Tuesday, May 31, 2011

భక్త కుచేల హరికథాగానం - ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం

భక్త కుచేల హరికథాగానం
కథకులు: శ్రీ వీరవ్యాస శ్రీరామ భట్టార్
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 31, 2011
నిడివి: 60 నిముషాలుఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, May 30, 2011

హరికథా ప్రపంచంలో మొట్టమొదటి గ్రామోఫోన్ రికార్డు ఇచ్చిన శ్రీ వేదనభట్ల వేంకట రమణయ్య - ఆడియో

శ్రీ వేదనభట్ల వేంకట రమణయ్య భాగవతార్ - హరికథా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రామోఫోన్ రికార్డు ఇచ్చిన మహానుభావులు. 1945లో హెచ్.ఎం.వి వారు రికార్డు చేసిన షిర్డి సాయి చరిత్ర అనే హరికథ - శ్రీ వేదనభట్లవారి గళంలో ఇక్కడ వినవచ్చు. 

 ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్నహరికథలు - ఆడియో లంకె నొక్కి వినవచ్చు
శ్రీ వేదనభట్ల వారి గురించి క్లుప్తంగా: వీరు మూకీ సినిమాల్లో కథానాయకుడిగా వెలుగొందారు. రామాయణం అనే సినిమా 10 పార్ట్లుగా తీసారనీ అందులో శ్రీ వేదనభట్లవారే కథానాయకుడనీ వారి మనవలు శ్రీ మండా కృష్ణమోహన్ తెలియచేస్తున్నారు. ఆదిభట్ల నారాయణదాసు గారి వద్ద శిష్యరికం చేసి ఆ తరువాత హరికథాగానంలో అంతటి పేరూ తెచ్చుకున్న మహానుభావులు శ్రీ వేదనభట్ల.

నెల్లూరులో దాదాపు ఆరు నెలలు రామాయణాన్ని హరికథారూపంలో గానంచేసి ప్రేక్షకులని సమ్మోహితులని చేసినందుకు గాను, శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి శ్రీ సాంబమూర్తిగారు వేదనభట్ల వారిని బంగారు కంకణంతో సన్మానించారన్నమాట శ్రీ సాంబమూర్తిగారే కృష్ణమోహన్ గారితో చెప్పారట.

 తన తాతగారి గళంలో జాలువారిన అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ మండా కృష్ణమోహన్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో 

 భవదీయుడు
మాగంటి వంశీ

Update: ఈ హరికథలో హార్మోనియం ప్లే చేసింది శ్రీ కె.వి.మహదేవన్ (అవును "మామ" మహదేవన్ గారే!) 

Sunday, May 29, 2011

కర్నాటక సంగీత కార్యక్రమం - బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం వీణా వాయిద్య విన్యాసం

కర్నాటక సంగీత కార్యక్రమం
బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం
వీణా వాయిద్య విన్యాసం
మృదంగ సహకారం: వి.కాళీప్రసాద్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం


ఈ ఆడియోలో:
అనుపమ గుణాంబుధి
అఠాణ రాగం
త్యాగరాజ కీర్తన

అపరాధములన్నియు
లతాంగి రాగం
ఆది తాళం
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన
 
మొదలైనవి వినవచ్చు

ఎక్కడ వినవచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, May 27, 2011

హిందూ శబ్దం యొక్క అర్థం చాలా చెడ్డది!! - శ్రీమాన్ నండూరి కృష్ణమాచార్యులు

"మనము ఆర్యసమాజీయులము ఎందుకు కావలయును"

అని ఓ గోప్ప పుస్తకం తారసపడింది. అది చదివితే గోప్ప పుస్తకమెందుకు అయ్యిందో మీకే ఎరికలోకి వస్తుంది. లంకె ఇక్కడ.

http://www.archive.org/details/ManamuAryaSamaajulamEndukuKavalayunu


శ్రీమాన్ నండూరి కృష్ణమాచార్యులు అన్న పేరు కలవారు వ్రాసిన మణి అది. బంకనక్కిడికాయలా ఈయన ఆర్యసమాజాన్ని నూరేసి ఆరేసి మన మీద పారేసారు. ఇహ పొలోమంటూ ఆర్యులమైపోటం మిగిలింది.

ఆ పుస్తకంలోని ఒక ముత్యం -

"మన పేరు నిజానికి హిందువు కాదు. హిందూ శబ్దం యొక్క అర్థం చాలా చెడ్డది. దానికి అర్థం - దొంగ, బానిస, నల్లవాడు, పాషండుడు మున్నగునవి. అది ఫారసీ భాషలోని శబ్దం. ముసల్మానులు ద్వేషంతో మనకీ పేరు పెట్టినారు"....

