Thursday, April 28, 2011

కాఫీ అవసరం లేకుండా కిక్కెక్కి పోయింది!!

రెండు రోజుల క్రితం పొద్దున్న పూట ఒక ఈమెయిలు వచ్చిందండీ. ఎవరో అనానిమస్సు గారి నుంచి. సాధారణంగా ఈమెయిళ్ళలో తెలియని ఊరు పేరు చూస్తే, అందులో ఏముందో కూడా చూడకుండా - స్పాం లోకి నెట్టెయ్యటమో, ఏకంగా డిలీట్ చేసెయ్యటమో చేస్తా. అదే చేసా.....

ఏం చేసా?

డిలీట్ చేసా....

ఈరోజు పొద్దున్న అదే విచిత్రమైన పేరుతో మళ్ళీ వచ్చింది - ఈసారి సబ్జెక్టులో జావళి అని ఉండటంతో ఈమెయిలు తెరిచి చూసా....ఇతర వివరాలేమాత్రం లేకుండా ఒక ఎం.పి.3 అటాచుమెంటు ఉన్నది....

సందేహ పడుతూనే స్కాన్ చేసి, ఓపెను చేసా.

చెవుల తుప్పు వదిలిపోయింది.

వోలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం.

కాఫీ అవసరం లేకుండా కిక్కెక్కి పోయింది... ఒక్కటే మాట - అద్భుతం

అలా నాలుగు నిముషాలు తన్మయత్వంలో మునిగిపోయా! కొద్దిగా ఆ తన్మయత్వం నుంచి తేరుకున్నాక, సద్దుకోటం అయిపోయాక ఆ అనానిమస్సు గారికి బోల్డు నమస్కారాలతో ఈమెయిలు కొట్టా.....వేంటనే తిరిగొచ్చింది! అక్కవుంటు నాట్ ఫవుండ్ అని....అల్లా ఎల్లాగయ్యిందో అర్థం కాలా కానీ....ఆయనకో / ఆవిడకో హృదయ పూర్వక నమస్కారాలు సభా ముఖంగా అర్పించేసుకుంటున్నా.....

ఈ క్రింది జావళి గురించి ఇతర వివరాలు తెలిసిన వారు పంచుకోండి బాబో! మీకో లక్ష దణ్ణాలు...నెట్టులో వెతికితే ఆయనెవరో ధర్మవరపు సుబ్బరాయార్యుల వారి జావళి అని ఉన్నది....ఆ సుబ్బరాయార్యుల గారి గురించి కూడా తెలిస్తే కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోండి...

"చెలి నేనెట్లు సహింతునే...." - జావళి

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "శాస్త్రీయ సంగీతం ఆడియో " లంకె నొక్కి, ఆ తర్వాత వోలేటి వారి పాటల గ్రూపులో చివరి లంకె  నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ


PS: Here are the Lyrics of the song from rasikas.org

*****************************************

#7 - Lakshman says -

» 25 Jan 2009 23:35
Here is the text of celinEnETlu. There is no mudra of Subbaraya Iyer.

celi nEneTlu (jAvaLi). rAgA: paraju. Adi tALA.

P: celi nEnetlu sahintunE alavAni nentO varNintunE
C1: manOhArakAruDE ghana vinOda AdhIruDE pagadAniNTilO jEraDE
2: javvana rADAyane manci puvvulu inkElanE soga sevvAru jUcedarE
3: cEDErO cAmindruDE krpa cUDAmaNI candruDE cevi nEDaina rADAyene
 ************************************

Very interesting that he almost says that THIS IS NOT subbaraya iyer's song...With my limited knowledge - I will not know it, unless some esteemed and educated people say something about it....Thanks in Advance Sirs....

ధృవాదేవి చంద్రగుప్తుడు - అఖిల భారత నాటకం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం

ధృవాదేవి - గుప్త సామ్రాజ్యానికి మహారాణి. జగజ్జేత సముద్ర గుప్తుని కుమారులు రెండవ చంద్రగుప్తుడు, రామగుప్తుడు.మొదట రామగుప్తుని భార్యగా గుప్త సామ్రాజ్యంలోకి ప్రవేశించిన ఈ రాణి, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల చంద్ర గుప్తుని భార్యగా మారి మహారాణి పగ్గాలు స్వీకరించింది. అతిపరాక్రమవంతుడు కుమార గుప్తుడి తల్లి.

