Monday, April 11, 2011

అలా తాదాత్మ్యంలో మునిగిపోయానండీ! జయహో ఆకాశవాణి !!

ఆకాశవాణి వారి భక్తి రంజని గీతం -
"సర్వమంగళాధవ శివ శంభో శంభో"
శ్రీ కందాళ జగన్నాధం గారి స్వర కల్పనలో


ఎక్కడ వినొచ్చా?


ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాకఎడమవైపున ఉన్న "ఆకాశవాణి శ్రవ్యతరంగాలు " లింకు నొక్కి వినవచ్చు

పరుచూరి శ్రీనివాస్ గారు కనుక్కుని చెపుతానన్నారు కానీ, నా ఆత్రం కొద్దీ, కక్కుర్తి పడి సభికులను కూడా అడుగుతున్నా!

ఎవరికైనా ఈ భక్తి గీతం పాడిన వారి పేర్లు తెలుసా?

రేడియోలో కుదరదూ, సమయము అనుమతించదు, రేడియో కార్యక్రమాలు చేసినవాడిగా ఆ సంగతి తెలిసినా - ఈ మాట అనాలనిపించింది...ఆకాశవాణి వారికి క్షమాపణలతో ....    
" ఈ ఆకాశవాణి వారొహరు! పాడిన వారి వివరాలు కూడా చెపితే ఆ కళాకారులకు ఎంత న్యాయం చేసినవారవ్వచ్చోనని!"

వారి గొంతుల్లో అసలా పాట వింటూంటే నన్ను నేనే మరచిపోయా! పైగా శివయ్య మీద అనేటప్పటికి ఇంకా పూనకం వచ్చేసి, రెండో చరణానికి వచ్చేటప్పటికి పూర్తిగా తాదాత్మ్యంలో మునిగిపోయా! ఆహా! ఎంతటి అదృష్టవంతులో - ఆ భగవంతుడు అలాటి స్వరం వారికి ప్రసాదించినందుకు!

ఏదేమైనా అద్భుతమైన ఆణిముత్యాన్ని అందించిన  చొప్పకట్ల సంతోష్ గారికి బోలెడు ధన్యవాదాలతో


భవదీయుడు
మాగంటి వంశీPS: UPDATED The post 

కావలసిన వారికోసం సాహిత్యం ఇదిగో ఇక్కడ..తప్పులుండొచ్చు, పెద్ద మనసుతో క్షమించేసి తప్పు దిద్దిన వాళ్ళను ఆ శివయ్య ఆశీర్వదించేస్తాడని నా ఘాట్టి నమ్మకం
(3.04 PM PST)


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశ భవహర శంభో శంభో
సకలైశ్వర్యప్రదదేవ శంభో శంభో
శకటాసురహరసఖ మహదేవ శంభో శంభో
సకలైశ్వర్యప్రదదేవ శంభో శంభో
శకటాసురహరసఖ మహదేవ శంభో శంభో
సరసీరుహసఖశశికళనాంబక శంభో శంభో
హరహరపాలక కపాలధరభవ శంభో శంభో
సరసీరుహసఖశశికళనాంబక శంభో శంభో
హరహరపాలక కపాలధరభవ శంభో శంభో


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో


సగుణోపాసకజనచయకులభ శంభో శంభో
జగదుదయేస్థితిసంహారకర శంభో శంభో
సగుణోపాసకజనచయకులభ శంభో శంభో
జగదుదయేస్థితిసంహారకర శంభో శంభో
చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో శంభో
చంద్రఛ్ఛవిలేచితవృషవాహన శంభో శంభో
చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో శంభో
చంద్రఛ్ఛవిలేచితవృషవాహన శంభో శంభో
చరణాగతజనరక్షకనియమా శంభో శంభో
చరసంభుతనిభసుందరదేహా శంభో శంభో
చరణాగతజనరక్షకనియమా శంభో శంభో
చరసంభుతనిభసుందరదేహా శంభో శంభో


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభోతామజచర్మవిభాజితచేల శంభో శంభో
కామజదనుజాపురవాశూల శంభో శంభో
తామజచర్మవిభాజితచేల శంభో శంభో
కామజదనుజాపురవాశూల శంభో శంభో
సలలితనాగవిభూషణపురహర శంభో శంభో
నళినవిభాసశిరోపరిభాగా శంభో శంభో
సలలితనాగవిభూషణపురహర శంభో శంభో
నళినవిభాసశిరోపరిభాగా శంభో శంభో
సదమలభక్తవశీకృతహృదయా శంభో శంభో
సదయావిరహితరితిసుతవిలయా శంభో శంభో
సదమలభక్తవశీకృతహృదయా శంభో శంభో
సదయావిరహితరితిసుతవిలయా శంభో శంభో


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభోజలజాదేక్షణ పూజితచరణా శంభో శంభో
జలనిధిభవ హాలాహలభక్షణ శంభో శంభో
జలజాదేక్షణ పూజితచరణా శంభో శంభో
జలనిధిభవ హాలాహలభక్షణ శంభో శంభో
గౌరిగణేశ్వరతపనోమాన్విత శంభో శంభో
తారకసంభవజగన్నాథనుత శంభో శంభో
గౌరిగణేశ్వరతపనోమాన్విత శంభో శంభో
తారకసంభవజగన్నాథనుత శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో

4 comments:

 1. Jawahar gaaru

  You are more than welcome to send the sUryAshTakam mp3 if you have it. Pls send it to contact@maganti.org and I will update it in a day or two...

  Thanks
  Vamsi

  ReplyDelete
 2. గాయని స్వరం చాలా బావుందండి. నా భక్తిరంజని పరిజ్ఞానం మీరడిగిన వివరం తెలుపటానికి చాలదు కానీ, ఈ గీతం మా అమ్మాయికి నేర్పించే ప్రయత్నం లో పడ్డాను. రేడియో అభిమాని బ్లాగరి శివ గారు చెప్పగలరేమో అనుకున్నాను. వారి బ్లాగుని బట్టి మీకు వారు పరిచితులేలేమ్మని ఊరుకున్నాను.

  ReplyDelete
 3. @ఉష - శుభం...మీ అమ్మాయి చేత పాడించి, రికార్డు చేసి మాకు వినిపించండి....కష్టమేమీ కాదు....శ్రీదేవి ఒక్క రోజులో నేర్చుకుని మా గుళ్ళో మొన్న పదిహేనో తారికున ఆ శివయ్య ప్రదోష పూజ సమయంలో పాడి మమ్మల్ని ధన్యం చేసింది......సంగీత కచేరిలు దాదాపు పదిహేనేళ్ళ క్రితమే మానేసినా, ఈ శివ కీర్తన వినగానే తనకు మళ్ళీ ఉత్సాహం పుట్టుకొచ్చింది....అంటే నేను కూడా ఓ తోపు తోసాననుకోండి...ఇంతకు ముందు అలా ఎన్నో తోపులు తోసినా పడలా....ఈ కీర్తనకు పడిపోయింది...

  ReplyDelete
 4. నాకు, దైవాలకీ కొన్ని యోజనాల దూరం కానీ, ఈ పాట మాత్రం వినేందుకు బాగుంది! అర్థం తెలుసుకునేంత తెలుగు నాకు వచ్చుంటే ఇంకా బాగుండేది.

  ReplyDelete