Monday, November 1, 2010

గంగులుగాడి నోట్టొ చిత్రమైన జాలం, అంతర్జాలం, మాయాజాలం

చిత్రమైన జాలం, అంతర్జాలం, మాయాజాలం

ఈ ఇంటర్నెట్టు అనేది చిత్రమైనది. చాలా చిత్రమైనది. మనుషుల్లో, స్వభావాల్లో తీసుకొచ్చే మార్పులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎంత ఆసక్తికరంగా అంటే విడమర్చి చెప్పలేనంత.  పరగడుపునే ప్రత్యక్ష నారాయుడి సేవ జేసుకుని.......అలా అలా ...మాడా గారి అలో అలో దాకా వెళ్లిపోయేంత. 

సపోసు ఒక వయసైపోయిన అవ్వో, అయ్యో  ఉంది/ ఉన్నాడనుకుందాం . బోల్డు కతలు, కవితలు  రాస్తుంటుంది/రాస్తాడు  అని అనుకుందాం. పోనీ తెలుగులో రాయటం ఎలాగో తెలీదులే, సాయం చేద్దామని సపోసు లేఖిని పరిచయం చేసామనుకోండి. అలా లేఖినిని బట్టుకోని, కూడలికెళ్లిపోయి, ఆనందభరితురాలైపోయి ఆ ఆనందం ఆసక్తిగా మారాక, బొరియలు తవ్వి బ్లాగొకటి మొదలెట్టి కొద్ది రోజుల తర్వాత అనుసంధానించబడున్న ఆ బొరియల్లో కిచకిచలాడుతూ కూర్చునున్న ఇతర బ్లాగెలకల్లోనుంచి ఓ భజన గుంపు పోగేసుకున్నాక, కీచు శబ్దం కాస్తా ఘీంకారమైపోయిన్నూ, అహం బ్రహ్మస్మిగా మారిపోయిన్నూ అసలుగా ఆ లేఖినిని పరిచయం చేసినవాడిని మర్చిపోయో, మర్చిపోకపోయినా మాట్లాడితే తూలనాడేంతో మార్పు వస్తుంది. 

ఇది ఓ రకం.

రెండో రకం ఎలకలో, కప్పలో ఉన్నాయి. 

ఇయ్యిటికి అవ్వ మీద కొద్దిగా తెలివెక్కువ. ఓ పేరొందిన, పోనీ అప్పుడే ఇకసిస్తున్న, ఇప్పటికి బాఘా ఇకసించేసిన ఆన్లైను మాగజైను ఉందనుకుందాం. ఈ ఎలక ఆ మాగజైను ఓనరు ఇంటో ఇంతకుముందు బొరియలు తవ్వెట్టగా, ఆ యజమాని ఉల్లిపాయ ముక్కెట్టిన్నూ, బోనులో పెట్టేసిన్నూ ఓ తాపు తన్ని బయటకు ఈడ్చవతల పారేసాడనుకుందాం. అప్పుడు ఈ ఎలక బయటకొచ్చి, ఆ ఆన్లైను మాగజైను పైకిరాటానికి నేనే కారణమని బయట చెప్పుకునేంతవరకూ వెళ్లి, అసలు ఆ పత్రిక్కు కాప్షను నేనే పెట్టాననీ, ఆ ఇంటి యజమానికి విశ్వాసం లేదనీ ఆ ఓనర్ని తూలనాడేంత వరకూ కిచకిచలాడ్తాదండే. ఎంత కిచకిచలాడినా, ఇంకే ఇళ్లల్లో ఎక్కడన్నూ ఆహారం దొరక్క మళ్లీ ఆ పాత ఓనరు ఇంటికే కాళ్లు ఈడ్చుకుంటూ పోయి పాత బొరియల్లో కాలం గడుపుతూ ఉండాల్సొస్తుందండే.

ఇగ తదుపరి ఇసేషాలు మా గంగులుగాడి నోట్టొ ఇనండే! ఈడికి నా కాడ ఉన్న సంగతులన్నీ తెల్సండే ! అయ్య బాబోయి నాక్కూడా వీడి యాస వచ్చేస్తోందేంటిరా భగవంతుడా ! రక్ష రక్ష పాహిమాం !

