాల పాట

జానపద గీతాలు
పుల్లోరి బూదమ్మ & బృందం వారిచే ఉయ్యాల పాట
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
నిడివి: 10 నిముషాలు
ప్రసార తేదీ: మే 31, 2011
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న  జానపదం - ఆడియో   లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

హెచ్చరిక - రూపకం

హెచ్చరిక - రూపకం

హైదరాబాదు ఆకాశవాణి కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 5, 2011
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

రచన: శ్రీ తుర్లపాటి నాగభూషణరావు
నిర్వహణ: డాక్టర్ కె.విజయ
సహకారం: శ్రీమతి కవిత

పాల్గొన్నవారు
శ్రీమతి ఎ.వసంతలక్ష్మి
డాక్టర్ కె.విజయ
శ్రీ వెన్న కృష్ణాశివరావు
శ్రీ మంత్రవాది మహేశ్వర్
శ్రీ బాలకృష్ణ 


ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత రూపకాలు లంకె నొక్కి  వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ  

Saturday, June 4, 2011

మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

భక్తి రంజని గీతాలు
శ్రీ మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 4 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ 

Friday, June 3, 2011

"అతడు అడవిని జయించాడు" డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 3 hrs audio

డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 3 hrs audio
పరిచయకర్త: డాక్టర్ పతంజలి
ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం


"ప్రపంచ సాహిత్యంలోనే చాలా పేరు పొందిన సాహితీప్రక్రియ నవల. 11వ శతాబ్దపు ప్రారంభంలో జపాన్ దేశంలో నవలా ప్రక్రియ ఆవిర్భవించినట్లుగా కాలర్సెన్సోక్లోపీడియా 13వాల్యూంలో ఉన్నది" అంటూ డాక్టర్ పతంజలి గారు "అతడు అడవిని జయించాడు" రచనతో ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్ కేశవరెడ్డి గారితో ఆకాశవాణి పరిచయకార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత తెలుగుదేశంలో నవల జీవితానికి నూరేళ్ళు నిండాయని చెబుతూ డాక్టర్ కేశవ రెడ్డి గారు 7 నవలికలు మాత్రమే రచించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని వివరిస్తారు. ఆ తరువాత డాక్టర్ కేశవరెడ్డిగారి బాల్యం గురించీ, వారి సాహితీ ప్రస్థానాన్ని గురించి చాలా చక్కగా వివరించారు.

వృత్తి పరంగానూ, రచనా పరంగానూ చికిత్సే ప్రధాన ధ్యేయంగా కలిగినవారు అని చెబుతూ వారితో పరిచయ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన శ్రీ పతంజలి గారికీ, శ్రోతలకు ఒక మంచి కార్యక్రమం వినే అవకాశం కలిపించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి, అన్నిటికన్నా మిన్నగా ఏ భేషజం లేకుండా చక్కగా తన అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను మనతో పంచుకున్న శ్రీ కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అడగగానే ఈ మూడు గంటల ఇంటర్వ్యూను పబ్లిష్ చేసుకోడానికి అనుమతి ఇచ్చిన శ్రీ పతంజలి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో .....

ఆరు భాగాలుగా చేసి ఎం.పి.3లుగా పంపిన శ్యాం నారాయణగారికి ధన్యవాదాలతో

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

 

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, June 1, 2011

శ్రీ కె.ఎ.అబ్బాస్ When Night Falls నవల విశేషాలు

శ్రీ కె.ఎ.అబ్బాస్ 1968లో రచించిన When Night Falls నవలని, శిల్పసౌందర్యం ఏమాత్రం చెక్కుచెదరకుండా తెలుగులోకి అనువదించిన ఘనత శ్రీ దొడ్డవరం కామేశ్వర రావు గారికి దక్కుతుంది. "చీకటి పడ్డాక" అనే పేరుతో 1975 సంవత్సరంలో ప్రచురించినవారు ఎమెస్కో వారు.

ఆ నవలలోని విశేషాలను ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రతివారం ప్రసారమయ్యే లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి కార్యక్రమంలో వివరించినవారు శ్రీ పైడి తరేశ్ బాబు గారు.

ఎప్పటిలానే చాలా చక్కగా వివరించారు.

ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!


భవదీయుడు
మాగంటి వంశీ

డాక్టర్ పంతుల రమ - రాగం తానం పల్లవి - ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ

రాగం తానం పల్లవి కార్యక్రమం
గాత్రం: డాక్టర్ పంతుల రమ
వయోలిన్: శ్రీ కె.వి.ఎస్.ప్రసాదరావు
మృదంగం: శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ
ప్రసార తేదీ: జూన్ 1, 2011
నిడివి: సుమారు 45 నిముషాలు
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఈ కార్యక్రమంలో

 • షహనా రాగాలాపన
 • తానం
 • రామా నీ స్మరణము మరువము మరువము శ్రీరామ అనే పల్లవి
 • ఆది తాళం , నాలుగు కళల చౌకం, సమం నుండి రెండక్షరాలు వదలి

వినవచ్చు

ఎక్కడ వినొచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

నేనూ నా రచనలు -- అంపశయ్య నవీన్ -- ఆడియో

సాహితీ సంచిక కార్యక్రమం
నేనూ - నా రచనలు
అంపశయ్య నవీన్
పరిచయకర్త: శ్రీ చెన్నూరి రాంబాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ : జూన్ 1, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ 

కొన్ని మంచి చురుకులు ఉన్నాయి ఇందులో..

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

కథా ప్రపంచం - కన్నీటి వెన్నెల - శ్రీమతి డి.సుజాతా దేవి గారి కథానిక

కథా ప్రపంచం కార్యక్రమం
కన్నీటి వెన్నెల - శ్రీమతి డి.సుజాతా దేవి గారి కథానిక
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