Thursday, April 7, 2011

మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసారమైన తేదీ - ఏప్రిల్ 7, 2011
సౌజన్యం - భవదీయుడు  (అనగా నేనేనన్నమాట !!)

ఆర్టిష్టు - శ్రీమతి దుర్గా భాస్కర్ (వీరు రిటైర్డు ఆకాశవాణి డైరెక్టరు)
ఫ్లూట్ - శ్రీ వి.నాగరాజు
వయొలిన్ - శ్రీ శ్రీధర్ కుమార్
కీబోర్డు - శ్రీ పి.ఫణికుమార్
తబల - శ్రీ ఎ.ప్రభాకర రావు
రిథంస్ - శ్రీ సత్యేంద్రనాథ్

పాటలు
 • వాణ్ణి నేనేమన్నన, వానయ్య సొమ్మేమన్న తిన్నన?
 • ఎల్లన్న, ఎల్లన్న, ఎల్లన్న
 • నాట్లు ఏసీ ఏసీ నడుమెల్లా నొచ్చే నొచ్చే
బ్రహ్మాండంగా ఉన్నాయి...


తప్పక వినాల్సిన కార్యక్రమం

________________________________________________

రెండో కార్యక్రమం:

జానపద, లలిత గీతాల / సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఆర్టిస్టులు - కె.బి.కె.మోహన రాజు, నిత్య సంతోషిణి
సౌజన్యం - భవదీయుడు  (అనగా నేనేనన్నమాట !!)

ఈ కార్యక్రమం నాకు పెద్దగా నచ్చలా కానీ, ఇతర సంగీత ప్రియులకు ఉపయోగపడుతుందేమో అన్న ఆలోచనతోనూ, ఆరుద్ర, దేవులపల్లి, దాశరథి మొదలైనవారు రచించిన గీతాలు ఉండటంతోనూ - సైటులో ప్రచురించటం జరిగింది. మొత్తం కార్యక్రమంలో దాశరథి గారి లలిత గీతం "కొసకొమ్మల రెప్పలలోన" ఒకటే కాస్త నాకు నచ్చింది.


______________________________________________________ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
మాగంటి వంశీ

7 comments:

 1. ekkado kanapadaledu...folk music vaanni nenemannana paata kaavaali

  ReplyDelete
 2. @డి.ఎన్.సి - మీ పేరు ఏదో కంపెనీ పేరులా ఉంది...కొంచెం ఓపిక చేసుకుని తీరిగ్గా మళ్ళీ ఓ సారి పోష్టు కింద నుంచి పైదాకా చదివి, అప్పుడు ఈ పోష్టులో ఇచ్చిన నీలం రంగు (అంటే బ్లూ కలరు) లింకు నొక్కి ఆ లింకుడు పేజీలో వెతకాలి...

  అన్నీ ఓ బటనో, లింకో నొక్కగానే కళ్ళ దగ్గరకు, చెవుల దగ్గరకు రావాలంటే ఎలా?..... :) ఊరకే అన్నాననుకునేరు.......అవును ఊరకే అన్నా!

  ఆ నీలం రంగు లింకు నొక్కారు....ఎడమ వైపున ఉన్న ఆ పరిచయాలు - నాటికలు లింకు కూడా నొక్కారు...అప్పుడు కూడా మీక్కావలసింది ఆ పేజీలో ఇంకా కనపడకపోతే, కింద నుంచి లెక్కెట్టుకుంటూ రండి - 18 లింకులో శ్రీ బలదేవానంద్ సాగర్ గారి అమృతగళం / సంస్కృత వార్తల ప్రసారం బిట్ / ఢిల్లీ అని కనపడుతుంది....దాని పైనే ఉన్నాయి ఈ పోష్టులో చెప్పిన రెండు కార్యక్రమాలూనూ...

  ఇహ అప్పటికీ దొరక్కపోతే మీ అంత అదృష్టవంతుడు ఇంకొహరు ఉండరు.........:)

  ReplyDelete
 3. నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ లో కాస్త చెవి రిక్కించి వినాల్సివచ్చిందండి, గాయని గళాన్ని సహకారమిచ్చిన వాయిద్యగాళ్ళు కాస్త డామినేట్ చేశారనిపించింది. మరో మూడు నాలుగు సార్లు వింటేనే గానీ సాహిత్యం రాసుకోలేననిపించింది. బహుశా ఆవిడ గొంతు విన్న అలవాటు లేక కూడానేమో?

  జానపద, లలిత గీతాల / సంగీత కార్యక్రమం వరకూ నిత్యసంతోషిణి గొంతు పరిచితం కనుకా పాటతో పాటుగా పదాల్ని అనుసరించగలిగాను. నాకు దేవులపల్లివారి గీతం నచ్చింది. రెండో సారి వినాలి.

  పదిలపరుస్తున్నందుకు థాంక్స్!

  ReplyDelete
 4. ఉష గారు

  మీరన్నది నిజమే. అయితే తప్పు ఆల్ ఇండియా రేడియో వారిది కాదు....శ్రీమతి దుర్గా భాస్కర్ గారిదీ కాదు....మా నాన్నగారి వద్దనుంచి వచ్చిన మహాభారత కాల రికార్డింగు / కన్వర్టర్ డివైసులది. అవి మార్చి కొత్తవి తీసుకొచ్చి ప్రయత్నించాలి......

  ఆ రెండో కార్యక్రమం ఆడియోలో కూడా ఎక్కడో తేడా వచ్చినట్టుంది...అది మొత్తం 35 నిముషాల ప్రోగ్రాము...17 నిముషాలు మాత్రమే ప్లే అవుతోంది....సంగతి రేప్పొద్దున్న చూస్తా....

  పదిలపర్చేదేముంది లెండి.....మనకిష్టమైనవి, మనవద్దనున్నవి పంచుకోటమే.....పంచుకున్నాక ఆసక్తి కలిగినవారికెవరికైనా ఉపయోగపడితే అంతకన్నా సంతోషం లేదు....

  కొంత మంది సాయం లేకుండా అక్కడున్న ఆడియోలు అందరితో పంచుకోగలిగే వాడినీ కాను....కాబట్టి మీ థాంకులన్నీ వారికే....

  ReplyDelete
 5. Vamsi garu,

  Could you please tell me how you are listening to AIR stations here in USA? I have tried AIR Hyd. (first and last Telugu station broadcast with short wave frequencies) without success.

  Thanks & Regards,
  Jawahar

  ReplyDelete
 6. Jawahar gaaru

  Finally some one asked a good question, rather a right question. Glad to hear that people are still interested in listening to the good OLD radio. Here are couple links

  For regional news in telugu: http://www.newsonair.com/

  You have to choose the regional bulletin in the language bulletins section (drop down) and then click on the respective audio link. It delivers news from Vij and Hyd

  For Hyd channels:
  http://www.voicevibes.net/

  Dear friend Raj has hosted this site and it has been around for about 5 years I believe. For the past 3 years I have been listening - I only listen to the first three sections in this page. But FYI - there will be lots of interruptions like overlapping channels, double voices, sudden switches to other frequencies etc etc etc...And if you want to multi task on the computer while listening, it will crash the browser (70% of the time). If you are lucky and if interested and have patience, you will be able to grab the audios like I was able to, over time.... So good luck and keep listening to the radio.....

  ReplyDelete
 7. Vamsi gaaru,

  Thank you for the quick and positive response. I still remember those childhood days where wake up by AIR signature tune is a routine for me.

  By the way, i am from a village near Challapalli and done my intermediate at Srysp Jr College.

  Thanks & Regards,
  Jawahar

  ReplyDelete