Sunday, April 24, 2011

మొన్న పేపర్లిచ్చాడా? ఇవ్వాళ గుడ్లిచ్చాడు....!!

మొన్న పేపర్లిచ్చాడా? ఇవ్వాళ గుడ్లిచ్చాడు....

గుడ్లతో ఏం చేసానా? ఇదిగో...ఇదీ చేసింది...







ఎలా చేసానా?

నాన్న, ముందు గుడ్డు కింద చిన్న చిల్లు పెట్టి, యెల్లోగా ఉన్న కోడిపిల్లను తీసేసాడు....

తర్వాత లోపలంతా నీళ్లతో కడిగి , లోపలా బయటా అంతా తుడిచేసి ఓ గుడ్డుకు కళ్లు ముక్కు పెట్టి చూపించాడు...అలా చూడగానే తర్వాత మూడు బొమ్మలు నేనే చేసేసా....

నాన్న చేసిన బొమ్మ ఇదే.... రెండు కాటన్ బాల్సు తీసుకుని, నాన్న గీసిన బొమ్మ గుడ్డుకు నెత్తి మీద అతికించమన్నాడు...అదే ఇది....










నల్లగా ఉండేట్టు ఓ విచ్ బొమ్మ గుడ్డు మీద గీసా...దానికి నాన్న నల్లగా ఉన్న కాటన్ బాల్స్ తీసుకుని, నా చేత ఆ కాటన్ బాల్స్ని పచ్చడి చేయించి - అదే బూర బూరగా తీయించేసి, గ్లూ పూయించేసి అతకపెట్టించాడు....అదే ఇది...




చివరికి ఓ కార్డుబోర్డు తీసుకుని దాని మీద చిన్న చిన్నగా, గుండ్రం గుండ్రంగా గ్లూ అంటించమన్నాడు. తర్వాత గ్లూ అయిపోయిన స్పార్క్లీ గ్లూ పెన్నులు తీసుకుని గుడ్డు బొమ్మలు వాటీ మీద నుంచోపెట్టేసి కార్డుబోర్డు మీద ఇలా అంటించేసా....




అయినా ఇవాళ్టితో శలవలు అయిపోయినాయి....రేపటినుంచి మళ్లీ స్కూల్......యెయ్...

4 comments:

  1. $వైష్ణవీ
    గుడ్డుతో అట్టే కాదన్నమాట!...ఎంచక్కా బొమ్మీలు కూడా చేయోచ్చన్నమాట! బావున్నాయి.. నీ గుడ్డ్డు బొమ్మ వెరీ గుడ్డూ. :) నాకు 1,3,5 గుడ్డుబొమ్మలు మాహాగుడ్డు. :))

    ReplyDelete
  2. వైష్ణవీ అమ్ములు, పేర్లెమిటి బొమ్మలకి? వంకాయరంగు జుట్టు బొమ్మ నాకిస్తావా? లేదా ఇంచక్క జుంకీలు పెట్టిన బొమ్మైనా సరే. విచ్ వద్దు - నాకు భయం. ;) సో, సెలవులన్నీ ఫన్ గా అయ్యాయా? అన్నట్టు ఈసారి కార్న్ కొని - ఆ పొత్తులు అమ్మకి ఇవ్వు (వడలు చెయ్యమని), వాటికి వచ్చే పీచు నీక్కావాల్సిన రంగులద్ది గుడ్డుకి అంటిస్తే పోనీలు కూడా వెయ్యొచ్చు. నా దగ్గరకి వస్తే ఇంకొన్ని నేర్పిస్తా... :) గుడ్ జాబ్!

    ReplyDelete
  3. @రాజేష్ - అవును అట్టు నేనేసుకు తినేసా....పెంకులు మిగిల్చా.... :) ఏమిటీ? బ్రాహ్మలయ్యుండి గుడ్డు తింటారా? అవును గుడ్డొక్కటే తింటా! ఆరోగ్యరీత్యా డాక్టరు సలహా మీద అలవాటు చేసుకోవాల్సి వచ్చింది!.....ఇప్పుడు పెంకులూ ఉపయోగపడ్డాయి....బొమ్మలకి....

    @ భరద్వాజ్ - :)

    @ ఉష - విచ్ పేరు పిప్ లుప్ అట, రెండు పిలకల గుడ్డు పేరు చిం చార్ అట, వంకాయ రంగు జుట్టు బొమ్మ పేరు లిల్లీ అట, చెవుల వంకీల బొమ్మ పేరు గ్లాసియోన్ అట....నేనేదో సుబ్బరంగా మారీచ, సుబాహు ఇల్లా పోతూ ఉంటే ఆవిడకు నచ్చలా....మీరిచ్చిన మొక్క జొన్న పొత్తుల సలహా బ్రహ్మాండం....వచ్చేసారి చేయిస్తా....కుదరకపోతే మీ దగ్గరికే పంపించేస్తా, చిన్నమ్మిని పొత్తులతో పాక్ చేయించి... :)

    ReplyDelete