Wednesday, March 16, 2011

తెలుగులో రాయించొచ్చుగా....ఓ అవునా, నాకు తట్టలేదు..తమరు భలే చెప్పారే!

ప్రతిరోజు లాగే ఓ కథ వినిపిస్తూ ఓ కాయితం ఇచ్చి ప్రయోగం చేసా....సఫలం అయినట్టే కనపడింది.... ఐదేళ్లకు ఫరవాలా అనిపించింది.... :) కూతురు పనులు బావున్నాయనిపించకపోతే ఇంకెవరివి బావుంటాయి?

ఆ కాయితం అయిపోగానే - నాన్నా, అయిపోయింది అంటే ఇంకో కాయితం ఇచ్చా, అది కూడా అయిపోయాక మూడోది ఇచ్చా! మూడో దాని మీద మూడు లైన్లు రాసాక, యెహ్హా ఇంకేం రాస్తాం అనుకుందో ఏమో That's the end of the story. Ok bye అని ఆ పేపర్లు, పెన్సిలు, రబ్బరు నా మీద పడేసి పోయింది...

తెలుగులో రాయించొచ్చుగా....ఓ అవునా, నాకు తట్టలేదు...తమరు భలే చెప్పారే!

అ నుంచి అః వరకే వచ్చు..."క చ ట త ప" లు రాయటం ఇంకా రాలా... అందుకు.... :)


సరే సోది ఆపుతా, కథ చదూకోండి...పై కాయితాల్లో తప్పులు పట్టుకుని, ఒప్పులు చెబితే వీరతాళ్లు బహూకరించబడతాయి...


నా సాయం ఈ మూడు పేజీల్లో రెండు పదాలు - Creaked , Squeaked - ఈ రెండూ నా నోట్టోనుంచి రాగానే తలెత్తి, కళ్లు చిన్నవి చేసి, చిరాగ్గా పెట్టి, పెన్సిలు నా వంక నిటారుగా చూపిచ్చి  - I don't know how to write it అనగానే , గుండె కరిగిపోయి .....పోయీ.....సాయం చేసానన్నమాట ...అదండీ....

ముందు - కథ తన చేతే సదివిచ్చండి, తర్వాత పుస్తకం తనకు కనపడకుండా బయటకు బిగ్గరగా మీరు సదవండి, పేపర్లిచ్చి రాయమనండి...

8 comments:

 1. పిల్లలు రాసిన దానిలో తప్పులు వెదికి నాకు వచ్చే వీర తాడు లు అవసరం లేదు
  :)
  కూతురు హోం వర్క్ చేయించడం లో ఉండే మజా నే వేరు కదా సర్

  ReplyDelete
 2. Daughter is the extension of Dad's soul :-)
  Enjoy the fun while it lasts :-)

  ReplyDelete
 3. kotaa vishayam chapii nan duku ..dannyavadamulu

  ReplyDelete
 4. Does she make "swish swish" sounds in reality, apart from writing on paper? :)

  Its cute!

  ReplyDelete
 5. @వంశీ - వీరతాడు వేస్తానన్నప్పుడు వేయించుకోవాలి....లేపోతే చిన్నమయకు కోపం వస్తుంది...ఆ తర్వాత ఘటోత్కచుల వారు వస్తారు.... ఊరకే అన్నా లెండి.... :)

  @ కుమార్ - అవునండీ, కరష్టుగా చెప్పారు

  @ మహేందర్ రెడ్డి - దండాలకు, ధన్యవాదాలకు - ప్రతి దండాలు, ధన్యవాదాలు....

  @ ఆర్కే - లేదు ...మామూలుగానే ధ్వనులంటే భయం ఆవిడకు....చిన్నవీ పెద్దవీ అన్నదానితో సంబంధం లేదు....ఇదివరకైతే "ఫాల్" సీజనులో ఆకులు లగెత్తుతుంటే, నా కాళ్లకు కరుచుకునిపోయి ఉండేది.....ఎవరో ఒకరు పక్కనుంటే కొట్టుకొచ్చేది కానీ, ఒక్కత్తినీ వదిలామా ఆరున్నొక్క రాగాలే! ...ఇప్పుడు కాస్త ఫరవాలా! భయం పోయింది....నోట్లోంచి సవుండ్లూ వస్తున్నాయి...అయితే స్విష్ స్విష్ దాకా రాలా ఇంకా!

  ReplyDelete
 6. సూపర్.

  మీ కోసం కాకపోయినా తన కోసం, తన పిల్లల కోసం ఎత్తిపెట్టుకోండి జాగ్రత్తగా. ఎంత ఎంజాయ్ చేస్తారో.

  ReplyDelete
 7. @ భావకుడన్ - కామెంటుకు ధన్యవాదాలు....ఓ ట్రంకు పెట్టె అల్రెడి ఉన్నదండీ....అందులో ఆవిడ బర్తు సర్టిఫికెట్లు, హాస్పిటల్లో నర్సమ్మలు ఇచ్చిన కాయితాలు, డాక్టరమ్మ ఈవిడని చేతుల్లో ఎత్తుకుని తీయించుకున్న ఫుటోలు, పుట్టినప్పటినుంచి వచ్చిన గ్రీటింగు కార్డులు, ఆవిడ గీసిన మొట్టమొదటి బొమ్మలు, రాసిన అ - ఆ లు, కిండర్ గార్డెన్నులో ఇచ్చిన సర్టిఫికెట్లు, కుమాన్ అనే సదివింపుడు కలాసుల్లో వచ్చిన హానర్ స్టూడెంటు సర్టిఫికెట్లు - ఇల్లా ఇప్పటికే ఓ పావు భాగం నిండిపోయినై.....ఐదేళ్లకు పావు నిండిందంటే ఇరవై యేళ్లకు పూర్తిగా నిండుతుందన్న లెక్కలో "ఇప్పటికి" ఉన్నాను కాబట్టిన్నూ, అప్పటికి ఆ ట్రంకు పెట్టె ఇదిగోనమ్మా అని ఆవిడకిచ్చేసి చేతులు దులుపుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాను కాబట్టిన్నూ.... :)

  ReplyDelete