Sunday, November 14, 2010

వడగళ్ళు - కృష్ణాపత్రిక - శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు

కృష్ణా పత్రికతో పరిచయం వున్నవారిని శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారెవరంటే ఇట్టే చెపుతారు. వడగళ్ళు రాసినాయనేగా అని. ఆయన 1938లో కృష్ణాపత్రిక సంపాదక వర్గంలో చేరారు. దాదాపు పధ్నాలుగు  సంవత్సరాలు పాటు హాస్యం వ్యంగ్యం జత కలిపి " వడగళ్ళు " శీర్షికతో పాఠకులకి వింతా - వినోదం పంచిన ధన్యజీవి. ఆ పైన ఎన్నో హాస్య రచనలు చేసిన రచయిత, గొప్ప సాహితీవేత్త.

ఒకటేమిటి - ఆనాటి రాజకీయాలు, అవకతవక ఉపన్యాసాలు, మారుతున్న సాంఘికాచారాలు, నవలోకం కోరుకునే మార్పులు, మతిమరుపు వ్యక్తుల విచిత్ర గాధలు, రాజకీయాలలో రగడలు, సంస్థలలో చెలరేగే దుమారాలు, కవుల కలాలు చిలికే మీగడ తరకలు, ఇలా ఎన్నో తళుకులు మెరిపించేవారు ప్రతి శనివారం విడుదల అయ్యే కృష్ణాపత్రికలోని వడగళ్ళు శీర్షికలో.

 వారి అమ్మాయి జ్ఞానప్రసూనగారు తెలుగు బ్లాగర్లలో చాలా మందికి తెలిసినవారే! 



శ్రీ రావూరు గారితో తాను పాల్గొన్న సభలోని ఈ చిత్రం తన పర్సనల్ ఆల్బం నుండి అందించిన శ్రీ సుధామ గారికి వేల ధన్యవాదాలతో


ప్రసంగిస్తున్నవారు శ్రీ రావూరు, కుడివైపు చివరన కూర్చున్నది శ్రీ సుధామ గారు 


వడగళ్ళు శీర్షికలోని కొన్ని వ్యాసాలు, క్రితం సంవత్సరం మొదట్లో వెబ్సైటులో ప్రచురించాను. ఆసక్తి ఉన్నవారు వ్యాసావళి సెక్షన్లో చదువుకోవచ్చు, ఆనందించవచ్చు.

భవదీయుడు
వంశీ

2 comments:

  1. Nice information you had given.
    అలాగే ముట్నూరి కృష్ణా రావు గారి
    ఫొటోల గుచ్ఛమును అందివ్వ గలుగుతారను ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. మిరందించిన సమాచారానికి ధన్యవాదాలు.
    ఇవ్వాళే జ్ఞాన ప్రసూన గారు రావూరు గారిపై రాసిన వ్యాసం పుస్తకం.నెట్లో వచ్చింది. అప్పుడావిడని ఏదన్నా ఫొటో ఉంటే పంపమని అడిగితేనూ, మీ బ్లాగులో పెట్టారని చెప్పారు. దానితో ఇక్కడికొచ్చా!

    ఆవిడ రాసిన వ్యాసం లంకె: http://pustakam.net/?p=5839

    ReplyDelete