Tuesday, April 19, 2011

పద్మవ్యూహం హరికథాగానం - ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ

ఇమ్మాని వెంకటేశ్వర భాగవతార్ గారిచే పద్మవ్యూహం హరికథాగానం
ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ
ప్రసార తేదీ: తెలియదు

పద్మవ్యూహం అనగానే అభిమన్యుడు గుర్తుకొస్తాడు. వ్యూహం రచించిన ద్రోణాచార్యులవారు గుర్తుకొస్తారు. అయితే ఆ వ్యూహం వివరాలు - అనగా

  • ఆ పద్మ దళాలు ఎన్ని? 
  • ఆ దళాలకు అధిపతులు ఎవరు? 
  • అభిమన్యుడు ఆ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాడు? 
  • ప్రవేశించాక ఎలా ఎంతమందిని చంపాడు? 
  • చివరకు ఎవరెవరు అభిమన్యుడిని ఎలా నిరాయుధుడిని చేసారు? 
  • ఎలా నిర్జించారు? 

అన్న సందేహాలు పొడసూపేవారికి ఈ హరికథే సమాధానం.

ఆడియో ఎక్కడ వినవచ్చా? మామూలే - వెబ్సైటుకు వెళ్ళి , ఆకాశవాణి కార్యక్రమాలు లంకె నొక్కి, హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!

సుమారు 53 నిముషాల హరికథ ఇది...

ఇహ ఆనందో బ్రహ్మ

7 comments:

  1. Bhaskar garu,

    It's here: http://www.maganti.org/newgen/index1.html

    Vamsi garu: always better to provide link as there will be new visitors.

    Thanks & Regards,
    Jawahar

    ReplyDelete
  2. ఏంటి వంశీ గారూ ఆ వెబ్సైట్ మీదే??? తపాల బిళ్ళలే అనుకుంటే ఇది కూడానా? చాలా మంచి సేకరణ.

    ReplyDelete
  3. @భారారె - ఏమిటా కొచ్చెను? ఎన్నేళ్ళనుంచి నాకు మీరు, మీరు నాకు తెలుసు? చదవేస్తే ఉన్నదేదో పోయిందిట.... :)

    అల్లా నిఘంటువులో, సెర్చిలో పడిపోయి చివరాఖరికి ఇలాగొచ్చిందన్నమాట.... మాయ....జగన్నాథ మాయ...!

    @జవహర్ గారు - అవును లింకులిచ్చే పరిస్థితి పోలా ఇంకా! :) That aside - మీకు రేపొక ఈమెయిలు పంపిస్తాను ....వివరాలు అందులోనే!

    ReplyDelete
  4. రానారె కూడా కడప కేంద్రం కోసం నాటకమేదో రాసినట్టు గుర్తు. సరేలెండి.

    ఈ వారాంతం మీ సైటు తూట్లుపడేలా చేద్దామని పథకం వేశాను. చూద్దాం. నిన్న రాత్రి చిట్టిబాబు, మంచాల జగన్నాథరావు గారి వీణ విన్నాను. చిట్టిబాబు వీణ విన్న తర్వాత ఆ అవకాశం కల్పించినందుకు మీకు సాష్టాంగ..ఎందుకు లెండి. క్లుప్తంగా ధన్యవాదాలు చెప్పి ఊర్కుంటాను.

    ReplyDelete
  5. విన్నానండి. అద్భుతం అన్నమాట కూడా పేలవంగా ఉంది. చివర్లో హరికథకుల కంఠం బొంగురువోయింది!

    ReplyDelete
  6. రవి - మీ సాష్టాంగాలన్నీ ఆయా ఆడియోలు అందించిన మహానుభావులకే! నేను చేసిందేమీ లేదు....ఇక హరికథకు వస్తే, అవును ఆయన గొంతు చివరలో బొంగురు పోయింది...చాలా బాగా చెప్పుకొచ్చారు కథ...రేడియో ప్రసారాల్లో ఉండే సమయాభావం వల్ల, ఆయన - కథ చివరకు వచ్చేసరికి వ్యూహానికి న్యాయం చెయ్యగలిగినా, అభిమన్యుడి విషయంలో న్యాయం చెయ్యలేకపోయారనిపించింది....ఇదే ఆరుబయట ప్రోగ్రామనుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉండేది....

    ReplyDelete