వైదిక ధర్మం - విశిష్టత అని తనకు చేతనైనంతలో అరివీర భయంకరంగా రాసుకొచ్చారు. ఈ బొమ్మల మీద నొక్కి చదవండి.
సర్వేజనా స్సుఖినోభవంతు

భవదీయుడు
వంశీ

పండుగ దొంగలు నాటిక

పండుగ దొంగలు నాటిక
రచన: శ్రీ నట్టి శ్రీనివాస రావు
నిర్వహణ: శ్రీ చావలి దేవదాస్

పాల్గొన్నవారు:
శ్రీ దినవహి సుబ్రహ్మణ్యం
శ్రీ బొర్రా నిరంజన రావు
శ్రీమతి కె.వి.సత్యవతి
శ్రీమతి ఎం.కృష్ణసాయి

ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 27, 2011
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

అక్షర శిల్పాలు - శ్రీమతి శారదా అశోకవర్ధన్ - ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం

కార్యక్రమం: అక్షర శిల్పాలు
శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారి స్వీయ కవితా పఠనం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం
ప్రసార తేదీ: మే 27, 2011
నిడివి: సుమారు 10 నిముషాలు
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

శారదా అశోకవర్ధన్ గారేమిటీ - రేడియోలో హడావిడిగా పరుగులెత్తుతూ చెప్పటమేమిటీ అని ఆశ్చర్యపోయా! ఈ కవితా పఠనంలో "వశీకరణ" మిస్సయ్యిందనే చెప్పవచ్చు....

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!


భవదీయుడు
మాగంటి వంశీ
POST 480

Wednesday, May 25, 2011

కర్నాటక సంగీత కార్యక్రమం - వర్ణం/రఘునాయక/ఏనాటి నోము ఫలమో/నారాయణతే నమో నమో

కర్నాటక సంగీత కార్యక్రమం
ఆర్టిస్టు: శ్రీమతి పి.గీతా గాయత్రి
వీణా వాయిద్య విన్యాసం
మృదంగ సహకారం: వారణాసి కాళీప్రసాద్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 25, 2011
నిడివి: సుమారు అరగంట
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఈ ఆడియోలో:
 • నాటకురంజి రాగం / వర్ణం
 • హంసధ్వని రాగం / రఘునాయక / త్యాగరాజ కృతి 
 • ఏనాటి నోము ఫలమో / త్యాగరాజ కృతి / ఆది తాళం / భైరవి రాగం
 • నారాయణతే నమో నమో /  అన్నమాచార్య కీర్తన / బిళహరి రాగం

మొదలైనవి వినవచ్చు

ఎక్కడ వినవచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, May 24, 2011

ఒకవేళ ఎస్వీ.రంగారావుగారి చేత నర్తనశాల హరికథ చెప్పిస్తేనో, చెప్పించి ఉంటేనో!

"నర్తనశాల" హరికథ - కథకులు శ్రీ ముదపాక (మండపాక ??) బాలసుందరం.

నవరసాలు అలాగ్గా అలా జాలువారిపోయి మన మీద పడిపోతున్నాయా అన్నంత ఇదిగా శ్రోతలను రంజింపజేసి, మధ్యలో అవసరమైన ధిక్కారం , దర్పం, వాక్పారుష్యం బిట్లు బిట్లుగా వేసేసి షడ్రుచులు వడ్డించేసారు ఈ హరికథలో.

ఈ హరికథ ఈయనే చెప్పాలన్నంత, ఈయన చెపితేనే వినాలన్నంత బ్రహ్మాండంగా ఉన్నది.ఒకవేళ ఎస్వీ.రంగారావు గారిచేత నర్తనశాల హరికథ చెప్పిస్తేనో, చెప్పించి ఉంటేనో ఆయన వెర్షను ఈ వెర్షను ముందు దిగదుడుపేనేమో అన్న ఓ చిన్న అనుమానం కూడా పొడసూపింది.

అయినా అసలు రంగారావు గారు హరికథా గానం చెయ్యటమేమిటి సుబ్బారావూ?

ఊరకే ఐడియా బాగుందని రాసా! "నర్తనశాల" కీచకులు వారేగా!

వెరైటీగా కీచకుల వారి చేతే హరికథ చెప్పిస్తే?

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 24, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!


భవదీయుడు
మాగంటి వంశీ

శ్రీమతి టి.చంద్రభాను కర్నాటక సంగీత గాత్ర కచేరీ - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కర్నాటక సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
శ్రీమతి టి.చంద్రభాను గాత్ర కచేరీ
ఆడియో సౌజన్యం: భవదీయుడు
సుమారు అరగంట కార్యక్రమం

ఈ ఆడియోలో:
 •  ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం / మైసూర్ వాసుదేవాచార్య కృతి 
 • మనసు స్వాధీనమైన / త్యాగరాజ కృతి  

మొదలైనవి వినవచ్చు

ఎక్కడ వినవచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ


POST: 477

Monday, May 23, 2011

కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - ఆడియో ధారావాహిక - 2

కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - ఆడియో ధారావాహిక - 2

కల్పలతతో శారద చర్చించిన లేఖ 
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
వ్యాఖ్యాత / పరిచయకర్త: శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి
ప్రసార తేదీ: మే 23, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!  

Note: కార్యక్రమం మొదట్లో  అంతరాయం వల్ల - సుమారు 3 నిముషాల రికార్డింగు సరిగ్గా రాకపోవటం వల్ల, ఆడియోలో బాగున్న పార్టు కట్ చేసి పబ్లిష్ చెయ్యటమైనది...

అడిగి మరీ పాడించుకుంటూ ఉంటానన్నమాట..!!

