Wednesday, April 20, 2011

లిటరరీ భోజన హోటల్ - బాలల సాహిత్యం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

లిటరరీ భోజన హోటల్
ప్రతి మంగళవారం ఉదయతరంగిణి కార్యక్రమంలో
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 19, 2011

వ్యాఖ్యాత: పైడి తరేష్ బాబు
వంటకం: పిల్లలకే నా హృదయం అంకితం
వంటవాడు: సుహోం లిన్ స్కీ
(పూర్తి పేరు - వాసిలీ సుహోం లిన్ స్కీ )
ప్రచురించిన సంవత్సరం: 1974
తెలుగు అనువాదం: ఆర్.వి.ఆర్  (1983)
పబ్లిషర్స్: ప్రగతి ప్రచురణాలయం

సౌజన్యం: మాగంటి వంశీ

బాలల సాహిత్యం అంటే అందరికీ ఇష్టమే, అయితే ఆ బాలలు తమ బాల్యాన్ని నిజంగా అనుభవిస్తున్నారా అన్న ప్రశ్నకు వస్తే - ఆ అద్భుతమైన బాల్యాన్ని రష్యన్ బాలలు నిజంగానే అనుభవించే విధానాన్నీ, ఒక రష్యన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన సుహోం లిన్ స్కీ మూడు అంశాలతో నిర్మించిన బోధనా పద్ధతినీ వివరించే పుస్తకం ఇది. యూరప్ ఖండం అంతా ఆశ్చర్యపోయిందిట ఈ బోధనా పద్ధతిని చూసి. ఆశ్చర్యపోయాకా, ఆ పద్ధతుల వల్ల పిల్లలు పొందిన లాభాలు చూసిన తరువాత మెల్ల మెల్లగా తమ తమ స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టారట ఆ అంశాలను, పద్ధతులను......

ఆ పుస్తకం గురించి లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి కార్యక్రమంలో వివరించినవారు పైడి తరేష్ బాబు...

ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం

ఎక్కడ వినవచ్చా?


ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!


భవదీయుడు
మాగంటి వంశీ

3 comments:

 1. "పిల్లల్ని పిల్లలు గా ప్రేమించాడు." "...పిల్లల మొఖాల్లో వెల్లివిరిసిన సందేహాల ఇంద్రధనుస్సులని స్పష్టంగా చదివాడు." ఎంత ఉత్తమ ఉపాధ్యాయుడో సుహోం లిన్ స్కీ. ఈ వంటకం నేను రుచి చూడాలి, మరిందరికి వడ్డించాలి ఆమ్టే పుస్తకం నేను చదవాలి/చదివించాలి అని గట్టిగా అనేసుకున్నాను - అలాగే ప్రతి మంగళవారం మాగంటి సైట్ తెరవాలి అనీను. మీ అభిరుచికి అభినందనలు, ప్రసారాలు ఇస్తున్నవారికి కృతజ్ఞతలు. మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉందో వింటుంటే.

  చెప్పేది 2 గంటలే అయినా నా తెలుగుబడి కి నేను వాడే పద్దతి అదే - ఆడుతూ పాడుతూ కథలు చెప్పుకుంటూ కలిసి ప్రయాణించటం. ఇక్కడ బడుల్లో పద్దతి స్నేహపూరిత వాతావరణమే. ఇంకా మన ప్రాంతాల్లో చాలా మారాలి - మొన్న అమలాపురంలో ఒక బడి శిక్షాపరంపర చూసి హడలుకున్నాను.

  ***** ఇక ఇది రెండుసార్లు ఈ ప్రసారం వినగా సాగిన ఆలోచన
  విన్నవరకూ ఎక్కడా జన వ్యతిరేకత ఆయన అనుభవంలోకి వచ్చినట్లుగా లేదండీ. కానీ అర్థ శతాబ్దం క్రితం ఆయన పద్దతి వెనువెంటనే ఆహ్వానించారా అని ఆశ్చర్యా పడ్డాను. దీనికిగల కారణాలు రెండు.

