Friday, May 13, 2011

మీ మెదళ్ళలో మేత ఎంతుందో చూసుకుని వీలైతే జబ్బలు, లేకుంటే నోళ్ళు కొట్టుకోండి!

లూమోసిటీ అని ఒక సైటు దొరికిందండీ ఈవేళ...

మెదడుకు మేతనిచ్చే ఆటలుట...

గ్రాసం కొద్దిగా తక్కువయ్యిందేమోనన్న అనుమానంతో సరే చూద్దామని అక్కవుంటొకటి ప్రారంభించేసి ఆడా!

మూడు సెషన్లు ఫ్రీ గా ఇస్తాడట. మొదటిది "అన్లాక్" చేసా....రెండోది చేసి ఆపేసా! మూడోది రేపు మొదలెడతా!

మొదటిది ఆడా! బ్రహ్మాండం అనుకున్నా!

రెండోది ఆడుతున్నా....అలా స్కోరు వచ్చేస్తుంటే జబ్బలు చరుచుకుంటూ ఉత్సాహంగా ఉరకలేస్తున్నా...ఇంతలో లాస్ట్ ఇన్ మైగ్రేషన్ అని ఓ ఆట వచ్చింది....

అక్కడకు వచ్చేప్పటికి దెబ్బేసింది......మనకు ఏజొచ్చెసిందన్న నిజం పచ్చిగా అలా ముందు నిలబడింది...ఆక్యురసీ 59% తో కనపడటంతో ఈవేళ్టికి చాలు అని ఇహ స్వస్తి పలికి మళ్ళీ రేపొస్తా అని బయటపడ్డా.....

ఇహ మీ మెదళ్ళలో మేత ఎంతుందో చూసుకుని వీలైతే జబ్బలు, లేకుంటే నోళ్ళు కొట్టుకోండి .....


http://www.lumosity.com/మీకోసం నా స్కోరు బొమ్మలు ఇక్కడ....
సర్వేజనా స్సుఖినోభవంతు


PS: After finishing the third session - here is the updated score... :)


6 comments:

 1. $మాగంటి వంశీ మోహన్ Ji
  Kewl! Excellent game. I had just played. WOW.
  Thanks for sharing here.

  ReplyDelete
 2. స్కోరు ఎంత వచ్చినది? జబ్బలా? నోరా?

  బజ్జో, జో జో లాగా - ఈ బజ్జు ఏమి? వివరించుడు!

  ReplyDelete
 3. నేను మొదటి ఆవృతం పూర్తీచేశాను. ఇవి గణా౦కాలు
  Speed 106
  Memory 250
  Attention 141

  లుమోస్ గణా౦కం: 21 ఇప్పటికి

  అప్పుడే చెప్పలేని.. జబ్బా నోరా అంటే.. రెండవ ఆవృతం అయిన తర్వాత చెప్తాను :)

  బజ్జు - ఇది సమయాన్ని పోసుకోలు కబుర్లతో వృధా చేసుకోవడానికి మరియు మన భావాలను/సమాచారాన్ని ఇతరులతో త్వరితంగా పంచుకోవడానికి గూగల్ వారు తయారు చేసిన ఒక సాధనం.. ఒకరకంగా చెప్పాలంటే చాట్బండార్ అన్నమాట.

  ReplyDelete
 4. వంశీమోహన్ గారు! లుమోసిటీ లో ప్రవేశించి మూడు వారాలుగా.. నేను మెదడుకు చురుకు ,పదును పెంచుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. కోర్సు పూర్తయ్యాక ఫలితం చెపుతానండీ!. మనం మర్చిపోయినా గుర్తు చేసి మరీ..మెదడుకు మేత ఇచ్చి మరీ ఆట లాడిస్తున్నారు.బాగుందండీ!!!!

  ReplyDelete
 5. @రాజేశ్ - బజ్జు గురించిన వివరణకు ధన్యవాద్...

  @వనజ - సంతోషం....

  ReplyDelete