విశాఖదత్తుడు తన రచనలు దేవీచంద్రగుప్తం, నాట్యదర్పణం మొదలైన వాటిలో ధృవాదేవి గురించి విస్తృతంగా రాసాడు.అత్యంత సౌందర్యవతి, చాలా తెలివిడి కల మనిషి అనీ, గుప్తుల కొలువులో కవులను పోషించిన ఘనత ఈమెకే చెందుతుందనీ విశాఖదత్తుని వర్ణన.

ఇహ కథలోకి వస్తే, క్లుప్తంగా  - శకరాజు గుప్తులమీదకు దండెత్తటానికి  సమాయత్తమవుతూ ధృవాదేవిని తన పరం చేస్తే యుద్ధం మానేస్తానని వర్తమానం పంపుతాడు. రామగుప్తుడు భయపడిపోయి, ధృవాదేవిని శకరాజు వద్దకు పంపించటానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రగుప్తుడు ఓ ఉపాయం ఆలోచించి, ధృవాదేవితో కలిసి మారువేషం వేసుకుని శకరాజు వద్దకు వెళ్ళి శకరాజుని అంతం చేస్తాడు.

ఆ తర్వాత తనను తాకట్టు పెట్టినందుకు ధృవాదేవి చేవలేని రామగుప్తుణ్ణి ప్రజల సమక్షంలో భర్తగా వదిలేసి చంద్రగుప్తుని వరిస్తుంది. ఆ తరువాత మనకు తెలిసిన కథే - చంద్రగుప్తుడు - విక్రమాదిత్యుడిగా వెలుగొందటం, విశాల సామ్రాజ్యం స్థాపించడం, చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజ్యపాలన చేసి గుప్త వంశానికే మకుటాయమానంగా నిలచిపోవటం... 

ఈ కథకు నాటిక రూపం కల్పించి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రసారం చేసింది.

ఆడియో రికార్డింగు సౌజన్యం: మాగంటి వంశీ


నిర్వహణ: శ్రీమతి రతన్ ప్రసాద్ (చిన్నక్క)
మూలం: హిందీ రంగస్థల రచన - శ్రీ జయశంకర్ ప్రసాద్
తెలుగుసేత: డాక్టర్ సరోజా నిర్మల
రేడియో అనుసరణ: శ్రీ సుదర్శన్ కుమార్
పర్యవేక్షణ - శ్రీ చావలి దేవదాస్
సహకారం: శ్రీ ప్రభాకర్ జాజుల

ఇందులో పాల్గొన్నవారు:
ధృవస్వామిణి: శ్రీమతి శిల్ప
మందాకిని: శ్రీమతి ఏ.పి.మైథిలి
రామగుప్తుడు: శ్రీ సుబ్బరాయ శర్మ ఉప్పులూరి
చంద్రగుప్తుడు:శ్రీ ఎస్.మనోహర్
శిఖరస్వామి: శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి
శకరాజు: శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్
కోమ: శ్రీమతి ఏ.కె.శ్రీదేవి
మిహిరకులుడు: శ్రీ బొర్రా నిరంజన రావు
పురోహితుడు: శ్రీ గణాశంకర్ పూజారి

నాటిక మొదటి 10 నిముషాలు రికార్డు చెయ్యలేకపోయినందుకు చింతిస్తూ...

సుమారు నలభై నిముషాల నిడివి కల ఈ నాటికను విని ఆనందించండి


ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, April 27, 2011

బాపు గారి తమ్ముడు శంకరనారాయణ - చర్చా కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

బాపు గారు - ఆంధ్రదేశం గర్వించతగ్గ చిత్రకారులు, ప్రముఖులు. ఓ మహావృక్షం నీడలో పెరగటానికి ప్రయత్నించి సఫలం అయిన ఓ చిన్న వృక్షం - ఎవరో కాదు ఆయన తమ్ముడే శంకర నారాయణ. ఆయనతో చర్చా కార్యక్రమం ప్రసారం చేసింది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం. పూర్తి కార్యక్రమం రికార్డు చెయ్యటానికి సహకరించని రికార్డరు మూలాన సుమారు మూడు నిముషాల చర్చ ఆకాశంలో కలిసిపోయింది. క్షంతవ్యుడిని...

