Thursday, February 3, 2011

చెప్పనివాళ్లకు చిప్పలు బహుమానం! చెప్పినవాళ్లకు?

చెప్పనివాళ్లకు చిప్పలు బహుమానం! చెప్పినవాళ్లకు?

ఈ క్రింది ఫోటోలు ఎవరివో గుర్తు పట్టి చెప్పినవాళ్లకు హారాలూ, మణిహారాలూ, భోజ్యాలూ, భక్ష్యాలు, వీరతాళ్లు....చెప్పనివాళ్లకు?? అవే అవే! :)రత్నాలండీ రత్నాలు, అనర్ఘ రత్నాలు - సిగ్గుపడాలి చెప్పలేకపోతే! తెలీని కుర్రకుంకలుంటారు, అది వేరే సంగతి....తెలుసుకోవాలని ప్రయత్నించని, తెలుసుకోకూడదనుకునే కుంకలుంటారే వాళ్లకు ఈ పోష్టే హెచ్చరిక....ఇహ ముందు ఇలాటివి బోల్డు టపాలు వస్తాయి......

జాగ్రత్త జాగ్రత్తేన జాగిలం, కరువం కరువమేన కండలం

చిత్ర సౌజన్యం: శ్రీ దేవరపల్లి రాజేంద్రకుమార్ - http://www.itsvizag.com/

9 comments:

 1. "తెలీని కుర్రకుంకలుంటారు, అది వేరే సంగతి...."
  క్షమించండి నిజంగా తెలియదు. మొదటి ఫోటోలో ఆయన మాత్రం ఎక్కడో తెలిసినట్టుగా బలంగా అనిపిస్తోంది గానీ రెండవ ఫోటో లో ఆవిడ మాత్రం తెలిసినట్టుగా కూడా అనిపించటం లేదు. కానీ తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండటం వలన ఇంక ఆపుకోలేక మీకు కామెంట్ చేస్తున్నా.

  (ముప్ఫై మూడేళ్ళ నాకు వీళ్ళని ...ముఖ్యం గా మొదటి ఫోటోలో ఆయనని చూసే అవకాశం లేదని అనిపిస్తోంది)

  ReplyDelete
 2. Modati photo "CHASO" gaari di, Chaganti Somayajulu gaaru , rendava photo lo vyakti teliyandandi.

  ReplyDelete
 3. మొదటి పుటోలోని వ్యక్తి చాసో - చాగంటి సోమయాజులుగారు. రెండవ పుటోలో ఉన్నావిడ ద్వివేదుల విశాలాక్షిగారు. ఇద్దరు ప్రసిద్ధ ఉత్తరాంధ్ర కథకుల పుటోలు పెట్టినందుకు వంశీగారూ, అందుకోండి మా వందనాలు. విశాఖలోని పౌరగ్రంధాలయం గురించి, అందులోని రోణంకి అప్పలసామి పుస్తకాల గురించి, ద్వివేదుల వారు ఒరవడి పెట్టిన కొత్త మార్గం గురించి త్వరలోనే నా వ్యాసం రాబోతోంది. ఆలోపు మీరేం చేస్తారంటే, నా అడ్రసు తెలుసుగా..... అక్కడికి హారాలూ, మణిహారాలూ, భోజ్యాలూ, భక్ష్యాలు, వీరతాళ్లు.... ఇవన్నీ పంపేయండి. మరి నేను కుంకను కాదని నిరూపించుకున్నాగా. అగ్యానం కొద్దీ పుటోల్లో ఉన్నదెవరో చెప్పలేకపోతే కుక్కలను వదిలి పిక్కలను పీకిస్తారా, అయ్ బాబోయ్!!!!

  ReplyDelete
 4. మొదటిది చాసోగారు...మా ఊరాయన మాకు తెలీకపోవడమేమిటీ!...రెండో మాత్రం నిజంగానే తెలీదు :(

  అయితే నాకు సగం కానుకలు పంపిస్తారా? ఎన్ని వీరతాళ్ళు వేస్తారు?

  ReplyDelete
 5. నేను ముందే చెబుదామనుకున్నా కానీ చెప్పేశారు
  తయారే తాయారు తైరు,
  భక్తజనే నభుక్తి తకరారు...
  (అంటే అమ్మవారి రధం బయలు దేరటానికి తయారయ్యింది, భక్తులు భోజనం చెయ్యకుండా అవస్థలు పడుతూ ఎదురు చూస్తున్నారు అని..
  సరస్పత్దేవి ని మామీద ఒదులుతానన్నారుగా అందుకే
  మేము టెన్షన్ పడుతున్నాం)
  మీకీ కాదు మాక్కూడా వచ్చు కపిత్వం !!

  ReplyDelete
 6. అరుణగారూ - మిమ్మల్ని వదిలెయ్యొచ్చు.... మీకు తెలీదంటే నేను ఆశ్చర్యపోవాలి కానీ....ధన్యవాదాలు, వందనాలూ అన్నీ ఆ రాజేంద్రులవారికే! మీరు గెల్చుకున్న సరంజామా పంపించటం అయిపోయింది. ఇహ మీరు అందుకోటమే మిగిలింది.

  సౌమ్య - మీ నామాన్ని బట్టి మీరు నిజమైన స్త్రీ అని, ఫేకు కాదు అని అనుకుంటున్నాను కాబట్టి, స్త్రీలకు పురుషులు వీరతాడు వెయ్యకూడదు కాబట్టి, మీకు సగం తాళ్లు, బహుమానాలు అందచేస్తాం. మీరే వేసుకోవాలి. ఆ పైన వాటితో మీరేం చేసుకుంటారో మీ ఇష్టం.

  రవి - శెభాషో! మీకు నాలుగు తాళ్లు, అందరికన్నా ముందు చెప్పారు కాబట్టి బహుమానాల్లో సగం బహూకరించేసాం.

  శంకర్ - పైనున్న సమాధానాలతో మీ ప్రశ్నలకు జవాబులు దొరికాయనుకుంటున్నాను... :)

  ReplyDelete
 7. @ వంశీ మోహన్ గారు
  ధన్యవాదాలు.
  కాకపోతే నాదో చిన్న కోరిక (ఈ పోస్ట్ తో సంబంధం లేనిదయినప్పటికీ అడుగుతున్నాను). జలసూత్రం రుక్మిణి నాధ శాస్త్రి గారి ఫోటో మరియు వారి పుస్తకాలలో అచ్చు వేయబడినవి (మీ దగ్గర స్కాన్ చేయబడిన కాపీ) ఉంటే తెలుపగలరు.(అంటే మెయిల్ చేయగలరని ప్రార్ధన).
  ఎంతో కాలంగా వెతుకుతున్నా దొరకటం లేదు. మీ వద్ద ఉండవచ్చేమో అన్న ఒక చిన్న ఆశతో అడుగుతున్నా.

  ReplyDelete
 8. అరుణ గారు,ఇవ్వాళ ఉదయం నన్ను ఫోనులో మీరు యేమి అడిగింది నేను ఇక్కడేమీ చెప్పటం లేదు,
  అవును సౌమ్య గారు,చాసో గారిది మీ ఇజనారం గాబట్టి గబాల్న పోల్సినారు,మరి ఇసాపట్నం వారిని పోల్సలేకపోనారేటీ సిత్రం

  ReplyDelete
 9. తెలీదని చెప్పిన వాళ్ళకి కూడా యేమైనా ఉన్నాయా బహు-మాణ్యాలు.?

  ReplyDelete