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆర్టిష్టు: శ్రీమతి జయంతి రమ
నిడివి: సుమారు గంట
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఈ గంట ఆడియోలో - 
 • వరాళి రాగం / "శేషాచల నాయకం"/ దీక్షితార్ కృతి / రూపక తాళం
 • జో జో రామా / త్యాగరాజ / రీతిగౌళ
మొదలైనవి వినవచ్చు


ఎక్కడ వినొచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

PS: ఓ మాట చెప్పాలె - "జో జో రామా" - ఈ త్యాగరాజుల వారి కృతి ఎవరు పాడినా నచ్చదు ఎందుకో, ఒక్క మా ఆవిడ పాడింది తప్ప..........! అడిగి మరీ పాడించుకుంటూ ఉంటానన్నమాట..

Friday, May 20, 2011

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ - వయోలిన్ వాద్యవిన్యాసం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ
వయోలిన్ వాద్యవిన్యాసం
ఆర్టిష్టు: రాధికా శ్రీనివాసన్
మృదంగ సహకారం: శ్రీ డి.శేషాచారి
నిడివి: 60 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

గంట నిడివి కల ఈ ఆడియోలో:- వర్ణం (ఆదితాళం), పలుకే బంగారమాయెనా, మా జానకి చెట్టా పట్టగ(కాంభోజి రాగం, ఆదితాళం) మొదలైనవి వినవచ్చు

ఎక్కడ వినొచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Thursday, May 19, 2011

దేవీ స్తుతి - భక్తి రంజని కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

దేవీ స్తుతి
భక్తి రంజని కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ 

Tuesday, May 17, 2011

Authors @ Google Series - "Nudge: Improving Decisions......." - Prof. Thaler

For those of you - who are interested in Behavioural Economics here is a good video.It's a long one - about 56 mins...So have patience and enjoyAbout the video from the youtube here is what the video uploader says:

Every day, we make decisions on topics ranging from personal investments to schools for our children to the meals we eat to the causes we champion. Unfortunately, we often choose poorly. The reason, the authors explain, is that, being human, we all are susceptible to various biases that can lead us to blunder. Our mistakes make us poorer and less healthy.

"Nudge: Improving Decisions About Health, Wealth, and Happiness" shows that by knowing how people think, we can design choice environments that make it easier for people to choose what is best for themselves, their families, and their society. Using colorful examples from the most important aspects of life, Thaler and Sunstein demonstrate how thoughtful "choice architecture" can be established to nudge us in beneficial directions without restricting freedom of choice.

Richard H. Thaler is the Ralph and Dorothy Keller Distinguished Service Professor of Behavioral Science and Economics and the director of the Center for Decision Research at the University of Chicago's Graduate School of Business.

This event took place on May 29, 2008, as a part of the Authors@Google series. For more information on Prof. Thaler, go to http://www.nudges.org/thaler.cfm


Have Fun

PS: AND Yes, comments have been disabled! - both for the video and in this blog... :)

Monday, May 16, 2011

భక్త మార్కండేయ, నర్తనశాల హరికథలు - కథకులు: శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.

భక్త మార్కండేయ, నర్తనశాల హరికథలు
కథకులు: శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.
సౌజన్యం: శ్రీ కుప్పా రాజశేఖర్

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్నహరికథలు - ఆడియో లంకె నొక్కి వినవచ్చు


 భవదీయుడు
మాగంటి వంశీ

కళావైభవం - నాగార్జున కొండ - డాక్యుమెంటరీ రూపకం!!

కళావైభవం - నాగార్జున కొండ
డాక్యుమెంటరీ రూపకం
సమర్పణ: శ్రీ డి.ఎస్.ఆర్ ఆంజనేయులు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీప్రెజెంటేషన్ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టి ఉంటే కార్యక్రమం ఇంకా బాగుండేదనిపించింది.

మరి బావుండనివి మా చెవుల్లో ఎందుకు పోస్తున్నావు, మా నెత్తిన ఎందుకు పెడుతున్నావు బాబూ?

బాగుండలేదని నేననలేదే....అయినా నీకంటే అన్నీ తెలుసు నాయనా! మరి ఇప్పటి పిల్లలకు కూడా తెలియాలిగా?

పుస్తకాలున్నాయిగా?

అలాగే ఈ ఆడియోలు కూడా అనుకో! 


ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత రూపకాలు  లంకె నొక్కి వినటమే!


భవదీయుడు
మాగంటి వంశీ

Saturday, May 14, 2011

"హౌ టు డ్రా" పుస్తకాలు - పాండా బొమ్మ చూసి ఇవ్వాళ్ళ పొద్దున్న వేసా!

మా ఊళ్ళో 5 యేళ్ళ వాళ్ళకి చెప్పటానికి డ్రాయింగు టీచర్లు దొరకట్లేదని, నాన్న ఓ రెండు "హౌ టు డ్రా" పుస్తకాలు తీసుకొచ్చాడు....

అందులో ఒకదాన్లో పాండా బొమ్మ చూసి ఇవ్వాళ్ళ పొద్దున్న వేసా....

లక్ష్మీ స్తుతి - భక్తి రంజని కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

లక్ష్మీ స్తుతి
భక్తి రంజని కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ 

Friday, May 13, 2011

మీ మెదళ్ళలో మేత ఎంతుందో చూసుకుని వీలైతే జబ్బలు, లేకుంటే నోళ్ళు కొట్టుకోండి!

లూమోసిటీ అని ఒక సైటు దొరికిందండీ ఈవేళ...

