Monday, January 31, 2011

బోషాణం ఎత్తి మళ్లీ చూస్తూ ఉంటే - (1964) ???

బోషాణం ఎత్తి మళ్లీ చూస్తూ ఉంటే చివికిపోయిన పుస్తకరాజం ఒకటి కనపడింది. అదే ఇది -"శ్రీమన్మైసూర్ మహారాజాస్థాన ఋత్విగ్వరేణ్య గోమఠం శ్రీనివాసజ్యౌతిషిక తనూజేన గోమఠం రామానుజ జ్యౌతిషికేణ విరచిత "మహాన్యాసాది" నామకమిదం గ్రంథరత్నం - ముద్రాపితంసత్ విజయతెతరాం (1964) "

ఆశ్చర్యం కలిగించిన విషయాలేమనగా, అనగా నాకు వీరి వివరాలు తెలియకపోవటంచేత - 
1) ఒక తెలుగాయన (రచయిత తండ్రిగారు) మైసూరు మహరాజాస్థానంలో ఋత్విగ్వరేణ్యులుగా ఉన్నారని.....
2) వైష్ణవుడైయ్యుండి ఎంతో చక్కగా కేవలం ఆ పరమశివుడికి సంబంధించిన స్తోత్రపాఠాలు 450 పేజీల్లో వ్రాయటం. నమక, చమకాలు, రుద్రపాఠాలు వదిలెయ్యండి. అవి శ్రుతులు కాబట్టి - వేదపాఠశాలలో నేర్చుకున్నారనుకోవచ్చు. అవి వదిలేస్తే రుద్రుడికి సంబంధించిన మిగిలినవి ఎన్నో ఉన్నాయి ఆ 450 పేజీల్లో, ఇతర దేవతలతో సహా....అయితే రుద్రుడిదే సింహభాగం....

వీరి గురించిన ఇతర వివరాలు ఎవరైనా తెలియచేస్తే సంతోషం.

పాత స్కానరు వైష్ణవి చేతిలో పడి హర హర మహాదేవ అవ్వటంతో ఈ వారాంతం షాపింగు మీద పడాలనుకునేలోపు, టార్గెట్టు అనే స్టోరులో రిచర్డ్ చూ అనే కొలీగు - తనకు హెచ్.పి వారి డెస్క్ జెట్ ప్రింటర్, స్కానర్, కాపియర్ 7 డాలర్లకు దొరికింది (అవును 7 మాత్రమే!) అని చెప్పగానే వెళ్లి నేనూ ఒకటి ఎత్తుకొచ్చా....ఇహ నెమ్మదిగా ఒక్కోటి డిజిటైజేషను మొదలుపెట్టాలి........

UPDATE :

ప్రిం..స్కా... కా - 7 డాలర్లంటే నమ్మని వాళ్లకి ఫుటో ఇదిగో...అదిగో అల్లదిగో ఆ పైన, ఓ మూలకి ఎఱ్ఱ రంగు కాయితం - సిన్నది అంటించుందిగా...అక్కడ ఉంటాది...7.25 అని....ఆ పైన ఇది కొన్నందుకు 5 డాలర్లు ఆఫు, కార్ట్రిడ్జుల మీద ....కనపడకపోతే నా తప్పు కాదబ్బాయిలూ, నా ఐఫోను తప్పు....

Thursday, January 27, 2011

Yester-Year Women Writers - అపురూపమైన ఫోటోలు

ఆకాశవాణి ప్రముఖులలో ఒకరైన శ్రీమతి తురగా జానకీరాణి గారు తన పర్సనల్ ఆల్బం లోనుంచి పంచుకున్న ఫోటోలు మీ కోసం. ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలతో....


ఈ ఫోటో గురించి ఆవిడ మాటల్లోనే

Women Writers with the then President Dr.Sarvepalli Radhakrishnan at Rastrapati Nilayam, Secunderabad, 1963

In this photo: Janaki Rani Turaga, Ramalakshmi Arudra , Actress Bhanumathi, Dr Sarvepalli, Utukuri Lakshmi Kanthamma, Dr. Bezwada Gopala Reddi, Yellapragada Seethakumari, Nayani Krishna Kumari, Illindala Saraswathidevi, Pakala Yashoda Reddi

ఈ ఫోటో గురించి ఆవిడ మాటల్లోనే

Women Writers, 1963 - the first advisory committee of women writers to the AP Sahitya akademi, Soon after the first All India Women Writers Conference this committee was formed. The First All India Conference was inaugurated by Vijayalakshmi Pandit at Ravindra Bharathi, Leelavathi Munshi attended . I was the Joint Secretary.

