Wednesday, January 19, 2011

ఆ ఇంటర్వ్యూలలో ఉన్న ప్రముఖులు వీరే!!

ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చల్లా కృష్ణమూర్తి గారి కుమార్తె, డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారు తన పరిశోధక గ్రంథం "ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం" లో ఆయా సంస్థానాల సంగీతపోషణ గురించి విస్తృతంగా వివరిస్తారు. తన పరిశోధనలో భాగంగా చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసారు. ఆ ఇంటర్వ్యూ లు సంక్షిప్తంగా తన పుస్తకంలో ప్రచురించారు.

ఆ ఇంటర్వ్యూలలో ఉన్న ప్రముఖులు వీరే

 • శ్రీ పట్రాయని సంగీతరావు 
 • శ్రీ కోలంక వెంకటరాజు 
 •  శ్రీమతి చిలకమర్రి లక్ష్మీనరసమ్మ 
 • శ్రీ ద్వారం భావనారాయణరావు 
 • శ్రీ నాళం కామేశ్వరరావు 
 • శ్రీ పట్రాయని నారాయణమూర్తి 
 • శ్రీ పీసపాటి నరసింహం 
 • శ్రీమతి వాసా హైమావతి

అడగగానే ఆ ఇంటర్వ్యూలను / పూర్తి పుస్తకాన్ని  వెబ్సైట్లో ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు డాక్టర్ చల్లా విజయలక్ష్మి గారికి సహస్ర కృతజ్ఞతలు.

విడి ఇంటర్వ్యూలు ఎక్కడ చూడవచ్చు ? 

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "వ్యాసావళి " లింకు నొక్కి చూడవచ్చు.


పూర్తి పుస్తకం "సంస్థానములు" సెక్షన్లో చూడవచ్చు. ఈ పుస్తకంపై సర్వ హక్కులు డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారికే చెందుతాయనీ, ఎవరైనా వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవాలని తెలియచేసుకుంటున్నాను.


భవదీయుడు
వంశీ 

16 comments:

 1. వంశీ గారు: ఇక్కడో చిన్న చిక్కుంది. ముందు పైన పేర్కున్న మనుషులెవరో చెప్పాల్సిన అవసరముంది. పట్రాయని సంగీతరావు గారి పేరు ఇక్కడా, అక్కడా వినిపిస్తుంది కాబట్టి కొంచం తెలిసే అవకాశం వుండవచ్చేమో కానీ, మిగిలిన వాళ్ళ గురించి 2-3 లైన్ల పరిచయం రాయవలసి వుంటుంది :-).

  భవదీయుడు, శ్రీనివస్

  ReplyDelete
 2. శ్రీనివాస్ గారూ - :)

  ప్రముఖులు అని వదిలెయ్యటానికి ఓ కారణం ఉన్నది! ఎవరా ప్రముఖులు అని ఆసక్తి ఉన్నవాళ్లు - ఎంత మంది ఆ పోష్టు చదువుతారా అని ఆ పోష్టు వేసా! నా అనుమానం నిజమయ్యింది...బ్లాగర్ వాడి స్టాట్స్ చూస్తే సరిగ్గా 21 మంది....అందులోనూ వాడిచ్చేది హిట్సు కాబట్టి, ఒకాయనే 20 సార్లు నొక్కినా ఆశ్చర్యం లేదు....అది చూసాక, ఇద్దామనుకున్నవాణ్నే వివరాలు జతచెయ్యడం అనవసరమని ఆగిపోయా .... ఆసక్తి ఉన్నవాళ్లు ఎలాగూ తెలుసుకుంటారు.... :)

  వంశీ

  ReplyDelete
 3. ఆ 21 నొక్కుళ్లలో నాదొకటండోయ్

  ReplyDelete
 4. రాజేంద్ర గారూ - నొక్కినందుకు ధన్యం. ఈ ఇంటర్వ్యూలన్నీ క్రితం అక్టోబరులో వి.ఏ.కె.రంగా రావు గారి ఇంటర్వ్యూ పబ్లిష్ చేసినప్పుడే - దానికి తోడుగా చేసాను. రంగారావు గారి దానికి కూడా పెద్ద రెస్పాన్సు లేదు. అదే నేనేదన్నా ఏకుతూ రాసాననుకోండి, కుప్పలు కుప్పలు హిట్లు, వ్యూలు. అలాగే మీరు బట్టలిప్పిన హీరోయిన్ల గురించో, ఆయనెవడో "గీతాచార్య", "నిత్యానంద" స్కాముల గురించో మీ వైజాగు పత్రికలో రాసారనుకోండి బోల్డు హిట్లు, వ్యూలు..శ్రీ శ్రీ గురించి రాయండి - ఇద్దరో ముగ్గురో చూసేది...అదీ లెఖ్ఖ కాబట్టి, పి.ము.కొ లు పిచ్చి లోకం అని ఊరుకోటమే! :)

  ReplyDelete
 5. Sir, welcome to maaganti family ..superandee...naaku istamayina boldu paatalu dorikesaayi..nenu vinesaanu...chala chala thanks....

  ReplyDelete
 6. @ఎన్నెల - నచ్చినందుకు సంతోషం. ఉపయోగపడితే మరింత సంతోషం.

  వెన్నెల కన్నా చక్కగా ఎన్నెల అని పెట్టుకున్నారే - బాగుంది..