మెదడుకు మేతనిచ్చే ఆటలుట...

గ్రాసం కొద్దిగా తక్కువయ్యిందేమోనన్న అనుమానంతో సరే చూద్దామని అక్కవుంటొకటి ప్రారంభించేసి ఆడా!

మూడు సెషన్లు ఫ్రీ గా ఇస్తాడట. మొదటిది "అన్లాక్" చేసా....రెండోది చేసి ఆపేసా! మూడోది రేపు మొదలెడతా!

మొదటిది ఆడా! బ్రహ్మాండం అనుకున్నా!

రెండోది ఆడుతున్నా....అలా స్కోరు వచ్చేస్తుంటే జబ్బలు చరుచుకుంటూ ఉత్సాహంగా ఉరకలేస్తున్నా...ఇంతలో లాస్ట్ ఇన్ మైగ్రేషన్ అని ఓ ఆట వచ్చింది....

అక్కడకు వచ్చేప్పటికి దెబ్బేసింది......మనకు ఏజొచ్చెసిందన్న నిజం పచ్చిగా అలా ముందు నిలబడింది...ఆక్యురసీ 59% తో కనపడటంతో ఈవేళ్టికి చాలు అని ఇహ స్వస్తి పలికి మళ్ళీ రేపొస్తా అని బయటపడ్డా.....

ఇహ మీ మెదళ్ళలో మేత ఎంతుందో చూసుకుని వీలైతే జబ్బలు, లేకుంటే నోళ్ళు కొట్టుకోండి .....


http://www.lumosity.com/మీకోసం నా స్కోరు బొమ్మలు ఇక్కడ....
సర్వేజనా స్సుఖినోభవంతు


PS: After finishing the third session - here is the updated score... :)


Thursday, May 12, 2011

నేను పైరేట్ అంటే నాన్న సముద్రపు దొంగ అంటాడే?

నిన్న కొత్త కథల పుస్తకం తీసుకొచ్చాడు నాన్న. అందులో బోల్డంతమంది పైరేట్స్ ఉన్నారు.

ఆ పైరేట్స్ కి కింగ్ స్కార్ ఫేస్. ఆ స్కార్ ఫేస్ బొమ్మ వేసేసా!ఇప్పటివరకూ వేసినవాటిల్లో "మూడుకాళ్ళ తాబేలు" తర్వాత ఇది నెష్టు బెష్టు అన్నాడు......స్కార్ ఫేస్ అని పేరు పెట్టుకున్నాక మొహానికి స్కార్ ఉండాలిగా అన్నాడు, కానీ నాకు అర్థం కాలా! ఆ తర్వాత ...పోనీలే ఇలాగే బాగుంది అని ముద్దు పెట్టుకున్నాడు...

నాకు బొమ్మలు ఇంకొంచెం బాగా వెయ్యటం నేర్పించటానికి డ్రాయింగ్ టీచర్ల కోసం తెగ వెతుకుతున్నాడు కానీ ఎవరూ దొరకట్లా! ప్చ్చ్!

అవునూ నేను పైరేట్ అంటే నాన్న సముద్రపు దొంగ అంటాడే?

పుస్తకంలో కథ ఏంటా?

పేద్ద పుస్తకం అది. సగమే చెప్పాడు నాన్న....మొత్తం ఐపోయాక చెప్తా.

Tuesday, May 10, 2011

అన్నమయ్య చరిత్ర - ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం

అన్నమయ్య చరిత్ర - హరికథా గానం
శ్రీ శివరామకృష్ణ శర్మ భాగవతార్
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 10, 2011
నిడివి: 60 నిముషాలు
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!


భవదీయుడు
మాగంటి వంశీ

చాక్లెట్లన్నీ తినేసా..... గుర్తుపెట్టుకుని ప్లాస్టిక్కు ఎగ్గుల మీద .....!!

ఈస్టర్ ఎగ్గుల హంటు అయిపోయాక అవి ఇంటికి తెచ్చేసా...వాటిల్లో ఉన్న చాక్లెట్లన్నీ తినేసా.....ఇంతకుముందు గుడ్లకు రంగులేయించాడుగా నాన్న, అది గుర్తుపెట్టుకుని ఈ ప్లాస్టిక్కు ఎగ్గుల మీద నాకొచ్చినట్టు కళ్ళు ముక్కులున్న బొమ్మలేసేసా!

పింకు గుడ్డు బొమ్మ చాలా బావుందన్నాడు నాన్న!

పింకు గుడ్డు బొమ్మ పక్కనే ఉన్న బ్లూ బొమ్మ మీద కళ్ళు ముక్కు అన్నిటికిన్నా ముందు గీసా...సరిగ్గా రాలా! ప్చ్చ్...

ఇటు చివర ఉన్న బ్లూ గుడ్డు మీద నాన్న జుట్టు గీసి చూపించాడు...ఇహ మిగిలిన మూడిటికీ నేనే వేసేసా! 
నాన్న బొమ్మ కూడా వేసేసా.....