  1994 ప్రాంతాల్లో హైదరాబాదులో ఒక పాఠశాలకి వెళ్ళాను - వికాసభారతి పాఠశాల. అచ్చంగా ఆయన చేసిన పద్దతులే అక్కడ కనిపించేవి. అలికి ముగ్గులు పెట్టిన వాకిళ్ళు, ఉప్పుతో మొదలుకుని ప్రతీదీ వారు స్పర్శించి, రుచి చూస్తూ విజ్ఞానం సంపాదించటం, మొక్కల పెంపకం, ఆటపాటలకి సమపీఠం ఇలా ఎన్నో ప్రయోగాత్మక పద్దతులు చూసి చాలా ఆనందించాను, కానీ ఆదరణ విషయమై మరి అప్పట్లో అంత ప్రాచుర్యం లేదు దానికి. ఇప్పుడు తెలియదు.

  మా సమీప బంధువు ఒకరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యులు. ఆయన చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. పిల్లలకి వారి జ్ఞాసముపార్జన, పరిసరాల పరిశుభ్రత, ఫండ్స్ మీద హక్కులు, ఇతరత్రా విషయాల పట్ల అవగాహన కి తపన పడే మనిషి. ఈ మద్యన ఒక మారుమూల పల్లెకి కావాలని బదిలీతో వెళ్ళారు, ఆయనకి వచ్చిన వ్యరీరేకత అంతా ఇంతా కాదు గ్రామపెద్దలు, ఆఖరుకి మధ్యాహ్న భోజన తయారీ వంటవారి నుంచీను. మార్పుకి సత్వరం అలవడని, ప్రతిదాన్ని లాభదాయక దృష్టితోనే చూసే సమాజాన్ని ఒక్కరొక్కరుగా ఎదురుకోలేరేమో!

  -----
  చివరి నిమిషం మినహా మొదటి ఎనిమిదీ కాస్త లోగొంతుకగా వచ్చి చిన్న ఇబ్బంది పాలయ్యాను. :(

  ReplyDelete
 2. జనవ్యతిరేకత, మార్పువ్యతిరేకత మన రక్తంలో ఉంది కదండీ! ఆశ్చర్యమేముంది? ఉపయోగాల కోసం ఆలోచించే తీరికెక్కడుంది?

  అయితే ఇంత ఆలోచించి, అంత బుర్ర బద్దలు కొట్టుకుని ఇక్కడా, యూరపు ఖండాల్లో ఇన్ని పద్ధతులు, ప్రణాలికలతో విద్యను అభివృద్ధి చేద్దామని ఆశపడి స్కూళ్లలో ఓ హడావిడి చేస్తూ ఉంటే వాళ్ల జనాలే వాళ్లకు మొండి చెయ్యి చూపిస్తున్నారు...ఫలితం అన్నది శేష ప్రశ్నే! అయితే ఒహటి - ఆ ఆలోచనలవల్ల విద్యా వ్యవస్థ బాగుపడ్డది...ఉపయోగించుకోవలసిన వారు మాత్రం బాగుపడలా.... ఇతర దేశాల విద్యార్థులు బాగు పడుతున్నారు, ముఖ్యంగా మనవాళ్లు, చైనా వాళ్లు..... ఢక్కా మొక్కీలు తిని వచ్చిన మనవారికి ఇక్కడి చదువులు నల్లేరు మీద ఉరుకులే! ఆ ఢక్క బద్దలు కొట్టిన రక్తం వొంట్లో ఇంకిపోయి , కొండొకచో మరిగిపోతూ ఉండటం వల్లే మన వీరుల - వీరనారీమణుల, వీరపుత్రులు పుత్రికలు ఇక్కడి చదువుల్లో బంగారం....ఆ రకమైన మార్పు మన దగ్గర ఆశించడం భంగానికే తప్ప దేనికీ పనికి రాదు....

  ------------
  లోగొంతులతో కొంచెం కష్టమే కానీ, సద్దుకుపోవాల్సిందే ! వేరే దారి లేదు నా వద్ద... :)

  ReplyDelete
 3. మా ఊళ్ళో Literature Cafe అని ఒకటుంది. మీ టపా టైటిల్ చూడగానే, అది గుర్తొచ్చింది :))

  ReplyDelete