Tuesday, November 9, 2010

వ్యంగ్యాత్మక పైత్య ప్రకోపం అర్థమై చస్తే? - గుడ్డేనుగు అడుసు తొక్కినట్టే!

ఓ నాలుగు అర్థం కాని పదాలు గొలుసుకట్టుగా వ్రాస్తే కవి. ఓ పురాణపాత్రకు నూతనభాష్యం చెబితే పండితుడు. ఓ కొత్తవాదం పట్టుకొచ్చి నలుగురిని ఎగదోస్తే అది సాహిత్యం. ఈ ధోరణులు, వాటి కథాకమామీషూ సామాన్యుడికి అర్థం కావటం లేదు. అతడికి ’ఏదో’, ’ఎక్కడో’ లోపించిందని అనిపిస్తోంది.ఆ లోపించిన దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాడిలా...

 http://poddu.net/?q=node/767

ఎప్పుడో కిందటి వారం పడితే, ఇప్పుడా లింకిచ్చేది? అంతే బాబూ - కాలం మహిమ, తలరాత!!

శిరీష్ గారు ఓ రోజు ఈమెయిలు పంపించి పొద్దు కొత్తరూపం సంతరించుకుంటోందండీ, మీ తలలో రాత ఒకటి కావాలి నాకు అని అన్నారు. "పొరపాటులో అలవాటుగా" అచ్చోసిన ఆంబోతు వ్రాతలు ఏమి పంపిస్తాంలే అని ఊరకున్నా, ఆ తర్వాత ఆకాశవాణిలో పడి పూర్తిగా మర్చేపోయా. మళ్ళీ ఓ నెలరోజుల తర్వాత, శిరీష్ గారు ఓ మేకు, దాంతో పాటు ఓ సుత్తీ తీసుకుని వచ్చి తలలో దిగేసి ఏదీ నాకివ్వాల్సిన తలరాత అని అడిగారు. బోల్డు రగతం కారిపోయి, భోషాణమెత్తి అప్పుడప్పుడు నేను వ్రాసుకునే చిత్తుకాయితాల పత్రాల్లోంచి ఒకటి తీసి చూపించా! ఇప్పటికిది చాలు అని తీసుకెళ్ళి ఇక్కడ, అనగా పొద్దులో పొడిపించారు. భోషాణం మూతేసాసా! మూడొచ్చినప్పుడు , మేకులు దిగినప్పుడు మళ్ళీ మూత ఎత్తుతా...అదండీ సంగతి... క్ఌప్తంగా మాటా మంతీ సమాప్తం.

3 comments:

 1. మీ వ్యాసం "అచ్చోసిన ఆంబోతు" రాతలని మీరనుకుంటున్నారు అంతే. అవే రాతలను సూత్రాలలాగా కూర్చి, గంభీరమైన శైలి జోడించి, ఉదాహరణలు చేరిస్తే ఓ చిన్నసైజు లక్షణమైన లక్షణకావ్యం అవుతుంది.

  అయినా ఈ మాత్రం పరిచయం చాలు. మనకు ఇదే ఎక్కువని అర్థమవుతూ ఉంది లెండి.:-)

  ReplyDelete
 2. @ రవి - మీరు చెప్పింది ఒప్పుకుంటాను. ఆ శైలి కోసమే బోల్డు పాట్లు పడుతున్నా, గండభేరుండ తైలమూ రాసుకుంటున్నాను. ఈలాటి సామాన్య రాతలు కాకుండా, మీరు చెప్పిన శైలిలో ఉన్నవి కూడా కొన్ని కాగితం మీద గత నాలుగేళ్లుగా పెట్టుకుంటున్నా. కానీ వ్రాసుకున్నతర్వాత అవి నాకే ఎందుకో నచ్చలా! ఇంకా వ్రాయాలి, బోల్డంత వ్రాసుకోవాలి, పుట్లకు పుట్లు కాగితాలు పోగుపడాలి. అప్పుడు...... నాకే నచ్చాక, బయటకు వదలాలి. అదీ ప్రస్తుతం ఈ భవదీయుడు నిమగ్నమైన పని....

  కామెంటుకు ధన్యవాదాలు....

  ReplyDelete
 3. @ఓ నాలుగు అర్థం కాని పదాలు గొలుసుకట్టుగా వ్రాస్తే కవి. ఓ పురాణపాత్రకు నూతనభాష్యం చెబితే పండితుడు. ఓ కొత్తవాదం పట్టుకొచ్చి నలుగురిని ఎగదోస్తే అది సాహిత్యం
  :)) భలే జెప్పారు. పై నాలుగు ముక్కలు టప్ప నాకు ఈ తపాలో కింద రాసింది, ఆ లింకులో రాసింది అంతగా అర్ఠంకాలా. హేమో, నాకు అరదం కావలిసిది ఇంతేనేమో. అయిన మల్లీ మల్లీ సదువుతా అరదం అయ్యే వరకు. ప్రస్తుతానికి నేను కవి నా లేక తవి నా :)?

  హేదో... మీ చమక్కులు కి మనసూరకుండబట్టక కామెంటెడుతున్నా.. కొప్పడొద్దు.. హేదో అజ్ఞానిని

  ReplyDelete