Monday, May 9, 2011

కనుపర్తి లక్ష్మమ్మ శారద కథలు - ఆడియో ధారావాహిక / వైజ్ఞానిక వైతాళికులు - సైన్సు ధారావాహిక మొదటి భాగం / శ్రీమతి పి.గీతా గాయత్రి కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం


కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - ఆడియో ధారావాహిక
వరకట్న బాధితులైన తలిదండ్రుల ఆవేదనలు శారద కల్పలతతో చర్చించిన లేఖ 
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
వ్యాఖ్యాత / పరిచయకర్త: శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి
ప్రసార తేదీ: మే 9, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

సుమారు పది నిముషాల కార్యక్రమం. ఈ ధారావాహిక ప్రసార తేదీల వివరాలు తెలిసిన వారు ఇక్కడ పంచుకుంటే మరిన్ని ఆడియోలు అందించటానికి వీలవుతుంది.

ఒక్క మాట మటుకు చెప్పాలని అనిపించి - వ్యాఖ్యాతగా వేరెవరినైనా పెట్టి చదివిస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది.

పోనీ నువ్వెళ్ళి చదవకపోయావా అంటారా? :)

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు! ******************************************


వైజ్ఞానిక వైతాళికులు - సైన్సు ధారావాహిక మొదటి భాగం
రచన: డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
చదివిన వారు: మానస
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 9, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

సుమారు ఎనిమిది నిముషాల కార్యక్రమం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత బాలల  కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు! ******************************************

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
శ్రీమతి పి.గీతా గాయత్రి - వీణా వాయిద్య విన్యాసం
వర్ణం, మరివేరే దిక్కెవ్వరు
మృదంగ వాయిద్య సహకారం: వారణాసి కాళీప్రసాద్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 9, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

సుమారు అరగంట కార్యక్రమం

ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, May 8, 2011

నాటక రంగానికి చెందిన అద్భుతమైన కళాకారుల గళాలు మీ కోసం!!

నాటక రంగానికి చెందిన అద్భుతమైన కళాకారుల గళాలు మీ కోసం

 • శ్రీ స్థానం నరసింహా రావు
 • శ్రీ అద్దంకి శ్రీరామ మూర్తి
 • శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి
 • శ్రీ బందా కనకలింగేశ్వర రావు
 • శ్రీ ధూళిపాళ
 • శ్రీ కె.రఘురామయ్య
 • శ్రీ తుంగల చలపతిరావు
 • శ్రీమతి రామతిలకం
 • శ్రీ సి.ఎస్.ఆర్
 • శ్రీ బళ్ళారి రాఘవ
 • శ్రీ అబ్బూరి వరప్రసాద్

అలనాటి రంగస్థల నటుల / నటీమణుల అపురూప గళాలు భద్రపరచి అడగగానే సహృదయంతో వెబ్సైటు వీక్షకులతో పంచుకోవడానికి అవకాశమిచ్చిన శ్రీ కొల్లూరి భాస్కర రావు (సంచాలకులు - ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్, సలహా మండలి సభ్యుడు - ఘంటసాల గాన చరిత) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో .


ఈ అపురూపమైన ఆడియోలు శ్రీ భాస్కరరావు గారి సౌజన్యంతో ఇతరులతో పంచుకున్న శ్యాం నారాయణ గారికి కూడా బోల్డు ధన్యవాదాలతో

ఎక్కడ వినవచ్చా?


ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న రంగస్థల నటులు - ఆడియో లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, May 6, 2011

వేయి పున్నమలు - నాటిక

వేయి పున్నమలు నాటిక

రచన: శ్రీ కరంచెట్టి కమలాకర్
నిర్వాహణ : శ్రీ బి.చిట్టిబాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 6, 2011 
  

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

రాగం తానం పల్లవి - డాక్టర్ నిష్టల కృష్ణవేణి - వీణ - ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం

కర్నాటక శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమ ప్రసారంలో రాగం తానం పల్లవి కార్యక్రమం

డాక్టర్ నిష్టల కృష్ణవేణి
వీణ - వాద్య సంగీతం
మృదంగం: శ్రీ ధన్వాడ ధర్మారావు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 4, 2011
నిడివి: సుమారు 45 నిముషాలు
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

Here is what veenatarangini website says about her - "Dr. Nishtala Krishna Veni is a Carnatic Veena Artiste. She hails from a family of abiding interest in Music. Her mother is Smt. D.V.Subba Lakshmi ( BA, & Diploma in Music ). Her father Dr.D.Siva Prasad is a Retd. Sanskrit Professor in Andhra University , Visakhapatnam . She started learning Music from the childhood at her Guru,Smt. Mallapragada Jogulamba (Retd. Staff Artiste, A.I.R, Visakhapatnam and prominent disciple of Sri. Vasa Krishna Murthy ) and honed her skills under her tutelage"  ఎక్కడ వినొచ్చు?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Thursday, May 5, 2011

ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమైన ఓ నలభై ఆడియోలు!!

ఓ నలభై ఆడియోలు -

ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమైన


 • దేవులపల్లి కృష్ణశాస్త్రి - భక్తిరంజని కార్యక్రమానికి వ్రాసిన భక్తి గీతాలు
 • మహావిద్వాంసులు శ్రీ మైసూర్ టి.చౌడయ్య గారి వయోలిన్ వాయిద్య విన్యాసాలు
 • శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో నారాయణతీర్థ తరంగాలు
 • బృంద మరియు ముక్త గారి స్వరాలలో పదాలు, జావళీలు 
 • దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లలిత గీతాలు 

ఇవి వెబ్సైటులో ఆకాశవాణి కార్యక్రమాలు విభాగంలో సంబంధిత సెక్షన్లలో పబ్లిష్ చేయబడ్డవని తెలియచేసుకోటమైనది....

