Thursday, May 12, 2011

నేను పైరేట్ అంటే నాన్న సముద్రపు దొంగ అంటాడే?

నిన్న కొత్త కథల పుస్తకం తీసుకొచ్చాడు నాన్న. అందులో బోల్డంతమంది పైరేట్స్ ఉన్నారు.

ఆ పైరేట్స్ కి కింగ్ స్కార్ ఫేస్. ఆ స్కార్ ఫేస్ బొమ్మ వేసేసా!







ఇప్పటివరకూ వేసినవాటిల్లో "మూడుకాళ్ళ తాబేలు" తర్వాత ఇది నెష్టు బెష్టు అన్నాడు......స్కార్ ఫేస్ అని పేరు పెట్టుకున్నాక మొహానికి స్కార్ ఉండాలిగా అన్నాడు, కానీ నాకు అర్థం కాలా! ఆ తర్వాత ...పోనీలే ఇలాగే బాగుంది అని ముద్దు పెట్టుకున్నాడు...

నాకు బొమ్మలు ఇంకొంచెం బాగా వెయ్యటం నేర్పించటానికి డ్రాయింగ్ టీచర్ల కోసం తెగ వెతుకుతున్నాడు కానీ ఎవరూ దొరకట్లా! ప్చ్చ్!

అవునూ నేను పైరేట్ అంటే నాన్న సముద్రపు దొంగ అంటాడే?

పుస్తకంలో కథ ఏంటా?

పేద్ద పుస్తకం అది. సగమే చెప్పాడు నాన్న....మొత్తం ఐపోయాక చెప్తా.

No comments:

Post a Comment