Sunday, March 6, 2011

"ఎన్నిక ఒక కళ" - అవును నిజం!

"ఎన్నిక ఒక కళ" - అవును నిజం!

"ద ఆర్ట్ ఆఫ్ ఛూసింగ్" అన్న పుస్తకం చదివి ఎంత అబ్బురపడ్డానో, టెడ్.కాం లో ఈ రోజు ఆ పుస్తక రచయిత్రి షీనా అయ్యంగార్ ప్రసంగం విని, చూసి అంతే అబ్బురపడ్డా. ఆ వీడియో చూడాలనుకున్నవాళ్లకి లంకె ఇక్కడ......

http://www.ted.com/talks/lang/eng/sheena_iyengar_on_the_art_of_choosing.html

చూసాక మీకు ఏమనిపించిందో ఓ ముక్క కామెంటుగా రాయండి

భవదీయుడు
వంశీ

PS: Sheena Iyengar is a psychoeconomist and professor at Columbia Business School. She is Research Director of the Chazen Institute and author of "The Art of Choosing." and BTW - she is blind!

6 comments:

 1. Interesting :-).

  I always thought my life has become miserable in America, with too much of choice out there. I was used to "feel good" by walking into the "only" Bata store in my little town to pick Bata sandals, whenever I was in "need" of new footwear :-)

  ReplyDelete
 2. @Kumar - Yes interesting, very interesting. You should read the book. It definitely gives a different perspective on the choices you can make when one is offered. I was very impressed, not that everyone else will....But....that's their chocie... :)

  Also you can take a look at this link too, if interested. Some of the courses she taught and some of the journal articles are in PDF format in the respective sections.

  http://www4.gsb.columbia.edu/cbs-directory/detail/494889/Sheena+Iyengar

  ReplyDelete
 3. థాంక్యూ వంశీ గారూ, మీరు చెప్పినది చదువుతాను.., "ఎన్నుకోవటం(choosing)" అనేదేమో కానీ, free-will గురించి కొంచెం కొంచెం కెలికా, అప్పుడెప్పుడో. free-will అనే ఐడియా(concept) ఉందని అర్ధమయింది కానీ, అది నాకు(మనుషులకి) ఉందో లేదో తెలీలా :-). everything is pre-destined (అదే Gods-will) ఏమో, including whether I treat 7 varieties of Pepsi as single choice or 7 choices!!

  ReplyDelete
 4. ఒక్కమాట వదలకుండా వినేంత ఆసక్తికరంగా ఉంది. ఆవిడ వాటిని కూర్చిన విధానం బావుంది. పాలు చిక్కదనం, కూరగాయలకి తాజాదనం, వస్తువుకి మన్నిక, "సీతారామయ్య/ఆ బోటివారు" తెచ్చే బట్టలు, మొత్తానికి ధర, జేబు బరువుల ఇలా కొన్ని సింపుల్ సూత్రాల ఆధారమైన ఎన్నిక పెద్దల నుంచి అందుకున్న మనకి - ఒక టీవీ షోకి కల్పిస్తున్న అపరిమిత మార్కెటింగ్ [తాగే కప్పు కాణ్ణించి, వేసుకునే చెప్పుల వరకూ ఆ పేరే బుర్రలు చెడేలా మతిభ్రమించేలా] ఉన్న మన పిల్లలకి; ఎన్నిక, మాట, మంచి అనుభవజ్ఞులది అన్న నమ్మకం నుంచి "ఇది నా[కు చెందిన]ది" అన్న తీర్మానాల దిక్కుగా నడత మారాక; అసలివన్నీ కాదు - మనిషిని బట్టి అసలు కావచ్చు. ఛాయిస్ ఉన్నా కావాల్సినది తెచ్చేవారితోనూ, లేకపోయినా వెదుక్కుని కొనేవారితోనూ తిరిగిన కన్ను/కాలు కనుకా - ఎన్నిక ఒక కళ కావచ్చు కానీ, ఇది ఆయా మనుషుల తాను, నేతల సమాహారం... :)

  ReplyDelete
 5. @ ఉష - మీరన్నదే స్థూలంగా ఆవిడ పుస్తకంలో చెప్పిందీనూ!

  @కుమార్ - భగవన్నిర్ణయం అన్న మాట ఓ రకంగా ఒప్పుకునే మనిషినే అయినా, ప్రతిదానికీ ఆయన వంక చూడటం మంచిది కాదు అని తెలిసినవాడిని కూడాను. ఫ్రీ విల్ అనేది మనిషిని బట్టీ, అతని చుట్టూ ఉన్న నాగరికతను బట్టీ మారుతూ ఉంటుంది. అది ప్రబలంగా వినపడుతున్నచోట కూడా - స్వయం "ఎన్నిక" ప్రధాన పాత్ర పోషిస్తుంది. నన్నడిగితే పెప్సీ అయినా, కోక్ అయినా, జ్యూస్ ఐనా, మంచి నీళ్లయినా మనిషి దాహార్తిని బట్టి స్థానం మారుతూ ఉంటుంది. నాకు అన్నీ ఒకటే, వివిధ రూపాల్లో ఉన్న జలం! పుచ్చుకునేది మారినా అవి తీర్చే దాహం ఒకటే! అదండీ... :)

  ReplyDelete
 6. Good one sir....this is what precisely we study in Economics.

  ReplyDelete