ఈ అపురూపమైన ఆడియోలు తన ఆడియోల భాండారం నుంచి అందరితో పంచుకోవాలనే సహృదయ స్ఫూర్తితో నాకు అందించిన శ్రీ కుప్పా రాజశేఖర్ గారికి  (panchajanya at gmail dot com) హృదయ పూర్వక కృతజ్ఞతలతో 

భవదీయుడు
మాగంటి వంశీ 

PS: Disclaimer - These are from AIR Original CD's sold at AIR offices and if any one has any objection in placing the content in the website, please let me know and I will promptly comply and remove the audio material from the website with due apologies.

Wednesday, May 4, 2011

అక్కమహాదేవి నాటిక - శ్రీ పురాణపండ రంగనాథ్ - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

అక్కమహాదేవి

శ్రీశైల వాసుడిని భక్తితో కొలచి జీవితాన్ని ధన్యం చేసుకున్నవారు.. తమ జీవితాన్ని స్వామివారికే అంకితమిచ్చినవారు ఎందరో వున్నారు. అలాంటి వారిలో వీరరాగిణిగా ప్రసిద్ధి చెందిన అక్కమహాదేవి' ఒకరు.

పన్నెండవ శతాబ్ధానికి చెందిన అక్కమహాదేవి గాథ - విచిత్రమైన గాథ. చిన్నతనం నుంచే శ్రీరంగనాథుడిని పూజిస్తూ.. యుక్తవయస్సురాగానే శ్రీరంగనాథుడే తన భర్తగా భావించి తరించి.. చివరకు శ్రీరంగనాథుడిలో ఐక్యమైన 'గోదాదేవి'లా అక్కమహాదేవి కూడా మల్లికార్జునుడే తన సర్వస్వం అని భావించిన మహాభక్తురాలు.

అక్కమహాదేవి క్రీ.శ. 12 వ శతాబ్దానికి చెందిన మహిళ. ఆమె కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని 'ఉడుతడి' అనే గ్రామములో సుమతి, నిర్మల శెట్టి దంపతులకు జన్మించింది. నిర్మల శెట్టి దంపతులు వీరశైవులు. నిత్యం శివపూజలో మునిగి వుండేవారు. అటువంటి ఇంటిలో జన్మించిన అక్కమహాదేవికి చిన్నతనం నుంచే శివభక్తి అలవడింది. తల్లిదండ్రులు ఆమెకు ఒకవైపున విద్యను చెప్పిస్తూనే.. మరోవైపు వీరశైవ మతాచారం ప్రకారం లింగధారణ చేయించారు. శివదీక్ష సంస్కారాలన్నీ నేర్పించారు. యుక్తవయస్సు వచ్చాక ఆ భక్తి ప్రేమగా మారింది. చెన్న మల్లికార్జునుడే తన సర్వస్వం అని భావించింది.

ఒకనాడు అక్కమహాదేవి స్నేహితురాళ్ళతో కలిసి వీధు లలో ఆడుకుంటూ వుండగా .. ఆదారిన వెళ్తూ వున్న ఆ దేశరాజు 'కౌశికుడు' చూశాడు. అక్కమహాదేవి అందచందాలను, సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన కౌశికుడు ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలిపి, ఆమెను అంగీకరింపజేయవలసిందిగా తన మంత్రులను అక్కమహాదేవి వద్దకు పంపాడు. మంత్రులు చెప్పిన మాటలను విన్న అక్కమహాదేవి-
'శ్రీశైలనాథుడే నా సర్వస్వం. చెన్న మల్లికార్జునుడికి తప్ప మరొకరికి నా మనస్సులో స్థానం లేదు. కనుక చెన్న మల్లి కార్జునుడిని తప్ప మరొకరిని వివాహమాడను' అని పలికింది.

మంత్రులు వెళ్ళి  ఈ మాటలను కౌశికుడికి తెలిపారు. ఈ మాటలు విన్న రాజులో ఆవేశం అధికమైంది. బలవంతంగా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక అధికమ మైంది. ఈ విషయాన్నే మంత్రులకు చెప్పి వారిని అక్కమహాదేవి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి చెప్పమన్నాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రులు అక్కమహాదేవి తల్లిదండ్రుల వద్దకు చేరుకుని విషయాన్ని తెలిపి.. 'రాజుతో వివాహానికి అక్కమహాదేవి అంగీకరించకపోతే రాజదండనకు గురికావల్సి వస్తుందని' మంత్రులు హెచ్చరించారు.

దీనితో అక్కమహాదేవి తల్లిదండ్రులలో భయందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో-
'తల్లిదండ్రులారా! దిగులు చెందకండి... జైనమతానికి చెందిన కౌశికుడు వీరశైవుడుగా మారిన తర్వాత నేను వివాహం చేసుకుంటాను. నా గురించి దిగులు చెందకండి' అని అక్కమహా దేవి తల్లిదండ్రులకు చెప్పి మంత్రులతో పాటు - రాజధానికి బయలుదేరింది.

