Tuesday, February 8, 2011

దిబ్బరొట్టి అబ్బాయి - విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన అరుదైన ఆడియో

దిబ్బరొట్టి అబ్బాయి

ఒక పాత ఇంగ్లీషు కథ ఆధారంగా జేజిమావయ్య శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రూపొందించిన కథాపదం

ఇందులో
కథల మావయ్య : ఎం.చిత్తరంజన్
దిబ్బరొట్టి అబ్బాయి - కె.ఎ.కల్యాణి
అవ్వ - జి.అలకానంద
నక్క - కె.రామాచారి
ఆవు - ఎ.గిరిజ
గుర్రం - ఎ.సీతామహాలక్ష్మి
పొలం పనివాళ్లు - ఆర్.రాజ్యశ్రీ,ఎం.స్వరాజ్యలక్ష్మి

అవ్వ తయారు చేసిన దిబ్బరొట్టి అబ్బాయి ఇంట్లోంచి పారిపోతూంటే ఆ దిబ్బరొట్టి అబ్బాయిని పట్టుకోటానికి పడే పాట్లూ, ఆ దిబ్బరొట్టిని ఆపే/తినే ఆశతో ఆవు, గుర్రం, పొలంలో పనిచేసుకునే పనివాళ్లూ - వీళ్లు తమ ప్రయత్నంలో విఫలం కాగా, సఫలం అయిన నక్కగారి తెలివి మీరు ఆడియో విని తెలుసుకోవాల్సిందే!

అవ్వగా అలకానంద వాయిస్ ఓవర్ బ్రహ్మాండం.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన ఈ అరుదైన ఆడియో అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో!

ఎక్కడ వినవచ్చా? 

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పిల్లల పాటలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు .

భవదీయుడు
వంశీ

7 comments:

  1. Thanks మేషారూ! లింకు మీద dobbarotti.html అని టైపారు. dibbarotti.html అని మార్చుకుంటె పని జరిగింది !!

    ReplyDelete
  2. సవరించబడింది. ధన్యవాదాలు

    ReplyDelete
  3. Thanks andee , maa pillalaki vinipistaanu..

    ReplyDelete
  4. @ఎన్నెల - సంతోషం...పిల్లలకు వినిపించాక ఏమన్నారో చెప్పండి....నిజాన్ని / అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగేది వాళ్లే కాబట్టి

    ReplyDelete
  5. వంసీ గరు, మీ ప్రయ్తనం చాల బాగుంది. పర్చురు శ్రినివాస్ గారంటే old telugu songs.com లొ ఉండెవరు ఆయనెనా? ఇంక ఇలాతివి మాకిష్టమైనవి ఎన్నొ పంచుకొవలని ఆసిస్తు.పర్చురు గరి సాయం కొసం చుస్తు ఉంతమని ఆయ్నకు తెల్యచెయ్యండి

    ReplyDelete
  6. @ సర్వేపల్లి

    అవును, ఆయన ఆ వెబ్సైటువారే. ఉన్నవి పంచుకోవాలనే ఈ మా ప్రయత్నం. మీకు నచ్చినందుకు / బాగున్నందుకు సంతోషం.

    మీరు ఏ ఉపకరణం వాడి ఈ తెలుగు స్క్రిప్టు రాసారో తెలియదు కానీ, ఆ ఉపకరణం మీద ప్రాక్టీసు అవసరం మటుకు బాగా కనపడుతోంది.. :)

    ReplyDelete
  7. Hello vamsi, i am new to blog. my friend suggest to use lekhini.org but that tool is new for my typing. i will try to write better telugu next time. if you know other tool please inform.

    Sarvepalli krishnayya

    ReplyDelete