Thursday, November 4, 2010

చూడండి...నేడే చూడండి...ఆలసించిన ఆశాభంగం !!

ఓ రెండు వారాల క్రితం కామోసు అడిగాను....అంగీకరించారు కానీ, ఏ రోజున పంపిస్తారో తెలియలా....ఈ రోజు చూస్తే.....దీపావళి రోజున కానుకగా ఈ అపురూప చిత్రాలు, వాటికి సంబంధించిన వివరాలు అందించిన ప్రముఖ కార్టూనిష్టు, రచయిత, కవి, ఆకాశవాణి ప్రముఖులు శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో


రేడియో భానుమతి:మద్రాస్ ఆకాశవాణి లో తొలి తెలుగు డ్రామా వాయిస్/1938 జూన్ 16 న ప్రసారమైన తొలితెలుగు నాటిక 'అనార్కలీ'లో ఆవిడే అనార్కలి.కృష్ణశాస్త్రి  గారు సలీం.అయ్యగారివీరభద్రరావుగారు అక్బర్./1980 లో రిటైర్ అయ్యారు.భానుమతి గారి కూతురే అనౌన్సర్ జ్యోత్స్న.(జ్యోత్స్నా ఇలియాస్)
 


జోలిపాళెం మంగమ్మ:ఢిల్లీలో తొలి మహిళా న్యూస్ రీడర్ గా ప్రసిద్దులు.రిటైరు అయ్యారు


ఎం.జి.శ్యామలా దేవి:ఆకాశవాణి హైదరాబాద్ డ్రామా ఆర్టిస్టు. మొదట విజయవాడ  ఆ తరువాత 1960 నుండీ హైదరాబాద్.ఉదయతరంగిణి లో ఆవిడ తల్లి గా సుధామ కొడుకుగా. పుట్టపర్తి గారి అమ్మాయి నాగపద్మిని కూతురుగా శుక్రవారాల్లో ప్రసారమైన కుటుంబ సంభాషణ ఆ రోజుల్లో ప్రసిద్ధం.కన్యాశుల్కం నాటకం లో బుచ్చమ్మ  గా నటించింది శ్యామల గారే
మామిళ్ళపల్లి రాజ్య లక్ష్మి:ఢిల్లీ న్యూస్ రీడర్ గా పనిచేసి రిటైరయ్యాక  మదరాసులో స్థిరపడ్డారు.

శ్రీమతి శారదా శ్రీనివాసన్: జననం:1935 ఆగస్టు 18/రేడియో హీరోయిన్ అని పేరు ఆవిడకే.1959 లో హైదరాబాద్ ఆకాశవాణి లో డ్రామా ఆర్టిస్టు గా చేరారు.చలం గారి పురూరవ నాటకానికి ప్రానం పోసింది తనే.బంగారు కలలు సినిమా కు వహీదా రెహమాన్ కు డబ్బింగ్ ఇచ్హారు. వేణుగాన విద్వాంసులు ఎన్.ఎస్.శ్రీనివాసన్ వారి భర్త రేడియోలోసంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేసారు


ఏడిద గోపాలరావు: 1966 నుండి 19996 వరకూ ఢిల్లిలో వార్తలు చదివారు.మాస్కోలో 4 సంవత్సరాలు తెలుగు వార్తలు చదివారు.మంచి నటులు.గాంధీ వేషానికి పెట్టింది పేరు
శ్రీ.కొత్తపల్లి సుబ్రహ్మణ్యం: చేరింది:1954 ఫిబ్రవరి24.1956 నుండి 13 సంవత్సరాలు డిల్లీ న్యూస్ రీడర్ గా చేసి 1966 లో హైదరాబాద్ వచ్చారు


శ్రీ అద్దంకి మన్నార్ : పుట్టింది:1934/విజయవాడలో అనౌన్సర్ గా చేరింది:1959/1977లో 2 సంవత్సరాలు మాస్కోలోతెలుగు వార్తలు చదివారు


శ్రీ డి.వెంకట్రామయ్య:హైదరాబాద్ ప్రాంతీయ విభాగం లో ప్రముఖ న్యూస్ రీడర్.1963 నవంబర్ లో మొదట అనౌన్సర్.ఫ్రముఖ కథకులు. నాటకరచయిత.2010 రావిశాస్త్రి పురస్కార గ్రహీత. పంతులమ్మ సినిమా మాటల రచయిత.వార్తా పఠనానికి పేరుపొందారు