అక్కమహాదేవి రాకను చూసిన కౌశికుడిలో ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో వెళ్ళి ఆమెను స్వాగతించాడు. రాజును చూస్తూనే అక్కమహాదేవి- 'మహారాజా! మీరు జైన సంప్రదాయానికి చెందినవారు. నేను వీర శైవ మతానికి చెందిన దానిని. మీరు వీరశైవుడిగా మారినప్పుడే - నేను మిమ్ములను వివాహమాడతాను. అంత వరకూ నేన మీ రాజమందిరంలోనే వుంటాను. శివపూజలో వున్నంతకాలం మీరు నన్ను తాకరాదు. ఒకవేళ మీరు ఈ షరతును ఉల్లంఘిస్తే రాజభవనం నుండి ఏ క్షణాన్నైనా వెళ్ళిపోయేందుకు నాకు స్వేచ్ఛ వుంది' అని పలికింది.

కౌశికుడు వెనుకాముందు ఏమీ ఆలోచించకుండా అందుకు అంగీకరించాడు.

అక్కమహాదేవి నిరంతరం శివపూజలో మునిగి ఉండేది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు విసుగు చెందిన కౌశికుడు కామోద్రిక్తం వల్ల కళ్ళు మూసుకుపోయిన వాడై... షరతులను మరిచి అక్కమహాదేవి వద్దకు వెళ్ళి ఆమెను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కమహాదేవి తాను ధరించిన వస్త్రాన్ని తీసి రాజు ముఖంపై వేసి తన పొడవాటి జుట్టుతో శరీరాన్ని కప్పుకుని, రాజును నిందిస్తూ నిలుచుంది. వివస్త్రగా అక్కమహాదేవిని చూసిన కౌశికుడు కళ్ళముందు జైన తీర్థంకరులు దర్శనమిచ్చారు. ఫలితంగా జైనమతస్థుడు అయిన కౌశికుడు మోకాళ్ళపై ఆమె ముందు మోకరిల్లి నమస్కరించాడు. అనంతరం అక్కమహాదేవి రాజభవనాన్ని వదిలి వచ్చేసింది.

ఆ తర్వాత అక్కమహాదేవి కళ్యాణపట్టణానికి చేరుకుని అక్కడ వున్న అనుభవ మండపంలో కొంతకాలం గడిపింది. అనంతరం శ్రీశైలం చేరింది. స్వామివారిని దర్శించి పూజలు చేసింది. శ్రీశైలం సమీపంలోని ఒక గుహకు చేరుకుని శ్రీశైలవాసుడిని ఆరాధిస్తూ చివరివరకూ గడిపి అనంతరం శివుడిలో ఐక్యమైంది. కన్నడ, సంస్కృత భాషల్లో విశేష ప్రావీణ్య మున్న ఆమె - 'అక్కమహాదేవి వచనాలు' రచించింది. వాటికే 'శివశరణాలు' అని పేరు. ఈ వచనాల్లో భక్తి, జ్ఞాన, వైరాగ్య విషయాలు ప్రస్తావించబడ్డాయి. శ్రీశైలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి నివశించి, శివుడిని ఆరాధించిన గుహలను నేటికీ దర్శించవచ్చు.

Source: http://srivenkatesham.technicalcontact.biz/index.php?module=content&id=46

********************************

 అక్కమహాదేవి - నాటిక
రచన: శ్రీ పురాణపండ రంగనాథ్    

నిర్వహణ: శ్రీ వై.నాగేశ్వర రావు
సహకారం: కుమారి లక్కోజు భానుమతి

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 4, 2011

పాల్గొన్న వారు:

అక్కమహాదేవి: శ్రీమతి మారోజు రేణుక
కౌశికుడు: శ్రీ జొన్నా రామలింగేశ్వర రావు
సుమతి: శ్రీమతి యక్కల పార్వతీ శ్యామల రావు
అల్లమ ప్రభువు: శ్రీ ఎం.పి.కన్నేశ్వర రావు

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ 

********************************

ఆకాశవాణితో పరిచయమున్న వారికి, ప్రత్యేకించి విజయవాడ శ్రోతలకు --- శ్రీ ఎం.ఎల్.నరసింహం గారి శాస్త్రీయ సంగీతం

ఆకాశవాణితో పరిచయమున్న వారికి, ప్రత్యేకించి విజయవాడ శ్రోతలకు శ్రీ ఎం.ఎల్.నరసింహం గారంటే చప్పున ఆయన గళంలో జాలువారిన ఎన్నో లలిత సంగీతం పాటలు, ఎన్నో మధురమైన జానపద గీతాలు, కర్నాటక శాస్త్రీయ సంగీత గీతాలు గుర్తుకొస్తాయి. తన గళంతో శ్రోతలను కట్టిపడేసి, ముగ్ధులను చేసేసి ఈనాటికి కూడా ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప కళాకారులు శ్రీ నరసింహంగారు. 

వారి అబ్బాయి - బాలగంధర్వుడిగా పేరుపొందిన శ్రీ మండా కృష్ణమోహన్ గారు నేను అడక్కుండానే వారంతట వారే, సహృదయంతో తన వద్దనున్న ఆడియోల భాండారం నుంచి తన తండ్రిగారు శ్రీ నరసింహంగారి గీతాలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు, వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో.