ప్రసార తేదీ : 27 April 2011
పాల్గొన్నవారు: నారాయణ గారు, ??? (తెలియదు) 


ఇక శంకరనారాయణ గారిని పక్కనబెడితే , బాపు గారి గురించి ఇక్కడ ఓ మాట చెప్పాలనిపించి - A real, critical analysis of Bapu gaaru is missing in Telugu press. I am looking for the day when someone can critically evaluate Bapu (and Ramana) gaarlu.

ఈ పాయింటు మీద వీరాభిమానులూ - కొద్దిగా సంయమనం కోల్పోకుండా, ఆ తర్వాత నాచేత ఏదేదో అనిపించకుండా మీ మీ అభిప్రాయాలు రాయండి వీలు చేసుకుని, చూసుకుని

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత పరిచయాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, April 26, 2011

"ద్రౌపది మాన సంరక్షణ" - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి హరికథా గానం - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

పంచమ వేదమయిన మహాభారతంలోని ఒక ముఖ్య సంఘటన -

"ద్రౌపది మాన సంరక్షణ"

ఈ సంఘటన హరికథా రూపంలో ఆకాశవాణి శ్రోతలకు వివరించినది - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రిగారు

శ్రీ సచ్చిదానంద శాస్త్రి గారి గురించి ఆంధ్ర దేశ శ్రోతలకు వివరించాల్సిన పని లేదు.

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 26, 2011
సౌజన్యం: మాగంటి వంశీ

సుమారు గంట నిడివి కల ఈ హరికథా గానాన్ని విని ఆనందించండి...

ఆడియో ఎక్కడ వినవచ్చా? ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, April 25, 2011

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 24, 2011

ఆర్టిష్టు: మంగళంపల్లి స్వర్ణ

వయోలిన్: ఎం సూర్యదీప్తి
మృదంగం: పి.జయభాస్కర్

ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, April 24, 2011

మొన్న పేపర్లిచ్చాడా? ఇవ్వాళ గుడ్లిచ్చాడు....!!

మొన్న పేపర్లిచ్చాడా? ఇవ్వాళ గుడ్లిచ్చాడు....

గుడ్లతో ఏం చేసానా? ఇదిగో...ఇదీ చేసింది...ఎలా చేసానా?

నాన్న, ముందు గుడ్డు కింద చిన్న చిల్లు పెట్టి, యెల్లోగా ఉన్న కోడిపిల్లను తీసేసాడు....

తర్వాత లోపలంతా నీళ్లతో కడిగి , లోపలా బయటా అంతా తుడిచేసి ఓ గుడ్డుకు కళ్లు ముక్కు పెట్టి చూపించాడు...అలా చూడగానే తర్వాత మూడు బొమ్మలు నేనే చేసేసా....

నాన్న చేసిన బొమ్మ ఇదే.... రెండు కాటన్ బాల్సు తీసుకుని, నాన్న గీసిన బొమ్మ గుడ్డుకు నెత్తి మీద అతికించమన్నాడు...అదే ఇది....


నల్లగా ఉండేట్టు ఓ విచ్ బొమ్మ గుడ్డు మీద గీసా...దానికి నాన్న నల్లగా ఉన్న కాటన్ బాల్స్ తీసుకుని, నా చేత ఆ కాటన్ బాల్స్ని పచ్చడి చేయించి - అదే బూర బూరగా తీయించేసి, గ్లూ పూయించేసి అతకపెట్టించాడు....అదే ఇది...
చివరికి ఓ కార్డుబోర్డు తీసుకుని దాని మీద చిన్న చిన్నగా, గుండ్రం గుండ్రంగా గ్లూ అంటించమన్నాడు. తర్వాత గ్లూ అయిపోయిన స్పార్క్లీ గ్లూ పెన్నులు తీసుకుని గుడ్డు బొమ్మలు వాటీ మీద నుంచోపెట్టేసి కార్డుబోర్డు మీద ఇలా అంటించేసా....
అయినా ఇవాళ్టితో శలవలు అయిపోయినాయి....రేపటినుంచి మళ్లీ స్కూల్......యెయ్...

Thursday, April 21, 2011

బుర్ర తింటున్నానని పేపర్లిచ్చి......