  ReplyDelete
 7. వంశీగారు,
  చివరి మూడు (హైమవతిగారిది, నాళంవారిది, లక్ష్మీ నరసమ్మగారిది) ఇంటర్‌వ్యూలు ఒక్క పేజీనే ఉన్నాయండి. అవి అంతేనా, లేక పి.డి.ఎఫ్‌లు అసంపూర్తిగా ఉన్నాయా?
  రిగార్డులతో,
  నాగరాజు

  ReplyDelete
 8. Vamsee gaaru thanks andee naa peru nachchinanduku...

  chinnappudu...mabbulu mabbulu mabbulochchinay paatato paatu, "raala lopal poolu poosina raama mandira leela" , inkaa "merupulu poovula dandagaa mabbulu mettani dindugaa" ani oka paata nerchukunnaanu. modati paataa pallavi tappa gurtu ledu..rendo paata baane gurtundi...meeku yee paatalu telusaa? vinaalanundi... thanks andee....

  ReplyDelete
 9. నాగరాజు గారు

  విజయలక్ష్మి గారి ప్రకారం, ఆవిడ సిద్ధాంత వ్యాసానికి ఉపయోగపడినంతమేరకు ఇంటర్వ్యూలున్నాయనీ, ఇక్కడున్నవి సంక్షిప్త రూపాలనీ - ఆ సంక్షిప్త రూపం వల్ల ఆ మూడు ఒక్కో పేజీనే...

  అసంపూర్తిగానే అనిపించినాయి నాకూనూ ....ఇంకొక ఇంటర్వ్యూ శ్రీ కాళహస్తి రామమూర్తి గారిది ఉన్నది (వీరు తిరుపతి సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసి చాలా ఏళ్ల క్రితమే రిటైరైపోయారు) ...అది ప్రచురించాలి సమయం చూసుకుని...

  ReplyDelete
 10. ఎన్నెల - మీరడిగిన పాటలకు నా వద్ద ప్రస్తుతం సాహిత్యం మటుకే ఉన్నది....ఎక్కడ చూడొచ్చా? లలిత సంగీతం - సాహిత్యం సెక్షన్లో...ఆడియోలు ఏ మహనుభావుడన్నా ఇస్తే ఇచ్చినట్టు...అప్పటిదాకా ప్రయత్నం చేస్తు ఉండటమే! జనాలని ఇవ్వండి బాబో అని చిరాకు పెదుతూ ఉండటమే! కొంతమంది బయటకు తిట్టి లేవు అని చెపుతే, కొంతమంది తిట్టుకుని ఇచ్చేవాళ్లు, కొంతమంది మనఃస్ఫూర్తిగా ఇచ్చేవాళ్లు, కొంతమంది పోనీలే ఇన్నిసార్లు అడుగుతున్నాడుగా ఏదో కొద్దిగా బిచ్చం వేద్దాం అనుకునేవాళ్లు - ఇలా రకరకాలు....ఏదేమైనా, ఎటువంటివారైనా నా సతాయింపును సహించి, సహాయపడ్డ మహానుభావులందరికి వేల వేల నమస్కారాలతో!

  ReplyDelete
 11. వంశీ గారు, కృతజ్ఞతలండీ, నేనూ ప్రయత్నిస్తాను..హహహ...నేనూ మీ పద్దతిలో ప్రయత్నిస్తాను..నాకు దొరికితే, మీకు పంపిస్తా..మంచి పాటలు వినిపించినందుకు, గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 12. నమస్కారాలండి.
  తెలుగుభాషాసేవ చేస్తున్న మీకు అభినందనలు తెలుపటంలో నాకెంతో సంతోషం.
  సప్తగిరిలో ఈ మధ్య పాటలపల్లకి అనే కార్యక్రమం మొదలయ్యిందండి. లలితసంగీత కార్యక్రమం. ఎప్పుడో చిన్నప్పుడు ఆకాశవాణిలో విన్న పాటలన్నీ ఇపుడు వింటుంటే హాయిగా ఉన్నది. ఆకాశవీణపై ఉదయరాగం..లాంటిపాటలు. ఇది సినిమా పాటల కార్యక్రమం కాదు.

  ReplyDelete
 13. "మబ్బులుమబ్బులు మబ్బులొచ్చినాయ్" పాటనిక్కడ వినవచ్చు:
  http://surasa.net/music/lalita-gitalu/air_rburra/Mabbulochinai.mp3

  మందాకిని గారు: సప్తగిరిలో ప్రసారమయ్యే "పాటలపల్లకి" కార్యక్రమంలో పాత పాటలు పాత గొంతుల్లో వినిపిస్తారా లేక ఆ సాహిత్యాన్ని కొత్త గొంతుకల్లో కొత్త వాద్యగోష్టితోనా!

  భవదీయుడు, శ్రీనివాస్

  ReplyDelete
 14. శ్రీనివాస్ గారు,
  కొత్తగాయకులు , వాద్య సహకారులు మన కళ్ళెదురుగా వీనులవిందు చేశారండి, నిన్న. (ఆదివారం)
  స్వరకర్త, గీతకర్తల పేర్లు చెప్తారు కాబట్టి ముందుగా సీడీలు విడుదల అయ్యుంటాయి వేరే ఎవరైనా పాడి.

  ReplyDelete
 15. శ్రీ పట్రాయని సంగీతరావు, శ్రీ పట్రాయని నారాయణమూర్తి గారు వీరిగురించి కొన్ని వివరాలు ఇక్కడ చూడండి.
  www.patrayani.blogspot.com

  ReplyDelete
 16. ఇంతకీ ఈ టపాలో ఇంకా వాళ్ళెవరో చెప్పనేలేదు!

  ReplyDelete