Tuesday, October 19, 2010

ఆ భాగ్యం కలిగించండి మహప్రభో !

మొత్తానికి 52 సంస్థానాల వివరాలు పూర్తయ్యాయి...ఎక్కడ?

ఇక్కడ....


లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "సంస్థానములు" లింకు నొక్కి ఆనందోబ్రహ్మ

కొద్దిమంది రాజావార్లను చిత్రరూపంలో దొరకపుచ్చుకోవటం నా శక్తికిమించిన పనయ్యింది...

అవి తక్క మిగిలిన సంస్థానాల పేజీలు బోసిగా కనపడవచ్చు...

ఆయా రాజావార్ల చిత్రరాజాల దర్శన భాగ్యం ఎవరన్నా కలిగిస్తే అందుకు వారికి కృతజ్ఞుడిని....

ఒకావిడ కొన్ని చిత్రాలు ఇస్తానన్నారు కానీ ఆవిడ అలా ఏరులోకి వెళ్ళి తెప్ప ఎక్కి సముద్రతీరప్రాంతానికి వెళ్ళిపోయారు...ఆవిడ ఆ తెప్ప మీద తిరిగిరావటం ఎప్పుడో...రాజావార్ల చిత్రాల దర్శన భాగ్యం ఎప్పుడో

భవదీయుడు
వంశీ

4 comments:

  1. దాదాపు మూడు సంవత్సరాల క్రితం నా "తెలుగు రాడికల్" లోననుకుంటా, మీరేదో ఆవేశం గా వ్యాఖ్య వ్రాశారు--నేను తగిన జవాబిచ్చాను--మీరు దాన్ని ఇప్పటివరకూ చూసి వుండలేదనుకుంటాను.

    మొన్నామధ్య SRRao గారికికూడా చెప్పాను, మీ బ్లాగుని "బుక్ మార్క్" చేసుకొని, చూస్తూనే వుంటాను అని.

    మీ బ్లాగు తెలుగు బ్లాగులలో "మకుటాయమానమైనది" అనడం లో సందేహం లేదు. మీ కృషికి శంకరాభరణం శంకర శాస్త్రిలా "శిరసు వంచి పాదాభివందనం" చేస్తున్నాను.

    వీలైనంతవరకు, ప్రముఖులు ఇచ్చిన "రెఫరెన్స్ గ్రంధాలు", పత్రికల ప్రతుల "ఆర్కైవ్స్" సేకరించండి--బ్లాగులో భద్రపరచండి--తెలుగు బ్లాగులోకానికి వంశీమోహన్"ఆదిత్యులై" వెలగండి.

    తెలుగు బ్లాగర్లందరి సహకారం మీకు వుండాలని కాంక్షిస్తూ............

    ReplyDelete
  2. కృష్ణశ్రీ గారూ

    అప్పుడు ఆవేశపడి ఉంటే ఇప్పుడు క్షమాపణలు.

    "పాదాభివందనాలు" అంత మాట వద్దండీ బాబు....మీకు నచ్చింది సంతోషం....చేసే పని ఒక్కళ్ళకు ఉపయోగపడినా చాలనుకునే వాడిని కాబట్టీ....Do what you can with what you have - ఈ మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవాడిని కాబట్టీ....

    మీ సూచనలకు ధన్యవాదాలు......పాటించటానికి, పూర్తిచెయ్యటానికి ప్రయత్నిస్తాను.....

    మన బ్లాగర్లలో కొద్దిమంది ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటారు.....అందుకు వారికి ధన్యవాదాలు...

    మీ
    ఆవేశ వంశీ

    ReplyDelete
  3. నా ప్రియ వంశీ!

    క్షమాపణల్దాకా వొద్దు!

    మీరువ్రాసిన పేరులోని "ఆవేశ" ని అధికారికంగా తొలగించాను కదా?

    పాదాభివందనలు మీ "కృషి" కి కాబట్టి మీకు ఆయుక్షీణం వుండదు.

    చాలా సంతోషం. అందరి సహకారం మీకు లభించాలని మరోసారి ఆకాంక్షిస్తా!

    ReplyDelete
  4. వంశీ గారు మీరు సేకరించిన సంస్థానాలు,వాటి వివరాలు క్లుప్తంగా చూసాను....మన ఆంధ్ర దేశం లో ఇన్ని సంస్థానాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. దీని వలన మన చరిత్ర కొంచెం అర్ధమయింది. మీ కృషి అభినందనీయం...

    మీ వెబ్సైట్ దయ వలనే నేను దేశం కాని దేశంలో రోజు 'లలితా సహస్ర నామాలు ' చదవగలుగుతున్నాను...అందుకు కృతగ్నురాలిని..ఇది మీ బ్లాగ్ అని నాకు ఇప్పటి దాక తెలియదు...మీకు ఇలా ధన్యవాదాలు తెలుపగల అదృష్టం లభించినందుకు ఆనందిస్తున్నాను :)

    ReplyDelete