Wednesday, November 10, 2010

ఉషశ్రీగారి గళంలో జాలువారిన పురాణాలు, ఐతిహాసికాలు - ఆడియోలు!

ఉషశ్రీగారి గళంలో జాలువారిన భాగవతము, రామాయణము, మహాభారతము ఆడియోలు అందించిన డాక్టర్ చెముటూరి నాగేంద్ర గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. వీరు యూనివర్సిటీ ఆఫ్ ఐయోవాలో పనిచేస్తున్నారు. 

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పురాణాలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

4 comments:

  1. @ఉషశ్రీగారి గళంలో...

    నిజముగా మధురమైన గళం. ఆయన వర్ణించి చెబుతూ ఉంటె అంతా కళ్ళముందే జరుగుతున్నట్లుంటుంది. చిన్నప్పుడెప్పుడో విన్నా.

    కృతజ్ఞతలు, ఇలా వాటిని ఒక చోట పెట్టి పంచుకున్నందుకు. ఆలాగే నాగేంద్ర గారికి కూడా.

    ఇంతకీ "తమలపాకు విషయము" చెప్పనేలెదు మీరు.. హ్మ్..

    ReplyDelete
  2. చిలికిన అమృతాన్ని పంచడమే చేసింది అలనాటి మోహిని. మీరు మాకోసం అమృతాన్ని మధించి మరీ పంచిపెడుతున్న అపర మోహినిగా (పోనీ మోహనుగా :-) కనిపిస్తున్నారు మీరు!

    ReplyDelete
  3. హ్మ్.. అవును కామేశ్వరరావుగారు.. నిజముగా వంశీ మొహనుడే.

    --------
    ఆదిరా అబ్బాయ్.. కామెంటలా పెట్టాలి.. అర్థమయిందా?. హ్మ్. నేర్చుకుంటాండి.

    ReplyDelete
  4. ఇటువైపు వచ్చినందుకు ధన్యోస్మి కామేశ్వరరావుగారూ...ధన్యోస్మి....అమృతం నా సొంతం కాదు కాబట్టి ఎంతైనా పంచుతాను సార్....ఆ అమృతం నాకిచ్చిన వాళ్లకే అన్ని అభినందనలు, అలంకారాలు......అంతా వారి పుణ్యమే....నా పనల్లా వెనక పడి వేధించడమే! ఒక్క జర్మనీ మాష్టారు గారి దగ్గరనుంచి సంపాదించలేకపోయాను కానీ, మిగిలిన వాళ్లు చాలా మంది ఆనందంగానూ, కొద్దిమంది నా వేధింపులను తట్టుకుని అమృతాన్ని తిట్టుకుంటూనూ, మరికొంతమంది సతాయింపులను తిమ్ముకుని , అమృతాన్ని తిమ్ముకుంటూనూ ఇస్తున్నారు....తిట్లైనా తిమ్ములైనా అమృతం ముఖ్యం కాబట్టి దులిపేసుకు పోతున్నా....జర్మనీ మాష్టారు గారు మటుకు బుట్టలో పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు.....ఎప్పుడెయ్యగలనో, బుట్టల దారి ఎలా మార్చుకోవాలో తెలియట్లా... :)

    అమృతం సొంత ప్రొడక్షనైతే ఓ గంగాళమన్నా దాచుకునేవాడినేమో... :)

    ఇటువైపు వచ్చిన సరస్వతీ పుత్రులకు నమోన్నమహ...

    రాజేష్ - కామెంటుతున్నందుకు ధన్యవాద్!

    ReplyDelete