ఐరనీ ఏమనగా ఆ మాగజైను ఓనరూ తక్కువోడు కాదు. ఆ వ్యక్తి ఇతర వెబ్సైట్లూ, ఫేసుబుక్కులోనూ, ట్విట్టర్లోనూ, కూడలీలో పహారా గాస్తూ, ఎక్కడ మెటీరియల్ దొరుకుతుందా, ఆ మెటీరియల్ ఇచ్చినోడి ఇవరాలు ఆయా వెబ్సైట్లలో బట్టుకోని ఆడికి ఏకంగా ఫోన్ జేసేసి, ఏవండే కష్టపడి మీ ఇవరాలు సంపాదించానండే. యాడ్నుంచి అని అడగమాకండి, ఎన్నో ఎబ్సైట్లు అయ్యీ ఎతికి ఎతికి పట్టుకున్నా, ఏ ఎబ్సైటో నాకు ఇప్పుడు గ్యాపకం లేదండే, అయితే మటుకు మీరు దయ ఉంచి మా పత్రిక మొగాన ఓ కవళం పడెయ్యండే అని దేవురిస్తాడు. ఈడి గోల పడలేక అవతలోడు సిసలు వెబ్సైటు ఓనరును దొబ్బులెట్టి, ఎటు మింగలేక ఆడి జ్ఞాపకాలన్నీ ఈ ఓనరు గాడి మాగజైను మీద కక్కుతాడు. అప్పుడు ఆడి పనీ సరీ, ఈడి పనీ సరీ, చదువరుల పనీ సరీ, అసలు సిసలు ఎబ్సైటు ఓనరు గాడి పని హరిలో రంగ హరి!

ఇగ ఇంగో రకం ఎలకలు - ఈ కుర్రకుంక ఎలకలు మొదలెట్టకముందే కొన్ని ఎలకలు గుంపు గూడి ఓ పత్రికెట్టి - ఆళ్లల్లో ఆళ్లే వ్యాసాలు రాసేసుకుని ఇవతలోడిని సున్నంలోకి ఎముకల్లేకుండా గొట్టేసి, అవునండే సున్నంలోకి ఎముకలే - గొట్టి ఇవతలోడినెవ్వుడినీ రానీకుండా మా పత్రిక్కి ఓ స్టాండర్డుందండే, మీ అభిప్రాయాలు జెప్పాలంటే ముందు మా ముసలి జక్రవర్తులకో ఇన్నపం పంపించాలా. మీరు పంపించాక రాజుగారికి  తీరికుంటే మిమ్మల్ని లోనికి రానిమ్మని జెప్తాడు..ఆరు జెప్పాక, మీ తోలు తెల్లదా, మాతో కలిసేదా కాదా తెల్సుగోటానికి ఉతికి ఆరేసి ఏధిస్తాం.అందుకు సిద్ధం కాపోతే ఇంగో రకంగా హెరాసుమెంటు జేత్తాం అని బెదిరిస్తా ఉంటారన్నమాట నిఖార్సైన నిజమని ఓ మార్జాలం, అనగా గోడమీద పిల్లి జెప్పగా ఇన్నమాట.

ఇగ ఇంగో రకం కప్ప - ఈ కప్ప ఉండే బాయిలో బోల్డు బంగారం ఉంటాదని ఇనికిడి ఒగటి, ఆపైన ఆ కప్ప బెకబెకలొగటి. బెకబెక గోలతో నిజంగానే బంగారముందేమో అన్నంత ఫీలంగు వచ్చేత్తాదన్నమాటండే! అయ్యి - ఆ బెకబెకలు నిజమా అన్నట్టు అప్పుడప్పుడు బంగారం కుండలో నుంచేనండే ఓ పూత ఇసిరేత్తా బాయిలో ఉన్న ఇతర కప్పల్జేత అరిపింపజేసి ఇసుగు పుట్టించి నువ్వే సామ్రాట్ కప్పవనిపింపజేస్తాదండే! పొరపాట్న ఏదన్నా అడిగామనుకోండే, ఇగ ఆడు తెలుసా నీకు, ఈడు తెలుసా నీకు, ఆడు రాసిన పుస్తకాలు దెల్సా నీకు, ఆళ్లంతా అంతర్జాలం గురించి నా దగ్గిర శిష్యరిగం జేసినోళ్లే...గావాలంటే అడిగిత్తా, పోటేపిత్తా అని గుంతలకిడి మాటలు మాట్టాడతాడండే!... ఐతే ఆడికి నచ్చినోళ్లకి, కాళ్ల మీద బుఱద సాపు జేసినోడికి బంగారం ఇసిరేత్తా ఉంటాడండే! జివరికి నే పొయ్యేలోగా నా బంగారమంతా ఎవుడికో ఇచ్చి పోతా అని ఓ తెగ ఇదిగా జప్తా ఉంటాడండే!  సివరాకరికి సెప్పెదేంటంటే మాటలు తప్పితే పని తక్కువండే!

ఈ మొదటి బాగం ఇక్కడితో ఆపేత్తానండే ! మళ్లా రేపో ఎల్లుండో ఇంగో రగం ఎలక్కాయల ఇసేషాలతో వత్తానండే

గంగులు


7 comments:

 1. గంగులు ఘటికుడే!
  సామ్రాట్ కప్ప - ఆ పోస్టు నాకేవన్నా వచ్చే ఛాన్సుందా?? :)

  ReplyDelete
 2. @ విజయమోహన్ - ధన్యవాద్!