In this photo: Ranganayakamma, Pakala Yashoda Reddy, Raghavamma Brahmananda Reddy, actress Bhanumathi, Illindala Saraswathidevi, Janaki Rani Turaga, Utukuri Lakshmi Kanthamma, Tenneti Hemalathaఅపురూపమైన ఫోటోలు పంచుకున్నందుకు, అడగగానే అనుమతి ఇచ్చినందుకు ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలతో....

భవదీయుడు
వంశీ

Friday, January 21, 2011

ఊరించటానికి ముచ్చటగా మూడు బొమ్మలు....

కొత్త సంవత్సరం మొదలయ్యాక చదివిన పుస్తకాల జాబితా ఇదీ...అన్నీ ఓ సారో, నాలుగు సార్లో చదివేసినవే  అయినా, చదివిన ప్రతిసారీ కొత్త అనుభవం, కొత్తవి నేర్చుకోవటం...

 • అమరకోశం - 1951 - జనమంచి వేంకట సుబ్రహ్మణ్య శర్మ
 • తెలుగు జానపద గేయ సాహిత్యం - 1958 - బిరుదురాజు రామరాజు
 • ధనుర్విద్యా విలాసం - వేటూరి ప్రభాకర శాస్త్రి
 • నవ్యాంధ్ర సాహిత్య వీధులు - 1994 - కురుగంటి సీతారామయ్య
 • "భావన" సుభాషితాల సంకలనం - 1974 - యువభారతి ప్రచురణ
 • ప్రసంగ సాహితి - 1978 - డాక్టర్ ఎస్.గంగప్ప
 • అశోకం - 1934 - ముద్దుకృష్ణ
 • ఉపన్యాస దర్పణం - 1936 - నందిరాజు చలపతి రావు
 • కపోత వాక్యము యక్షగానం - 1986
 • స్త్రీల గేయములలో సంప్రదాయము - 1986 - డాక్టర్ చింతపల్లి వసుంధరా రెడ్డి
 • హరి వినోదము - 1949 - కవికొండల వేంకటరావు
 • వ్యాసవాణి - 1984 - వేలూరి శివరామ శాస్త్రి
 • నర్మదా పురుకుత్సీయము - 1909 - పానుగంటి
 • మాఘ కావ్యము - 1914 - వావిళ్ల వారి ప్రచురణ
 • పాంచాలీ స్వయంవరం - 1918 - ధర్మవరం రామకృష్ణమాచార్యులు

హేమిటీ ? హిన్ని హుస్తకాలే హని హడుగుతారేమో! హవును హన్ని హుస్తకాలూనూ!

4 (వారాంతపు) దినాలు, మార్టిన్ లూథర్ కింగు శలవ, - ఆంగ్ల సంవత్సరీకాలు, వెధవ తత్ దినాలు, తద్దినాలూ నేను జరుపుకోను కాబట్టి - సంవత్సరం మొదటి మూడు రోజులు శలవలు, అన్ని కలిపి మాంఛి దట్టంగా, దిట్టంగా కలిసొచ్చినాయి... అదండీ సంగతి...కొచ్చెనేసేముందే సమాధానం వచ్చింది కాబట్టి....ఇహ....తమరు...

ఇహ....ఊరించటానికి ముచ్చటగా మూడు బొమ్మలు ఈ క్రింద..Wednesday, January 19, 2011

ఆ ఇంటర్వ్యూలలో ఉన్న ప్రముఖులు వీరే!!

ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చల్లా కృష్ణమూర్తి గారి కుమార్తె, డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారు తన పరిశోధక గ్రంథం "ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం" లో ఆయా సంస్థానాల సంగీతపోషణ గురించి విస్తృతంగా వివరిస్తారు. తన పరిశోధనలో భాగంగా చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసారు. ఆ ఇంటర్వ్యూ లు సంక్షిప్తంగా తన పుస్తకంలో ప్రచురించారు.

ఆ ఇంటర్వ్యూలలో ఉన్న ప్రముఖులు వీరే

 • శ్రీ పట్రాయని సంగీతరావు 
 • శ్రీ కోలంక వెంకటరాజు 
 •  శ్రీమతి చిలకమర్రి లక్ష్మీనరసమ్మ 
 • శ్రీ ద్వారం భావనారాయణరావు 
 • శ్రీ నాళం కామేశ్వరరావు 
 • శ్రీ పట్రాయని నారాయణమూర్తి 
 • శ్రీ పీసపాటి నరసింహం 
 • శ్రీమతి వాసా హైమావతి

అడగగానే ఆ ఇంటర్వ్యూలను / పూర్తి పుస్తకాన్ని  వెబ్సైట్లో ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు డాక్టర్ చల్లా విజయలక్ష్మి గారికి సహస్ర కృతజ్ఞతలు.