స్ప్రింగు బ్రేకు అట.....మా స్కూలుకు ఓ వారం రోజులు శలవులిచ్చారు....బయటకెళ్ళటానికి లేకుండా ఈ దగ్గు జలుబు ఒహటి....ఇంట్లోనే ఉండటంతో నిన్న సాయంత్రం బుర్ర తింటున్నానని పేపర్లిచ్చి బొమ్మలు గియ్యమన్నాడు నాన్న....పేపరు నాకివ్వకముందే నల్ల బోర్డర్ గీసేసి ఇచ్చాడు.....వెంటనే డాక్టర్ సూస్ బొమ్మ గీసిపారేసా!

ఇంకో నాలుగు బొమ్మలు - ఎల్మో, బ్రూస్ షార్క్, పెంగ్విన్, లయన్ - గీసా కానీ అవి బాలేవన్నాడు నాన్న...

Wednesday, April 20, 2011

లిటరరీ భోజన హోటల్ - బాలల సాహిత్యం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

లిటరరీ భోజన హోటల్
ప్రతి మంగళవారం ఉదయతరంగిణి కార్యక్రమంలో
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 19, 2011

వ్యాఖ్యాత: పైడి తరేష్ బాబు
వంటకం: పిల్లలకే నా హృదయం అంకితం
వంటవాడు: సుహోం లిన్ స్కీ
(పూర్తి పేరు - వాసిలీ సుహోం లిన్ స్కీ )
ప్రచురించిన సంవత్సరం: 1974
తెలుగు అనువాదం: ఆర్.వి.ఆర్  (1983)
పబ్లిషర్స్: ప్రగతి ప్రచురణాలయం

సౌజన్యం: మాగంటి వంశీ

బాలల సాహిత్యం అంటే అందరికీ ఇష్టమే, అయితే ఆ బాలలు తమ బాల్యాన్ని నిజంగా అనుభవిస్తున్నారా అన్న ప్రశ్నకు వస్తే - ఆ అద్భుతమైన బాల్యాన్ని రష్యన్ బాలలు నిజంగానే అనుభవించే విధానాన్నీ, ఒక రష్యన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన సుహోం లిన్ స్కీ మూడు అంశాలతో నిర్మించిన బోధనా పద్ధతినీ వివరించే పుస్తకం ఇది. యూరప్ ఖండం అంతా ఆశ్చర్యపోయిందిట ఈ బోధనా పద్ధతిని చూసి. ఆశ్చర్యపోయాకా, ఆ పద్ధతుల వల్ల పిల్లలు పొందిన లాభాలు చూసిన తరువాత మెల్ల మెల్లగా తమ తమ స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టారట ఆ అంశాలను, పద్ధతులను......

ఆ పుస్తకం గురించి లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి కార్యక్రమంలో వివరించినవారు పైడి తరేష్ బాబు...

ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం

ఎక్కడ వినవచ్చా?


ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!


భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, April 19, 2011

పద్మవ్యూహం హరికథాగానం - ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ

ఇమ్మాని వెంకటేశ్వర భాగవతార్ గారిచే పద్మవ్యూహం హరికథాగానం
ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ
ప్రసార తేదీ: తెలియదు

పద్మవ్యూహం అనగానే అభిమన్యుడు గుర్తుకొస్తాడు. వ్యూహం రచించిన ద్రోణాచార్యులవారు గుర్తుకొస్తారు. అయితే ఆ వ్యూహం వివరాలు - అనగా

  • ఆ పద్మ దళాలు ఎన్ని? 
  • ఆ దళాలకు అధిపతులు ఎవరు? 
  • అభిమన్యుడు ఆ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాడు? 
  • ప్రవేశించాక ఎలా ఎంతమందిని చంపాడు? 
  • చివరకు ఎవరెవరు అభిమన్యుడిని ఎలా నిరాయుధుడిని చేసారు? 
  • ఎలా నిర్జించారు? 

అన్న సందేహాలు పొడసూపేవారికి ఈ హరికథే సమాధానం.

ఆడియో ఎక్కడ వినవచ్చా? మామూలే - వెబ్సైటుకు వెళ్ళి , ఆకాశవాణి కార్యక్రమాలు లంకె నొక్కి, హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!

సుమారు 53 నిముషాల హరికథ ఇది...

