Monday, November 22, 2010

ఈ సంకలనాలేమిటో, సంగ్రహాలేమిటో, కలగూరగంప అచ్చులేమిటో! తద్దినం తగలెయ్య!

ఈ సంకలనాలేమిటో, సంగ్రహాలేమిటో, కలగూరగంప అచ్చులేమిటో! తద్దినం తగలెయ్య!

సమయం దొరికితే చాలు ఈ మధ్యన ప్రతి సాహిత్య సంఘం, వాటితో పాటు కొద్ది మంది మనుషులు  - పెద్ద సంఘం, చిన్న సంఘం, పెద్ద మనిషి, చిన్న మనిషి  తేడాల్లేకుండా గుత్తగుంపేసి బతుకమ్మలోలా కాకపోయినా ఏదో రకంగా చప్పట్లు కొట్టుకుంటూ, కొట్టించుకుంటూ, చెవిలోకి కాకుండా తమ బుఱ్ఱల్లోకి చేరిన జోఱీగల వ్రాతలు నెత్తినెట్టుకోని, మాకు నచ్చినవి అచ్చేస్తాం. ఆ అచ్చుపోతలకు, ఎత్తిపోతలకు బాబూ మీ డబ్బులివ్వండి. మా డబ్బులడక్కండి. మా సంఘానికి బొక్కెట్టే ఆలోచనకో రూపం ఇచ్చాం. అదెవ్వడికీ తెలీదు. మీ డబ్బులు ఆడెవడో పబ్లిషరు కాకుండా మా బంధువుల్లోని పబ్లిషరుకే ధారపోసి, సాయం జేసి, ఆతర్వాత పనీ పాట లేకుండా మీరుంటారని మీకు ఆహ్వానం పంపించి ఇకిలిస్తాం. మీ సకిలింపుతో మా పనికిమాలిన ఆహ్వానాన్ని మన్నించి పొద్దుపోని మా సభకొస్తే మీరిచ్చిన డబ్బుతో మీకు కొద్దిగా మేత వేస్తాం. మేత మెక్కి, కుడితి తాగి మీ మొహాన తగలేసిన పుస్తక ప్రతులు తీసుకెళ్లి పాత పేపర్లోడికి అమ్ముకోండి. ఈ మధ్య అమెరికా బాంకులోళ్లు ఖర్చు చేసిన మీ డబ్బుల్లో ఐదు శాతం తిరిగిస్తాం. ఖర్చు చెయ్యండి బాబులూ అంటున్నట్టు, ఈ సంగ్రహసంకలనాలకు మీరిచ్చిన డబ్బుల్లో రెండు శాతం మా ఏజంటు ఆ పాతపేపర్లోడి దగ్గరనుంచి వెనక్కు తెచ్చుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇకిలింపులకి ఇప్పట్నుండే సిద్ధమైపోండి. ఈ సంవత్సరం రాజపోషకులు కాబట్టి, వచ్చేసంవత్సరం మహరాజ పోషకులో వీలైతే సార్వభౌమ పోషకులో అవ్వండి. మీకో కత్తి ప్రదానం చేయిస్తాం. అదుచ్చుకుని గాడిదెక్కి మెళ్లో మేమిచ్చిన బిళ్లేసుకుని మీ ఊళ్లో జరిగే ప్రతి సభకు పోండి. మీ ప్రతిష్ట ఇనుమడింపచేసుకోండి. కొద్దిరోజుల్లో బిచ్చగాడైపోండి.

అలా పోయే ముందు ఓ మాట - సభలకు ప్రచారం కలిపించే బాధ్యత మటుకు మాదే. నిప్పులు రాజేసైనా సరే, తెలంగాణా సంగతి ఎత్తైనా సరే, సినిమాల లెవెల్లో హైపులు కల్పించే తద్దినాలు మా దగ్గరున్నాయి. మీరు కూడా పిండాలు పెట్టానుకుంటే, మా దగ్గరకొచ్చి మాఱుమాట లేకుండా సకిలించండి. కావలసిన నువ్వులు, బియ్యం, బియ్యపన్నం తినడానికి కాకులు సప్ప్లై చేస్తాం.

ఫలశ్రుతి:
సంకలనాస్సమస్తా స్సుఖినోభవంతు
సంపాదకస్సమస్తా స్సుఖినోభవంతు
సాహిత్యసభాస్సమస్తా స్సుఖినోభవంతు
ధనసాయాస్సమస్తా ద్దరిద్రోభవంతు

దిక్కుమాలిన కామెంట్లు పెట్టేముందు బ్లాగులో అల్లదిగో , పైన, కుడిపక్కనున్న నిర్దాక్షిణ్య సంగతి చదవండి. తర్వాత ఏడవొద్దు.

11 comments:

 1. lol, సంకలనాలమీద గుఱ్ఱుమంటున్నారేంటండోయ్?

  ReplyDelete
 2. @ భరద్వాజ్ గారు - గుఱ్ఱేమిటి? బఱ్ఱున చీది - ఎంత ఓ గంగాళమంత - మీద పారేయ్యాలనిపిస్తోంది ఈ దిక్కుమాలిన సంఘాల మీదాని మీదా! వెధవ గోలాని వెధవ గోల!

