Wednesday, April 27, 2011

బాపు గారి తమ్ముడు శంకరనారాయణ - చర్చా కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

బాపు గారు - ఆంధ్రదేశం గర్వించతగ్గ చిత్రకారులు, ప్రముఖులు. ఓ మహావృక్షం నీడలో పెరగటానికి ప్రయత్నించి సఫలం అయిన ఓ చిన్న వృక్షం - ఎవరో కాదు ఆయన తమ్ముడే శంకర నారాయణ. ఆయనతో చర్చా కార్యక్రమం ప్రసారం చేసింది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం. పూర్తి కార్యక్రమం రికార్డు చెయ్యటానికి సహకరించని రికార్డరు మూలాన సుమారు మూడు నిముషాల చర్చ ఆకాశంలో కలిసిపోయింది. క్షంతవ్యుడిని...

ప్రసార తేదీ : 27 April 2011
పాల్గొన్నవారు: నారాయణ గారు, ??? (తెలియదు) 


ఇక శంకరనారాయణ గారిని పక్కనబెడితే , బాపు గారి గురించి ఇక్కడ ఓ మాట చెప్పాలనిపించి - A real, critical analysis of Bapu gaaru is missing in Telugu press. I am looking for the day when someone can critically evaluate Bapu (and Ramana) gaarlu.

ఈ పాయింటు మీద వీరాభిమానులూ - కొద్దిగా సంయమనం కోల్పోకుండా, ఆ తర్వాత నాచేత ఏదేదో అనిపించకుండా మీ మీ అభిప్రాయాలు రాయండి వీలు చేసుకుని, చూసుకుని

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

4 comments:

  1. పరిచయకర్త శ్రీ సుమనస్పతిరెడ్డి

    శ్రీ శంకరనారాయణ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు (1995)

    The Hindu news item :
    http://www.hindu.com/2011/02/26/stories/2011022657750200.htm

    see also :
    http://www.bapubomma.com/cricket-players1.htm

    ReplyDelete
  2. Thanks for posting this.
    చాలారోజుల తరువాత కూడలి తెరిచాను. ఇప్పుడు మీ బ్లాగు లో టపాలు వరుసగా చూస్తున్నా అనమాట. కనుక, స్పాం లా వ్యాఖ్యలు వస్తే క్షమించగలరు.

    ReplyDelete