ఇహ ఆనందో బ్రహ్మ

Monday, April 18, 2011

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ - హైదరాబాదు ఆకాశవాణి కేంద్ర ప్రసారం

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ
హైదరాబాదు ఆకాశవాణి కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 18, 2011
రచన: హరి నాగభూషణం
వయోలిన్ : పి.పూర్ణచందర్
మృదంగం: కాపా శ్రీనివాసరావు

"నీ మహిమలు పొగడతరమా"
కళాకారిణులు: డి.వర్ధని/కె.శేషులత
రాగం: భైరవి


"ఎవరినాశ్రయించెదరా"
కళాకారిణులు: డి.వర్ధని/కె.శేషులత
రాగం: హైమవతి
తాళం: రూపకం


"సమయము గాదా"
కళాకారిణి: డి.వర్ధని
రాగం: శుద్ధ ధన్యాసి
తాళం: ఆది
 
ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

ఏమిటీ? లంకెలు మారినట్టున్నాయి?

అవును - మార్చేసా! మీ / నా సౌలభ్యం కోసం!

భవదీయుడు
మాగంటి వంశీ

PS: పూర్తి కార్యక్రమం రికార్డు చెయ్యలేకపోయినందుకు చింతిస్తూ .....

Saturday, April 16, 2011

POLL - ఘంటసాల మాష్టారా? రజనీ గారా? ఈ దండకాలకు దండలు ఎవరికి?

ఏమిటీ హెడ్డింగు? బుద్ధుందా అసలు నీకు?

ఉంది కాబట్టే ........

ఇంతకీ సంగతేమిటి? కథా కమామీషు వివరించుకో!

ఘంటసాల మాష్టారు పాడిన శ్యామలా దండకం నభూతో నభవిష్యతి  అని అనుకుంటూ ఉండేవాడినా? నేనేమిటి ఈ భూప్రపంచకంలో పాటలు వినేవాడెవడైనా అలాగే అనుకుంటాడన్న సంగతి నీకు కూడా తెలుసుగా?  వేరే మాట లేకుండా పటాపంచలు అయిపోయింది.

ఏమిటి పటాపంచలయ్యింది? పాటా? నీ అభిప్రాయమా? నిన్ను తగలెయ్య! సరిగ్గా చెప్పు

అభిప్రాయం నాయనా! అభిప్రాయం.

ఎలా? ఘంటసాల మాష్టారుని మించినవారు లేరయ్యా ఈ సంగీత ప్రపంచంలో!

ఒప్పుకున్నా, కానీ ఈ దండకానికి కాదు...

మరి? ఎవరున్నారో చెప్పు!

బాలాంత్రపు రజనీకాంతరావు గారని ఒకాయన ఉన్నారు, తెలుసా నీకు? ఆయన ఘంటసాల మాష్టారు గాత్రాన్ని ఆవగింజంత చేసేసారేమో అన్న అనుమానం వచ్చేసింది.

ఎలా?

పరుచూరి శ్రీనివాస్ గారి దగ్గరినుంచి బాలాంత్రపు రజనీకాంతరావు గారి శ్యామలా దండకం ఆడియో వచ్చింది. విన్నా! ఆ దండకంలోని చివరి ఎనిమిది నిముషాల భాగం వింటూంటే , వెంటనే లేచి నించున్నాయి!

ఏమిటి నుంచున్నాయి?

ఒంటి మీద వెంట్రుకలు! సూదుల్లాగా, అంపశయ్య మీది బాణాల్లాగా నిక్కబొడుచుకుని పోయినాయి....దండకంలోని ఆ ఎనిమిది నిముషాల భాగం ఆగేంతవరకూ అలా నిటారుగానే ఉండిపోయినాయి.....

ఏదీ? నన్ను కూడా విననీ , చూద్దాం! ఏం నుంచుంటాయో?

సరే ఇక్కడ విను....

ఒక్కటే మాటయ్యా - ఈ నా అభిప్రాయంతో నీ అభిప్రాయాన్ని నా దారి పట్టిస్తున్నాననుకునేవు! నా సోది పక్కనబెట్టి సుమారు పధ్నాలుగు నిముషాల ఈ ఆడియో  తీరిగ్గా విని, కామెంటు రూపంలో చెప్పు .