శ్రీ.దుగ్గిరాల పూర్ణయ్య:జననం:15.4.1936.1964 లో న్యూస్ రీడర్ గా చేరారు ఢిల్లిలో.1994 ఏప్రిల్ లో రిటైరయ్యారూ

శ్రీ జి.జె.రవివర్మ:జననం:17.9.1951 1971 లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరారు.మంచి నటుడుగా ప్రముఖులయ్యారు.1983 లో  క్రీడావిభాగం ప్రొడ్యూసర్ అయ్యారు.1995 లో పదవి వదిలేసారు .
శ్రీ కందుకూరి సూర్యనారాయణ :జననం:29 జూలై 1936.1962 లో ఢిల్లీ వార్తావిభాగం లొచేరారు.మాస్కోలోనూ చేసారు.ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు గారికి వీరు కుమారుడు.
శ్రీ.ఎం.ఎన్.శాస్త్రి.: 1950 లో అనౌన్సర్ గా చేరారు.గ్రామస్తుల కార్యక్రమం తో ప్రముఖులు.చక్కని కంఠ స్వరంతో వారు 'గాంధీ మార్గం' సమర్పించడం శ్రొతలకు కలకాలం గుర్తు.ప్రస్తుతం ప్రసారభారతి మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్ కు మామగారు వీరు.
మల్లంపల్లి  ఉమామహేశ్వరరావు: మద్రాస్ కేంద్రం ప్రారంభించక ముందే చేరిన తొలి తెలుగు అనౌన్సర్./రేడియో తాతయ్య గా ప్రసిద్దులు. 1977 మే 31 న రిటైర్ అయ్యారు.96 సంవత్సరాలు ఇప్పుడు.

పన్యాల రంగనాధరావు:చేరింది:1943 నవంబర్/డిల్లీ న్యూస్ రీడర్/1962 లో హైదరాబాద్ ఎ.ఎన్.ఇ. గా/మరణం:1987

ఎస్.బి.శ్రీరామ మూర్తి: విజయవాడ  కేంద్రానికి పదిసార్లు అఖిల భారత స్థాయిలో తన కార్యక్రమాలతో బహుమతులు తెచ్హి పెట్టిన ఒకేఒక అనౌన్సర్ ఈయనే.1970 లో మొదట విశాఖ లో చేరారు.1972 నుండి 2002 వరకూ విజయవాడలో పనిచేసి స్వచ్చందంగా  పదవీ విరమణ చేసారు.

9 comments:

 1. వంశీ మోహన్ గారూ !
  మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

  - శి.రా.రావు
  శిరాకదంబం

  ReplyDelete
 2. వంశీ గారూ, చాలా గొప్ప టపా!

  జోలెపాళెం మంగమ్మ గారు చారిత్రిక రచనలు కూడా చేసారనుకుంటాను, కదా? అల్లూరి సీతారామరాజు జీవిత కథ రాసారని విన్నాను. ఆమేనా ఈమె?

  "వార్తలు, చదువుతోంది: కందుక్కూరీ సూర్యనా..రా..యణ" - ఆయన పేరు తలుచుకోగానే, కందుకూరి లో కూ ని కొద్దిగా ఒత్తి పలకడం, "నా.. రా.. యణ" అని దీర్ఘం తీస్తూ చెప్పడం చెవిలో మోగుతుంది నాకు.

  ఈ బొమ్మలు చూపించినందుకు నెనరులు, నమస్కారం!

  ReplyDelete
 3. నిజంగానే ఆలశ్యం చేసిఉంటే ఆశాభంగం అయేది! మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. చదువరి / శిరీష్ గారూ, మీకు ఇదివరకు తెలిసిన రచయిత్రి
  మంగమ్మ గారే ఈమె :) డాక్టరు (పి.హెచ్.డి) కూడా !!

  ReplyDelete
 5. వంశీ మోహన్ గారూ !
  దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!

  ReplyDelete
 6. పేర్లు మరియు రేడియో లో కొన్ని గొంతులు విన్నజ్ఞాపకాలు తప్ప వాళ్ళను చూసే భాగ్యం కలిగించిన మీకు నెనర్లు

  ReplyDelete
 7. రంజని గారూ, నెనరులు.

  ReplyDelete