Monday, January 31, 2011

బోషాణం ఎత్తి మళ్లీ చూస్తూ ఉంటే - (1964) ???

బోషాణం ఎత్తి మళ్లీ చూస్తూ ఉంటే చివికిపోయిన పుస్తకరాజం ఒకటి కనపడింది. అదే ఇది -"శ్రీమన్మైసూర్ మహారాజాస్థాన ఋత్విగ్వరేణ్య గోమఠం శ్రీనివాసజ్యౌతిషిక తనూజేన గోమఠం రామానుజ జ్యౌతిషికేణ విరచిత "మహాన్యాసాది" నామకమిదం గ్రంథరత్నం - ముద్రాపితంసత్ విజయతెతరాం (1964) "

ఆశ్చర్యం కలిగించిన విషయాలేమనగా, అనగా నాకు వీరి వివరాలు తెలియకపోవటంచేత - 
1) ఒక తెలుగాయన (రచయిత తండ్రిగారు) మైసూరు మహరాజాస్థానంలో ఋత్విగ్వరేణ్యులుగా ఉన్నారని.....
2) వైష్ణవుడైయ్యుండి ఎంతో చక్కగా కేవలం ఆ పరమశివుడికి సంబంధించిన స్తోత్రపాఠాలు 450 పేజీల్లో వ్రాయటం. నమక, చమకాలు, రుద్రపాఠాలు వదిలెయ్యండి. అవి శ్రుతులు కాబట్టి - వేదపాఠశాలలో నేర్చుకున్నారనుకోవచ్చు. అవి వదిలేస్తే రుద్రుడికి సంబంధించిన మిగిలినవి ఎన్నో ఉన్నాయి ఆ 450 పేజీల్లో, ఇతర దేవతలతో సహా....అయితే రుద్రుడిదే సింహభాగం....

వీరి గురించిన ఇతర వివరాలు ఎవరైనా తెలియచేస్తే సంతోషం.

పాత స్కానరు వైష్ణవి చేతిలో పడి హర హర మహాదేవ అవ్వటంతో ఈ వారాంతం షాపింగు మీద పడాలనుకునేలోపు, టార్గెట్టు అనే స్టోరులో రిచర్డ్ చూ అనే కొలీగు - తనకు హెచ్.పి వారి డెస్క్ జెట్ ప్రింటర్, స్కానర్, కాపియర్ 7 డాలర్లకు దొరికింది (అవును 7 మాత్రమే!) అని చెప్పగానే వెళ్లి నేనూ ఒకటి ఎత్తుకొచ్చా....ఇహ నెమ్మదిగా ఒక్కోటి డిజిటైజేషను మొదలుపెట్టాలి........

UPDATE :

ప్రిం..స్కా... కా - 7 డాలర్లంటే నమ్మని వాళ్లకి ఫుటో ఇదిగో...అదిగో అల్లదిగో ఆ పైన, ఓ మూలకి ఎఱ్ఱ రంగు కాయితం - సిన్నది అంటించుందిగా...అక్కడ ఉంటాది...7.25 అని....ఆ పైన ఇది కొన్నందుకు 5 డాలర్లు ఆఫు, కార్ట్రిడ్జుల మీద ....కనపడకపోతే నా తప్పు కాదబ్బాయిలూ, నా ఐఫోను తప్పు....

5 comments:

 1. ఇప్పుడే! ఇప్పుడంటే ఇప్పుడే ఆ బొమ్మ చూసి మీ బోషాణాన్ని రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చేసుకుందాం అనుకున్నా కానీ చివర్లో ఆ స్కానింగ్ కథ చదివాక అనవసరంగా శ్రమెందుకులే అని ఊరుకుంటున్నా :)

  నిజమేనండీ.. ఇలాంటి పుస్తకాలు నెట్ లో వుంటే ఎవరోఒకరికి ఉపయోగ పడతాయి.

  ReplyDelete
 2. ఏవిటీ? ఏడుకే ప్రిం.స్కా.కా...దేవ్.డా

  టారుగెట్టులోనా...నేనూ ఎల్తా ఉన్నా ఇప్పుడే

  ReplyDelete
 3. మీ భోషాణం లో అమ్మో ఎన్ని వజ్ర వైడూర్యాలు.....మీరేమీ అనుకోనంటే మీ భోశానానికి కన్నం వేయాలనిపిస్తుంది:)

  ReplyDelete
 4. తెలుగు పండితులు మైసూరు రాజాస్థానంలో ఉండడం పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ శ్రీవైష్ణవులైనవారు నమకచమకాలే కాక ఇతర శివ స్తోత్రాలన్నింటినీ రాయడం ఆశ్చర్యమే. నా దృష్టికి వచ్చిన ఓ రెండు విషయాలు.
  1. నాచేతికి యాదృఛ్ఛికంగా చిక్కి, తరవాత నా జీవితంలో నిత్యభాగం అయిపోయిన ఒక ఆడియో సీడీ - పరాత్పరా పరమేశ్వరా అనేది - దీనిలో నమక, చమక, శివోపాసన మంత్ర, నమక ఘనాపాఠాలని అత్యంత శ్రావ్యంగా గానం చేసిన వారు, చలకీరె (చల్లకీరె?) సోదరులు, M.S. వేణుగోపాల్, శ్రీనివాస్ - వీరుకూడా మైసూరు ఆస్థాన విద్వాంసుల పుత్రులే, వైష్ణవులే.
  2. నా జీవితంలో ఒకే ఒక్కసారి తిరుమలలో సుప్రభాతసేవకి హాజరైనప్పుడు, సుప్రభాతం చదువుతున్న పండితులు ఐదుగురూ నామాలు కాకుండా విబూధి రేకలు ధరించి ఉండడం గమనించాను. సేవ ముగిసినాక వాళ్ళు బయట మండపంలో కూర్చుని ఉండగా అడిగాను. అప్పటివరకూ తిరుమల ఆలయంలో అర్చనాదికాలన్నీ వైష్ణవులే చేస్తారని అనుకునేవాణ్ణి. వారిలో ఒకాయన చెప్పారు. ఏదైనా స్తోత్రపాఠం చెయ్యాలి అంటే అగ్రతాంబూలం వేదపండితులకే, దక్షిణాదిలో వేదపాఠం అంటే స్మార్తులదే - అని. మరి మిగతా వైష్ణవాలయాల సంగతి నాకు తెలియదు గాని, తిరుమలలో వేద పఠన సంబంధమైన బాధ్యతలన్నీ స్మార్తులే నిర్వహిస్తారుట.

  ReplyDelete
 5. @భాస్కర్ రామిరెడ్డి - అవును, ఒక్కళ్లకు ఉపయోగపడ్డా చాలు

  @భాస్కర్ - అవును ఏడు డాలర్లే - మీ ఊళ్లో దొరికిందా?

  @భాను - కన్నం వెయ్యాలనుంది అని ఎవురన్నా టముకేస్తారా? పైగా ఏమీ అనుకోవద్దా? :)

  @కొత్తపాళీ - ఆ సి.డి వివరాలు ఇంకొద్దిగా పంచుకోండి...ఎక్కడ దొరికేది తెలిస్తే నేనూ తెచ్చుకుంటా.....అవును వేదపండితులే సమర్థులు అన్నిటికీ...మీ తిరుపతి ఎక్స్పీరియన్సు ఆశ్చర్యమే!

  ReplyDelete