Thursday, February 3, 2011

అపురూపమైన జేజిమామయ్య పాటల ఆడియోలు కొన్ని! - 1960's

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వీయ రచన, స్వరకల్పనలో 60వ దశకంలో రూపుదిద్దుకున్న ఎంతో అపురూపమైన జేజిమామయ్య పాటల ఆడియోలు కొన్ని అందించారు పరుచూరి శ్రీనివాస్ గారు. నా సతాయింపును విసుక్కోకుండా భరించిన ఆయనకు వేల ధన్యవాదాలతో.

ఎక్కడ వినవచ్చా? 

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పిల్లల పాటలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు .

ఈ జేజిమామయ్య పాటల్లో కొన్ని పాటల సాహిత్యం "చిన్నారులు" సెక్షన్లో, ఆ పేజీ చివర చూడవచ్చు. ఎప్పుడో 2006లో మా పెద్దమ్మ సుబ్బమ్మ గారిని అడిగి ఆవిడకు గుర్తున్నంతలో ఈ పాటల సాహిత్యం రాసుకుని ప్రచురించాను. కొన్ని తప్పులుండవచ్చు. తెలిసిన వారెవరైనా సరిదిద్దితే అమితమైన సంతోషం. దాదాపు ఐదేళ్ల తరువాత ఆడియోలు లభించటం మరింత ఆనందం.


నాకు బాగా నచ్చిన పాట చిట్టీ చిట్టీ రేగీపళ్లూ - ఎంతందంగా వర్ణించారో రజనీకాంతరావుగారు. ట్యూను కూడా అద్భుతం, బ్రహ్మాండం.అలా కళ్లు మూసుకుని ఈ ఆడియో వింటూ ఉంటే కళ్ల ముందు ఆ బోగి పళ్ల సీనంతా కనపడట్లా?

ఒక్కటే మాట - అద్భుతం....రజనీకాంతరావు మాష్టారు గారికి వేల వేల వందనాలు.


చిట్టీ చిట్టీ రేగిపళ్లు
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ
చిట్టీ చిట్టీ రేగిపళ్లూ
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ


ఘల్లూ ఘల్లున దమ్మీడీలు
జల్లుగ అల్లో నేరెడిపళ్లు
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై
కలలూ ఘల్లున దమ్మీడీలు
జల్లుగ అల్లో నేరెడిపళ్లు
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై


పెద్దల దీవనలెన్నో పూలై
ముద్దులు తీయా తీయని పళ్లై
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై
పెద్దల దీవనలెన్నో పూలై
ముద్దులు తీయా తీయని పళ్లై
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై


పసుపూ గంధం అరటిపళ్లతో
మిసమిసలాడే పట్టుచీర్లతో
ముత్తైదువులా గాజులసడిలో
ఎత్తున రాలే బోగీపళ్లూ
పసుపూ గంధం అరటిపళ్లతో
మిసమిసలాడే పట్టుచీర్లతో
ముత్తైదువులా గాజులసడిలో
ఎత్తున రాలే బోగీపళ్లూ


చిట్టీ చిట్టీ రేగిపళ్లు
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ
చిట్టీ చిట్టీ రేగిపళ్లూ
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ


కొసమెరుపు: కొన్ని నెలల క్రితం దాకా నాకూ తెలీదు - "భోగి" కాదనీ - "బోగి" అనీ. అనవసరంగా వత్తు వచ్చి చేరిందని. ఎలా తెలిసింది బాబూ నీకు అని అంటున్నారా? శ్రీ నల్లాన్ చక్రవర్తుల శేషాచార్య గారి పుస్తకం - హాస వ్యాస మంజరి పుస్తకంలో ఉన్నది ఈ సంగతి. ఈ పుస్తకం సుమారు 10 నెలల క్రితం నా చేతికి వచ్చింది కానీ చదవటానికి తీరిక ఆ పై రెండు నెలలకు కానీ కలగలా. ఆ పుస్తకాన్ని ఇప్పుడు "సాహితీ సంబంధ" సెక్షన్లో చూడవచ్చు. వ్యంగ్యాత్మక వ్యాస పరంపర....చాలా మంచి పుస్తకం. వీలుచేసుకుని చదవండి.

5 comments:

 1. వంశీ గారు భలే బాగున్నాయి పాటలు. ఇలాంటివి వెలికి తీసి మాకందిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  ReplyDelete
 2. నాదేం లేదండీ...ఈ ముత్యాలు, రత్నాలు శ్రీనివాస్ గారి చలవ.....ఆయన దగ్గర ఇంకా ఇలాటివి బోల్డు ఉన్నాయి........ మీ ధన్యవాదాలు ఆయనకు అందించేసాం!

  ReplyDelete
 3. paruchuri srinivas zindabad, srinivasaraov from khammam

  ReplyDelete
 4. ఆడియో క్వాలిటీ చాలా బావుంది.
  అరుదైన సంపద అందించిన వారికీ సేకరిస్తున్నమీకూ ధన్యవాదాలు.
  ఇంకొన్ని పాటలు కూడా దొరికే అవకాశముందా?
  :)

  ReplyDelete
 5. లలిత గారూ

  అవును ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. బాగోలేనివి ఆయనే ఫిల్టర్ చేసేసీ పంపలా....మరి కొన్ని వచ్చే అవకాశం ఉందా అంటే.... ఆశాజీవిని కాబట్టీ, ఆయన్ని ఎప్పుడు ఏదడిగినా ఇంతవరకు ఎప్పుడు కాదని అనకుండా బోల్డు సాయం చేసారు కాబట్టీ - ఉందనే చెబుతా.....ఆ తరువాత ప్రాప్తం ఎంతవరకో తెలియదు కానీ సతాయింపు మటుకు ఉండేదే! అది ఆయనకూ తెలుసు, నాకూ తెలుసు!.. :)

  ReplyDelete