Wednesday, January 19, 2011

బోషాణమెత్తితే మళ్లీ బయటపడ్డ నిధులు....1934, 1950, 1974.....

 


బోషాణమెత్తితే మళ్లీ బయటపడ్డ నిధులు......మళ్లీ చదువుకోవాలి.....

1950 - "భర్తృహరి సుభాషితం" పుస్తకం పరిస్థితి నాకు ఆశ్చర్యం కలిగించలా కానీ, వేదం వారి 1934 - "గ్రామ్యభాషాప్రయోగ నిబంధనం" పరిస్థితి చూసి బోల్డు ఆనందమేసింది. 1934లో ప్రచురించబడ్డ పుస్తకం ఇంకా తళతళలాడుతూ ఉన్నది. వేదం వారి పుస్తకం మీద అప్పుడెప్పుడో ఓ సినాప్సిస్ రాసుకున్నట్టు గుర్తు. వెతికి ప్రచురించాలి...ముందు బొమ్మలు చూస్కోండి....రివ్యూ తర్వాత ఇస్తా... :)

ఇహ 1974 - వడగళ్లు పుస్తకం దగ్గరకొస్తే ఆ పుస్తకం మా నాన్న దగ్గరినుంచి చిన్న బాబాయి హైజాక్ చేసి పేరు రాసేసుకుని, దాదాపు రెండున్నర దశాబ్దాలు అట్టిపెట్టేసుకున్నాడు... ఆయన దగ్గర నుంచి మళ్లీ ఎత్తుకొచ్చా రెండేళ్ల క్రితం...:)

7 comments:

 1. అవును, హైజాకింగ్ కి హైజాకింగే జవాబు! మంచికి రోజులు కావు.

  నాకూ మొన్న మా అమ్మమ్మ గారి పాత కావిడి పెట్టెలో "తెలుగు నుడి-నానుడి" అన్న పుస్తకం దొరికిందండీ! అట్ట లేదు. రచయిత బి.స. బంగారయ్య అని ఉంది. తెలుగు నానుడి వెలువరింతలు-బెజవాడ అనుంది. యాభైల్లో వేసిన పుస్తకం!

  ముందు పేజీలో ఇలా ఉంది "తల్లి నుడిని మరిచిన జాతి చచ్చిన జాతి"! భలే
  గా అనిపించింది చదువుతుంటే!

  ఇలా అప్పుడప్పుడు నిధులు దొరకడం గొప్పగా ఉంటుంది.

  ReplyDelete
 2. వంశీ గారు:

  మీ భోషాణ దర్శనం ఎలా?

  పైన మీరు చూపించిన టైటిళ్ళలో సత్యనారాయణ బుక్ డిపో వారి భర్తృహరిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అది నా బడి జ్ఞాపకాలని తట్టిలేపింది. అందులోంచి రోజూ కొన్ని పద్యాలు కూర్చోబెట్టి మరీ భట్టీయం వేయించిన మా నాన్నగారు మళ్ళీ గుర్తొచ్చారు.

  మనసుకి ఆ వెసులుబాటునిచ్చిన మీ టపాకి ధన్యవాదాలు.

  ReplyDelete
 3. @సుజాత - అట్ట లేకపోయినా పుస్తకం పుస్తకమే, అందులోనూ యాభైల్లోది కాబట్టి బి.స.బంగారయ్యగారి ఆ పుస్తకం గురించి పరిచయం, అందులోని ముత్యాలు చూడాలని ఉన్నది. టపా వేసాక తెలియపరిస్తే సంతోషం.

  @అఫ్సర్ గారు - ఆ బోషాణ దర్శనం నా ఒక్కడికే పరిమితం. కాబట్టి మీ కోరిక తీరడం అసాధ్యమే! :) ఈ టపా మీకు ఏదో ఒక రకంగా వెసులుబాటు కలిపించినందుకు సంతోషం. ధన్యవాదాలు.

  ReplyDelete
 4. నేను వేరే వాళ్ళ భోషాణ దర్శనం చేసొచ్చా ఆమధ్య. పబ్లిగ్గా ఫొటోలు పెట్టేద్దామా అని ఆలోచిస్తున్నా... ;)

  ReplyDelete
 5. @సౌమ్య - సంతోషం. బాబాయిల బోషాణాలు, వేరేవాళ్ల బోషాణలు పబ్లిక్కు చేసెయ్యటం మంచిదే! :)

  లఘుదర్శనం, శీఘ్రదర్శనం ఉండేవి నా వద్ద....కానీ మనోళ్లు ఎక్కడున్నా ఒకటే కాబట్టిన్నూ, నా దగ్గరున్న పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు ఎత్తుకుపోబట్టిన్నూ, అందరికీ దర్శనం బంద్ చేసిపారేసా! అదీ సంగతన్నమాట...

  ReplyDelete
 6. వంశీ గారు: పైన పేర్కున్న పుస్తకాల్లో వేదంవారి "శారదాకాంచిక" నా దృష్టిలో అరుదైన పుస్తకం. నా వరకు అది తప్పించి మిగిలిన పుస్తకాలన్నీ తెలుసు (/వున్నాయి). పుస్తకం scan చేయడానికి వీలైన స్థితిలో వుంటే, నాకో మైలు పంపండి. 2006 లో ఈ క్రింద సంచిక వెలువడినప్పుడు, ఈ మొత్తం చరిత్ర పైన ఒక bibliographic essay లాంటిది రాస్తానని మాటిచ్చాను. అప్పటినుండి రాస్తూనే వున్నాను. అంటే బద్ధకం అని కాదు :-), ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు బయటపడుతున్నాయి. అవి చదవకుండా మరి నేను రాయకూడదు కాబట్టి, అలా నా వ్యాసరచన సాగుతూ పోతుంది.

  http://www.eemaata.com/em/category/issues/200806/

  భవదీయుడు, శ్రీనివాస్

  ReplyDelete
 7. వంశీ గారు: Just found that "శారదా కాంచిక" is indeed on DLI and ofcourse immediately grabbed it. You need not send it! Anyway have an exciting time reading the FIGHTS between Gidugu vs Vedam.

  Regards,
  Sreenivas

  ReplyDelete