  @ కొత్తపాళీ గారు - మీక్కావాలంటే వచ్చే ఛాన్సు ఎక్కువే....:) కానీ గంగులుగాడి ప్రస్తుత సామ్రాట్ కప్ప, మనకి అనగా అమెరికా తెలుగు వాళ్లకి విదేశీ కప్పండి బాబూ.....అమెరికాలో బ్రాంచీలు తెరవబడును అని ఇంకా అడ్వర్టైసుమెంటు ఇవ్వలా....ఇచ్చాక నన్ను కూడా లెక్కలోకి వేస్కోండి ...ఇద్దరం కలిసి అప్ప్లై చేసుకుందాం! :)

  ReplyDelete
 3. @మాగంటి వంశీ మోహన్
  బాబోయ్ కేక! గంగులు కామెడీ :) కానీ నాకు మీరు చెప్పిందే ఇంకా కేక.. వామ్మో.. సివరి వరకు సదివితేగాని అర్థం కాలా.. ఇదో పెద్ద బ్లాగ్-సెటైర్ అని.. కత్తి లా ఉందడీ..

  #లేఖినిని బట్టుకోని.. బొరియలు తవ్వి బ్లాగొకటి మొదలెట్టి .. ఆ బొరియల్లో కిచకిచలాడుతూ.. ఓ భజన గుంపు పోగేసుకున్నాక.. శబ్దం కాస్తా ఘీంకారమైపోయిన్నూ

  ఇది బ్లాగులకే కాదు.. నాలాగా కమెంట్ యెట్టే వారికి కూడా వర్తించాలి.:)

  #కొన్ని ఎలకలు గుంపు.. ఆళ్లల్లో ఆళ్లే వ్యాసాలు .. ఇవతలోడినెవ్వుడినీ రానీకుండా.. ఓ స్టాండర్డు.. మీ అభిప్రాయాలు .. మా ముసలి జక్రవర్తులకో .. మీ తోలు తెల్లదా, మాతో కలిసేదా కాదా.. కాపోతే ఇంగో రకంగా హెరాసుమెంటు జేత్తాం

  ఇలాంటి బ్లాగు గ్రూపులు బ్లాగ్లోకంలో చాలా ఉన్నాయి :) మెజారిటీ మరియు సెన్సు ఉన్నవాళ్ళ తొలుకి మన తొలు కలిసిపొయెట్లు చేసేయడమే మంచిది :)

  #ఈ కప్ప ఉండే బాయిలో బోల్డు బంగారం.. నచ్చినోళ్లకి,.. బుఱద సాపు జేసినోడికి బంగారం ..
  "పొరపాట్న ఏదన్నా అడిగామనుకోండే, ఇగ ఆడు తెలుసా నీకు, ఈడు తెలుసా నీకు, ఆడు రాసిన పుస్తకాలు దెల్సా నీకు," -

  అంటె "కత్తి" సామ్రాట్ కప్పా??!! :) వామ్మో ఇప్పుడొ నాలుగు పుస్తకాలు పడేస్తడెమో ఇప్పుడు నా మీద :)
  ఇంక ఈ బంగారం బ్లాగులోకి పసుపు అంటే
  ఫాషన్ మాత్రమే అనుకునే కొంతమంది మణులు గూడా వస్తారు..

  #ఇంగో రగం ఎలక్కాయల ఇసేషాలతో వత్తానండే

  మరైతే ఎదురు సూత్తా ఉంటాండీ ఆయ్ :)

  ReplyDelete
 4. రాజేష్ - తమరు ఎలకల యాపారం మొదలొట్టొచ్చు...ఇది అచ్చంగా బ్లాగులకని నేనెక్కడా జెప్పలేదే!

  మీక్కొన్ని తెలీని ఇషయాలు ఉండాయి ఇందులో.....ఎవరికి దెలియాల్సిన ఇషయాలు ఆళ్లకు దెలుస్తాయి...మనకు మనం ఏదో అనేసుకుని చంకల్లో గోళ్లెట్టి గీక్కుంటే ఎట్టా? రగతాలొస్తాయి.....:)

  నేరాసింది, మీరనుకున్నది ఏరు ఏరు...జదవాల్సినోళ్లు జదివేసి గమ్మున కామెంటకుండా బోయారు.....గాబట్టి మీ ఊహాగానాలు ఆపేత్తే మంచిది....

  మీ వ్యాఖ్య ఇంకా డిలీట్చెయ్యనందుకు ఎలకలు సంతోషిస్తున్నాయంట.... ;)

  ReplyDelete
 5. అన్నట్లు ఒహ్క ఎలక కూడా బయటకొచ్చి కామెంటు పెట్టినట్లు లేదు? లేక మీ ఎలకల అవి నచ్చలేద :)

  మీ తర్వాతి టపా కోసం ఎదురు చూస్తున్నా..

  ReplyDelete
 6. వ0శీ గారూ వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పారు
  ఎవరు ఎలా భుజాలు తడుముకున్నా అది వాళ్ల ఖర్మ

  ReplyDelete