Tuesday, November 9, 2010

చంకల రవికలో సొగసు దేనిది? చంకదా? రవికదా?

 
శ్రీ కవికొండల వేంకటరావుగారి గురించి తెలుగు సాహిత్యం అన్న మాట తెలిసినవాళ్లకు చెప్పాల్సిన పని లేదు.

ఆయన 1949 లో వ్రాసిన "హరివినోదము" అనే రచన నుండి సంగ్రహించిన "కంద కుక్షి" అనే భాగం ఇక్కడ చూడవచ్చు.


ఆ రచన నుంచి నా కుక్షిలో బాగా అతుక్కుపోయిన బోల్డు కందాల్లో కొన్ని కంద ముత్యాలు:


నల్లికి నెత్తురు సత్తువ
యుల్లికి వాసనలుసత్తు, వూరూరెగిరే
పుల్లాకుకు సుడి గాడుపు
లిళ్ళవెనుక సత్తువిచ్చు, నెవరెంత్రుహరీ?






పప్పున్నద యుప్పున్నద
ఇప్పొద్దున గూరగలద యేమే? యనుచున్;
ధప్పళమును వడియమ్ములు
తప్పక వేయించువాడు తగుగేస్తుండౌ.






పులికిం గ్రౌర్యము మిక్కిలి
చలిక్రౌర్యము దానిమించు జలిచే వణికె
యలనాయకు గవయని చెలి
పొలయలుకనుజెలగు క్రౌర్యము పులికె చలియౌ.




ఈ కింది ప్రశ్నలకు సమాధానమివ్వుడి -
నావి కావు, కవికొండల వారివే -


అప్పటికి వింతపోకడలు పోతున్న వేషభాషల గురించి ఆయన తన రీతిలో ప్రశ్నించిన తీరు చూడండి


చంకల రవికలో సొగసు దేనిది? చంకదా? రవికదా?
వంక కొప్పులో పొంకము వంకదా? తలదా?


 
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

4 comments:

  1. చంకల రవికలో సొగసు దేనిది? రవికదా?/surelyచంకde-endukante adi praanamunna di kaabatti.

    ReplyDelete
  2. @మాగంటి వంశీ మోహన్ గారు

    ఇంతకీ మీ స.ధా ఎమిటి దీనికి?

    ReplyDelete
  3. ఇక్కడ రవికలు లేవు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానమివ్వలేకున్నా క్షమించండి. :)

    పద్యాలు మాత్రం సూపరో సూపరు

    ReplyDelete
  4. vamsi mohan garu.. mee blog tholisaarigaa..choosthunnaanu. chaalaa baagundhi ani.. chinna maatalo cheppadam chaaladhemo.. visthruthamgaa choosi.. chadhivi.. mari konthamndhiki parichayam cheyadam karthvyam. ika naa.. comment.. rendoo.. kaadhu. jabbaladhi.

    ReplyDelete