విడి ఇంటర్వ్యూలు ఎక్కడ చూడవచ్చు ? 

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "వ్యాసావళి " లింకు నొక్కి చూడవచ్చు.


పూర్తి పుస్తకం "సంస్థానములు" సెక్షన్లో చూడవచ్చు. ఈ పుస్తకంపై సర్వ హక్కులు డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారికే చెందుతాయనీ, ఎవరైనా వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవాలని తెలియచేసుకుంటున్నాను.


భవదీయుడు
వంశీ 

బోషాణమెత్తితే మళ్లీ బయటపడ్డ నిధులు....1934, 1950, 1974.....

 


బోషాణమెత్తితే మళ్లీ బయటపడ్డ నిధులు......మళ్లీ చదువుకోవాలి.....

1950 - "భర్తృహరి సుభాషితం" పుస్తకం పరిస్థితి నాకు ఆశ్చర్యం కలిగించలా కానీ, వేదం వారి 1934 - "గ్రామ్యభాషాప్రయోగ నిబంధనం" పరిస్థితి చూసి బోల్డు ఆనందమేసింది. 1934లో ప్రచురించబడ్డ పుస్తకం ఇంకా తళతళలాడుతూ ఉన్నది. వేదం వారి పుస్తకం మీద అప్పుడెప్పుడో ఓ సినాప్సిస్ రాసుకున్నట్టు గుర్తు. వెతికి ప్రచురించాలి...ముందు బొమ్మలు చూస్కోండి....రివ్యూ తర్వాత ఇస్తా... :)

ఇహ 1974 - వడగళ్లు పుస్తకం దగ్గరకొస్తే ఆ పుస్తకం మా నాన్న దగ్గరినుంచి చిన్న బాబాయి హైజాక్ చేసి పేరు రాసేసుకుని, దాదాపు రెండున్నర దశాబ్దాలు అట్టిపెట్టేసుకున్నాడు... ఆయన దగ్గర నుంచి మళ్లీ ఎత్తుకొచ్చా రెండేళ్ల క్రితం...:)

Monday, January 17, 2011

పిల్లల పాటలు వినాలనుకున్నవారు !!!

"విద్యార్థి సృజన కుటీర్ - విజయవాడ" ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.వి.కృష్ణగారు, పాఠశాల చిన్నారులతో పాటలు పాడించి - మంచి క్వాలిటీతో రికార్డు చేయించి, అందరితో పంచుకుని ఆ చిన్నారులకు అమితమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు....

మరి ఆ పిల్లల పాటలు వినాలనుకున్నవారు ఎక్కడ వినొచ్చు?

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పిల్లల పాటలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు


పిల్లలకు మీ అభినందనలు తెలియచెయ్యాలంటే ప్రధానోపాధ్యాయులకు malkrigama @ gmail.com  ఈమెయిలు చెయ్యండి.

భవదీయుడు
వంశీ

Wednesday, January 12, 2011

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన నాలుగు ఆణిముత్యాలు - నాటకాలు

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన నాలుగు ఆణిముత్యాలు. డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో...

అవి వరుసగా - బొందితో కైలాసం, ఇంటి నంబరు , ఊహల పల్లకీ , తస్మాత్ జాగ్రత్త  నాటకాలు


**************************************************
తస్మాత్ జాగ్రత్త నాటకం వివరాలు


విజయవాడ కేంద్రం ప్రసారం
రచన: శ్రీ జంధ్యాల
నిర్వహణ: శ్రీ శంకరమంచి సత్యం

ఇందులో నటించినవారు:

శ్రీ శనగల కబీర్ దాసు
సి.రామ్మోహన రావు
కుమారి వి.బి.కనక దుర్గ
శ్రీ నండూరి సుబ్బారావు
శ్రీ విన్నకోట విజయరాం
శ్రీ ఏ.ఆర్.ఎస్.శర్మ
శ్రీ రామినేని రాధాకృష్ణ
శ్రీ పేరి కామేశ్వర రావు
శ్రీ లక్కా నరసింగ రావు
శ్రీ జి.శ్రీనివాస మూర్తి

************************************************

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