Sri Krishna Mohan has a blog too -


URL - http://www.mandakrishnamohan.blogspot.com/

శ్రీ నరసింహంగారి గీతాలు ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "శాస్త్రీయ సంగీతం ఆడియో " లంకె నొక్కి, ఆ తర్వాత శ్రీ ఎం.ఎల్.నరసింహం వారి పాటల గ్రూపులో  లంకెలు నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, May 3, 2011

శ్రీహరి కీర్తనా మహిమ హరికథా గానం / భక్తిరంజని గీతాలు / కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

శ్రీహరి కీర్తనా మహిమ - హరికథా గానం
శ్రీ చిర్రా బ్రహ్మానంద రెడ్డి భాగవతార్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఎక్కడ వినవచ్చా? ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!


___________________________________________
భక్తిరంజని  గీతాలు

I) శంకరుని పూజా - చేయా మనసా
భక్తి రంజని గీతం
రచన: శ్రీ వేంకట నృసింహదాసు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం


II) సాంబ సదాశివ సాంబ సదాశివ
భక్తి రంజని గీతం
రచన: శ్రీ వేంకట నృసింహదాసు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం


III) చల్లరే శంభుని పై
భక్తి రంజని గీతం
రచన: శ్రీ వేంకట నృసింహదాసు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం


ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినవచ్చు! 
___________________________________________

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం

భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
అన్నమాచార్య కీర్తన
రాగం: శుద్ధ ధన్యాసి
నాదస్వరం: నందికుంట వెంకటేశ్వర్లు & బృందం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం


ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు! 

___________________________________________


భవదీయుడు
మాగంటి వంశీ

Monday, May 2, 2011

మూడు ఆకాశవాణి ప్రసారాల రికార్డింగులు - ఆంజనేయ దండకం / దాశరథి గారి గాలిబ్ గీతాలు అనువాద రచన / భక్తి రంజని పాటలు

మూడు ఆకాశవాణి ప్రసారాల రికార్డింగులు మీ కోసం

I)

ఆంజనేయ దండకం
కార్యక్రమం: భక్తి రంజని
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 2, 2011

Note: గాయకుడెవరో  తెలియరాలేదు...వివరం తెలిస్తే పంచుకోండి దయచేసి...

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినొచ్చు!


II)

శ్రీ దాశరథి గారి గాలిబ్ గీతాలు అనువాద రచన
కార్యక్రమం: లిటరరీ భోజన హోటల్
వ్యాఖ్యాత: శ్రీ పైడి తరేశ్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 2, 2011


శ్రీ దాశరథి గారి గాలిబ్ గీతాలు పుస్తకం గురించి లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి కార్యక్రమంలో వివరించినవారు పైడి తరేశ్ బాబు...ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!


III)

రామదాసు కీర్తనలు / భక్తి రంజని
కార్యక్రమం: భక్తి రంజని
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 1, 2011

 • అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
 • చక్కని తల్లికి చాంగు భళా
 • కదిలెను శంభుడు / కొలనిలోని మును గోపికలు
NOTE: కొలనిలోని మును గోపికలు - ఈ గీతం బాగుంది ....అనగా నాకు నచ్చిందన్నమాట....రెండు గీతాల రికార్డింగు అది...సుమారు నాలుగో నిముషం దగ్గర నుంచి ఈ "కొలనిలోని మును గోపికలు" గీతం మొదలవుతుంది...

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తి రంజని లంకె నొక్కి  వినొచ్చు!


భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, May 1, 2011

ఆరె మరాఠీల చరిత్ర - చిందు యక్షగానం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

శ్రీ గడ్డం ముత్తులింగ & బృందం
చిందు యక్షగానం
ఆరె మరాఠీల చరిత్ర
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 1, 2011
ఆడియో రికార్డ్ సౌజన్యం: మాగంటి వంశీ


ఈ చిందు యక్షగానం ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత జానపద కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ


PS:

A) ఆచార్య పేర్వారం జగన్నాధం గారు ఆరె జానపద గేయాల గురించి పరిశోధన చేసినట్టు గుర్తు...ఆ పుస్తకంలో బోల్డంత సమాచారం ఉన్నది.... ఆరె భాష మరాఠీ జన్యమనీ, కొన్ని వందల సంవత్సరాల నుండి తెలంగాణా ప్రాంతలో ఊపిరులూదుకుంటూ నిలుస్తోందని ఆయన చెబుతారు....ఐతే ఆ భాషకు లిపి లేనందున వారి గేయాలు తెలుగు లిపిలోనే రాసుకున్నానని ఆచార్య పేర్వారం గారు వివరించినట్టు గుర్తు...

B) హరికథల్లోనూ, ఇతర శ్రవ్యప్రధాన కళల్లోనూ - ముగించే ముందు వినపడే "పవమాన సుతుడు" బిట్టు ఈ చిందు యక్షగానంలో విని కొద్దిగా ఆశ్చర్యపోయా....

ఎందుకా?

ఇంతకు ముందు నేను విన్న, పదిహేనేళ్ళ క్రితం వరంగల్లులో చూసిన యక్షగానంలోనూ, ఆ తర్వాతి సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా కడెం ఊరు దగ్గర శ్రీనివాసులు & బృందం వారు ఇచ్చిన యక్షగాన ప్రదర్శనలోనూ ఈ పవమాన సుతుడు బిట్టు విన్నట్టు గుర్తు లేదు....:)