  ఈ సంవత్సరంలో వచ్చిన కథలన్నీ ఓ పుస్తకం వేద్దామండీ అని ఒహడు, గత ఐదేళ్లలో వచ్చిన కథల్లో నుండి ఏరుకున్న గొట్టాం కథలు వేద్దామని ఒహడు, పదేళ్లలో వచ్చిన కొత్తెం కథలు వేద్దామని ఒహడు, ఇరవై ఏళ్లలో వచ్చిన కథల్లో తొట్టి కథల్లో కొన్ని వేద్దామని ఒహడు - ఆ పైన డబ్బుల కోసం ఒహడు, సభకి టికెట్లెడతాం అవి అమ్మిపెట్టండి అని ఒహడు, సభలకొస్తూ ఓ ఇరవై మందికి మీరు ఏదన్నా వండి తీసుకొస్తే బావుంటుందని ఒహడు.....

  సత్రకాయ గోలాని సత్రకాయ గోల....

  పోనీ ఆ కథలేవన్న చదవనివా? చదివిన చచ్చు పుచ్చు వంకాయలే! ఆ వంకాయలే మా పాలిట గుత్తి వంకాయలు అంటాడు ఒహ సంపాదకుడు, ఆ పుచ్చులే మా ముచ్చులు అంటాడు ఒహ సంకలనకారుడు, అబ్బో మా గురువుగారివి వెయ్యలేదా అని ఒహడు, ఆహా మా గురువుగారివి వేసానని ఒహడు, ఆ గురువు గారి డప్పు వాయింపు కోసం ఒహడు......చిత్తడి చిత్తడిగా చిరాకొచ్చేస్తోందనుకోండి...


  చిలమకూరు విజయమోహన్ :)

  ReplyDelete
 3. నిజమే..ఆపుడెప్పుడో..అమితాబ్ బచ్చన్..పార్లమెంట్ ని సెస్స్ పూల్ అని అన్నందుకు చాల మందికి కోపం వచ్చింది. ఇక ఈ భాగ్యనగరంలో అంటారా..కొందరు మీరన్నట్టు తయారయ్యారు.

  ఒక ప్రొఫెషన్‌గా మీ పుస్తకాన్ని మీకోసం ప్రచురించిపెడతాం అన్న వెధవలు కూడ, డబ్బు బొక్కేసి, కనీసపు ప్రమాణాలను కూడ పాటించకుండా నాసిరకం పుస్తకాన్ని బయటకు లాగేస్తున్నారు. బలిపశువులు పాపం చెప్పుకోలేరు, ఏడవలేరు.

  ఇప్పుడు మరోక జాడ్యం అంటుంకుంది.

  కాపి రైటులేని పుస్తకాల మీద పడింది వీరి దృష్టి. కనీసం కుటుంబ సభ్యులకో / వారసులకో కూడా తెలియజేయాలన్న కానీసపు ఇంగిత జ్ఞానం లేని పందికొక్కులు బయలుదేరారు.

  బ్రతికి ఉండగానే, అట్టలు మార్చి పుస్తకాలని ప్రచురించారు. పైగా దేశం మీద పడి, డబ్బులివ్వండి..ఫలాన వారి పుస్తకం నేను వేస్తూన్నాను అని. దానికంటే దుర్మార్గం ఏదేనా ఉంటుందా?

  ప్రఖ్యాతి చెందిన ప్రచురణ సంస్థలు కూడా దీనికి అతీతం కాదు.

  కానీ అందరిని ఒకే గాటకట్టలేము.

  ReplyDelete
 4. అనిల్ గారూ

  అవును, మీరన్న జాడ్యం కూడా చెవిన పడింది.... అనవసరంగా బి.పి పెంచుకోని అవి అన్నీ ఎక్కడ రాస్తాంలే అని ఊరకున్నా....ఎక్కడిదాకానో ఎందుకు మా బంధువుల్లోనే ఉన్నారు ఈ ముచ్చుకోతుల్లో ఒకరిద్దరు! మిగిలిన 98 మంది సంత - తెలిసిన జనాభా !

  ఇందులో రకాలు కూడా - తలపొగరు జనాభా! ధనమద జనాభా! కులకంపు జనాభా! స్వయంసేవ చేసుకునే ఈ పీనుగులతో ఏదన్నా అంటే - నీకేం తెలుసు మా వంకాయల గురించి అంటారు

  గాటన కట్టలేమన్న సంగతి ఒప్పుకున్నా....ఆ శాతం గడ్డిలో సూదే!

  కామెంటుకు ధన్యవాదాలు

  ReplyDelete
 5. చప్పట్లు, చప్పట్లు! ఇటీవలే సొంత డబ్బాతో వేసుకున్న ఒక కథా సంకలనం చదివి ఫ్రెష్ గా చీదరించుకుని ఉన్నానేమో, ఈ టపా గ్లూకోజ్ లా కాస్తంత శక్తి ఇచ్చింది.

