Tuesday, February 8, 2011

క్రితం మూడువారాల్లో చదివిన పుస్తకాల జాబితా ఇదీ !!

జనవరి 22వ తారీకు నుంచి ఈవేల్టి దాకా - అనగా దాదాపు మూడువారాల్లో చదివిన పుస్తకాల జాబితా ఇదీ

(Jan 1st - 21st List is here - http://janatenugu.blogspot.com/2011/01/blog-post_21.html )

ఈ సారికి బోషాణంలోని తెలుగు పుస్తకాలొదిలేసి అందులోనే ఓ మూలకు బిక్కు బిక్కుమంటూ చూస్తూన్న ఆంగ్ల పుస్తకాల మీదకు మనసు పోయింది.



ఏవిటి బాబూ? ఏం చదివావు?

ఇదిగో ఇవే
  • Religion And Culture - 1968 - Sri Sarvepalli Radhakrishnan - Orient Paperbacks
  • Recovery of Faith - 1955 - Sri Sarvepalli Radhakrishnan - Orient Paperbacks

సర్వేపల్లివారివే ఇతర పుస్తకాలు మరి కొన్ని -
  • The Present Crisis Of Faith, The Creative Life, Our Heritage, Towards A New World, Living With A Purpose, True Knowledge

సర్వేపల్లివారివి అయిపోయాక చదివినవి ఇవీ 
  • Patanjali Yogasutras - 1966 - Swami Vasantananda - Divine Life Society
  • Stories From The Mahabharata - Swami Sivananda - 1943
  • The Symbolism Of Hindu Gods And Rituals - A.Parthasarathy - 1983 - Vedanta Life Institute
  • Upanishads In Story aAnd Dialogue - R.R.Diwakar - 1981
  • Stories For The Innocent - Sri C.Rajagopalachari - 1982 - Bharatiya Vidya Bhavan
  • Uddhava Gita (The Last Message Of Srikrishna) - 1978


ఇవి కాక - క్రితంసారి హైదరాబాదు వచ్చినప్పుడు తెచ్చుకున్న పాకెట్ పుస్తకాలు ఓ నాలుగు...ఏవా? ఇవే - అప్పుడెప్పుడో మా బాబాయి తెచ్చివ్వగా నేను భద్రంగా మూడు దశాబ్దాల పాటు దాచుకున్న చిన్నప్పటి బంగారాలు.....

  1. Lew Wallaces's - Ben-Hur
  2. Howard Pyle's - The Merry Adventures Of Robinhood
  3. Mark Twain's - The Adventures Of Tom Sawyer
  4. James Fenimore Cooper's - The Last Of Mohicans

పాకెట్ పుస్తకాలంటే ఏదో అనుకునేరు - దిట్టమైనవే - 240 పేజీలు ఒక్కోటి...అయితే చిన్న సైజు పుస్తకాలవ్వటం వల్ల, నాలుగూ కలిపి రెండు రోజుల్లో ఐపోయినాయి.

రివ్యూలు గట్రా అడక్కండి....వీలున్నప్పుడు ఎప్పుడైనా తరువాత...ఇప్పటికి బొమ్మలు చూస్కోండి....













మరి ఈ కిందనున్న మూడు పుస్తకాలూ ఎవరికి?






వాల్యూం - 1 అసలు ఈ పుస్తకం అందులోని బొమ్మలు చూసి అప్పుడెప్పుడో ఓ 9 ఏళ్ల క్రితం కొన్నా.....కళ్లు చెదిరిపోయేలా ఉంటాయి, అద్భుతమే మాట అన్నమాట....వాల్యూం - 2, 3 ఈ మధ్యే కొన్నా. వాటిల్లోని బొమ్మలకు ఆ వాల్యూం - 1 లోని బొమ్మల కళ రాలేదు కానీ, ఫరవాలా....పిల్లలున్న ఇంట్లో ఉండాల్సిన పుస్తకాలు...

4 comments:

  1. అసలు మీ గురించి మీరేం అనుకుంటున్నారు?!! ఇన్ని పుస్తకాలా? ఇంత తక్కువ సమయంలోనా అది కూడాను. టూమచ్ సార్!!
    But inspiring.

    ReplyDelete
  2. గ్రేటో!!! నాకు లాగా ఒట్టి జాబితా చదివి వదిలెయ్యకుండా :)

    ReplyDelete
  3. @ఆశ - ఇందులో టూమచ్ ఏముంది? ఇన్స్పిరేషన్ అన్నారు...అన్నారు కాబట్టి మొదలుబెట్టి నిలబెట్టుకుంటారో లేదో అన్నది మీ చేతుల్లోనే - కాబట్టి .... :)

    @రాజేంద్ర - రెండు కాకపోయినా రోజుకో పుస్తకం చదవాలన్న నియమానికి ఇప్పటివరకూ ఆటంకం కలగలా! చూద్దాం ముందు ముందు ఎలా సాగుతుందో!!

    ReplyDelete
  4. అంటే, రోజుకి ఒక పుస్తకం పూర్తిగా చదువుతున్నారా! :O
    నేనైతే, నెలన్నర బట్టీ ఒక్కటీ పూర్తి చెయ్యలా. రెండోది మొదలుపెట్టలా! :P

    ReplyDelete