మీలో చాలామందికి మొదటిసారి వినగానే "నుంచోకపోవచ్చు" కానీ, ఓ ఐదారు సార్లు విన్న తర్వాత "నుంచుంటాయి"....నాదీ పూచీ.....కొద్దిమందికి మొదటిసారి వినగానే నుంచుంటాయి...వారు ధన్యులు ***************************************************
***************************************************


ఈ క్రింది సూర్య దండకం ఘంటసాల మాష్టారు పాడితే ఎలాగుండేదో కానీ, ఇప్పటికీ ఎప్పటికీ ఈ దండకానికి రజనీకాంతరావు గారే నెంబర్ వన్ అని నా నమ్మకం! -

 సూర్య దండకం కూడా వినిపించు !

ఇదిగో ఇక్కడ వినుకో -I will say just one thing - Brilliant! Brilliant! Brilliant! Though I have been listening to this danDakam from Sri BR since ages - it MOVES me, every single time I listen to it

వైష్ణవికి నేర్పుదామని ఓ రెండు వారాల క్రితం ఆవిడకు వినిపించా! దండకం అయిపోగానే ఏమందో తెలుసా?

Daddy, I want to go to that thaata and sing with him

కదిలిపోయా! గుండెలకు హత్తుకుని ఓ ఐదు నిముషాలు వదిలిపెట్టలా చిన్నమ్మిని!

అదండీ సంగతి! 

దండకం ఈ క్రింద  :


శ్రీ సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైక నాధాధినాధా మహాభూత భేదంబులున్ నీవయై బ్రోవుమెల్లప్పుడున్ భాస్కరా హస్కరా

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

పద్మినీ వల్లభా వల్లకీ గానలోలా త్రిమూర్తిస్వరూపా విరూపాక్షనేత్రా మహా దివ్యగాత్రా అచింత్యావతారా నిరాకారా ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిర్ధూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాటి యేకాకినై చిక్కి యే దిక్కునున్ గానగా లేక యున్నాడ నీవాడనో తండ్రీ

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

జేగీయమానా కటాక్షంబునన్ నన్ గృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్ర మూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారథ్యమన్ గొంటి ఆకుంటి యశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి త్రోలంగ మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ కాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ ద్రుంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీ దాసులన్ గాంచి ఇష్టార్థముల్ కూర్తువో

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

దృష్టివేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంభభారంబుగానీక శూరోత్తమా ఒప్పులన్ తప్పులన్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీ కీర్తి కీర్తింప నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్త్వమున్  జూపి నా ఆత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ బ్రశంశింప నా వంతు ఆ శేషభాషాధిపుల్ కానగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు కానంగ నేనెంత ఎల్లప్పుడున్ స్వల్పజీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ చేయవే కామితార్ధప్రదా

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

శ్రీమహాదైవరాయా పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీదండకంబిమ్మహిన్ వ్రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించున్ మహాదేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమహా 

Friday, April 15, 2011

బల్ల ఎక్కామండీ! నొక్కించుకున్నామండీ!

వైష్ణవి నిన్న సాయంత్రం మా ఇల్లు - అదే డాల్ హవుస్ కింద పడేసింది.... ఎందుకా? ఏమో?

ఇదే అవకాశం అని పోలో మంటూ బల్ల ఎక్కామండీ! నొక్కించుకున్నామండీ!

అదేనండి - క్లిక్కు...క్లిక్కు మని నొక్కించుకున్నాం...

ఇంకా బోల్డు మంది జతగాళ్ళు ఉన్నారు కానీ తర్వాత తీరిగ్గా ఎప్పుడైనా ...ఇప్పటికిన్నే
అబ్బాయి - మామిడి చెట్టు - కథా గేయ రూపకం - విజయవాడ ఆకాశవాణి కేంద్రం

అబ్బాయి - మామిడి చెట్టు

జేజిమావయ్య శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రూపొందించిన కథా గేయ రూపకం

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన ఈ అరుదైన ఆడియో అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో!

ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, April 11, 2011

అలా తాదాత్మ్యంలో మునిగిపోయానండీ! జయహో ఆకాశవాణి !!

ఆకాశవాణి వారి భక్తి రంజని గీతం -
"సర్వమంగళాధవ శివ శంభో శంభో"
శ్రీ కందాళ జగన్నాధం గారి స్వర కల్పనలో


ఎక్కడ వినొచ్చా?


ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాకఎడమవైపున ఉన్న "ఆకాశవాణి శ్రవ్యతరంగాలు " లింకు నొక్కి వినవచ్చు

పరుచూరి శ్రీనివాస్ గారు కనుక్కుని చెపుతానన్నారు కానీ, నా ఆత్రం కొద్దీ, కక్కుర్తి పడి సభికులను కూడా అడుగుతున్నా!

ఎవరికైనా ఈ భక్తి గీతం పాడిన వారి పేర్లు తెలుసా?

రేడియోలో కుదరదూ, సమయము అనుమతించదు, రేడియో కార్యక్రమాలు చేసినవాడిగా ఆ సంగతి తెలిసినా - ఈ మాట అనాలనిపించింది...ఆకాశవాణి వారికి క్షమాపణలతో ....    
" ఈ ఆకాశవాణి వారొహరు! పాడిన వారి వివరాలు కూడా చెపితే ఆ కళాకారులకు ఎంత న్యాయం చేసినవారవ్వచ్చోనని!"

వారి గొంతుల్లో అసలా పాట వింటూంటే నన్ను నేనే మరచిపోయా! పైగా శివయ్య మీద అనేటప్పటికి ఇంకా పూనకం వచ్చేసి, రెండో చరణానికి వచ్చేటప్పటికి పూర్తిగా తాదాత్మ్యంలో మునిగిపోయా! ఆహా! ఎంతటి అదృష్టవంతులో - ఆ భగవంతుడు అలాటి స్వరం వారికి ప్రసాదించినందుకు!

ఏదేమైనా అద్భుతమైన ఆణిముత్యాన్ని అందించిన  చొప్పకట్ల సంతోష్ గారికి బోలెడు ధన్యవాదాలతో


భవదీయుడు
మాగంటి వంశీPS: UPDATED The post 

కావలసిన వారికోసం సాహిత్యం ఇదిగో ఇక్కడ..తప్పులుండొచ్చు, పెద్ద మనసుతో క్షమించేసి తప్పు దిద్దిన వాళ్ళను ఆ శివయ్య ఆశీర్వదించేస్తాడని నా ఘాట్టి నమ్మకం
(3.04 PM PST)


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశ భవహర శంభో శంభో
సకలైశ్వర్యప్రదదేవ శంభో శంభో
శకటాసురహరసఖ మహదేవ శంభో శంభో
సకలైశ్వర్యప్రదదేవ శంభో శంభో
శకటాసురహరసఖ మహదేవ శంభో శంభో
సరసీరుహసఖశశికళనాంబక శంభో శంభో
హరహరపాలక కపాలధరభవ శంభో శంభో
సరసీరుహసఖశశికళనాంబక శంభో శంభో
హరహరపాలక కపాలధరభవ శంభో శంభో


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో


సగుణోపాసకజనచయకులభ శంభో శంభో
జగదుదయేస్థితిసంహారకర శంభో శంభో
సగుణోపాసకజనచయకులభ శంభో శంభో
జగదుదయేస్థితిసంహారకర శంభో శంభో
చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో శంభో
చంద్రఛ్ఛవిలేచితవృషవాహన శంభో శంభో
చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో శంభో
చంద్రఛ్ఛవిలేచితవృషవాహన శంభో శంభో
చరణాగతజనరక్షకనియమా శంభో శంభో
చరసంభుతనిభసుందరదేహా శంభో శంభో
చరణాగతజనరక్షకనియమా శంభో శంభో
చరసంభుతనిభసుందరదేహా శంభో శంభో


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభోతామజచర్మవిభాజితచేల శంభో శంభో
కామజదనుజాపురవాశూల శంభో శంభో
తామజచర్మవిభాజితచేల శంభో శంభో
కామజదనుజాపురవాశూల శంభో శంభో
సలలితనాగవిభూషణపురహర శంభో శంభో
నళినవిభాసశిరోపరిభాగా శంభో శంభో
సలలితనాగవిభూషణపురహర శంభో శంభో
నళినవిభాసశిరోపరిభాగా శంభో శంభో
సదమలభక్తవశీకృతహృదయా శంభో శంభో
సదయావిరహితరితిసుతవిలయా శంభో శంభో
సదమలభక్తవశీకృతహృదయా శంభో శంభో
సదయావిరహితరితిసుతవిలయా శంభో శంభో


సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభోజలజాదేక్షణ పూజితచరణా శంభో శంభో
జలనిధిభవ హాలాహలభక్షణ శంభో శంభో
జలజాదేక్షణ పూజితచరణా శంభో శంభో
జలనిధిభవ హాలాహలభక్షణ శంభో శంభో
గౌరిగణేశ్వరతపనోమాన్విత శంభో శంభో
తారకసంభవజగన్నాథనుత శంభో శంభో
గౌరిగణేశ్వరతపనోమాన్విత శంభో శంభో
తారకసంభవజగన్నాథనుత శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో
సర్వమంగళాధవ శివ శంభో శంభో
శర్వశంకరగిరీశభవహర శంభో శంభో

Thursday, April 7, 2011

మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసారమైన తేదీ - ఏప్రిల్ 7, 2011
సౌజన్యం - భవదీయుడు  (అనగా నేనేనన్నమాట !!)

ఆర్టిష్టు - శ్రీమతి దుర్గా భాస్కర్ (వీరు రిటైర్డు ఆకాశవాణి డైరెక్టరు)
ఫ్లూట్ - శ్రీ వి.నాగరాజు
వయొలిన్ - శ్రీ శ్రీధర్ కుమార్
కీబోర్డు - శ్రీ పి.ఫణికుమార్
తబల - శ్రీ ఎ.ప్రభాకర రావు
రిథంస్ - శ్రీ సత్యేంద్రనాథ్

పాటలు
  • వాణ్ణి నేనేమన్నన, వానయ్య సొమ్మేమన్న తిన్నన?
  • ఎల్లన్న, ఎల్లన్న, ఎల్లన్న
  • నాట్లు ఏసీ ఏసీ నడుమెల్లా నొచ్చే నొచ్చే
బ్రహ్మాండంగా ఉన్నాయి...


తప్పక వినాల్సిన కార్యక్రమం

________________________________________________

రెండో కార్యక్రమం:

జానపద, లలిత గీతాల / సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఆర్టిస్టులు - కె.బి.కె.మోహన రాజు, నిత్య సంతోషిణి
సౌజన్యం - భవదీయుడు  (అనగా నేనేనన్నమాట !!)

ఈ కార్యక్రమం నాకు పెద్దగా నచ్చలా కానీ, ఇతర సంగీత ప్రియులకు ఉపయోగపడుతుందేమో అన్న ఆలోచనతోనూ, ఆరుద్ర, దేవులపల్లి, దాశరథి మొదలైనవారు రచించిన గీతాలు ఉండటంతోనూ - సైటులో ప్రచురించటం జరిగింది. మొత్తం కార్యక్రమంలో దాశరథి గారి లలిత గీతం "కొసకొమ్మల రెప్పలలోన" ఒకటే కాస్త నాకు నచ్చింది.


______________________________________________________ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, April 6, 2011

"సహాయ నిరాకరణోద్యమం - చీరాల, పేరాల సత్యాగ్రహం" రూపకం / అకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

"సహాయ నిరాకరణోద్యమం - చీరాల, పేరాల సత్యాగ్రహం" రూపకం
అకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ - ఏప్రిల్ 6, 2011
సౌజన్యం: భవదీయుడు 

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య వంటి మహానుభావుల చరిత్ర, పన్నుల నిరాకరణోద్యమం, రావూరి అలిమేలు మంగమ్మ (జైలుకు వెళ్ళిన తొలి మహిళ) వివరాలు, శాసనోల్లంఘన ఉద్యమం, పురపాలక సంఘ నిర్మాణం - ఇలా ఎన్నో అపురూపమైన సంఘటనలను వివరిస్తూ, విశదీకరిస్తూ సాగిన ఈ రూపకం తప్పక వినదగిన ఆణిముత్యం.

రచన: డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు
నిర్వహణ: రామసూర్యప్రకాశ రావు
సంగీతం: షేక్ ఇమాం సాహిబ్
వ్యాఖ్యానం: ఎన్.సి.దాస్ 

పాల్గొన్నవారు

గాంధీజి : శ్రీ సత్యనారాయణమూర్తి
కొండా వెంకటప్పయ్య : శ్రీ వారణాసి ఉదయ భాస్కర మూర్తి
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య: శ్రీ ఎం.సి.కన్నేశ్వర రావు
విలేకరి - పి.ఎస్.ఆర్ రావు
ఇంకా ఆళ్ళ యోగానంద్ తదితరులు

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