  ఈ మధ్య నేను చదివిన సంకలనాల్లోని కథల్లో చాలా వరకూ ఒకసారి చదవడమే దండగ అనిపించే కథలు! వాటిని మళ్ళీ మళ్ళీ బలవంతంగా చదివించే ఎజెండా ఏమిటో! ఎవరు చదవమన్నారు అనడగండి....నేనే తెలీక కొనుక్కున్నా, మచి సరుకేమైనా ఉంటుందేమో అని!

  ReplyDelete
 6. "దిక్కుమాలిన కామెంట్లు పెట్టేముందు బ్లాగులో అల్లదిగో , పైన, కుడిపక్కనున్న నిర్దాక్షిణ్య సంగతి చదవండి. తర్వాత ఏడవొద్దు"- ఈ కుడిపక్కనేమిటో తెలియలేదు. వ్యాఖ్య పెడదామన్నా, మరీ చివాట్లు తినాలేమో అని ఓ భయం!
  కొత్తపాళీ గారు వ్రాసినట్లు-- What is this about?

  ReplyDelete
 7. @హరేఫల గారు
  ఆ కుడిపక్కన ఇదే
  "
  ఈ బ్లాగులో ఏ టపాకైనా - ఆ టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. నిర్దాక్షిణ్యంగా తీసివెయ్యబడతాయి. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.
  "

  హేమిటో, భయపెట్టి మరీ బ్లాగులు నడుపుతున్నారు :)

  ఈ టపా అరదం చేసుకొవడానికి నేనింకా ఎదగాలేమో(బ్లాగుల్లో). పొనీలే ఏదో ఒకటి కామెంటుదామా అంటె ఆ తర్వాతి వచ్చే మాటలు విన(కన)లేను.

  ఏదో మీకోసం పెట్టా ఇప్పుడు (FYI) :)

  ReplyDelete
 8. @ రాజేశ్ - భయపెట్టడం మా ఇంటా వంటా లేవు, భయపడ్డం మీ ఇంటా వంటా ఉంటే తప్ప...నాకోసం ఇటేపు వచ్చినందుకు ఆనందం, పరమానందం! :)

  @ సుజాత - :) సరుకులు సవరాల్లాంటివి....ఎక్కువైతే ఎబ్బెట్టు! మరి తక్కువైతే? - కాబట్టి సరుకుల సవరాలు, చూడకుండా కొనుక్కునే వాళ్లదే పూర్తి బాధ్యత.... :)

  @ కొత్తపాళి - ఊదర, ఊదర - ఊదరగొట్టేస్తున్నారండీ ఈ మధ్య ఈ సంకలనాలతో. వీళ్లను తగలెయ్య.....బ్లాగుల్లో, యాహూ గ్రూపుల్లో, గూగులు గ్రూపుల్లో కూడా ఈ సంత మొదలయ్యింది....సాహిత్యసేవ చేస్తున్నామన్న పేరుతో రోజుకో పీడ ఈమెయిలు, వాటికి తోడు డబ్బు పీడింపు ఫోన్లు ఒహటి....చదవలేక అవతలపారేసిన పుచ్చు వంకాయలకి మళ్లీ డబ్బులివ్వటమేమిట్రా అని అంటే, అందులో ఓ వంకాయ కథ మీరు చదవలేదు కాబట్టిన్నూ, మావాడు వ్రాసింది అందులోకెక్కించాను కాబట్టిన్నూ, గత ఇరవై ఏళ్లలో ఇలాటి సంకలనం రాలేదంటూ - మీకిష్టమున్నా లేకున్నా కొనాల్సిందే అని చిరాకు పెడుతున్నారండీ బాబూ.....కొనను అంటే నిందలు. ఆపైన నీకు సాహిత్యమంటే తెలుసా? ఈ సంకలనానికి సంపాదకులు ఎవరనుకున్నావు? భాఘా "పేరు" ఉన్నవాళ్లు. వాళ్లవి కొనకపోతే ఎవడివి కొంటావు నువ్వు...సాయం చెయ్యలేవూ, కులద్వేషి అని లేనిపోనివి అంటగడుతూ - చూస్తాం, బహిష్కరిస్తాం! అని బెదిరింపులు ఒహటి.... మిగతా కారణాలు వివరంగా తర్వాత ఎప్పుడైనా...

  @ హరేఫల - కొత్తపాళీ గారికిచ్చిన సమాధానం చూడండి...

  ReplyDelete
 9. హ్మ్.. నాకిక్కడ ప్రస్తుతానికి ఇల్లు(బ్లాగు) లేదు, వంట(టపా) అసలే లేదు.

  ఇంక భయమంటారా, అది భక్తితో కూడి గౌరవం వల్ల వచ్చిన భయం, అందునా పెద్దల యెడల. ఎప్పుడైనా ఎకసెక్కాలు చేస్తే ఏదో చిన్నవాణ్ణి మన్నించండి.

  మీరు బదులు ఇచ్చినందుకు నాకు ఆత్మానందం.

  మొత్తమ్మీద హిప్పుడు అరదం అయింది, ఈ సంకలనాల 'ఇతి' బాధ.

  ReplyDelete