Thursday, April 28, 2011

కాఫీ అవసరం లేకుండా కిక్కెక్కి పోయింది!!

రెండు రోజుల క్రితం పొద్దున్న పూట ఒక ఈమెయిలు వచ్చిందండీ. ఎవరో అనానిమస్సు గారి నుంచి. సాధారణంగా ఈమెయిళ్ళలో తెలియని ఊరు పేరు చూస్తే, అందులో ఏముందో కూడా చూడకుండా - స్పాం లోకి నెట్టెయ్యటమో, ఏకంగా డిలీట్ చేసెయ్యటమో చేస్తా. అదే చేసా.....

ఏం చేసా?

డిలీట్ చేసా....

ఈరోజు పొద్దున్న అదే విచిత్రమైన పేరుతో మళ్ళీ వచ్చింది - ఈసారి సబ్జెక్టులో జావళి అని ఉండటంతో ఈమెయిలు తెరిచి చూసా....ఇతర వివరాలేమాత్రం లేకుండా ఒక ఎం.పి.3 అటాచుమెంటు ఉన్నది....

సందేహ పడుతూనే స్కాన్ చేసి, ఓపెను చేసా.

చెవుల తుప్పు వదిలిపోయింది.

వోలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం.

కాఫీ అవసరం లేకుండా కిక్కెక్కి పోయింది... ఒక్కటే మాట - అద్భుతం

అలా నాలుగు నిముషాలు తన్మయత్వంలో మునిగిపోయా! కొద్దిగా ఆ తన్మయత్వం నుంచి తేరుకున్నాక, సద్దుకోటం అయిపోయాక ఆ అనానిమస్సు గారికి బోల్డు నమస్కారాలతో ఈమెయిలు కొట్టా.....వేంటనే తిరిగొచ్చింది! అక్కవుంటు నాట్ ఫవుండ్ అని....అల్లా ఎల్లాగయ్యిందో అర్థం కాలా కానీ....ఆయనకో / ఆవిడకో హృదయ పూర్వక నమస్కారాలు సభా ముఖంగా అర్పించేసుకుంటున్నా.....

ఈ క్రింది జావళి గురించి ఇతర వివరాలు తెలిసిన వారు పంచుకోండి బాబో! మీకో లక్ష దణ్ణాలు...నెట్టులో వెతికితే ఆయనెవరో ధర్మవరపు సుబ్బరాయార్యుల వారి జావళి అని ఉన్నది....ఆ సుబ్బరాయార్యుల గారి గురించి కూడా తెలిస్తే కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోండి...

"చెలి నేనెట్లు సహింతునే...." - జావళి

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "శాస్త్రీయ సంగీతం ఆడియో " లంకె నొక్కి, ఆ తర్వాత వోలేటి వారి పాటల గ్రూపులో చివరి లంకె  నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ


PS: Here are the Lyrics of the song from rasikas.org

*****************************************

#7 - Lakshman says -

» 25 Jan 2009 23:35
Here is the text of celinEnETlu. There is no mudra of Subbaraya Iyer.

celi nEneTlu (jAvaLi). rAgA: paraju. Adi tALA.

P: celi nEnetlu sahintunE alavAni nentO varNintunE
C1: manOhArakAruDE ghana vinOda AdhIruDE pagadAniNTilO jEraDE
2: javvana rADAyane manci puvvulu inkElanE soga sevvAru jUcedarE
3: cEDErO cAmindruDE krpa cUDAmaNI candruDE cevi nEDaina rADAyene
 ************************************

Very interesting that he almost says that THIS IS NOT subbaraya iyer's song...With my limited knowledge - I will not know it, unless some esteemed and educated people say something about it....Thanks in Advance Sirs....

3 comments:

 1. వంశీ గారు,

  మీ ప్రశ్నలకు - చాలవరకు - సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.

  జావళీలు - స్వరసహితము
  N.C. పార్థసారథి, N.C. ద్వారక పార్థసారథి
  ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి, హైదరాబాదు, 1980

  The book also gives brief biographies of the జావళి writers - with complete lyrics AND
  notation.

  పై పుస్తకంలో రెండు చరణాలే ఇవ్వబడ్డాయి. మూడవది లేదు. అలాగే పాఠంలో తేడాలున్నాయి.

  15వ మేళమగు మాయమాళవగౌళ రాగజన్యము. ఫరజ్ రాగము - మద్యాదితాళము

  ప. చెలి నేనెట్లు సహింతునే అలవానితో వర్ణింతునే
  చ. మనోరధకారుడే ఘన వినోదక ధీరుడే
  పగదానింటిలో జేరడే
  చ. జవ్వని రాడాయనే మంచి
  పువ్వులు ఇంకేలనే సొగసెవ్వరు జూచెదరే

  Some general comments:
  1. Voleti gaaru used to sing it in his concerts.
  2. I also do NOT believe that its a composition of Dharmapuri Subbaraya Iyer. His "mudra" is clearly missing. In fact, the above book says that the composer is unknown.
  3. Dharmapuri was a prominent, popular figure in Carnatic music circles of early 20th century. There is good amount of published data on him.

  More questions? Please feel free to ask :-).

  Regards,
  Sreenivas

  ReplyDelete
 2. Sreenivas gaaru

  Thanks for the info and the book details. As always thanks for the help.

  Just a note - Dr KB Gopalam gaaru thinks that the author must be Dharmapuri Subbaraya Sastry. And I am very excited to know that he has many versions of the audio.

  Since I first heard this jaavaLi in Sri Voleti's voice yesterday, based on my taste and my liking of the master's voice - I know that it will be the best rendition for a long time to come

  Regards
  Vamsi

  ReplyDelete
 3. re: many versions of this jaavaLi, a plenty of them can be heard on-line, both instrumental and vocal: Nityasree, DK Pattammal, Trisur Ramachandran, Sikkil Sisters, A.Kanyakumari, and so on. But I am more interested in seeing Sri Gopalam's arguments in favour of Dharmapauri being the author. I personally do not one single jaavaLi from him without his "mudra" at the end of the composition. Secondly he is from relatively recent times, and was closely associated with Veena Dhanammal (whom about we know a lot more), who popularized his works through her legendary "Friday house concerts".

  Anyway, I'll wait for others feedback.

  Regards,
  Sreenivas

  ReplyDelete